# INCOME TAX FY 2020-21 NEW SLAB RATES – OLD SLAB RATES – COMPLETE INCOME TAX SAVING SECTIONS

- Link: https://amaravathiteacher.com/income-tax-fy-2020-21-new-slab-rates-old-slab-rates-complete-income-tax-saving-sections/
- Published: 2021-01-31T19:41:41+05:30
- Author: Venkat

ఆదాయం సంపాదించిన ప్రతి ఒక్కరు ఆదాయపు పన్ను చెల్లించాల్సి ఉంటుంది. మీ ఆదాయం జీతం 
కావచ్చు, పెన్షన్ కావచ్చు
 లేదా పొదుపు ఖాతా నుండి వచ్చిన వడ్డీ, ఇంటి కిరాయికి ఇవ్వడం
ద్వారా వచ్చిన ఆదాయం మొదలగునవి ఆదాయంగా వచ్చిన వాటికి కూడా పన్ను చెల్లించాలి. **ఈసారి
బడ్జెట్ లో పాత స్లాబ్ రేట్ లతో పాటు కొత్త స్లాబ్ రేట్ లను తీసుకువచ్చారు. ఈ కొత్త
స్లాబ్ రేట్ లు ఆకర్షణీయంగా ఉన్న వాటిని వినియోగించుకోవాలి అంటే మనం గతంలో పొందిన మినహాయింపులు
సేవింగ్స్ వదులుకోవాల్సి వస్తుంది.****మరి కొత్త స్లాబ్ రేట్లతో వదులుకోవాల్సినవి ఏంటో
ఓసారి చూద్దాం.**

[[

పైన చెప్పినవే కాకుండా ఇంకెన్నో మినహాయింపులు వదులుకోవాల్సి వస్తుంది. **డిజబుల్డ్ 
వారికి ఇచ్చే అలవెన్సులకు మినహాయింపు, ట్రావెలింగ్ అలవెన్సులకు మినహాయింపు మరియు NPS
లో ప్రభుత్వం జమచేసిన నిధికి సెక్షన్ 80CCD(2) మినహాయింపు వర్తిస్తుంది, **ఇంకా కొన్ని
కొనసాగించారు. 

[[

**మనము సెక్షన్ 192 (పాత విధానం లో) కానీ సెక్షన్ 115 BAC (కొత్త విధానంలో) కానీ టాక్స్
చెల్లించవచ్చు. **

ఆదాయపు పన్ను చట్టం (1961) ప్రకారం ఆర్థిక సంవత్సరం 2020-21 గణనలో తేది 01.04.2020 
నుండి 31.03.2021 వరకు పొందిన జీతభత్యాలు ఆదాయముగా పరిగణించాలి అదే విదంగా సేవింగ్స్
మరియు మినహాయింపులు పొందే సొమ్ము ఈ కాలంలో చెల్లించినవి అయి ఉండాలి. 

**పాత స్లాబ్ రేట్లతో టాక్స్ స్లాబ్స్ ఏంటో, మినహాయింపులు ఏంటో ఓసారి చూద్దాం.**

**ఉదా 1: **ఒక ఉద్యోగి ఆదాయంలో నుండి ఇంటి అద్దె, ఇతర మినహాయింపులు మరియు 1.50 లక్షల
సేవింగ్స్ పోగా పన్ను చెల్లించాల్సిన ఆదాయము 7లక్షలు ఉన్నట్లయితే. అందులో
 మొదటి 2.5
లక్ష లకు పన్ను లేదు 2,50,001 నుండి 5లక్షలవరకు ఉన్న 2.50 లక్షల పై 5% చొప్పున 12,500/-,
తరువాతి 5లక్షల పైబడి ఉన్న 2లక్షలకు 20% చొప్పున 40,000 గణించాలి. మొత్తంగా 12,500+
40,000=52,500 అవుతుంది. కాని 7లక్షల నుండి పన్ను లేని 2.50లక్షలను తీసివేయగా వచ్చిన
4.5లక్షలకు 5% చొప్పున 22,500 గా లెక్కించడం సరికాదు.

 **ఉదా 2: **ఉద్యోగి ఆదాయపు పన్ను చెల్లించాల్సిన ఆదాయం 12లక్షలు ఉంది అనుకుంటె వారు
చెల్లించాల్సిన ఆదాయపు పన్ను 10లక్షలు దాటింది కాబట్టి 12,00,000 X 30% = 3,60,000లుగా
గణించడం సరికాదు.

2,50,000వరకు పన్ను లేదు, 2,50,001 నుండి 5లక్షలవరకు గల 2.5 లక్ష లకు 5%
 చొప్పున చెల్లించాల్సిన
పన్ను 12,500/-, 5లక్షల నుండి 10 లక్షలవరకు గల 5లక్షలకు 20% చొప్పున చెల్లించాల్సిన
పన్ను 12,500 + 1,00,000 = 1,12,500/-, 10 లక్షల పైన గల 2లక్షలకు ఆదాయానికి 30% చొప్పున
చెల్లించాల్సిన పన్ను 12,500 + 1,00,000 + 60,000= 1,72,500/- చెల్లించాలి

**Section 16 **గత ఆర్థిక సంవత్సరం 2018-19కు నూతనంగా జీతం ద్వారా వచ్చిన ఆదాయంలో నుండి

గరిష్టంగా Standard Deduction గా రూ.40,000 వరకు సెక్షన్ 16(ia) ద్వారా మినహాయింపునిచ్చారు
దీనిని ఈ ఆర్థిక సంవత్సరం 2019-20కు 50,000 లకు పెంచారు ఇది పాత విధానం ప్రకారం కొనసాగుతుంది.

**Section 87A:**ప్రకారం
 పన్ను చెల్లించాల్సిన ఆదాయము 5లక్షల లోపు ఉన్న వారికి చెల్లించాల్సిన
టాక్స్ లో రూ.12,500 లకు రిబేట్ సదుపాయాన్ని పెంచారు. ఈ సెక్షన్ ఉపయోగించుకుని 5లక్షల
లోపు ఆదాయం కలిగిన వారు పూర్తి టాక్స్ మినహాయింపు పొందుతారు.

**\* చెల్లించాల్సిన ఆదాయపు పన్ను పైన అదనంగా చెల్లించాల్సిన హెల్త్ & ఎడ్యుకేషన్ సెస్
4%. **

#### **ఆదాయముగా పరిగనించబడే⏎  జీతబత్యములు:- 

Pay, DA, HRA, IR, CCA, అలవెన్సులు, మెడికల్ అలవెన్సులు, అదనపు ఇంక్రిమెంట్ అలవెన్స్,
సరెండర్ లీవు, స్టెప్ అప్ ఎరియర్స్, సెలవు కాలపు జీతం, మొ||నవి ఆదాయంగా పరిగణించబడును.

#### **ఆదాయముగా పరిగనించబడని అంశములు:- **

పదవి విరమణ తరువాత పొందే GPF/GIS/AP (TS) GLI లనుండి పొందే సొమ్ము మరియు నగదుగా మార్చుకున్న
సంపాదిత సెలవులు, అర్దజీతపు సెలవుల పై వచ్చిన సొమ్ము, LTC పై పొందిన ప్రయాణ భత్యం, 
మెడికల్ రియంబర్స్మేంట్ మరియు GPF, (TS) GLI లలో అప్పుగా పొందిన సొమ్ము ఆదాయంగా పరిగణించరాదు.

#### **మినహాయింపులు:**

**1.****HRA మినహాయింపు:****Under Section 10(13A)**

ప్రకారం క్రింది మూడు అంశంలలో ఏది
 తక్కువయితే ఆ మొత్తము ఆదాయం నుండి మినహాయింపు పొందవచ్చును.
పొందిన ఇంటి అద్దె బత్యం మొత్తం  ఇంటి అద్దె గా చెల్లించిన మొత్తం – 10% (Pay +DA) 
40% వేతనం ఇంటి అద్దె అలవెన్స్ (HRA) నెలకు 3,000/- (సంవత్సరానికి సరాసరి 36,000/-)
కన్నఎక్కువ పొందుతున్నవారు మొత్తం HRA మినహాయింపు పొందాలంటే రశీదు DDO కు సమర్పించాలి.

IT Department circular No. 8/2013 Dt.  10.10.2013 ప్రకారం మీరు చెల్లిస్తున్నఇంటి
అద్దె 1లక్ష దాటిన పక్షంలో ఇంటి యజమాని PAN నంబర్ ఇవ్వాల్సి ఉంటుంది. స్వంత ఇంట్లో 
నివాసం ఉంటున్న వారికి HRA మినహాయింపు వర్తించదు. పేరెంట్స్ పేరు మీద ఉన్న ఇంట్లో తల్లిదండ్రులతో
కలిసి ఉంటున్నట్టయితే రెంట్ వారికి చెల్లిస్తున్నట్టు చూపితే పేరెంట్స్ మీ నుండి పొందిన
రెంట్ డబ్బులను వారు ఆదాయంలో చూపాల్సి ఉంటుంది.

**Section 80GG: **ఎలాంటి ఇంటి అద్దె భత్యం పొందని ఆదాయపు పన్ను చెల్లింపుదారులు తన
పేరిట కాని, తన స్పౌజ్ పెరిట కాని, తన మైనర్ పిల్లల పేరిట కాని ఎక్కడ కూడా ఇల్లు లేని,
అద్దె ఇంట్లో ఉంటున్న వారికి ఈ సెక్షన్ వర్తిస్తుంది

1.Rent paid minus 10% of total income

2.Rs. 5000/- per month

3.25% of total income

పై మూడింటిలో ఏది కనిష్ఠమో దానిని పరిగణలకు తీసుకుని సంవత్సరానికి గరిష్ఠంగా 60,000
వరకు మినహాయింపు వర్తిస్తుంది.

**2.ఇంటి ఋణం పై వడ్డి (Section24): **ఇంటి ఋణం తో AY 2014-15 నిర్మించి స్వంతం గా 
ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పైవరకు 1,50,000 వరకు మినహాయింపు కలదు, 
AY 2015-16 నుండి నిర్మించి స్వంతం గా ఉంటున్న వారికి ఋణం పై చెల్లిస్తున్న వడ్డి పై
2లక్షల వరకు మినహాయింపు కలదు. ఒకవేళ ఇల్లు బార్య మరియు భర్త ఇద్దరు
 జాయింటుగా ఋణం 
పొంది ఉంటె ఇద్దరికీ సమానంగా విభజించి ఒక్కొక్కరు గరిష్టంగా 2లక్షల మినహాయింపు పొందవచ్చు.
ఇంటి ఋణం తీసుకున్న ఇంట్లో స్వయంగా నివసించకుండా కిరాయికి ఇచ్చినట్టయితే ఇంటి ఋణం పై
వడ్డి పూర్తిగా మినహాయింపు కలదు, కాని వచ్చే కిరాయిని ఆదాయంగా చూపాలి.

**Section 80EEA: **ఎలాంటి ఇల్లు లేకుండా మొదటిసారి ఇంటికొసం పైనాన్సియల్ ఇన్స్టిటూషన్ల(
బ్యాంకు) నుండి రుణం పొంది. స్టాంప్ డ్యూటీ విలువ 45లక్షలు లేదా లోపు ఉండాలి 01.04.2019
నుండి 31.03.2021 మద్యన తీసుకున్న రుణం వడ్డీ పై **Section 24** కి అదనంగా 1,50,000
వేల మినహాయింపు కలదు.

**3.ఉన్నత చదువుల కోసం విద్యాఋణం పై వడ్డి (80E):**Self, Spouse, Children ఉన్నత చదువుల
కోసం విద్యాఋణం పై 2020-21 ఆర్థిక సంవత్సరం లో చెల్లించిన వడ్డి మినహాయింపు కలదు. ఈ
మినహాయింపు ఋణం ముగిసే వరకు లేదా గరిష్టం గా 8 సం. లు వర్తిస్తుంది.

**4.ఆడరపడిన వారు వికలాంగులయితే (80DD):**ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తిపై ఆడరపడిన
వాళ్ళలో వికలాంగులుంటె సెక్షన్ 80DD క్రింద మినహాయింపు కలదు. 80% కన్నా తక్కువగా వైకల్యం
ఉంటె 75,000/- , 80% లేదా అంత కన్నా ఎక్కువ వైకల్యం ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు.
ఇందుకొసం సంబంధిత అధికారులు జారిచేసిన సర్టిఫికెట్ పొంది ఉండాలి.

**5.ఆదాయపు పన్ను చెల్లించే వ్యక్తీ వికలాంగులయితే (80U):**ఉద్యోగి స్వయంగా వికలాంగులైన
పక్షంలో 80% కంటే తక్కువ వైకల్యం ఉంటె 75,000/-, 80% లేదా అంత కన్నా
 ఎక్కువ వైకల్యం
ఉంటె 1,25,000/- మినహాయింపు కలదు. వైకల్య ద్రువీకరణ పత్రం సమర్పించాలి. 

**6.అనారోగ్య చికిత్సకు అయిన ఖర్చు
 (80DDB):
ఉద్యోగి కాని తనమీద ఆడరపడిన వారు Cancer,
Hemophilia, Thalassemia, Neurological diseases మరియు Chronic renal Failure వంటివాటితో
అనారోగ్యానికి గురయి చికిత్స కోసం చెల్లించిన సొమ్ములో 60 సంవత్సరాల లోపు వారికి 40,000/-,
60 సంవత్సరాలు లేదా పైబడిన వారికి 1,00,000/- మినహాయింపు కలదు. దీనికోసం ఫారం 10-I 
లో సంభందిత స్పెషలిస్ట్ డాక్టర్ చే ఖర్చుల వివరాలు సమర్పించాలి. కాని ఈ సెక్షన్ కింద
మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు.

**7.చందాలు (80G) :**PM, CM రిలీఫ్ ఫండ్ వంటి 100% మినహాయింపు గల వాటికి ఇచ్చే చందాలు

మినహా, 80G క్రింద కు వచ్చే 50% లేదా 30% మినహాయింపులోకి వచ్చే ఏ ఇతర చందాలు DDO లు
అనుమతించరాదు.

**\* Note:** సెక్షన్ 80DDB మరియు 80G కింద మినహాయింపు చేసె అవకాశం DDO లకు లేదు. కాని
ముందుగా February
 జీతం తో టాక్స్ చెల్లించి, అధికముగా చేల్లించిన మొత్తాన్ని31 జూలై
2019 లోపు Income Tax Department వారికి SAHAJ ఫారంలో సమర్పించిన తిరిగి చెల్లిస్తారని
ఐ.టి. డిపార్ట్మెంట్ వారు గతంలో DTA / DTO లకు సర్క్యులర్ రూపంలో ఆదేశాలు ఇచ్చినారు(
vide E.No TDS/clarification/1011 Dt. 15/12/2011 of Addl. Commissioner IT Dept. Hyderabad)
తిరిగి పొందవచ్చు.

**8.మెడికల్ ఇన్సూరెన్స్ (80D):**ఉద్యోగి తన కుటుంబం కోసం మరియు పేరెంట్స్ కోసం చెల్లించిన
మెడికల్ ఇన్సూరెన్స్ వేరు వేరుగా మినహాయింపు పొందవచ్చు. ఉద్యోగి తన కుటుంబం కోసం చెల్లించిన
సోమ్ముకాని గరిష్టంగా 25,000/-, ఉద్యోగికి మరియు పేరెంట్స్ కి మెడికల్ ఇన్సూరెన్స్ 
కోసం చెల్లించిన ప్రీమియం కాని గరిష్టంగా 25,000/-, సీనియర్ సిటిజెన్ అయితే ప్రీమియం
కాని గరిష్టంగా 50,000/- మినహాయింపు పొందవచ్చు. 

**ఉద్యోగి మరియు పేరెంట్స్ కోసం మాస్టర్ హెల్త్ చెకప్ కోసం సొమ్ము ఉపయోగిస్తే  ఈ సెక్షన్
కింద గరిష్టంగా రూ.5,000/- మినహాయింపు కలదు. **

**ఉద్యోగి కుటుంబ సభ్యులకు మరియు పేరెంట్స్ కోసం ఈ సెక్షన్ కింద గరిష్టంగా రూ.1,00,000/-
వరకు మినహాయింపు కలదు. **

**అంధులు లేదా చెవిటి మరియు మూగ లేదా తక్కువ అంత్య భాగాల వైకల్యంతో ఆర్థోపెడిక్‌ వికలాంగ
ఉద్యోగులకు తన నివాస స్థలం మరియు అతని విధి స్థలం మధ్య ప్రయాణించు ప్రయోజనం కోసం అతని
ఖర్చులను తీర్చడానికి రవాణా భత్యం గా మంజూరు చేయబడిన కన్వేయన్సు అలవెన్స్ ను sub-clause(
ii) of clause (14) of section 10 ప్రకారం ప్రతినెల గరిష్టంగా 3200/- వరకు మినహాయింపు
కలదు.**

**మనం ప్రతినెల చెల్లిస్తున్న వృత్తి
 పన్ను (Professional Tax) కి section 16 (iiiB)
ప్రకారం పూర్తిగా మినహాయింపు కలదు.

#### **పొదుపు పథకాల పై మదుపు రూ. 1.5 లక్ష:**

**వివిధ పొదుపు పతకాలలో సేవింగ్స్ (80C):**GPF, ZPGPF, APGLI, GIS, LIC, PLI, National
Saving Certificates, Public Provident Fund, Sukanya Samruddhi Yojana, ELSS, ULIPS
మొదలయిన పతకాలలో చేసిన సేవింగ్స్, తన, స్పౌస్ ఉన్నత చదువులకోసం, ఇద్దరు పిల్లల వరకు
ప్రీ స్కూల్ నుండి ఉన్నత చదువుల వరకు చెల్లించిన ఫీజు, ఇంటి ఋణం పై చెల్లించిన అసలు(
Principle), ఇంటిని ఈ ఆర్థిక సంవత్సరం లో కొన్నవారికి రిజిస్ట్రేషన్ కోసం చెల్లించిన
స్టాంప్ డ్యూటీ రూ. 1.5 లక్ష వరకు మినహాయింపు కలదు. 

**Annuity సేవింగ్స్ పథకం లో సేవింగ్ (80 CCC):**LIC లేదా ఇతర ఇన్సూరెన్స్ ప్రొవైడర్
ల ద్వారా తీసుకున్న ఆన్యుటి స్కీంల కోసం చేల్లించిన ప్రీమియం. 

#### 3. CPSdeduction (80CCD):కొత్తపెన్షన్పైనియామకంఅయినఉద్యోగులుప్రతినెలజీతంనుండి10%చెల్లిస్తున్నCPS deduction 80CCD(1)ప్రకారం మినహాయింపుకలదు.⏎  ప్రభుత్వం ఉద్యోగిప్రాన్ ఖాతాలోజమ చేస్తున్న CPS మ్యాచింగ్గ్రాంట్ 10% ని80CCD(2)ప్రకారం జమయినమొత్తాన్నిపొదుపురూ. 1.5 లక్షలకు అదనంగా మినహాయింపు కలదు. FY 2015-16 AY 2016-17 లో కొత్తగా 80CCD(1B) సెక్షన్ చేర్చడం జరిగింది దీనిద్వారా కొత్త పెన్షన్ పథకంలో ఉద్యోగి పెట్టిన సొమ్ము పైన 50,000/- వరకు అదనపు మినహాయింపు అవకాశం కల్పించారు ఈసదుపాయం ఏప్రిల్2016నుండిఅందుబాటులోకివచ్చింది.

ఈ సెక్షన్ పైన పలువురు పలు సందేహాలు వ్యక్తపరచగా మన రాష్ట్ర శాఖ వారు పైన 2 సందర్భాల
గురించి ఆదాయపన్ను శాఖ వారి నుండి క్లారిఫికేషన్ కోరగా ఆదాయపన్ను శాఖ వారు F.No. Pr.
CCIT/Tech/67/2015-16 తేదీ 12.02.2016 సమాధానం ఇచ్చినారు అవి 1. ఒక ఉద్యోగికి 80C కింద
CPS నిధి కాకుండా 1.50లక్షల పొదుపు నిధి ఉన్నప్పుడు CPS కింద ఉద్యోగి జమచేసిన నిధిని
80CCD(1B) కింద చూపొచ్చా? 2. ఒక ఉద్యోగి 80C కింద పొదుపు CPS (NPS) నిధి కాకుండా 1.50లక్షల
కంటే తక్కువగా ఉండి CPS(NPS) కింద ఉద్యోగి 50 వేల కంటే ఎక్కువ కొత్త పెన్షన్ కోసం జమచేస్తే
ఇట్టి మొత్తాన్ని 80CCD(1B) కింద గరిష్టంగా 50 వేలు పోగా మిగిలిన నిధిని 80C కి విడగొట్టొచ్చా?
పై రెండు ప్రశ్నలకు అవును అని సమాధానం
 ఇచ్చారు.

#### * 80C, 80CCC, 80CCD ల పొదుపుల పైన మొత్తము గా 1.5లక్షలు తగ్గింపుఉంటుంది.

**సేవింగ్స్ ఖాతా పైన పొందిన వడ్డీ మినహాయింపు (80TTA)**:సేవింగ్స్ ఖాతాలో జమయిన వడ్డీ
ని ఆదాయం గా చూపిన దాంట్లో నుండి వడ్డీని గరిష్టం గా 10,000/- వరకు 80TTA ప్రకారం రూ.
1.5 లక్ష సేవింగ్స్ పై అదనముగా 10,000/- వరకు మినహాయింపు అవకాశం ఉంది.  

**\*Note**: DDO లు జీతం బిల్లు పొందే సమయములో డిడక్ట్ చేసిన ఇన్కమ్ టాక్స్ TAN నెంబర్
తో జమ అవుతుంది, దీనికి సంబందించిన బిన్ నెంబర్స్ STO/ Online లో STO ల AIN & DDO ల
TAN నెంబర్ ద్వారా తీసుకుని ఉద్యోగి వారిగా ఇ- పైల్లింగ్ ద్వారా TDS వివరాలు 31 జూలై,
2020 లోపు ఆన్లైన్ చేయించాలి, ఇలా చేయని వారికి Income Tax Department వారు ఫైన్ వేసే
అవకాశం ఉంది. సెక్షన్ 80TTB ప్రకారం ఆదాయపన్ను చెల్లింపుదారులు సీనియర్ సిటిజెన్ అయితే
50వేలు వరకు మినహాయింపు కల్పించారు.

**ఆదాయపు పన్నుకు సంబంధించి ఏఏ ఫారములు సమర్పించాలి?  **జనవరి మాసములో లేదా ఫిబ్రవరి
మాసము మొదటి వారం లోపు మీ సేవింగ్స్ మరియు మినహాయింపులను తెలుపుతూ Form-12BB పూర్తిచేసి
DDO లకు ఇవ్వాలి. వాటిని పరిగణలోకి తీసుకుని, నెలవారీగా చెల్లించిన జీతం మరియు జీతం
ద్వారా చేసుకున్న పొదుపుల ఆధారంగా **DDOలు విధిగా తమ పరిధిలోని ఉద్యోగుల Form-16ని 
తన పరిధిలోని ఉద్యోగులకు **చెల్లించిన టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా** ఇవ్వాలి**. ఉద్యోగులు
బ్యాంకు లలో తమ పేరిట ఫిక్స్డ్ డిపాజిట్ చేసుకున్నట్లయితే వాటిపై బ్యాంకు వాళ్ళు చెల్లించిన
టాక్స్ (TDS) సర్టిఫికెట్ గా **Form 16A **ని ఇస్తారు. ITR సమర్పించే సమయంలో 26AS ద్వారా
చూసుకుని ఈ ఆదాయాన్ని Income from other source లో చూపిస్తూ DDO లు చెల్లించిన టాక్స్(
TDS) సర్టిఫికెట్ **Form 16** తో కలిపి సమర్పించాలి.

ప్రతి ఉద్యోగి ఆదాయపు పన్ను పరిదిలోకి రాకపోయినా “PAN” కార్డ్ విదిగా పొందాలి. ఉద్యోగులు“
ITR” ఫారములలో రిటర్న్ లను 31జూలై, 2021 లోపు Income Tax Department వారికి
 సమర్పించాలి.

By Putta Srinivasa Reddy

[KSS PRASAD INCOME TAX SOFTWARE 2021-22 – DOWNLOAD](https://amaravathiteacher.com/kss-prasad-income-tax-software-2021-22-kss-prasad-income-tax-software-for-ap-ts-teachers/)

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW AP SSC Exam Fee Online Payment – AP SSC March 2027 Fee Due Dates ](https://amaravathiteacher.com/ap-ssc-exam-fee-online-payment/)
 *  [ NEW SA1 Question Papers 2026 PDF Download – 1st to 5th Classes | Telugu, English, Maths, EVS ](https://amaravathiteacher.com/sa1-question-papers-2026-1st-to-5th-classes/)
 *  [ AP DSC 2026 Notification PDF Download – 2721 Vacancies, Syllabus – Apply Online ](https://amaravathiteacher.com/ap-dsc-2026-notification-apply-online/)
 *  [ APPSC AEE Recruitment 2026 – 503 Assistant Executive Engineer Posts ](https://amaravathiteacher.com/appsc-aee-recruitment-2026-notification-503-posts/)
 *  [ AP Local Body Elections 2026 Remuneration Rates – GO 1086 | ఎన్నికల సిబ్బంది రెమ్యునరేషన్ ](https://amaravathiteacher.com/ap-local-body-election-remuneration-rates-2026-go-1086/)
 *  [ GVMC Teachers School Educational Subordinate Service Rules, 2026 G.O.Ms.No.40 ](https://amaravathiteacher.com/gvmc-teachers-school-educational-subordinate-service-rules-2026-g-o-ms-no-40/)
 *  [ Vijayawada Municipal Corporation Teachers School Educational Subordinate Service Rules 2026 GO No 39 ](https://amaravathiteacher.com/vijayawada-municipal-corporation-teachers-school-educational-subordinate-service-rules-2026-go-no-39/)
 *  [ AP Municipal Corporation Teachers Service Rules 2026 GO 38 ](https://amaravathiteacher.com/ap-municipal-corporation-teachers-service-rules-2026-go-38/)
 *  [ AP Municipal School Educational Subordinate Service Rules 2026, GO Ms 37 ](https://amaravathiteacher.com/ap-municipal-school-educational-subordinate-service-rules-2026-go-ms-37/)
 *  [ AP School Education (Govt) Subordinate Service Rules 2026 – G.O.Ms.No.35 ](https://amaravathiteacher.com/ap-school-education-govt-subordinate-service-rules-2026-g-o-ms-no-35/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
