# how-to-get-GPA-10/10-SSC-10th-Class-Public-Exams-Social-Studies-S.S

- Link: https://amaravathiteacher.com/how-to-get-gpa-10-10-ssc-10th-class-public-exams-social-studies-s-s/
- Published: 2019-02-13T22:18:25+05:30
- Author: amaravathiteacher

## **_how-to-get-GPA-10/10-SSC-10th-Class-Public-Exams-Social-Studies-S.S_**

### **పరీక్షల ముందు ఏం చదవాలి? ఎలా చదవాలి? అనే సందేహాలు విద్యార్థులను భయాందోళనలకు గురి చేస్తూంటాయి.**

### **అయితే తగిన మెలకువలు పాటిస్తే వాటిని అధిగమించి, పరీక్షల్లో మంచి స్కోరు సంపాదించవచ్చు.**

### **పదోతరగతి విద్యార్థులకు శ్రమించే తత్వం, సన్నద్ధత చాలా ముఖ్యం.**

### **కష్టపడి చదవటం అలవాటు చేసుకోవాలి. చదివేటప్పుడూ, రాసేటప్పుడూ ‘ఇక చాలు’ అనే భావన రానీయకండి.**

### ** ఇంకాస్త చదివితే మార్కులు పెరుగుతాయి. **

### **కొంచెం ఆలోచించి రాస్తే మరో అర మార్కు సంపాదించవచ్చు అనే భావనతో పరీక్షలు రాయండి.**

### **ప్రణాళిక:**

### ** ఏ పని చేపట్టినా ఒక పద్ధతిని ఆచరిస్తే ఫలితం బాగుంటుంది. ప్రతి సబ్జెక్టుకూ కొంత సమయం కేటాయించాలి.**

### **ముఖ్యమైన ప్రశ్నలను గుర్తించి, వాటిని బాగా చదివి, చూడకుండా రాయాలి. రాని ప్రశ్నలను వదిలివేయకుండా మళ్ళీ ప్రయత్నించాలి.**

### **ప్రశాంతత: **

### **పరీక్షలంటే భయపడితే చదివింది కూడా మర్చిపోయే ప్రమాదం ఉంది.**

### **వాటి గురించి భయపడాల్సిన అవసరమే లేదు. సన్నద్ధమయ్యేటప్పుడూ, పరీక్షలు రాసేటప్పుడూ కూడా ఆందోళన చెందకుండా ప్రశాంతంగా ఉండటం ఎంతో అవసరం. ‘నేను సాధించగలను, తప్పక సాధిస్తాను’ అనే విశ్వాసాన్ని పెంచుకోవాలి.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **చేతిరాత: **

### **పరీక్షల్లో చేతిరాతకు ప్రాధాన్యం ఉంటుంది.**

### **అందువల్ల దీనిపై శ్రద్ధ వహించాలి.**

### **ఒకవేళ మీ చేతిరాత బాగుండకపోతే ఆందోళన చెందాల్సిన పనిలేదు.**

### **దస్తూరి అందంగా ఉండటం ముఖ్యం కాదు; మీరు రాసింది దిద్దేవారికి అర్థం కావాలి. **

### **అందుకు పదానికీ పదానికీ¨ మధ్య కాస్త ఖాళీ ఇవ్వండి. **

### **అలాగే ప్రతి రెండు వాక్యాల మధ్యా కొంచెం దూరం పాటించండి. అంతే!**

### **పునశ్చరణ: **

### **పరీక్షలు సమీపిస్తున్న కొద్దీ ఇంతకుముందు చదివిన ప్రశ్నలనే పునశ్చరణచేస్తూ అవగాహన పెంచుకోవాలి.**

### **పరీక్షకు ముందు సబ్‌ హెడ్డింగ్స్, ముఖ్యమైన పాయింట్లు మాత్రమే చదవాలి.**

### ** 1, 2, 4 మార్కుల ప్రశ్నలు, బహుళైచ్ఛిక ప్రశ్నలపై పట్టు సాధించాలి.**

### ** ఛాయిస్‌ లేని 1/2, 1, 2 మార్కుల ప్రశ్నలపై ఎక్కువగా దృష్టి పెట్టాలి.**

### **రోజూ ఒకటి లేదా రెండు వ్యాసరూప ప్రశ్నలు రాయడాన్ని సాధన చేస్తే పరీక్షలో వేగంగా, తప్పులు లేకుండా విషయాన్ని వివరించడం సాధ్యమవుతుంది.**

### **స్టడీ మెటీరియల్‌లోని ప్రశ్నలను ఇప్పటికే చాలావరకు చదివిఉంటారు.**

### **వాటిని మినహాయించి మిగతా ప్రశ్నలపై దృష్టి పెట్టండి.**

### **జవాబులను చదివేసమయంలో బిట్లుగా వచ్చే పాయింట్లను అండర్‌లైన్‌ చేసి ఉంచుకోండి.**

### ** పరీక్షలు సమీపించినప్పుడు వాటిని పునశ్చరణ చేయండి.**

### **ప్రశ్నపత్రం చదవాలి: పరీక్షల్లో విద్యార్థులంతా సాధారణంగా చేసే పొరపాటు. ప్రశ్నపత్రాన్ని చదవడానికి 15 నిమిషాలు కేటాయించి, ఆ సమయాన్ని సక్రమంగా వినియోగించుకోవాలి.**

### **ప్రశ్నపత్రాన్ని క్షుణ్ణంగా చదివితే ఎలా రాయాలి అనే అంశంపై స్పష్టత ఏర్పడుతుంది. అలాగే సమయపాలన తేలికవుతుంది.**

### **మార్కులకు అనుగుణంగా:**

### ** ప్రశ్నలకు జవాబులు రాసేటప్పుడు ఏయే అంశాలను తప్పనిసరిగా రాయాలి అనే దానిపై విద్యార్థులకు స్పష్టత అవసరం.**

### **అడిగిన ప్రశ్నకు ఏ పాయింట్లు ఉంటే పూర్తి మార్కులు పొందుతారో తెలుసుకొని ఉండాలి.**

### **మొదట ఆ ప్రశ్నకు కేటాయించిన మార్కులకు అనుగుణంగా తప్పనిసరిగా రాయాల్సిన అంశాల తర్వాతే, మిగతావి రాయటం మేలు.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **అవసరముంటేనే అడిషనల్స్‌: **

### **అదనపు జవాబుపత్రాలను (అడిషనల్స్‌) అవసరంమేరకే తీసుకోండి.**

### ** ఎక్కువ పేజీల్లో సమాచారం ఉంటే మంచి మార్కులు సాధించవచ్చు అనేది అపోహే. జవాబు పత్రాల్లో అవసరానికి మించి ఖాళీలు వదిలి ఎక్కువ అడిషనల్స్‌ తీసుకోవద్దు.**

### **ఇలా చేయడం వల్ల మీ జవాబు పత్రాలు మూల్యాంకనం చేసేవారికి విసుగ్గా అనిపించడంతోపాటు మీపై చెడు అభిప్రాయం ఏర్పడుతుంది.**

### **ఎక్కువ పేజీలు ఉంటే ఎక్కువ మార్కులు ఇస్తారని రాసిన జవాబునే మళ్లీ రాయవద్దు.**

### **అవసరమైన మేరకే రాయాలి. అనవసర విషయాలు చర్చించడం వల్ల మార్కులు తగ్గడం, సమయం వృథా కావడం తప్ప ప్రయోజనం ఉండదు.**

### **సమయ సద్వినియోగం: **

### **కొందరు విద్యార్థులు పరీక్షలో సమయం చూసుకోకుండా రాస్తూనే ఉంటారు. ఇలాంటివారు తమకు తెలిసిన జవాబులు రాయకుండానే పేపర్‌ ఇచ్చేయాల్సి వస్తుంటుంది.**

### **అలా జరగకుండా ఉండాలంటే ఆయా ప్రశ్నలకు నిర్దేశిత సమయాన్ని మాత్రమే కేటాయించండి.**

### **మొదట మీకు వచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయండి.**

### **మరిచిపోయిన జవాబులను చివరిలో ప్రయత్నించండి.**

### ** ప్రశ్నల నంబరు వేయడం మరవకండి.**

### **వీటిని మార్జిన్‌ ఎడమపక్క వేయాలి.**

### **జవాబుల్లో ఉపశీర్షికలు (సబ్‌హెడ్డింగ్స్‌) ఉంటే వాటిని అండర్‌లైన్‌ చేయాలి. ఉపశీర్షికలు లేని సమాధానాల్లోని పాయింట్స్‌లో ముఖ్యపదాలను అండర్‌లైన్‌ చేయండి.**

### ** అదనపు (ఛాయిస్‌) ప్రశ్నలకు ముందే రాయకండి. చివరిలో సమయం ఉంటేనే రాయండి.**

### **జవాబులను పూర్తిగా రాయాలి.**

### **అవసరమైనచోట అదనపు పాయింట్లను జతచేయాలి. అర్థమయ్యే చేతరాత, క్రమబద్ధంగా రాసిన జవాబులు, ఉప విభాగాలు, ముఖ్యమైన పదాలను అండర్‌లైన్‌ చేయడం, మార్జిన్‌ వదలడం, ప్రశ్నపత్రం దిద్దేవారిని ఆకట్టుకుంటాయి. అన్ని జవాబులూ రాసిన తర్వాత, జవాబు పత్రాన్ని అంతా చదివి తప్పులుంటే సరిచేయండి.**

### **భూగోళశాస్త్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు భారతదేశ పటాన్నీ, చరిత్ర పాఠ్యాంశాలను చదివేటప్పుడు ప్రపంచపటాన్నీ దగ్గర పెట్టుకుని వాటికి సంబంధించిన అంశాలు వచ్చినప్పుడు పటాలను చూస్తూ చదవండి.**

### ** ఒకసారి చదివితే ఏదీ రాదు. వచ్చేవరకూ చదవండి.**

### **బిట్స్‌ (బహుళైచ్ఛిక ప్రశ్నలు) బట్టీ పట్టవద్దు. డ్రిల్లింగ్‌ (ఒకరిని ఒకరు అడగటం) చేస్తే మేలు.**

### **వ్యాఖ్యానించడం: **

### **‘ఇచ్చిన పాఠ్యాంశాన్ని చదివి వ్యాఖ్యానించడం’ అనే నైపుణ్యంలో ఇచ్చే పేరాను కొంతమంది ఉన్నది ఉన్నట్లు రాస్తున్నారు. ఇలా చేయకూడదు.**

### ** పేరాను పూర్తిగా చదవండి. ప్రశ్నను అర్థం చేసుకోండి. దానికి సంబంధించిన అంశాలు మాత్రమే రాయండి. అభిప్రాయాలు అడిగినప్పుడు ఆ పేరాలోని అంశాలను ఆధారంగా చేసుకొని రాయండి.**

### **దీనికోసం పాఠ్యపుస్తకంలోని రెండు పేరాలను తీసుకుని సాధన చేయండి.**

### **పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలు: **

### **పాఠ్యపుస్తకంలో ఉన్న పట్టికలు, గ్రాఫ్‌లు, పటాలను పరిశీలించండి.**

### ** ఆ పట్టిక మనకు ఏమి తెలియచేస్తుంది? సమాచారంలో మొదటి, చివరి స్థానంలో ఏం ఉన్నాయి? వాటి మధ్య తేడా ఏమిటి? ప్రత్యేకత ఏమిటి? పటాలైతే ఏ దిక్కులో ఏ దేశాలున్నాయి? భారతదేశపటంలో ఏ వైపు ఏ రాష్ట్రాలున్నాయి? మొదలైన ప్రశ్నలతో వాటిని పరిశీలనాత్మక ధోరణిలో చూడండి.**

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **పట నైపుణ్యాలపై అవగాహన ఉంటే తక్కువ సమయంలోనే ఎక్కువ మార్కులు పొందవచ్చు.**

### **ఈ నైపుణ్యంలో మూడు విధాలుగా ప్రశ్నలు వస్తాయి.**

### **రాష్ట్రాలను, భారతదేశ చిత్తుపటాలను గీయమనడం; ప్రాంతాలను, దేశాలను గుర్తించమనడం; గుర్తించిన పటాన్నిచ్చి ఇచ్చిన ప్రశ్నలకు జవాబులు రాయమనడం. ఈ మూడింటినీ సాధన చేయండి.**

### ** ఈ సాధన ద్వారా సాంఘికశాస్త్ర పాఠ్యాంశాలను బట్టీపట్టకుండా అర్థం చేసుకోవచ్చు.**

### **దేశాలు, దీవులు, ఇతర ప్రాంతాలను కొన్ని ఆకారాల్లో (జంతువులు, పక్షులు, అక్షరాలు, అంకెలు) గుర్తుపెట్టుకుంటే వాటిని సులభంగా గుర్తించవచ్చు.**

### **మ్యాప్‌ను గుర్తించేటప్పుడు ప్రశ్న సంఖ్యను అక్కడ వేయకూడదు.**

### **గుర్తించిన చోట పేరు మాత్రమే రాయాలి. ఒకవేళ స్థలం లేకపోతే బాణం గుర్తువేసి రాయాలి. లేదా గుర్తించాల్సిన ప్రదేశంలో మ్యాప్‌పై సంఖ్యవేసి, ఎదురుగా పేరు రాయాలి.**

### **సమకాలీన అంశాలు:**

### ** ఈ నైపుణ్యంలో పాఠ్యపుస్తకంలో ఉన్న పాఠ్యాంశాలకు సంబంధించిన సమకాలీన అంశాలపై మాత్రమే ప్రశ్నలు వస్తాయి. **

### **\* మొదటి పేపర్‌లో- పాఠశాల విద్య, భ్రూణహత్యలు, మహిళలపై అఘాయిత్యాలు, లింగ వివక్ష, మధ్యాహ్న భోజన పధకం, మురికి వాడలు, చౌకధరల దుకాణాలు, నీరు- అమ్మకాలు, నీటి కాలుష్యం, భూగర్భజలాలు, ప్రపంచీకరణ, పోషకాహారం, భూగోళం వేడెక్కడం, పర్యావరణ పరిరక్షణ, ఓజోన్‌పొర. **

### **\* రెండో పేపర్‌లో- ప్రపంచయుద్ధాలు, భారతదేశంతో ఇతర దేశాల సంబంధాలు, ప్రాజెక్టులు, ప్రభుత్వ సంక్షేమ పథకాలు, జాతీయ, ప్రాంతీయ పార్టీలు, నూతన రాష్ట్రాలు, జిల్లాల ఏర్పాటు, రాజ్యాంగ సవరణలు, సామాజిక ఉద్యమాలపై దృష్టిపెట్టండి.**

### **బిట్‌పేపర్‌ రాసేటప్పుడు:**

### ** బిట్‌పేపర్‌ ఇచ్చిన వెంటనే మెయిన్‌ పేపర్‌ రాయడం ఆపి బిట్‌పేపర్‌ పూర్తి చేయాలి.**

### **సమయం ఉంటే ఆ తర్వాత మెయిన్‌ పేపర్‌ రాయాలి.**

### **\* A, B, C, D లు బ్రాకెట్టులో రాసేటప్పుడు సరిగా రాయండి.**

### **జవాబులు తప్పు రాశామనుకుంటే దానిపై దిద్దవద్దు. తప్పు అనుకున్నదాన్ని పూర్తిగా కొట్టివేసి, అప్పుడు సరైన సమాధానం రాయాలి.**

### **అన్ని బిట్లనూ పూరించండి. ఒక్కోసారి ఏదైనా బిట్‌ తప్పుగా రావచ్చు. ఇలాంటివి అటెమ్ట్‌ చేస్తే మార్కు వస్తుందని మర్చిపోవద్దు.**

### **ముఖ్యమైన ప్రశ్నలు**⏎  **పేపర్‌-1**

 1.  
     ### **‘వ్యవసాయానికి మైదాన ప్రాంతాలు తోడ్పడినంతగా పీఠభూమి ప్రాంతాలు తోడ్పడవు’. ఈ పరిస్థితి భారతదేశంలో ఎలా ఉంది?**
     
 2.  
     ### **మిగతా రంగాలకంటే సేవారంగానికి ప్రత్యేకత ఉంది. కొన్ని ఉదాహరణలతో వివరించండి. (ఏపీకి మాత్రమే)**
     
 3.  
     ### **3. మీ రాష్ట్రంలో ‘పాఠశాల విద్యను విప్లవం‘గా చేపట్టాలంటే ఏమి చేయాలో తగు సూచనలు ఇవ్వండి.**
     
 4.  
     ### **‘భూగోళం వేడెక్కడానికి మానవుడే కారణం’. వివరించండి.**
     
 5.  
     ### **వలసలు వెళ్ళినవారు ఆ ప్రాంతంలో సమస్యలు సృష్టిస్తారా/సమస్యలకు కారణం అవుతారా? మీ సమాధానానికి కారణాలు రాయండి?**
     
 6.  
     ### **ప్రపంచీకరణ మన దేశ అభివృద్ధిని కుంటుపరుస్తుంది అని ఒకరంటే దేశాభివృద్ధికి సహాయపడుతుంది అని మరొకరు అంటున్నారు- వ్యాఖ్యానించండి.**
     
 7.  
     ### **పర్యావరణ పరిరక్షణకు ప్రజల్లో చైతన్యం రావడానికి రెండు నినాదాలు రాసి, ఒక కరపత్రాన్ని తయారుచేయండి.**
     
 8.  
     ### **‘ప్రత్యేక ఆర్థిక మండలి’ (సెజ్‌) అని దేన్ని అంటారు? వివరించండి?**
     
 9.  
     ### **భారతదేశ చిత్రపటాన్ని గీచి, మీ రాష్ట్రాన్ని, దాని రాజధానిని గుర్తించండి.**
     
 10. 
     ### **ఆనకట్టలు కట్టడం వలన ఎవరికి లాభం కలుగుతుంది? ఎవరికి నష్టం కలుగుతుంది?**
     

### **పేపర్‌-2**

 1. 
    ### **రెండో ప్రపంచ యుద్ధానికి దోహదం చేసిన ప్రత్యేక అంశాలేవి?**
    
 2. 
    ### **లెనిన్, స్టాలిన్‌లు రష్యాసమాజంలో ఎటువంటి మార్పులు తీసుకొచ్చారు?**
    
 3. 
    ### **చైనాలో భూ సంస్కరణల కోసం చేపట్టిన కార్యక్రమాలు రాసి, వాటి ఫలితాలు తెల్పండి.**
    
 4. 
    ### **సంస్థానాలను భారతదేశంలో విలీనం చేసే ప్రక్రియలో పటేల్‌ కృషిని ప్రశంసించండి?**
    
 5. 
    ### **రాజ్యాంగ సభ చర్చల్లో ‘అంటరానితనం’ అనే అంశంపై ప్రొమథరంజన్‌ ఠాకూర్‌ ఏమన్నారు?**
    
 6. 
    ### **భారత రాజ్యాంగంలోని మౌలిక సూత్రాలను తెలపండి?**
    

### **\* పొరుగు దేశాలతో శాంతియుతంగా ఉండటానికి మన దేశం చేపట్టాల్సిన చర్యలను సూచించండి?**

 8.  
     ### **బహుళ పార్టీ వ్యవస్థ వల్ల ప్రజలు పొందుతున్న ప్రయోజనాలు, ఎదుర్కొంటున్న సమస్యలను తెలపండి?**
     
 9.  
     ### **సామాజిక ఉద్యమాల మౌలిక అంశాలను రాయండి?**
     
 10. 
     ### **గ్రామపెద్దలు, కోర్టులు వివాదాలు/తగాదాలను పరిష్కరించే విధానాలను పోల్చండి. మీరు దేన్ని ఇష్టపడతారు? ఎందుకు?     **
     
 11. 
     ### **_󠀁[10th CLASS SOCIAL STUDIES (S.S) PUBLIC EXAMS PAPERS 3 SETS (T.M)](https://amaravathiteacher.com/10th-class-public-exams-social-paper-1-telugu-medium-papers-ap/)󠁿_**
     

[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]

### **_󠀁[10TH CLASS S.S PAPER-1 PUBLIC EXAMS PAPERS ](https://amaravathiteacher.com/10th-class-public-exams-social-paper-1-english-medium-papers-ap/)󠁿_**

### **_󠀁[10TH CLASS SOCIAL PAPER-2 (E.M) PUBLIC EXAMS PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-social-paper-2-english-medium-papers-ap/)󠁿_**

### **_󠀁[10TH CLASS SOCIAL PAPER-2 (T.M) PUBLIC EXAMS PAPERS](https://amaravathiteacher.com/10th-class-public-exams-social-paper-2-telugu-medium-papers-ap/)󠁿_**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
