YUVIKA (YUva VIgyani KAryakram) – Young Scientist Programme
ఇస్రో శిక్షణ
★ విద్యార్థులు, యువతను అంతరిక్ష ప్రయోగాల వైపు ఆకర్షించేందుకు ఈ ఏడాది నుంచే ‘యువ శాస్త్రవేత్త అభియాన్’ పేరిట ప్రత్యేక కార్యక్రమం ప్రారంభిస్తామని ఇస్రో ప్రకటన.
★ రెండు వారాలపాటు కొనసాగే ఈ కార్యక్రమంలో ప్రతి రాష్ట్రం, కేంద్రపాలిత ప్రాంతం నుంచి ముగ్గురు చొప్పున విద్యార్థులను ఎంపికచేసి శిక్షణనిస్తారు.
★ సీబీఎస్‌ఈ, ఐసీఎస్‌ఈ, రాష్ట్ర పాఠ్యాంశాలలో తొమ్మిదో తరగతి చదువుతున్న విద్యార్థులు ఎంపికకు అర్హులు.
★ ఇప్పటికే ఆయా రాష్ట్ర ప్రభుత్వాలను సంప్రదించామని, విద్యార్థుల ఎంపిక అనంతరం ఈ నెలాఖరు నుంచి మొదటి విడత కార్యక్రమంలో పాల్గొనే విద్యార్థుల పేర్లను ప్రకటిస్తామని ఇస్రో ప్రకటన.
“యువిక” యంగ్ సైంటిస్ట్ ISRO కార్యక్రమం:
1) యువిక అంటే ఏమిటి?
♦ “యువ విజ్ఞాన్ కార్యక్రమ్” అంతరిక్ష విజ్ఞానంపై అవగాహన కల్పించి బాల్యదశలోనే విద్యార్థులను శాస్త్రవేత్తలుగా మలిచేందుకు రూపొందించిన కార్యక్రమం.