6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) మార్గదర్శకాలు
2019, జనవరి 2 నుండి 11 వరకు
1. జన్మభూమి-మా ఊరు (JBMV)
1.1 ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ప్రజల వద్దకు పాలనను తీసుకువెళ్ళడానికి, వారి ఇబ్బందులను నివారించడానికి, అభివృద్ధి మరియు సంక్షేమం యొక్క ఏకీకృత ధృక్పధాన్ని ప్రధానంగా తెలియచేయడానికి మరియు స్థిరమైన అభివృద్ధి లక్ష్యాలు మరియు విజన్ 2029 క్రింద లక్ష్యాలను చేరుకోవడానికి కూడా 5వ విడత JBMVను నిర్వహించడం జరిగింది.
1.2 రాష్ట్ర వ్యాప్తంగా విస్తృత ప్రచారాన్ని కొనసాగిస్తూ, రాష్ట్రంలోని అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులలో 2019, జనవరి 2 నుండి 11 వరకు 6వ విడత జన్మభూమి-మా ఊరు (JBMV) కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది.
2. 6వ విడత JBMV కార్యక్రమ ప్రధాన అంశాలు,
2.1 ‘వయాడక్ట్’(VIADUCT) ద్వారా అభివృద్ది మరియు వృద్ధి ధృక్పధంపై చైతన్యాన్ని కలిగించడం – ‘వయాడక్ట్’ (VIADUCT)కు విస్తరించే విజన్, వినూత్న కల్పన, జవాబుదారీతనం, డిజిటలైజేషన్, ఊబరైజేషన్, సమగ్ర మరియు సాంకేతిక పరిజ్ఞాన రూపాంతరీకరణ.
2.2 2014 నుండి సాధించిన విజయాలపై అవగాహనను కల్పించడం – అన్ని ప్రభుత్వ శాఖలకు చెందిన అన్ని సంపదలు మరియు లబ్ధిదారుల జాబితాను (తెలుగులో) ఆర్.టి.జి శాఖ ద్వారా ఏర్పాటు చేయబడిన ఒక ఆన్ లైన్ వేదిక ద్వారానూ మరియు సంబంధిత శాఖలన్నింటి సహాయంతో గ్రామం వారీగా ముందుగానే ముద్రించిన తగినన్ని ప్రతులను గ్రామ సభ ముందు ఉంచాలి. సమాజ వికాసం, కుటుంబ వికాసం మరియు ఎస్.డి.జి క్రింద పనితీరును కూడా గ్రామ సభ ముందు ఉంచాలి.
2.3 2019-24 కాలానికి గ్రామ/వార్డు అభివృద్ధి ప్రణాళిక (VDP/WDP) – గ్రామదర్శిని కార్యక్రమ సమయంలో అన్ని జిపిలు మరియు వార్డులు వచ్చే ఐదు సంవత్సరాలకు సంబంధించిన (2019-2024) VDP/WDPని తయారు చేయడమైనది. ఆ రోజుటి ఇతివృత్తం ప్రకారం గ్రామ పంచాయతీ/వార్డు సందర్శన సమయంలో మండల స్థాయి టీంల ద్వారా మరియు గ్రామ పంచాయతీ/వార్డు స్టేషనరీ టీం ద్వారా JBMV కార్యక్రమంలో VDP/WDPను చర్చించి, దీనిని తుదిగా ఆమోదించి, గ్రామ పంచాయతీ/వార్డు స్థాయి స్టేషనరీ టీమ్ ద్వారా 2019 జనవరి 11 తేదీన JBMV ఆఖరి రోజున విడుదల చేయాలి.
3. JBMV కార్యక్రమం 6వ విడత కార్యకలాపాలు – JBMV 6వ విడత కార్యక్రమం JBMV 5వ విడత మాదిరిగానే, రెండు సెట్ల కార్యకలాపాలను కలిగివుంటుంది.
• 3.1 కార్యకలాపం ‘A’ – మండల స్థాయి బృందం సందర్శన – JBMV కార్యక్రమంలో మండల/మునిసిపల్ బృందం షెడ్యూల్ ప్రకారం గ్రామ పంచాయతీ/వార్డును సందర్శించి, గ్రామ సభలను నిర్వహించి మరియు మండల/మునిసిపాలిటీ యొక్క అన్ని గ్రామ పంచాయతీలు/వార్డులను సందర్శించాలి. మండల స్థాయి సందర్శన బృందానికి సంబంధించిన సూచిత అజెండాను 1వ అనుబంధంలో పొందుపరచడమైనది.
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
ప్రధాన సవాళ్ళు, కీలక అంశాలు, అత్యున్నత అభ్యాసాలు, జాతీయ/అంతర్జాతీయ అవార్డులు మరియు బెంచ్ మార్కులపై కూడా చర్చ కేంద్రీకరించాలి. సదరు చర్చను పర్సన్ ఇన్ ఛార్జ్ మరియు/లేదా గ్రామ కార్యదర్శి నిర్వహించాలి మరియు అట్టి ఇతివృత్తానికి విద్యార్ధులకు మరియు అనుబంధ గ్రామస్థాయి ఉద్యోగులు దానికి సహకరించాలి. శాఖలతో సంబంధం లేకుండా విఇఓ, విఆర్ఓ, ఉపాధ్యాయులు, వ్యవసాయ అధికారి, గ్రామ సహాయకుడు, పశు వైద్యాధికారి, బిల్ కలెక్టరు, శానిటరీ ఇన్పెక్టరు వంటి గ్రామస్థాయి/వార్డు స్థాయి అధికారులందరూ ఆశా వర్కర్లు, ఎ.ఎన్.ఎం, ఎ.డబ్ల్యుడబ్ల్యు, సాధికార మిత్రాలు, ఎన్.ఆర్.టిలు మరియు ఇతరులు, సంబంధిత గ్రామ పంచాయతీ/వార్డులలో ఈ కార్యక్రమానికి రోజూ హాజరుకావాలి.
3.2.1 బహుళ రంగాలకు చెందిన బృందాలు (MDTs) – 4 నుండి 5 గురు విద్యార్ధులు మరియు ఉన్నత విద్యా శాఖ మరియు ఏపిఎస్ సి.హెచ్.ఇ చే ఏర్పాటు చేయబడిన ఒక బృందం మరియు నాయకుడుగా ఉన్నట్టి ఫ్యాకల్టీ సభ్యునితో కూడుకొని ఉన్నట్టి బహుళ రంగాలకు చెందిన బృందాలు (MDTs) గ్రామ పంచాయతీ/వార్డు బృందాలకు సహాయపడతాయి
గ్రామ స్థాయి పోటీలు :
అంతేకాకుండా, విద్యా శాఖతో సంప్రదించి సాంస్కృతిక శాఖ ప్రతి గ్రామ పంచాయతీ/వార్డులో ముఖ్యంగా JBMV చివరి తేదీన అనగా, 2019, జనవరి 11 తేదీన చర్చ/వ్యాస రచన/చిత్ర లేఖనం/రంగోలి వంటి పోటీలను నిర్వహించాలి.
అవార్డులు :
గ్రామ అభివృధి ప్రణాళికను గ్రామ దార్శనికత పత్రంగా చేపట్టడంతో పాటుగా పర్యాటక, సాంస్కృతిక శాఖ JBMV చివరి తేదీన అనగా 2019, జనవరి 11వ తేదీన వివిధ పోటీలలో గెలిచిన విజేతలకు అవార్డులను ఇవ్వాలి.
పుడ్ ఫెస్టివల్ –
పర్యాటక, సాంస్కృతిక శాఖ జారీ చేయనున్న మార్గదర్శకాల ప్రకారం ఒక రోజున పుడ్ ఫెస్టివల్ ను నిర్వహించాలి.
కె రన్ –
2019, జనవరి 6రవ తేదీ, ఆదివారం ఉదయం 6:30 గంటల నుండి 7 : 30 గంటల వరకు ప్రతి మండల ప్రధాన కార్యస్థానం మరియు మునిసిపాలిటీలో 5 కె రన్ ను నిర్వహించాలని నిర్ణయించడమయింది. ఈ రన్ కోసం జిల్లా కలెక్టర్లు అవసరమైన ఏర్పాట్లు చేయాలి.
ఫిర్యాదులు – సామాజిక, వ్యక్తిగత అంశాల రెండింటికి సంబంధించిన ఆర్థికేతర ఫిర్యాదులను JBMV కార్యక్రమం సమక్షంలోనే పరిష్కరించబడేలా చూడాలని అన్ని శాఖలను కోరడమయింది.
రోజువారీ ప్రాతిపదికన (అదే రోజు సాయంత్రం) అన్ని ఫిర్యాదుల వివరాలను అప్ లోడ్ చేయాలి.
స్కూల్స్ నుండి ఇవ్వవలసిన సమాచారం గల ఫారాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
కార్య విధానపరమైన – మార్గదర్శకాలు
కార్యక్రమం కాలవ్యవధి –
కార్యక్రమం కాలవ్యవధి 2019, జనవరి 2వ తేదీ నుండి 11వ తేదీ వరకు ఉంటుంది.
గ్రామ పంచాయతీ/వార్డు సందర్శనలు 2019,
జనవరి 2వ తేదీన ప్రారంభమై 2019, జనవరి 11వ తేదీ వరకు కొనసాగుతాయి.
స్కూల్స్ నుండి ఇవ్వవలసిన సమాచారం గల ఫారాలు కోసం ఇక్కడ క్లిక్ చేయండి
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
అనుబంధం – I
కార్యకలాపం – A క్రింద మండల/మునిసిపల్ స్థాయి సందర్శన బృందం కోసం సూచిత అజెండా
(ఎ) గ్రామ నడకన
(బి) ఈ క్రింద సూచించిన ఎజెండా ప్రకారంగా గ్రామ సభ.
వరుస సంఖ్య అజెండా కాల వ్యవధి
1 ప్రార్ధన 5 నిమిషాలు
2 కార్యక్రమం యొక్క ఎజెండా రూపు రేఖ 5 నిమిషాలు
3 గౌరవ ముఖ్యమంత్రి సందేశం 10 నిమిషాలు
4 JBMV ప్రతిజ్ఞ 5 నిమిషాలు
5 లబ్ధిదారులు మరియు సృష్టించిన ఆస్తుల జాబితాను ప్రకటించడంతో పాటు వివిధ కార్యక్రమాల క్రింద ప్రభుత్వం సాధించిన లక్ష్యాల ప్రగతి 30 నిమిషాలు
6 రోజువారి ఇతి వృత్తం, శ్వేత పత్రాలకు సంబంధించిన చర్చ 30 నిమిషాలు
7 గ్రామీణాభివృద్ధి ప్రణాళిక/వార్డు అభివృద్ధి ప్రణాళికపై చర్చ 30 నిమిషాలు
8 కార్యక్రమం సంతృప్తి సర్వే నివేదిక 10 నిమిషాలు
9 ఫిర్యాదులపై (ATR) తీసుకున్న కార్యాచరణ నివేదిక 10 నిమిషాలు
10 వివిధ శాఖలలో సాధించిన లక్ష్యాలపై ప్రదర్శన
కార్యక్రమానికి సమాంతరంగా
11 i. ఆరోగ్య శిబిరాలు కార్యక్రమానికి సమాంతరంగా
ii. పశువైద్య శిబిరాలు
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
అనుబంధం – II
కార్యరూపం – B క్రింది జిపి/వార్డు స్థాయి బృందం సూచిత అజెండా.
వరుస సంఖ్య అజెండా
రోజువారీ కార్యకలాపం
1 ప్రార్థన
2 గౌరవ ముఖ్యమంత్రి సందేశం (ప్రత్యక్ష ప్రసారం)
3 రోజువారీ ఇతివృత్తం మరియు శ్వేతపత్రంపై చర్చ మరియు రోజువారీ ఇతివృత్తానికి సంబంధించి లబ్దిదారునితో చర్చ
జనవరి 11, 2019 తేదీన ఒకసారి 6వ విడత JBMV
1 సాంస్కృతిక కార్యక్రమం
2 చర్చ/వ్యాసరచన/చిత్ర లేఖనం వంటి గ్రామ పంచాయతీ/వార్డు స్థాయి పోటీలు
3 ముగ్గుల పోటీలు
[siteorigin_widget class=”WP_Widget_Custom_HTML”][/siteorigin_widget]
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,

