BACKWARD CLASSES WELFARE DEPARTMENT – Guidelines for implementation of 10% Reservation to the Economically Weaker Sections for admissions into Educational Institutions for the academic year 2019-20 – Orders – Issued
రూ.8లక్షల పరిమితి✍*
*♦ఈడబ్ల్యూఎస్‌కు నిబంధన*
*ఐదెకరాలకు మించి ఉన్నా వర్తించదు*
*♦మార్గదర్శకాలు విడుదల చేసిన ఉన్నత విద్యాశాఖ*
ఉన్నత విద్యాసంస్థల్లో EWS రిజర్వేషన్ అమలుకు సంబంధించిన మార్గదర్శకాల ఉత్తర్వులను ఉన్నత విద్యాశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శి జేఎస్వీ ప్రసాద్ జారీ చేశారు.
ఇందులో భాగంగా ఉన్నత విద్యా సంస్థల్లో 10% రిజర్వేషన్ కల్పించనున్నారు.
మైనార్టీ విద్యా సంస్థలకు ఈ రిజర్వేషన్ వర్తించదు.
ఎస్సీ, ఎస్టీ, బీసీ రిజర్వేషన్లు పొందుతున్న వారు దీని పరిధిలోకి రారు.
కుటుంబ వార్షిక ఆదాయం రూ.8 లక్షలలోపు ఉండేవారికి ఈ రిజర్వేషన్ వర్తిస్తుంది.
వ్యవసాయం, వ్యాపారం తదితర వాటి ద్వారా వచ్చే మొత్తాలను ఆదాయంగా పరిగణిస్తారు.
* కుటుంబ ఆదాయంతో సంబంధం లేకుండా ఐదెకరాలు కంటే ఎక్కువ వ్యవసాయ భూమి, వెయ్యి చదరపు అడుగులకు మించిన నివాసఫ్లాటు, పురపాలికల్లో 100చదరపు గజాలకు మించిన స్థలం, పురపాలికల్లో కాకుండా ఇతర ప్రాంతాల్లో 200చదరపు గజాలకు మించి నివాస స్థలం ఉన్న వారు అనర్హులు.
అన్ని విద్యా సంస్థల్లో 10% సీట్లను పెంచుతారు. మహిళలకు 1/3 కోటా అమలు చేస్తారు.
* కేంద్ర ప్రభుత్వం సూచించిన నమూనాలో తహసీల్దార్ ధ్రువీకరణ పత్రాల్ని జారీ చేస్తారు.
* ప్రతి విద్యా సంస్థ వెబ్‌సైట్‌లలో రిజర్వేషన్ పథకం అమలును పేర్కొనాలి.
* ఉన్నత విద్యామండలి కార్యదర్శి, సాంకేతిక విద్యాశాఖ, కళాశాల విద్యాశాఖ, విశ్వవిద్యాలయాల ఉపకులపతులు, రాజీవ్‌గాంధీ విజ్ఞాన, సాంకేతిక వర్సిటీ ఉపకులపతి దీనిని అమలు చేయాలని ఉత్తర్వుల్లో పేర్కొన్నారు.
ఇప్పటికే ముగిసిన వాటిల్లో..*
సాంకేతిక విద్యాశాఖ పాలిటెక్నిక్‌లో ప్రవేశాల ప్రక్రియను ఇప్పటికే ముగించింది.
డిగ్రీ కళాశాలల్లో ప్రవేశాలు ముగిశాయి. ఇటీవల ఆర్జీయూకేటీ సైతం ట్రిపుల్‌ఐటీల్లో ప్రవేశాలకు ఎంపిక చేసిన అభ్యర్థుల జాబితాను విడుదల చేసింది.
ఈ నేపథ్యంలో ఆయా విద్యా సంస్థల్లో ఈ రిజర్వేషన్ అమలు ఉంటుందా? లేదా అనేదానిపై అస్పష్టత నెలకొంది.