# interesting-story-of-corona-town-in-California-united-states-USA

- Link: https://amaravathiteacher.com/interesting-story-of-corona-town-in-california-united-states-usa/
- Published: 2020-03-23T20:43:48+05:30
- Author: amaravathiteacher

## **interesting-story-of-corona-town-in-California-united-states-USA**󠀁[](https://amaravathiteacher.com/interesting-story-of-corona-town-in-california-united-states-usa/)󠁿

### **కరోనా అంటే వైరస్ మాత్రమే కాదు నగరం కూడా… ఎక్కడుందో తెలుసా?**

### **మీరు ఇప్పటి వరకూ కరోనా వైరస్ గురించి విన్నారు. **

### **కానీ కరోనా సిటీ గురించి ఎప్పుడైనా విన్నారా. **

### **లేకపోతే ఈ స్టోరీని తప్పక చదివి తెలుసుకొండి.**

### **కరోనా వైరస్ పేరు వింటే ఇప్పుడు ప్రపంచ దేశాలు భయపడే పరిస్థితి. చైనాలోని ఊహాన్ లో మొదలైన ఈ మహమ్మారి ఇప్పుడు ఇండియా సహా ప్రపంచంలో దాదాపు అన్ని దేశాలకు వ్యాపించింది. **

### **ఇప్పటి వరకూ ఈ వైరస్ ప్రభావానికి ప్రపంచ వ్యాప్తంగా 3 లక్షల 50 వేల మందికి పైగా ప్రజలు గురి కాగా 15 వేలకు పైగా ప్రజలు మరణించారు. భారత్ లో ఇప్పటికే చాలా నగరాలు లాక్ డౌన్ అయిన పరిస్థితి ఉంది. **

### **కరోనాకు సంబంధించి ప్రతి అప్డేట్ ను ప్రజలు ఆన్ లైన్ లో, టీవీల ద్వారా మిస్ కాకుండా తెలుసుకుంటున్నారు. **

### **ఈ నేపధ్యంలో కరోనా గురించి ఒక విషయం చాలా మందిని ఆశ్చర్యపరుస్తుంది. అదేంటంటే… కరోనా పేరుతో వైరస్ మాత్రమే కాదు ఒక నగరం కూడా ఉంది. అవునండీ ఇది నిజం. **⏎ **ఎక్కడ ఉంది? ****గూగుల్ లో ఈ మధ్యకాలంలో కరోనా అనే కీవర్డ్ బాగా సెర్చ్ అవుతుంది. **

### **సెర్చ్ రిజల్ట్స్ లో కరోనా వైరస్ తో పాటు కరోనా సిటీ గురించి కూడా చాలా మంది తెలుసుకుంటున్నారు. **

### **ఇంతకీ ఈ నగరం ఎక్కడ ఉందో ఇప్పుడు చూద్దాం. **

### **కరోనా కాలిఫోర్నియాలోని ఒక అందమైన నగరం. 1,55,000 కంటే ఎక్కువ జనాభా ఉన్న ఈ నగరం లాస్ ఏంజిల్స్ కు ఆగ్నేయంగా 45 మైళ్ల దూరంలో ఉన్న పశ్చిమ రివర్ సైడ్ కౌంటీ లోని శాంటా అనా పర్వత ప్రాంతంలో ఉంది. **

### **కరోనాలో దాదాపు వందల ఎకరాల్లో ఉద్యానవనాలు ఉన్నాయి. **

### **వీటిలో అనేక రకాల వినోద సౌకర్యాలు కలవు. అంతే కాకుండా ప్రఖ్యాత డే స్పా, మ్యూజిక్ మ్యూజియం, గో కార్ట్ రేస్, జిప్లింగ్ వంటి అనేక పర్యాటక ఆకర్షణలతో కరోనా టూరిస్టులను ఎంతో ఆకట్టుకుంటుంది. **⏎ **సందర్శనకు సరైన సమయం ****కాలిఫోర్నియాలోని కరోనా సంవత్సరంలో ఏ సమయంలోనైనా సందర్శించదగ్గ అద్భుతమైన గమ్యస్థానాల్లో ఒకటి. వేడి వేసవి కాలంలో, చల్లని శీతాకాలంలో ఈ నగరం వివిధ రకాల ఆకర్షణలను కలిగి ఉంటుంది. కరోనా వైరస్ ఎంత భయంకరమైనదో కరోనా సిటీ అంత ఆనందకరమైనది. **

### **పర్యాటకులు సంతోషంగా సమయం గడిపేందుకు ఇక్కడికి వస్తుంటారు. **

### **ఈ నగరంలో కొన్ని ప్రముఖ పర్యాటక ప్రదేశాలపై కూడా ఇప్పుడు ఓ లుక్కేద్దాం రండి. **

### **కరోనా హెరిటేజ్ పార్క్ & మ్యూజియం **⏎ **కరోనా హెరిటేజ్ పార్క్ & మ్యూజియంలో ఉన్న భవనాలు వాస్తవానికి 1900 ప్రారంభంలో నిర్మించబడ్డాయి. **

### **ఇందులో రైల్ రోడ్ మ్యూజియం, స్పెషల్ సెంటర్, ఆర్ట్ గ్యాలరీ వంటివి ప్రత్యేక ఆకర్షణలు. ఈ పార్క్ లో ఫీల్డ్ ట్రిప్స్, గార్డెనింగ్, సాంస్కృతిక కార్యక్రమాలు, వివాహాలు వంటి ఎన్నో కార్యక్రమాలు నిర్వహించబడతాయి. **

### **ఈ మ్యూజియం ఉదయం 10.00 గంటల నుండి మధ్యాహ్నం 2.00 గంటల వరకూ తెరిచి ఉంటుంది. **⏎ **కరోనా ఆర్ట్ గ్యాలరీ ****కళల పట్ల అధ్యయనాన్ని ప్రోత్సహించడానికి, అభివృద్ధి చేయడానికి ఈ ఆర్ట్ గ్యాలరీ ఉద్దేశించబడింది. **

### **చారిత్రాత్మక సివిక్ సెంటర్ లో ఉన్న కరోనా ఆర్ట్ గ్యాలరీ ప్రతి సంవత్సరం కనీసం ఏడు ఆర్ట్ ఎగ్జిబిషన్లను నిర్వహిస్తుంది. **

### **స్థానిక ప్రాంతానికి చెందిన అనేక మంది కళాకారులకు ఇది ఒక అద్భుతమైన ప్రారంభ కేంద్రంగా పని చేస్తుంది. **

### **సందర్శకులు గురువారం నుండి ఆదివారం వరకూ మధ్యాహ్నం 12.00 నుండి సాయంత్రం 4.00 వరకు ప్రవేశ ఛార్జీ లేకుండా గ్యాలరీను అన్వేషించవచ్చు. **

### **స్కల్ కన్యాన్ జిప్ వే **⏎ **స్కల్ కన్యాన్ జిప్ లైన్ 160 ఎకరాల విస్తీర్ణంలో విస్తరించి ఉంది. **

### **ఇంటర్ స్టేట్ 15 నుండి ఇక్కడికి కొన్ని నిమిషాల దూరం మాత్రమే. **

### **అతిధుల కోసం ఇక్కడ నాలుగు రకాల జిప్ లైన్ కోర్సులు అందుబాటులో ఉంటాయి. **

### **వీటిని రిజర్వేషన్ ద్వారా మాత్రమే ఎంపిక చేసుకోవాలి. **

### **ఒరిజినల్ కోర్స్ కిడ్ ఫ్రెండ్లీగా ఉంటుంది. ఇందులో పది నిమిషాల హైక్, ఆరు జిప్ లైన్ లు 2800 అడుగుల పొడవు, భూమికి 80 అడుగుల ఎత్తులో ఉంటాయి. **

### **ఎక్స్ ట్రీమ్ కోర్సు ఐదు జిప్ లైన్లతో 200 అడుగుల ఎత్తు, 6,100 అడుగుల పొడవు ఉంటుంది. **

### **మాంస్టర్ ఏడు జిప్ లైన్లుతో 300 అడుగుల ఎత్తు, 9,100 అడుగుల పొడవు కలిగి ఉంటుంది. ఇది పర్యాటకులకు గొప్ప వినోదకరమైన ఎంపిక. **⏎ **ఇతర పర్యాటక ఆకర్షణలు ****సిట్రస్ సిటీ గ్రిల్లే, ది హాట్ డాగ్ షాపీ, లూనా మోడ్రన్ మెక్సికన్ కిచెన్, డోస్ లాగోస్ గోల్ఫ్ కోర్స్, షాప్స్ ఎట్ డోస్ లాగోస్, పోల్ పొజిషన్ రేస్ వే, కోరోన్ బర్గ్ పునరుజ్జీవనం మొదలైనవి. **

### **󠀁[దక్షిణ కొరియా: 7 నిమిషాల్లోనే కరోనా పరీక్ష.. నో లాక్‌డౌన్, టెక్నాలజీతో కోవిడ్‌ను గెలిచిందిలా!](https://amaravathiteacher.com/south-korea-corona-test-in-just-7-minutes-no-lock-down-technology-won-carona/)󠁿**

### **󠀁[WHAT IS LOCK DOWN? PUBLIC DOS AND DONT’S READ](https://amaravathiteacher.com/what-is-lockdown-till-march-31st-dos-donts-for-the-public/)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
