# how-to-get-GPA-10/10-SSC-10th-class-exams-Physical-Science-subject

- Link: https://amaravathiteacher.com/how-to-get-gpa-10-10-ssc-10th-class-exams-physical-science-subject/
- Published: 2019-02-12T22:28:55+05:30
- Author: amaravathiteacher

## **_how-to-get-GPA-10/10-SSC-10th-class-exams-Physical-Science-subject_**

### **పదో తరగతి పబ్లిక్‌ పరీక్షలో.. భౌతికశాస్త్ర ప్రశ్నలు గుర్తుకు పెట్టుకుని, బట్టీపట్టి రాయడానికి వీలుగా ఉండవు. ఆలోచించి రాసేలా ఉంటాయి.**

### **విశ్లేషణాత్మకంగా అన్వయించి రాయాల్సి ఉంటుంది.**

### **సమాధానాలు ఒకేరకంగా రాయడానికి బదులు బహుళ విధాలుగా వచ్చేలా ప్రశ్నల స్వభావం ఉంటుంది.**

### **ఆ ప్రశ్నలు నిర్ధారించిన విద్యాప్రమాణాలు, సాధించవలసిన సామర్థ్యాలకు సంబంధించినవై ఉంటాయి.**

### **పాఠ్యపుస్తకంలోని అన్ని ప్రశ్నలూ యథాతథంగా ప్రశ్నపత్రంలో రావు. అందువల్ల బట్టీపట్టి చదివే విధానానికి స్వస్తిచెప్పి విషయాన్ని అవగాహన చేసుకోవాలి.**

### ** పాఠ్యాంశాల వారీగా వెయిటేజీ లేదు. సిలబస్‌ మొత్తానికి సమాన ప్రాధాన్యం ఉంటుంది. క్షుణ్ణంగా చదవాలి. పాఠాన్ని పూర్తిగా చదివి అందులో ముఖ్యమైన భావనలు, పటాలు, ఫార్ములాలు, ప్రయోగాలు, నిత్యజీవిత అనువర్తనాలను అవగాహన చేసుకోవాలి.**

### **పాఠ్యపుస్తకంలోని ప్రశ్నలకు సమాధానాలు రాయటం అభ్యసించి, పునశ్చరణ చేయాలి. కృత్యాలు, ప్రయోగాలను సాధ్యమైనంతవరకూ వ్యక్తిగతంగా చేసి పరిశీలనలు, ఫలితాలను నమోదు చేయాలి. ప్రతి ప్రయోగ కృత్యానికీ నివేదికలు రూపొందించుకోవాలి.**

### **ప్రతి భావననూ విశ్లేషణాత్మకంగా చదవాలి.**

### **ప్రత్యేకంగా బొమ్మల ద్వారా వివరించగలగడం, అసంపూర్తిగా ఉన్న బొమ్మలను పూర్తిచేయడం, సందర్భోచిత పటాలు గీయటం సాధన చేయాలి.**

### **ప్రశ్నల స్వభావం**⏎  **విషయావగాహన: **

### **భౌతికశాస్త్రంలో నేర్చుకున్న భావనలను వివరించడం, ఉదాహరణలివ్వడం, కారణాలు చెప్పడం, పోలికలు, భేదాలు చెప్పటంపై ప్రశ్నలు.**

### **ప్రశ్నించడం – పరికల్పనలు చేయడం:**

### **వివిధ భావనలపై విద్యార్థులు సొంతంగా ప్రశ్నలు అడిగేలా ఫలితాలు గురించి ఊహించే ప్రశ్నలు.**

### **ప్రయోగాలు – క్షేత్ర పరిశీలనలు:**

### **ప్రయోగ విధానం, ఉపయోగించిన పరికరాలు, వచ్చిన ఫలితాలు, ప్రత్యామ్నాయ పరికరాలు ఉపయోగించిన విధానం, చరాలు మార్చినప్పుడు వచ్చే ఫలితాలు, అమరికకు పటాలు గీయటం వంటి ప్రశ్నలు.**

### **సమాచార నైపుణ్యాలు: **

### **సమాచారాన్ని విశ్లేషించడం, సేకరించడం, ఉపయోగించిన సాధనాలు, నమూనా పట్టికలు తయారు చేయటం వంటి ప్రశ్నలు.**

### **బొమ్మలు గీయడం:**

### ** పరికరాల అమరిక, పనిచేసే విధానం, బొమ్మలు గీయడం, ఫ్లో చార్టులు, గ్రాఫులు గీయడం వంటి ప్రశ్నలు.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **ప్రశంస, విలువలు, జీవవైవిధ్యం: **

### **అభినందించే, ప్రశంసించే పద్ధతులు, నిర్వహించే లేదా పాల్గొనే పనులు, నినాదాలు, కరపత్రాలు, వ్యాసాలు రాయడం వంటి ప్రశ్నలు.**

### **ప్రశ్నపత్రంలో పార్టు-ఎ మూడు విభాగాలుగా ఉంటుంది.**

### **పార్టు ఎ-కి సమాధాన పత్రంలోనూ, పార్టు బి-కి ప్రశ్నపత్రంలోనూ సమాధానాలు రాయాలి.**

### **పార్ట్‌-ఎలోని విభాగం-1లో 4 ప్రశ్నలుంటాయి.**

### **అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి.**

### ** ప్రతి ప్రశ్నకు ఒక మార్కు. 1 లేదా 2 వాక్యాల్లో సమాధానం రాయాలి.**

### **అనుస‌రించాల్సిన అంశాలు**

### **\* సరైన ప్రణాళిక, సంసిద్ధత, పునశ్చరణ మంచి గ్రేడ్‌ పాయింట్లు సాధించడానికి దోహదం చేస్తాయి.**

### **\* ఇంట్లో, పాఠశాలలో పునశ్చరణకు తగిన సమయం కేటాయించాలి.**

### **\* ప్రతి పాఠ్యాంశాన్నీ పూర్తిగా అవగాహన చేసుకుని చదవాలి.**

### **\* కీ పాయింట్లను తయారుచేసుకోవాలి.**

### **\* స్వయంగా ప్రశ్నలు తయారు చేసుకొని వాటికి జవాబులు రాయడం సాధన చేయాలి.**

### **\* పాఠ్యపుస్తకంలోని ‘అభ్యసనాన్ని మెరుగుపరచుకుందాం’లోని అన్ని ప్రశ్నలకు స్వయంగా సమాధానాలను రాసుకుని పునశ్చరణ చేసుకోవాలి.**

### **ముఖ్య‌మైన ప్ర‌శ్న‌లు **⏎  **1 మార్కు**

### **1) 37^(O)C ను కెల్విన్‌ మానంలోకి మార్చండి.**

### **2) n = 3 అయితే l విలువలను తెలపండి.**

### **3) విశిష్ట నిరోధానికి S.I. పద్ధతిలో ప్రమాణం ఏమిటి?**

### **4) కింది సమ్మేళనాల్లో ఏది త్రికబంధాన్ని కలిగి ఉంటుంది?**⏎  **C_(3)H_(6), C_(3)H_(8), C_(3)H_(4)**

### **5) ఒక వాహకంలో 4 నిమిషాల్లో 90 కులూంబ్‌ల ఆవేశం ప్రవహిస్తే ఆ వాహకంలోని విద్యుత్‌ ప్రవాహం ఎంత?**

### **\* పార్టు-ఎ విభాగం-2లో 5 ప్రశ్నలు ఉంటాయి. **

### **అన్ని ప్రశ్నలకూ సమాధానాలు రాయాలి.**

### ** ప్రతి ప్రశ్నకు 2 మార్కులు. 3 లేదా 4 వాక్యాల్లో సమాధానాలు రాయాలి.**

### **2 మార్కులు**

### **1) వజ్రం ప్రకాశించడానికి కారణమేమిటి? ఇందులో ఇమిడి ఉన్న అంశాన్ని మీరెలా అభినందిస్తారు?**

### **2) NaOH ఉపయోగాలను తెలపండి?**

### **3) వస్తువును 2F_(1), F_(1) ల మధ్య ఉంచినపుడు పుటాకార కటకం వల్ల ప్రతిబింబం ఏర్పడే విధానాన్ని తెలిపే కిరణ చిత్రాన్ని గీయండి.**

### **4) 6, R_(2)  నిరోధం గల రెండు నిరోధాలను సమాంతరంగా కలిపినప్పుడు ఫలిత నిరోధం 4 లు అయితే R_(2) విలువను కనుక్కోండి.**

### **5) బాష్పీభవనం, మరగడం మధ్య భేదాలను తెల్పండి.**

### 󠀁[**_10TH P.S 20 PRACTICE PAPERS & BIT PAPERS_**](https://amaravathiteacher.com/ssc-10th-class-physical-science-p-s-practice-papers-e-m-t-m/)󠁿

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### 󠀁[**_10TH P.S CHAPTER WISE IMP QUESTIONS_ **](https://amaravathiteacher.com/category/10th-physical-science/)󠁿

### **\* పార్టు-ఎ విభాగం-3లో 4 ప్రశ్నలు ఉంటాయి.**

### **ప్రతి ప్రశ్నకు 4 మార్కులు.**

### **ప్రతి ప్రశ్నకు అంతర్గత వెసులుబాటు ఉంది.**

### **ఏదైనా ఒకదాన్ని ఎన్నుకొని సమాధానం రాయాలి.**

### **ప్రతి ప్రశ్నకు 8- 10 వాక్యాల్లో సమాధానం రాయాలి.**

### **4 మార్కులు**

### **1) ఓవర్‌లోడ్‌ వల్ల విద్యుత్‌ సాధనాలు ఎందుకు పాడవుతాయి? ఓవర్‌లోడ్‌ వల్ల సంభవించే ప్రమాదాలను ఎలా నివారించగలం?**

### **2) సాధారణంగా దృష్టి దోషాలు ఎన్ని రకాలు? అవి ఎలా ఏర్పడతాయి? పట సహాయంతో వివరించండి. కటకాలను ఉపయోగించి దృష్టి దోషాలను ఎలా సవరిస్తారో వివరించండి.**

### **3) ధాతువులను సాంద్రీకరణం చెందించే ప్రక్రియలను తెలిపి, వివరించండి.**

### **4) పట్టక వక్రీభవన గుణ‌కాన్ని కనుక్కునే ప్రయోగాన్ని వివరించండి.**

### **5) s, p ఆర్బిటాళ్ళ జ్యామితీయ ఆకృతులను గీయండి.**

### **పార్టు-బిలో 20 బహుళైచ్ఛిక ప్రశ్నలు ఉంటాయి.**

### ** ప్రతి ప్రశ్నకు 1/2 మార్కు.**

### **ఇచ్చిన నాలుగు సమాధానాల్లో (A, B, C, D) ఒకదాన్ని ఎంచుకుని బ్రాకెట్లలో రాయాలి. దిద్దేసిన, కొట్టివేసి రాసిన సమాధానాలకు మార్కులు ఇవ్వరు.**

### **1) ఒక పరమాణువులో చివరి ఎలక్ట్రాన్‌ క్వాంటం సంఖ్యలు 3, 2, -2, +1/2 అయితే, దాని పరమాణ సంఖ్య ( )**⏎  **A) 19 B) 20 C) 21 D) 22**

### **2) అత్యధిక ఋణ విద్యుదాత్మకత గల మూలకం బాహ్యతమ కర్పరంలోని ఎలక్ట్రాన్‌ విన్యాసం ( )**⏎  **A) ns^(2)np^(3) B) ns^(2)np^(4) C) ns^(2)np^(5) D) ns^(2)np^(6)**

### **󠀁[_10TH P.S PRACTICE PAPERS (T.M & E.M)_](https://amaravathiteacher.com/category/10th-physical-science/)󠁿**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **_󠀁[10th P.S PUBLIC EXAMS PAPERS 3 SETS E.M](https://amaravathiteacher.com/10th-class-public-exams-physical-science-english-medium-model-paper-ap/)󠁿_**

### **_󠀁[10TH CLASS P.S PUBLIC EXAMS PAPERS 3 SETS T.M](https://amaravathiteacher.com/10th-class-public-exams-physical-science-telugu-medium-papers-ap/)󠁿_**

### 󠀁[**_10TH P.S PAPER MARCH-2018 QUESTION PAPER & KEY PAPERS_**](https://amaravathiteacher.com/10th-class-public-exams-2018-physical-science-principles-of-valuation/)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
