Income-tax-department-issue-instant-epan-card

Income-tax-department-issue-instant-epan-card

ePAN Card: గుడ్ న్యూస్… ఇక 10 నిమిషాల్లో పాన్ కార్డ్ ఉచితంగా జారీ

సరికొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిందంటే… మీరు ఇ-పాన్ కార్డును సులువుగా తీసుకోవచ్చు. పాన్ కార్డ్ లేనివాళ్లే కాదు…

ఉన్నవాళ్లు కూడా డూప్లికేట్ పాన్ కార్డును నిమిషాల్లో పొందొచ్చు.

పాన్ కార్డ్ ఉన్నవారికి, లేనివారికి శుభవార్త. ఇక మీరు పాన్ కార్డ్ కోసం 15 రోజుల పాటు ఎదురుచూడాల్సిన అవసరం లేదు.

కేవలం 10 నిమిషాల్లోపే పాన్ కార్డును పొందే సదుపాయాన్ని ఆదాయపు పన్ను శాఖ ప్రారంభించబోతోంది.

ఆధార్ డేటాబేస్‌లోని వివరాల ఆధారంగా ఇ-పాన్ కార్డ్ జారీ చేయనుంది ఇన్‌కమ్ ట్యాక్స్ డిపార్ట్‌మెంట్. ఈ కొత్త విధానం అమలులోకి వస్తే… ఇక మీరు ఇ-పాన్ కార్డు 10 నిమిషాల్లో పొందొచ్చు.

ప్రస్తుతం ఈ కొత్త ఫెసిలిటీ ప్రయోగాత్మక దశలోనే ఉంది.

గత వారంలో 62,000 ఇపాన్ కార్డులు జారీ చేసినట్టు తెలుస్తోంది.

ఇంకొన్ని వారాల్లో ప్రజలకు అందుబాటులోకి రానుంది. ఈ సరికొత్త వ్యవస్థ అమలులోకి వచ్చిందంటే…

మీరు ఇ-పాన్ కార్డును సులువుగా తీసుకోవచ్చు. పాన్ కార్డ్ లేనివాళ్లే కాదు…

INCOME TAX DEPARTMENT OFFICIAL WEBSITE

ఉన్నవాళ్లు కూడా డూప్లికేట్ పాన్ కార్డును నిమిషాల్లో పొందొచ్చు.

ఉచితంగానే ఇ-పాన్ లభిస్తుంది.

మీరు ఇ-పాన్ కార్డ్ తీసుకోవాలనుకుంటే మీ ఆధార్ నెంబర్‌ను వెల్లడించాలి.

మీ ఆధార్ నెంబర్‌తో రిజిస్టర్ అయిన మొబైల్ నెంబర్‌కు ఓటీపీ వస్తుంది.

మీరు ఓటీపీ వెల్లడిస్తే మీ ఆధార్ వివరాలు వెరిఫై అవుతాయి.

ఆధార్ వివరాల ద్వారా మీకు ఇ-పాన్ కార్డ్ జారీ అవుతుంది.

మీ వివరాలు వెల్లడించడం తప్ప ఇక మీరు ఎలాంటి డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేయాల్సిన అవసరం లేదు. ఎందుకంటే మీ వివరాలన్నీ ఆధార్‌లో అందుబాటులో ఉంటాయి కాబట్టి ప్రత్యేకంగా మళ్లీ వివరాలను వెల్లడించాల్సిన అవసరం లేదు.

ఇ-పాన్ కార్డుపైన డిజిటల్ సిగ్నేచర్ ఉంటుంది. క్యూఆర్ కోడ్ కూడా ఉంటుంది.

PAN – ONLINE APPLICATION LINK

HOW TO LINK PAN CARD NUMBER TO AADHAR CARD NUMBER DETAILS

error: Content is protected !!