IIT-DELHI-record-1000-placments-microsoft-jobssoftware-engineers

IIT-DELHI-record-1000-placments-microsoft-jobssoftware-engineers

భారత ఇన్సిస్ట్యూట్ ఆఫ్ టెక్నాలజీ (IIT) ఢిల్లీ క్యాంపస్ తొలి దశలోనే భారీ ప్లేస్‌మెంట్లతో రికార్డు సృష్టించింది.

యూనివర్శిటీ క్యాంపస్‌ను సందర్శించిన 400లకు పైగా ఐటీ సంస్థలు అన్ని రంగాలకు సంబంధించి మొత్తం 600 వరకు ఆఫర్లతో ముందుకొచ్చాయి.

ఇందులో వెయ్యి వరకు ప్లేస్ మెంట్ జాబ్ ఆఫర్లను ఐఐటీ ఢిల్లీ దక్కించుకుంది.

వీటిలో 187 ప్రీ ప్లేస్ మెంట్ జాబ్ ఆఫర్లతో పాటు మొత్తంగా 960కు పైగా జాబ్ ఆఫర్లు ఉన్నాయి.

ఇందులో ఐటీ సంస్థ మైక్రోసాఫ్ట్ గరిష్టంగా 30మంది విద్యార్థులకు ఉద్యోగాలను ఆఫర్ చేయగా అందులో రెండు అంతర్జాతీయ ఆఫర్లుగా తెలిపింది.

ఆ తర్వాత ఇంటెల్ కంపెనీ 27 దేశీయ ఆఫర్లకు విద్యార్థులను ఎంపిక చేసింది. 

ఇతర అంతర్జాతీయ జాబ్ ఆఫర్లలో ఒకటి ఉబర్ యూఎస్ఏ, మరొకటి స్వ్కెయిర్ పాయింగ్ సింగపూర్ నుంచి ఉన్నాయి.

మరోవైపు, ఇతర టెక్ దిగ్గజాల్లో క్వాల్ కామ్ 16 జాబ్స్, గోల్డ్ మ్యాన్ సాచ్ 12 జాబ్ ఆఫర్లను అందించింది.

గత ఏడాదిలో ప్రీ ప్లేస్ మెంట్ ఆఫర్లు 8శాతం మేర పెరగగా, ఈ ఏడాదిలో మొత్తంగా జాబ్ ఆఫర్లు 10శాతం మేర పెరిగినట్టు ప్రీమియర్ ఇంజినీరింగ్ ఇన్సిస్ట్యూట్ వెల్లడించింది.

ఐఐటీ ఢిల్లీ డైరెక్టర్ వి. రామ్ గోపాల్ రావు మాట్లాడుతూ.. ‘ఈ ఏడాది సీజన్ లో జాబ్ ప్లేస్ మెంట్స్ మరింత పెరగడం చాలా సంతోషంగా ఉంది’ అని అన్నారు.

గత ఐదేళ్లలో వివిధ రీసెర్చ్ అంశాలపై 200 పరిశ్రమ భాగస్వామ్యాలతో కలిసి ఐఐటీ ఢిల్లీ పనిచేసినట్టు తెలిపారు. రెండో దశ ప్లేస్ మెంట్స్ సీజన్.. వచ్చే 2020 జనవరి తొలివారంలో, మే 2020లో ప్రారంభం కానుంది.