# how-to-speedup-your-android-smart-phone-2019

- Link: https://amaravathiteacher.com/how-to-speedup-your-android-smart-phone-2019/
- Published: 2019-09-13T21:45:47+05:30
- Author: amaravathiteacher

# **how-to-speedup-your-android-smart-phone-2019**

### **Speedup Your Phone: ఫోన్ స్లోగా ఉందా? అయితే ఇలా చేయండి!**

### **స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఎదుర్కునే సమస్య ఫోన్ స్లో అవ్వడం. **

### **అయితే కొన్ని చిన్న చిన్న చిట్కాలను పాటించడం ద్వారా ఫోన్ తిరిగి బాగా పని చేసేలా చేయవచ్చు.**

### **స్మార్ట్ ఫోన్ ఉపయోగించే ప్రతి ఒక్కరూ ఏదో ఒక దశలో ఫోన్ స్లో అయ్యే సమస్యను ఎదుర్కొనే ఉంటారు. **

### **బ్రాండ్ ఎంత మంచిదైనా ఈ సమస్య అప్పుడప్పుడు ఎదురవుతూ ఉంటుంది. **

### **అందువల్ల ఈ సమస్య తలెత్తిన ప్రతిసారీ కంపెనీని తిట్టుకోవడం సరికాదు. **

### **కొన్ని చిన్న చిన్న పద్ధతులు పాటించి ఈ సమస్యను అధిగమించవచ్చు. **

### **1. మీ ఫోన్ ను అప్ డేట్ చేసుకోండి ****ఎట్టి పరిస్థితుల్లో ఫోన్ సాఫ్ట్ వేర్ అప్ డేటెడ్ గా ఉండేలా చూసుకోండి. ఎందుకంటే పాత వెర్షన్ లో ఉండే లోపాలు, బగ్స్ వంటి వాటిని నివారించి కొత్త అప్ డేట్లో లోపాలు లేకుండా ఇవ్వడానికి కంపెనీలు ప్రయత్నిస్తారు. **

### **కాబట్టి ఎప్పటికప్పుడు తప్పనిసరిగా అప్ డేట్ చేసుకోవాలి. **

### **సాఫ్ట్ వేర్ అప్ డేట్లు వచ్చినప్పుడల్లా మీకు నోటిఫికేషన్ వస్తుంది. **

### **మీరు దాని నుంచి చేసుకోవచ్చు. లేకపోతే సెట్టింగ్స్ లో అబౌట్ ద డివైస్ కు వెళ్లి, అక్కడ సాఫ్ట్ వేర్ అప్ డేట్ పై క్లిక్ చేయడం అప్ డేట్ చేసుకోవచ్చు.**

### **2. హోం స్క్రీన్ పై యాప్స్ లేకుండా చూసుకోవాలి**⏎ **మీ హోం స్క్రీన్ మీద కూడా ఎక్కువ యాప్ ఐకాన్స్ లేకుండా చూసుకోవాలి. **

### **హోం స్క్రీన్ మీద ఎక్కువ యాప్ ఐకాన్స్ ఉంటే స్క్రీన్ గజిబిజిగా కనిపించడమే కాకుండా పనితీరు కూడా స్లో అవుతుంది. **

### **కాబట్టి అవసరం లేని యాప్ ఐకాన్స్ ను హోం స్క్రీన్ మీద నుంచి తీసేయండి.**⏎ **3. అవసరం లేని యాప్స్ ను అన్ ఇన్ స్టాల్ చేయండి****కొన్ని సార్లు మనం యాప్స్ ను ఫోన్ లో ఇన్ స్టాల్ చేశాక వాటి అవసరం తీరాక అలాగే వదిలేస్తాం. **

### **ఇలా ఫోన్ లో అనవసరమైన యాప్స్ ఉండటం కారణంగా స్టోరేజ్ నిండిపోయి, ఫోన్ పనితీరు మీద కూడా దాని ప్రభావం పడుతుంది. **

### **కాబట్టి అవసరం లేని యాప్స్ ను ఎప్పటికప్పుడు అన్ ఇన్ స్టాల్ చేయడం, ఒకవేళ అవి సిస్టం యాప్స్ అయితే డిజేబుల్ చేయడం ఉత్తమం.**⏎ **4. క్యాచీ డేటా ఎప్పటికప్పుడు క్లియర్ చేయండి****యాప్స్ ను ఉపయోగించడం ద్వారా మన ఫోన్ లో చేరే క్యాచీ డేటా ఆ యాప్ ఉపయోగించేటప్పుడు వేగంగానే పనిచేస్తుంది. ఫోన్ మెమొరీలో అధిక భాగాన్ని తినేయడం ద్వారా మొత్తంగా చూసినప్పుడు ఫోన్ సామర్థ్యాన్ని తగ్గించేస్తుంది. **

### **కాబట్టి దాన్ని ఎప్పటకప్పుడు క్లియర్ చేసుకుంటూ ఉంటే మంచిది. ప్రత్యేకంగా ఏదైనా యాప్ కు సంబంధించిన క్యాచీ డేటా క్లియర్ చేయాలనుకుంటే యాప్ సెట్టింగ్స్ లో ఆ యాప్ కు మాత్రమే సంబంధించిన డేటాను క్లియర్ చేసుకోవచ్చు. **

### **లేదు అంటే ఫోన్ లో ఉండే క్లీనర్ యాప్స్ ద్వారా మొత్తం క్యాచీ డేటాను కూడా క్లియర్ చేసుకునే అవకాశం ఉంది.**⏎ **5. ఆటో సింక్ ఆపేయడం ****మనలో చాలా మంది ఫోన్లలో చాలా యాప్స్ లో అకౌంట్స్ ఓపెన్ చేసి వదిలేస్తూ ఉంటాం. అయితే అవన్నీ బ్యాక్ గ్రౌండ్ లో ఆటోమేటిక్ గా సింక్ అయ్యేటప్పుడే అసలు సమస్య ఎదురవుతుంది. **

### **ఇది ఫోన్ పనితీరు మీద ప్రభావం చూపడమే కాకుండా, బ్యాటరీ జీవితకాలాన్ని కూడా తగ్గించేస్తుంది. **

### **కాబట్టి అవసరమైన కొన్ని యాప్స్ కు మాత్రమే సింక్ ఆప్షన్ ఎనేబుల్ చేసుకోవడం ఉత్తమం.**⏎ **6. టాస్క్ కిల్లర్ యాప్స్ ను వాడకండి ****సాధారణంగా మనలో చాలా మంది టాస్క్ కిల్లర్ యాప్స్ ను ఉపయోగించడం వల్ల ఫోన్ వేగంగా పని చేస్తుందనుకుంటారు. **

### **కానీ నిజానికి వీటి వల్ల ఫోన్ పనితీరు ఇంకా స్లోగా అయిపోతుంది. **

### **నిజానికి యాప్ లను ఆండ్రాయిడ్ చాలా తెలివిగా నిర్వహిస్తుంది. **

### **అవసరం లేదనుకున్న యాప్ ను అదే బ్యాక్ గ్రౌండ్ లో నడవకుండా ఆపేస్తుంది. **

### **ఈ టాస్క్ కిల్లర్ యాప్స్ ను ఉపయోగించి యాప్ లను ఒక్కసారిగా ఆపేయడం కారణంగా మనం ఆ యాప్ ను మళ్లీ ఓపెన్ చేసినప్పుడు ఓపెన్ అవ్వడానికి ఎక్కువ సమయం పడుతుంది. **

### **అంతేకాకుండా బ్యాటరీ సామర్థ్యాన్ని కూడా ఎక్కువగా ఉపయోగించుకుంటుంది.**

### **7. ఏదీ పనిచేయకపోతే రీసెట్ చేసేయండి**⏎ **ఒకవేళ పైన తెలిపిన పద్ధతుల్లో ఏదీ పని చేయకపోతే అన్నిటి కంటే మెరుగైన ఆప్షన్ ఒకటి ఉంది. అదేంటంటే ఫోన్ ను రీసెట్ చేసేయటం. **

### **మీ ఫోన్ లో ఎప్పటి నుంచో పేరుకుపోయిన చెత్త మొత్తాన్ని ఇది డిలీట్ చేసి మెరుగ్గా పనిచేసేలా చేస్తుంది. అయితే రీసెట్ చేస్తే డేటా మొత్తం పోతుంది కాబట్టి డేటా బ్యాకప్ తీసుకుని రీసెట్ చేయండి.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
