how-to-prepare-own-hand-sanitizer-step-by-step-all-details

how-to-prepare-own-hand-sanitizer-step-by-step-all-details

అలోవెరా జెల్‌తో ఇంట్లోనే ఈజీగా శానిటైజర్‌ని తయారు చేయండిలా..

శానిటైజర్.. ప్రజెంట్ వైరస్‌లు పెరిగిపోయిన నేపథ్యంలోనే దీనిని వాడేందుకు ప్రజలంతా ఆసక్తి చూపుతున్నారు.

ఈ సమయంలో ఇంట్లోనే శానిటైజర్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

ప్రస్తుతం ఎక్కడ చూసినా కరోనా కల్లోలమే నడుస్తోంది.

దీంతో ఎప్పటికప్పుడు చేతులను శుభ్రంగా చేసుకోండని చెబుతున్నారు నిపుణులు. ఇందుకోసం శానిటైజర్‌ని వాడాలని చెబుతున్నారు.

ఈ టైమ్‌లోనే ఇంట్లోనే శానటైజర్‌ని ఎలా తయారు చేయాలో ఇప్పుడు చూద్దాం..

శానిటైజర్ కచ్చితంగా వాడాలా…

చేతులను ఎప్పటికప్పుడు శుభ్రం చేసే శానిటైజర్‌‌కి ఇప్పుడు గిరికీ బాగా పెరిగిపోతుంది. చాలా మంది కరోనా వల్ల ఏర్పడిన భయంతో దీనిని వాడేందుకు మొగ్గు చూపతున్నారు.

ఈ నేపథ్యంలోనే ఇంట్లోనే దీనిని ఎలా తయారు చేసుకోవాలో చూద్దాం.. శానిటైజర్ వాడడం వల్ల కంటికి కనిపించని ఎన్నో సూక్ష్మక్రిములు చచ్చిపోతాయి.

దీనిని వాడడం వల్ల చేతులు ఎప్పటికప్పుడు శుభ్రంగా ఉంటాయి.

అదే విధంగా.. ఇందులో ఉపయోగించే ప్రతి పదార్థం కూడా నేచురల్‌వి కాబట్టి చేతులు మృదువుగా ఉంటాయి.

కావాల్సిన పదార్థాలు :

  • అలోవేరా జెల్

  • టీట్రీ ఆయిల్

  • లావెండర్ ఆయిల్

  • ఓ స్క్వీజ్ బాటిల్.

తయారు చేసే విధానం..

ముందుగా ఓ స్క్వీజ్ బాటిల్‌ తీసుకుని అందులో సగం కంటే తక్కువ పరిమాణంలో అలోవేరా జెల్‌‌ని వేసుకోవాలి.

ఇందులో ఎక్కువగా యాంటీ ఫంగల్, యాంటీ బ్యాక్టీరియల్ గుణాలు ఉంటాయి.

దీంతో పాటు చర్మాన్ని మృదువుగా చేసే గుణాలు కూడా ఉంటాయి.

కాబట్టి హ్యాపీగా దీని వాడొచ్చు.

ఇందుకోసం మీరు మార్కెట్లో దొరికే అలోవెరా జెల్‌నైనా మార్కెట్లో దొరికే అలోవేరా జెల్‌నైనా వాడొచ్చు.

కావాలనుకుంటే ఇందులో రోజ్‌వాటర్‌ని కూడా కలొపొచ్చు.

స్టెప్ 2..

ఇప్పుడు అలోవెరా మిశ్రమంలో కొన్ని చుక్కల లావెండర్ ఆయిల్‌ని వేసుకోండి.

ఈ లావెండర్ ఆయిల్‌ని కాస్మెటిక్స్, పెర్ఫ్యూమ్స్‌లో కూడా వాడతారు.

ఆ తర్వాత ఇందులోనే టీట్రీ ఆయిల్‌ని కూడా కొన్ని చుక్కలు కలపండి.

ఇవన్నీ కూడా మంచి అరోమాని కలిగి ఉంటాయి. ఇప్పుడు వీటన్నింటిని కలిపిన తర్వాత స్క్వీజ్‌ బాటిల్‌ని బాగా షేక్ చేయండి.

ఇలా చేయడం వల్ల పదార్థాలన్ని బాగా కలిసిపోతాయి.

ఇప్పుడు శానిటైజర్‌ని సిద్ధమైపోయినట్లే.

ఇలా తయారైన శానిటైజర్‌ క్రిములని చంపడంలో బాగా ఎఫెక్టివ్‌గా పనిచేస్తుంది.

కాబట్టి, దీనిని చక్కగా వాడుకోవచ్చు. దీని వల్ల చాలా వరకూ క్రిములన్ని చనిపోతాయని చెబుతున్నారు నిపుణులు.

ఇలాంటి శానిటైజర్స్‌ని ఇంట్లోనే తయారు చేసుకుని మీరు, మీ కుటుంబ సభ్యులు హ్యాపీగా వాడొచ్చు.

వీటి వల్ల ఎలాంటి ఇబ్బందులు ఉండవు.

వీటిని వాడడం వల్ల మరో లాభం ఏంటంటే.. చేతులు కూడా మృదువుగా తయారవుతాయి.

చక్కగా సాఫ్ట్‌గా ఉంటాయి.

దీంతో ఎలాంటి వారైనా ఈ శానిటైజర్స్‌ని వాడొచ్చు.

హ్యాపీగా యూజ్ చేయొచ్చు.

మరింకెందుకు ఆలస్యం మీరు వాడండి.

శానిటైజర్‌ తయారు చేసుకునే పద్ధతి-2

(పాఠశాల పిల్లలకు ఉపయోగం)

ప్రపంచ ఆరోగ్య సంస్థ(డబ్ల్యూహెచ్‌వో) ఫార్ములా ప్రకారం వీటిని తయారు చేసుకోవ చ్చు.

రూ.19తోనే 200 మి.లీ. శానిటైజర్‌ తయారు చేసుకునే పద్ధతి.

200 మిల్లీ లీటర్ల(మి.లీ) శానిటైజర్‌ చేసుకునేందుకు కావాల్సిన ద్రావణాలు:

* స్వచ్ఛమైన నీరు – 90 మి.లీ.

* ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ – 100 మి.లీ.

* హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌  – టేబుల్‌ స్పూన్‌

* గ్లిజరిన్‌/గ్లిజరాల్‌ – టేబుల్‌ స్పూన్‌

*తయారీ విధానం*

* ముందుగా 100 మి.లీ ఐసోప్రొపైల్‌ ఆల్కహాల్‌ను శుభ్రమైన పాత్రలో తీసుకోవాలి.

దీనికి టేబుల్‌ స్పూన్‌ చొప్పున గ్లిజరిన్‌, హైడ్రోజన్‌ పెరాక్సైడ్‌ కలపాలి.

దీనికి 90 మి.లీ శుద్ధమైన నీరు పోయాలి.

అనంతరం ఈ మిశ్రమాన్ని బాగా కలిపి.. ఖాళీ స్ప్రే బాటిల్‌ లేదా డిస్పెన్సింగ్‌ బాటిల్‌లో పోసి శానిటైజర్‌గా ఉపయోగించుకోవచ్చు.