# how-to-get-GPA-10/10-10th-class-public-exams-Telugu-subject

- Link: https://amaravathiteacher.com/how-to-get-gpa-10-10-10th-class-public-exams-telugu-subject/
- Published: 2019-02-11T20:02:06+05:30
- Author: amaravathiteacher

## **_how-to-get-GPA-10/10-10th-class-public-exams-Telugu-subject_**

### **తెలుగు.. తేలికే కదా అని ఆదమరిస్తే మొదటికే మోసం వస్తుంది. సరిగా చదివితే నిజానికి సులభంగానే ఉంటుంది. పాదభంగాలు లేకుండా పద్యాలు రాయడానికి పద్యాలను కంఠస్థం చేయాలి. వ్యక్తీకరణ అంశాల్లో అభ్యర్థి సృజనాత్మకతను ప్రదర్శించాలి. అప్పుడే మంచి మార్కులు సొంతమవుతాయి.**

### **తెలుగు పరీక్షను రెండు విధాలుగా నిర్వహిస్తారు. **

### **ఒకటి జనరల్‌ తెలుగు (****01T, 02T) ****రెండోది కాంపోజిట్‌ తెలుగు (****03T, 4S). **

### **మొదటి రోజు ప్రశ్నపత్రం ఇచ్చేటప్పుడు విద్యార్థి ఆ ప్రశ్నపత్రం తన ఐచ్ఛికానిదో****? ****కాదో****? ****పరిశీలించుకోవాలి. జనరల్‌ తెలుగు రాయబోయి కాంపోజిట్‌ తెలుగు రాసి మార్కులు కోల్పోయినవారు ఎందరో ఉన్నారు. **

### **కాబట్టి ప్రశ్నపత్రం ఇచ్చిన వెంటనే ఐచ్ఛికాన్ని పరిశీలించుకోవాలి.**

### **పరీక్ష రాయడానికి ****15**** నిమిషాల ముందు ప్రశ్నపత్రాన్ని ఇస్తారు. **

### **ముందు దాన్ని జాగ్రత్తగా చదువుకోవాలి. ప్రశ్నలను అర్థం చేసుకోవాలి. **

### **అంతర్గత ఎంపిక వ్యాసరూప ప్రశ్నలకు మాత్రమే ఉంటుంది. **

### **కాబట్టి ఏ ప్రశ్నలకు సమాధానం రాయాలో వాటికి ****‘****టిక్‌****’ ****మార్క్‌ ఇచ్చుకోవాలి.**

### **జవాబు రాసేటపుడు ప్రశ్నను సమాధాన పత్రంలో రాయాల్సిన‌ అవసరం లేదు. **

### **దాని సంఖ్యను సరిగా వేస్తే చాలు. ప్రశ్న సంఖ్య సరిగా వేయకపోతే పేపరు దిద్దేటప్పుడు అసిస్టెంట్‌ ఎగ్జామినర్‌కు విసుగు వచ్చే అవకాశం ఉంటుంది. మూల్యాంకనం చేయరు.**

### **ఏ ప్రశ్న వచ్చినా సమాధానం రాసేలా అన్ని ప్రశ్నలనూ సాధన చేయాలి.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **పరీక్షకు సన్నద్ధమయ్యేటప్పుడు**

## **పేపర్‌-****1****⏎  ⏎ ప్రతిపదార్థం చదివేటప్పుడు పద్య అన్వయ క్రమాన్ని పాటిస్తూ చదవాలి. అర్థాలు రాయాలి. కర్త పదంతో ప్రతిపదార్థం ప్రారంభించి క్రియాపదంతో పూర్తి చేయాలి.⏎  \* ⏎ కంఠస్థ పద్యం పాదభంగం లేకుండా రాసేలా సాధన చేయాలి. పద్యభాగం అర్థవంతంగా రాయాలి.⏎  ⏎ వ్యక్తీకరణ – సృజనాత్మకత సామర్థ్యంలో 4 లఘు సమాధాన ప్రశ్నలు ఇస్తారు.  వాటిలో పద్యభాగం, గద్యభాగం నుంచి 2 చొప్పున వస్తాయి. వీటిలో ఒక కవి పరిచయం, ఒక ప్రక్రియ తప్పనిసరిగా వస్తాయి. కాబట్టి పాఠ్యాంశాల కవులు, ప్రక్రియలు చదువుకోవాలి.⏎  \*⏎ వ్యాసరూప ప్రశ్నలకు సమాధానాలు పది లేదా పన్నెండు వాక్యాల్లో సమాధానాలు రాయాలి.

### **ఈ విభాగంలోవి స్వీయ రచన ప్రశ్నలు కాబట్టి సమాధానాలు సొంతంగా రాయడానికి ప్రయత్నించాలి.****⏎  \* ⏎ భాషాంశాలు మొత్తం చదివి జవాబులు పెట్టాలి.

### **పాఠ్యాంశాల వెనుక ఉండే పదజాలం, వ్యాకరణాంశాలు సమగ్రంగా చదువుకోవాలి.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **పేపర్‌-****2⏎  ⏎ ఉపవాచకం, వాచకంలోని సృజనాత్మక అంశాల మీద ప్రశ్నలతో ఉంటుంది.⏎  \* ⏎ సంఘటనా క్రమంలోని ప్రశ్నకు సమాధానం సరిగా రాయాలంటే రామాయణ కథపై పూర్తి అవగాహన ఉండాలి. 6 కాండలలో కథ ఎక్కడి నుంచి మొదలై ఎక్కడి వరకూ ఉంటుందో తప్పనిసరిగా గుర్తుంచుకోవాలి.⏎  \* ⏎ అపరిచిత పద్యం, అపరిచిత గద్యం కింద ఇచ్చే ప్రశ్నలు పూర్తిగా చదివి అర్థం చేసుకొని ప్రశ్నలకు సమాధానాలు రాయాలి.⏎  \* ⏎ వ్యక్తీకరణ – సృజనాత్మకతలోని లఘు ప్రశ్నలలో ఒక పాత్ర స్వభావం సంఘటన ద్వారా నీవేం తెలుసుకున్నావు? అనే ప్రశ్నలు వస్తాయి కాబట్టి, రామాయణంలోని ముఖ్య సంఘటనలను గుర్తుంచుకోవాలి.⏎  \* ⏎ ఉపవాచకంలోని వ్యాసరూప ప్రశ్న ‘రామాయణం’పై ఉంటుంది. కాబట్టి కాండలలోని కథకు సంబంధించిన ప్రశ్న లేదా రామాయణం విశిష్టత గురించిన ప్రశ్నలను చదవాలి.⏎  \* ⏎ సృజనాత్మక ప్రశ్నలకు మార్కుల సూచికలను అనుసరించి మార్కులు వేస్తారు. సృజనాత్మక ప్రశ్నకు నియమాలను అనుసరించి లేఖ, కరపత్రం, సంభాషణ వంటివి రాయాలి. లేఖ, కరపత్రం వంటివి ఒక పేజీలో పూర్తయ్యేలా రాయాలి.⏎  \* ⏎ భాషాంశాల్లో జాతీయాలు వివరించడం, వాక్యభేదాలు, క్రియాభేదాలు గుర్తుంచుకోవాలి. కర్తరి వాక్యం నుంచి కర్మణి వాక్యంగా మార్చేటప్పుడు ‘‘చేతబడి’’ అనే పదం గుర్తుంచుకుంటే సునాయాసంగా సమాధానాలు గుర్తించగలుగుతారు.

### **చేయకూడనివి****⏎  \* ⏎ ప్రశ్నపత్రం పూర్తిగా చదవకుండా సమాధానాలు రాయడం ప్రారంభించకూడదు.⏎  \* ⏎ సమాధానాలు రాసేటప్పుడు ప్రశ్నను రాయవలసిన అవసరంలేదు. మార్జిన్‌లో ప్రశ్న సంఖ్య వేస్తే చాలు.⏎  \* ⏎ అక్షరాలన్నీ ఒకే సైజులో పదానికి పదానికి మధ్య ఖాళీ ఉంచుతూ మూల్యాంకనం చేసే వారికి అర్థమయ్యేలా రాయాలి.⏎  \* ⏎ వ్యాసరూప ప్రశ్నలకు 20 నిమిషాలకు మించి సమయాన్ని కేటాయించకూడదు.⏎  \* ⏎ కొట్టివేతలు లేకుండా జాగ్రత్తపడాలి.⏎  \* ⏎ హాల్‌ టికెట్‌ నంబరు ఎక్కడా వేయకూడదు. మెయిన్‌ ఆన్స‌ర్‌ బుక్‌లెట్‌ నంబర్‌ మాత్రం ప్రతి అడిషినల్‌ షీట్‌ (అదనపు సమాధాన పత్రం), బిట్‌పేపర్‌ మీద వేయాలి.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **ముఖ్యమైన ప్రశ్నలు**** ⏎  ⏎ ⏎  ⏎ పేపర్‌ – 1⏎  ⏎ ప్రతిపదార్థాలు, కంఠస్థ పద్య భావాలు⏎  1. ⏎ శివరాజంతట మేల్ముసుంగు⏎  2. ⏎ అనలజ్యోతుల నీ పతివ్రతం⏎  3. ⏎ సురుచిర తారకాకుసుమ⏎  4. ⏎ వడిగొని టేకు లుప్పరిల్ల⏎  5. ⏎ దెసలను కొమ్మలొయ్య⏎  6. ⏎ నీరముతప్త లోహమున⏎  7. ⏎ ఉరుగుణవంతుడొడ్లు⏎  8. ⏎ తన చూపంబుధి మీద జాచి⏎  ⏎ వ్యాసరూప ప్రశ్నలు⏎  ⏎ 1. శివాజీ వ్యక్తిత్వం గురించి రాయండి.⏎  2. ⏎ అమరావతి సాంస్కృతిక వైభవాన్ని వివరించండి.⏎  3. ‘‘⏎ పల్లెటూళ్ళు ప్రశాంత జీవిత సౌఖ్యానికి పుట్టినిళ్ళు’’ – సమర్థించండి.⏎  4. ⏎ వెన్నెల పాఠ్యాభాగ సారాంశం రాయండి.⏎  5. ⏎ హనుమంతుడు సముద్రాన్ని లంఘించిన విధం రాయండి.⏎  6. ⏎ మానవ జీవితంలో కళ, కవిత, విజ్ఞానం తోడున్నాయని కవి అనడాన్ని నీవెలా సమర్థిస్తావు?⏎  7. ‘⏎ గోరంత దీపాలు’ కథానికలో వృద్థుని పాత్ర స్వభావం గురించి రాయండి.⏎  8. ⏎ చిత్ర గ్రీవాన్ని గురించి సొంత మాటలలో రాయండి.

### **పేపర్‌- ****2****⏎  ⏎ ఉపవాచక ప్రశ్నలు⏎  ⏎ 1. ‘‘రామాయణం మానవ హృదయాల నుండి ఎప్పటికీ చెరగని కథ’’ సమర్థించండి.⏎  2. ⏎ శ్రీరామ జననం గురించి రాయండి.⏎  3. ⏎ సీతారామ కళ్యాణాన్ని వర్ణించండి.⏎  4. ⏎ శ్రీరాముడు వనవాసమేగడానికి కారణాలేమిటి?⏎  5. ⏎ అయోధ్య కాండ ఆధారంగా శ్రీరాముని గుణగణాలు వర్ణించండి.⏎  6. ⏎ సీతాపహరణ వృత్తాంతం రాయండి.⏎  7. ⏎ శ్రీరామ సుగ్రీవుల మైత్రి గురించి రాయండి.⏎  8. ⏎ రామ రావణ యుద్ధాన్ని వర్ణించండి.⏎  ⏎ సృజనాత్మక ప్రశ్నలు⏎  ⏎ 1. మీకు నచ్చిన ప్రకృతి దృశ్యాన్ని లేదా సన్నివేశాన్ని వర్ణిస్తూ రాయండి.⏎  2. ⏎ అమరావతి శిల్ప సంపదను సృష్టించిన శిల్పులను అభినందిస్తూ లేఖ రాయండి.⏎  3. ⏎ మహిళల పట్ల వివక్ష, దాడులను ఖండిస్తూ కరపత్రం రాయండి.⏎  4. ⏎ చూడాకర్ణుడు, వీణాకర్ణుని మధ్య సంభాషణను రాయండి.⏎  5. ⏎ మీ పాఠాశాల వార్షికోత\*వానికి అందరినీ ఆహ్వానిస్తూ ఆహ్వానపత్రం తయారు చేయండి.

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **_󠀁[10TH CLASS PUBLIC EXAMS TELUGU PAPER-1 BLUE PRINT & MODEL PAPERS](https://amaravathiteacher.com/10th-class-telugu-paper-1-model-paper-blue-print/)󠁿_**

### **_󠀁[TELUGU PAPER-2 BLUE PRINT & EXAM MODEL PAPERS](https://amaravathiteacher.com/10th-class-telugu-paper-2-model-paper-blue-print/)󠁿_**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
