jagananna-vidya-kanuka-Procurement-Supply-Students-Kit-1st-to-10th-class

jagananna-vidya-kanuka-Procurement-Supply-Students-Kit-1st-to-10th-class

పేద పిల్లలకు రూ.600 కోట్లతో ‘జగనన్న విద్యా కానుక’

స్కూలు పిల్లలకు పాఠశాల కిట్లు

జూన్‌ నాటికి సిద్ధం చేసేలా కార్యాచరణ

ప్రభుత్వ యాజమాన్య, ఎయిడెడ్‌ స్కూళ్లలో చదివే ప్రతి విద్యార్థికి పంపిణీ

 ‘జగనన్న విద్యా కానుక’ కిట్స్‌ కొనుగోలుకు పరిపాలనా సంబంధిత అనుమతులు ఇస్తూ రాష్ట్ర ప్రభుత్వం గురువారం ఉత్తర్వులు జారీ చేసింది.

కిట్లు కొనుగోలుకు మొత్తం రూ. 655.60 కోట్లు వ్యయం కానుంది.

సమగ్ర శిక్షణ కేంద్ర పథకం ద్వారా ఈ కిట్లు పంపిణీ చేస్తారు.

ఇందులో రాష్ట్ర వాటాగా రూ. 262.24 కోట్లు వెచ్చించనుంది.

ఆరు రకాల వస్తువులతో కిట్లు..
కాగా ప్రభుత్వ పాఠశాలల్లో చదివే విద్యార్థులందరికీ వచ్చే విద్యా సంవత్సరం నుంచి ‘జగనన్న విద్యా కానుక’ కింద ఆరు రకాల వస్తువులతో కూడిన ప్రత్యేక కిట్లను ప్రభుత్వం పంపిణీ చేయనుంది.

1వ తరగతి నుంచి 10 తరగతి వరకు చదివే 42 లక్షల మందికి పైగా విద్యార్థులకు ఈ కిట్లను అందిస్తారు.

ప్రతి కిట్‌లో 3 జతల యూనిఫామ్‌ క్లాత్, నోట్‌ పుస్తకాలు, పాఠ్య పుస్తకాలు, షూ– 2 జతల సాక్స్‌లు, స్కూల్‌ బ్యాగ్, బెల్టు ఉంటాయి.

యూనిఫామ్‌ కుట్టించేందుకు అయ్యే ఖర్చులను విద్యార్థుల తల్లుల బ్యాంకు ఖాతాల్లో ప్రభుత్వమే జమ చేస్తుంది.

వేసవి సెలవుల అనంతరం స్కూళ్లు తెరిచే నాటికి ఈ కిట్లను పంపిణీ చేయనుంది.(6 వస్తువులతో జగనన్న విద్యా కానుక)

రాష్ట్రంలో 40 లక్షలకు పైగా పిల్లలకు ప్రయోజనం

‘మీ పిల్లల మేనమామగా..’ అంటూ రాష్ట్రంలోని నిరుపేద బడుగు బలహీన వర్గాల అక్కచెల్లెమ్మల పిల్లల చదువుల బాధ్యత తనదిగా పేర్కొన్న సీఎం వైఎస్‌ జగన్‌ ఆ పిల్లలకు మరింత భరోసా కల్పించే కార్యక్రమాలకు శ్రీకారం చుట్టారు. పిల్లలకు అందించే దుస్తులు పాఠ్యపుస్తకాలతో పాటు వారి చదువులకు అవసరమయ్యే మరికొన్ని వస్తువులను కూడా చేర్చి ‘కిట్‌’ రూపంలో అందించే కార్యక్రమాన్ని చేపట్టారు

రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్‌ పాఠశాలలు, ఎయిడెడ్‌ మదర్సాల్లో చదువుకొనే విద్యార్థులందరికీ ఈ కిట్లను అందించనున్నారు.

‘జగనన్న విద్యా కానుక’ పథకం కింద రాష్ట్రంలోని దాదాపు 40 లక్షల మంది విద్యార్థులకు రూ.600 కోట్ల వ్యయంతో ఈ కిట్లను పంపిణీ చేయనున్నారు. 

వచ్చే విద్యా సంవత్సరం ప్రభుత్వ పాఠశాలలు తెరిచే నాటికి ఈ కిట్లను సిద్ధం చేసి విద్యార్ధులందరికీ పంపిణీ చేయనున్నారు.

జగనన్న విద్యా కానుక: ఆరు వస్తువులతో కిట్లు

JAGANANNA VIDYA KANUKA PROCEEDINGS COPY CLICK HERE

రెండు జతల దుస్తులు, పాఠ్యపుస్తకాలు అందించడంలోనూ గత ప్రభుత్వం విఫలమైంది. పాఠ్యపుస్తకాలు డిసెంబర్‌ వరకు, దుస్తులు అయితే ఏకంగా ఏప్రిల్‌ వరకు కూడా పంపిణీ అయ్యే పరిస్థితి.

ముఖ్యమంత్రి జగన్‌మోహన్‌రెడ్డి పాఠశాలలు తెరిచే నాటికే పిల్లలకు పాఠ్యపుస్తకాలు, దుస్తులు పంపిణీ చేయాలని ఆదేశాలిచ్చారు.

రెండు జతల దుస్తులను మూడు జతలకు పెంచారు.

3 జతల దుస్తుల వస్త్రంతో పాటు నోట్‌ పుస్తకాలు, ఒక జత షూ, 2 జతల సాక్సులు, బెల్టు, స్కూలు బ్యాగును కిట్‌ రూపంలో అందించనున్నారు. 

ప్రభుత్వ పాఠశాలల్లో ఒకటో తరగతి నుంచి పదో తరగతి వరకు చదివే విద్యార్థులకు తరగతుల వారీగా ఈ కిట్లను అందిస్తారు.

వీటికి సగటున ఒక్కో విద్యార్థికి రూ.1,350 నుంచి 1,550 వరకు వ్యయం అవుతుందని అధికారులు అంచనా వేస్తున్నారు.

ప్రస్తుతం 40 లక్షల మంది విద్యార్థులకు వీలుగా అంచనా వేస్తున్నా ప్రభుత్వం ప్రభుత్వ పాఠశాలల అభివృద్ధికి తీసుకుంటున్న చర్యల కారణంగా ఈ సంఖ్య మరో 3 నుంచి 4 లక్షల వరకు పెరగవచ్చని అభిప్రాయపడుతున్నారు.

గతంలో కిట్ల రూపంలో రెసిడెన్సియల్‌ స్కూళ్లలోని 7 నుంచి 8 లక్షల మంది పిల్లలకు వీటిలో కొన్ని వస్తువులను మాత్రమే పంపిణీ చేసేవారు.

ముఖ్యమంత్రి వైఎస్‌ జగన్‌ రాష్ట్రంలోని ప్రభుత్వ యాజమాన్య పాఠశాలలు, ఎయిడెడ్‌ స్కూళ్లు, ఎయిడెడ్‌ మదర్సాల్లో చదువుకొంటున్న పిల్లలందరికీ వీటిని పంపిణీ చేయించేలా ఆదేశాలు ఇచ్చారు.  

‘జగనన్న విద్యా కానుక’ కిట్స్‌ కొనుగోలుకు పరిపాలనా సంబంధిత అనుమతులు JAGANANNA VIDYA KANUKA G.O.MS.NO.12

JAGANANNA VIDYA KANUKA PROCEEDINGS COPY CLICK HERE

error: Content is protected !!