How-to-grades-10th-class-pass-certificates

How-to-grades-10th-class-pass-certificates

పది ఫలితాల వెల్లడి ఎలా?*

🔑 *డీఈవోల వివరణ కోరిన విద్యాశాఖ*

🔑 *ఆందోళనలో విద్యార్థులు*

👁️‍🗨️👁️‍🗨️ *పదోతరగతి ఫలితాల వెల్లడిపై విద్యాశాఖ డీఈవోల అభిప్రాయం సేకరిస్తోంది. కరోనా నేపథ్యంలో పరీక్షలు రద్దు చేయడంతో మార్కుల కేటాయింపు కోసం ప్రామాణిక చర్యలు తీసుకుంటున్నారు.

భవిష్యత్తులో ఉన్నత చదువులు, ఉద్యోగాలు పొందే క్రమంలో అవరోధాలు లేకుండా జాగ్రత్తలు తీసుకుంటున్నారు.

పరీక్షలు రద్దయిన నేపథ్యంలో ఏడాది రాసిన ఎస్‌ఏ, ఎఫ్‌ఏ ఫలితాల ఆధారంగా గ్రేడ్లు ఇవ్వాలా? లేక అందరికీ ఒకే విధమైన కరోనా పాస్‌ అని ప్రకటించాలా అనే దానిపై అధికారులు తలలు పట్టుకుంటున్నారు.*

👁️‍🗨️👁️‍🗨️ *ఈ విషయంలో ఒక్కో డీఈవో ఒక విధమైన అభిప్రాయాన్ని ప్రభుత్వానికి పంపినట్లు తెలిసింది.

జిల్లా వ్యాప్తంగా పది విద్యార్థులు రెగ్యులర్‌ పరీక్షలకు సిద్ధంకాగా కొవిడ్‌-19 కారణంగా వాటిని ప్రభుత్వం రద్దు చేసింది.

వీరికి నేరుగా ఇంటర్‌లో ప్రవేశించే అవకాశం కలిగింది.

ఈ నేపథ్యంలో పది విద్యార్థుల సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎస్‌ఏ), ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌ (ఎఫ్‌ఏ) మార్కులను ఆన్‌లైన్‌లో నమోదు చేస్తున్నారు*.

👁️‍🗨️👁️‍🗨️ *ఫలితాలు గ్రేడ్‌ రూపంలో ఇస్తారా? కరొనా పాస్‌ అంటూ అందరికీ ఒకే ధ్రువపత్రం అందజేస్తారా? అన్న ఆందోళన విద్యార్థుల్లో నెలకొంది. నేటికీ విద్యాశాఖ ఫలితాలపై ఎలాంటి స్పష్టత ఇవ్వకపోవడంతో గందరగోళానికి గురవుతున్నారు.

ఇప్పటివరకు జరిగిన పది పరీక్షలకు మార్కులు, గ్రేడ్లు ప్రకటించిన విషయం తెలిసిందే…కాబట్టి ప్రస్తుతం పరీక్ష రద్దు చేసిన తరుణంలో విద్యాశాఖ నుంచి భిన్నాభిప్రాయాలు వ్యక్తం అవుతున్నాయి.

👁️‍🗨️👁️‍🗨️ *గతేడాది పది విద్యార్థులకు 4 ఫార్మేటివ్‌ అసెస్‌మెంట్‌, ఒక సమ్మెటివ్‌ అసెస్‌మెంట్‌ పరీక్షల మొత్తం 300ను వంద మార్కులకు లెక్కించి వాటి ఆధారంగా గ్రేడ్లు ఇచ్చేవారు. పక్కనున్న తెలంగాణ రాష్ట్రంలో అంతర్గత మార్కుల ప్రాతిపదికన ఫలితాలు వెల్లడించింది.*

నాలుగో తరగతి ఉద్యోగాలు పొందాలన్నా, ఇంటర్మీడియట్‌, ట్రిపుల్‌ ఐటీ, పాలిటెక్నిక్‌ తదితర కోర్సుల్లో ప్రవేశించాలన్నా విద్యార్థులకు మార్కులే ఆధారం.

కరోనా ఉత్తీర్ణతగా ఫలితాలు వెల్లడిస్తే నిజంగా ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు అన్యాయం జరుగుతుందన్న వాదన వినిపిస్తుంది.

ఒకవేళ గ్రేడ్‌ ప్రకటిస్తే కొన్ని ప్రైవేట్‌, కార్పొరేట్‌ పాఠశాలలు అక్రమాలకు పాల్పడి మార్కులు వేసుకుంటున్నాయనే ఆరోపణలు ఉన్నాయి.*

👁️‍🗨️👁️‍🗨️ *ఇప్పటికీ ఇంటర్నల్‌ మార్కులు ఆన్‌లైన్‌లో నమోదు చేయకపోవడాన్ని ఇందుకు ప్రస్తావిస్తున్నారు.

ఇంకొందరు ఎస్‌ఏ, ఎఫ్‌ఏ పరీక్షల్లో అనుత్తీర్ణత చెందడంతో వారి పరిస్థితి ఏమిటన్న సందిగ్ధం లేకపోలేదు*.

error: Content is protected !!