E-commerce platform Amazon on Sunday announced close to 20,000 seasonal jobs in its customer service department in India.
The positions are open to all as the minimum education qualification required is 12th standard pass and the applicants should b proficient in languages including English, Hindi, Tamil, Telugu or Kannada.
HIGHLIGHTS
Amazon on Sunday announced close to 20,000 seasonal jobs in its customer service department in India
The company revealed that the jobs will be available in 11 Indian cities including Hyderabad, Pune, Coimbatore, Noida, Kolkata and others
Earlier in this year, Amazon had announced that it plans to create 1 million new jobs in India by 2025
నిరుద్యోగులకు శుభవార్త.. కొత్తగా 20 వేల ఉద్యోగాలు.. 15-20 వేల మధ్య జీతం
అమెజాన్ ఇండియా భారతదేశంలో భారీగా ఉద్యోగాలను భర్తీ చేస్తోంది.
హైదరాబాద్ సహా 11 ప్రాంతాల్లో ఖాళీలున్నాయి.
ఈ-కామర్స్ దిగ్గజం అమెజాన్ ఇండియా 20,000 ఉద్యోగాలను ప్రకటించింది.
హైదరాబాద్, కోల్‌కతా, పూణె, బెంగళూరు, చెన్నై లాంటి 11 ప్రాంతాల్లో ఈ ఖాళీలను భర్తీ చేయనుంది.
వర్చువల్ కస్టమర్ సర్వీస్ ప్రోగ్రామ్‌లో ఎక్కువ అవకాశాలున్నాయి.
వర్క్ ఫ్రమ్ హోమ్ ఉద్యోగాలు కోరుకునేవారికి ఇది మంచి అవకాశం.
అమెజాన్ ఇప్పటికే కొద్ది నెలల గ్యాప్‌లో దేశవ్యాప్తంగా దాదాపు 50,000 మందిని తాత్కాలిక ఉద్యోగాల్లో నియమించుకుంది.
ఇప్పుడు మళ్లీ మరో 20 వేల మందిని సీజనల్ జాబ్స్ కోసం తీసుకుంటామని పేర్కొంది.
నెలకు రూ.15 వేల నుంచి రూ.20,000 వరకు జీతం లభిస్తుంది. ఈమెయిల్స్, చాట్, సోషల్ మీడియా, ఫోన్ కాల్స్ ద్వారా కస్టమర్లకు సేవలు అందించాల్సి ఉంటుంది.
కరోనా వైరస్ శరవేగంగా విస్తరిస్తున్న నేపథ్యంలో చాలా మంది ఆన్‌లైన్ షాపింగ్ బాట పడుతున్నారు.
దీంతో డిమాండ్ భారీగా పెరిగింది.
అందుకే అమెజాన్ కూడా డిమాండ్‌కు తగినట్లుగా ఉపాధి అవకాశాలు కల్పిస్తూ వస్తోంది.
రాబోయే ఆరు నెలల కాలంలో కస్టమర్ల నుంచి డిమాండ్ మరింత పెరగొచ్చని అమెజాన్ ఇండియా డైరెక్టర్ (కస్టమర్ సర్వీస్) అక్షయ్ ప్రభు తెలిపారు.
అందుకే దీనికి అనుగుణంగానే తమ నెట్‌వర్క్‌ను కూడా బలోపేతం చేసుకోవాలని యోచిస్తున్నామని, అందుకే కొత్తగా నియామకాలు చేపడుతున్నామని వివరించారు.
ఉద్యోగుల పనితీరు, కంపెనీ అవసరాలకు అనుగుణంగా టెంపరరీ ఉద్యోగుల్లో కొంత మందిని ఏడాది చివరి కల్లా పర్మినెంట్ కూడా చేస్తామని ఆయన తెలిపారు.
కాగా 2025 నాటికి 10 లక్షల మందికి కొత్తగా ఉపాధి కల్పిస్తామని అమెజాన్ ఫౌండర్ జెఫ్ బెజోస్ ఏడాది ఆరంభంలో ప్రకటించిన విషయం తెలిసిందే.