how-to-get-GPA-10/10-SSC-10th-Class-public-exams-Mathematics-subject
నూరుశాతం మార్కులను కచ్చితంగా సాధించగలిగే సబ్జెక్టు గణితశాస్త్రం.
ఈ సబ్జెక్టు పరీక్షలో విజయానికి వేగం, కచ్చితత్వం రెండు కళ్ళు.
అందుకే విద్యార్థికి ఈ రెండూ తప్పనిసరి.
పదో తరగతి గణితంలో 10/10 గ్రేడ్ పాయింట్లు సాధించడానికి సరైన సన్నద్ధతతో పాటు పరీక్షల్లో జవాబులను చక్కగా ప్రెజెంట్ చేయటం కూడా అవసరం.
అందుకోసం చేయాల్సినవి.
పరీక్షలకు సన్నద్ధమయ్యేటప్పుడు ఇష్టం వచ్చినట్టు ఏది పడితే అది చదవటం సరి కాదు.
ప్రణాళిక ఏదీ లేకుండా ఇలా చదివితే ఫలితం ఉండదు.
ఏయే సబ్జెక్టుల్లో, ఏయే అంశాల్లో వెనుకబడి ఉన్నామో గుర్తించాలి.
ప్రణాళికాబద్దంగా పునశ్చరణ (రివిజన్) చేసుకోవాలి.
విద్యార్థులు తెల్లవారుఝామున 4 గంటలకు నిద్రలేవటం మంచిది.
ఈ సమయంలో చదివిన విషయాలు ఎక్కువగా గుర్తుంటాయి.
రాత్రి 10.30 గంటలవరకు శ్రద్ధగా చదవటం మేలు.
ప్రతిరోజూ సబ్జెక్టుకు రెండు గంటల చొప్పున అన్ని సబ్జెక్టులు పునశ్చరణ చేసుకోవాలి.
జవాబులను పెన్సిల్‌తో రాయకూడదు.
బిట్ ప్రశ్నల జవాబుల్లో కొట్టివేతలు, దిద్దుబాట్లు ఉండకుండా చూసుకోవాలి.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
* గణితం పేపర్1 కి సంబంధించిన 7 చాప్టర్లలో మొత్తం 20, పేపర్ 2కి సంబంధించి 7 పేపర్లలో మొత్తం 25 భావనలున్నాయి.
అన్ని భావనలపైనా పట్టు సాధించినట్లయితే నూరుశాతం మార్కులకు ఆస్కారం ఉంటుంది. ఎందుకంటే ఈ భావనల ఆధారంగానే పరీక్షల్లో ప్రశ్నలు రూపొందిస్తారు.
* ప్రతీ చాప్టర్‌లోని సూత్రాలు, నిర్వచనాలు ఒక చార్టుపై రాసి ప్రతిరోజూ పునశ్చరణ చేసుకోవాలి. మెరుగైన స్కోరుకు ఇవి దోహదం చేస్తాయి.
* పరీక్ష రాసేటప్పుడు ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదవాలి.
అవగాహన చేసుకుని బాగా వచ్చిన ప్రశ్నలను ముందుగా రాయాలి.
* కంపాస్ పెట్టె తప్పనిసరిగా ఉంచుకోవాలి.
* జవాబు రాసే ప్రతీ ప్రశ్నసంఖ్యనూ మార్జిన్‌లో రాయాలి.
జవాబు పత్రానికి రెండువైపులా మార్జిన్ గీయాలి.
చివరన జవాబులన్నీ సరిచూసుకోవాలి.
* అదనపు జవాబు పత్రాలు, గ్రాఫ్, పార్టు – బి జవాబుపత్రాలన్నీ వరుసగా కట్టాలి.
* ప్రశ్నలను బట్టీ పట్టే అలవాటు ఏమాత్రం సరికాదు.
తెల్లవార్లూ మేలుకుని చదవటం వల్ల వ్యతిరేక ఫలితాలు వస్తాయి.
* అనవసరంగా ఆందోళనకు గురికాకుండా ఆత్మవిశ్వాసంతో పరీక్షలు రాస్తే ఆశించిన మార్కులు సాధ్యమవుతాయి.
10TH MATHS PAPER-1 PUBLIC EXAMS MARCH-2018 QUESTION PAPER & KEY PAPERS
10TH MATHS PAPER-2 PUBLIC EXAMS MARCH-2018 QUESTION PAPERS & KEY PAPERS
10th MATHS-1 PUBLIC EXAMS BLUE PRINT & MODEL PAPERS (E.M)
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
