IRCTC-tree-jyotirlinga-shirdi-sai-baba-darshan-tour-package-November-details

IRCTC-tree-jyotirlinga-shirdi-sai-baba-darshan-tour-package-November-details

షిరిడీ వెళ్లాలనుకునేవారికి ఐఆర్‌సీటీసీ టూర్ ప్యాకేజీ

మీరు షిరిడీ టూర్ ప్లాన్ చేసుకుంటున్నారా? అయితే మీకు శుభవార్త.

ఐఆర్‌సీటీసీ షిరిడీ టూర్ ప్యాకేజీ రూపొందించింది. షిరిడీతో పాటు మరిన్ని ప్రాంతాలకు తీసుకెళ్లనుంది.

ఆ టూర్ ప్యాకేజీ విశేషాలు తెలుసుకోండి.

మహారాష్ట్రలోని మూడు జ్యోతిర్లింగాలను దర్శించడంతో పాటు షిరిడీకి ఐఆర్‌సీటీసీ ప్యాకేజీ రూపొందించింది.

ఔరంగాబాద్, షిరిడీ, నాసిక్, త్రయంబకేశ్వరం, భీమశంకర ఆలయం, ఎల్లోరా, బీబీకా మఖ్‌బారా, శనిశింగాపూర్, షిరిడీ, ముక్తిధామం, పంచవటి లాంటి ప్రాంతాలకు తీసుకెళ్లనుంది.

‘త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్’ పేరుతో రూపొందించిన టూర్ వైజాగ్ నుంచి నవంబర్ 7న ప్రారంభమవుతుంది. ప్యాకేజీ ధర రూ.18260

ఈ ప్యాకేజీ బుక్ చేసుకున్న టూరిస్టులు దువ్వాడ, అనకాపల్లి, తుని, సామర్లకోట, రాజమండ్రి, విజయవాడ, ఖమ్మం, వరంగల్, కాజీపేట, సికింద్రాబాద్ రైల్వేస్టేషన్‌లో రైలు ఎక్కొచ్చు.

థర్డ్ ఏసీలో ప్రయాణం, బ్రేక్‌ఫాస్ట్, లంచ్, డిన్నర్, ఔరంగబాద్‌, షిరిడీలో బస, ట్రావెల్ ఇన్స్యూరెన్స్ టూర్ ప్యాకేజీలో కవర్ అవుతాయి

ఐఆర్‌సీటీసీ త్రి జ్యోతిర్లింగ షిరిడీ సాయిబాబా దర్శన్ టూర్ నవంబర్ 7న ప్రారంభం అవుతుంది.

నవంబర్ 7న ఉదయం 8 గంటలకు వైజాగ్ రైల్వేస్టేషన్‌లో టూర్ మేనేజర్‌ని కలిసి 9 గంటలకు వైజాగ్‌లో రైలు ఎక్కాలి

నవంబర్ 8న ఉదయం 07.30 గంటలకు ఔరంగాబాద్‌కు చేరుకుంటారు.

ఆ రోజంతా ఎల్లోరా గుహలు, బీబీకా మక్బారా, గృష్ణేశ్వర్ ఆలయ సందర్శన ఉంటుంది. రాత్రికి ఔరంగాబాద్‌ లోనే బస చేయాలి.

నవంబర్ 9న షిరిడీకి బయల్దేరాలి. దారిలో శనిశింగాపూర్ ఆలయ దర్శనం ఉంటుంది. సాయంత్రం షిరిడీకి చేరుకున్న తర్వాత హోటల్‌లో విశ్రాంతి తీసుకొని సాయిబాబా దర్శనానికి వెళ్లాలి. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి

నవంబర్ 10న నాసిక్‌లో సైట్ సీయింగ్ ఉంటుంది. త్రయంబకేశ్వర శివాలయం, ముక్తిధామం, పంచవటి, సీతాగుహ, కపలేశ్వర్ ఆలయం, గోదావరి ఘాట్ సందర్శన ఉంటుంది. రాత్రికి షిరిడీలోనే బస చేయాలి

నవంబర్ 11న భీమశంకర సైట్ సీయింగ్ ఉంటుంది. రాత్రికి తిరిగి షిరిడీకి తీసుకొస్తారు.

రాత్రి షిరిడీలో బస చేసిన తర్వాత నవంబర్ 12న మన్మాడ్‌కు చేరుకోవాలి.

సాయంత్రం 4.30 గంటలకు మన్మాడ్‌నుంచి బయల్దేరితే నవంబర్ 13న తెల్లవారుజామున 04.40 గంటలకు విశాఖపట్నం చేరుకోవడంతో టూర్ ముగుస్తుంది

error: Content is protected !!