Coal-India-Recruitment-2019-engineering-diploma-1326-jobs-notification

Coal-India-Recruitment-2019-engineering-diploma-1326-jobs-notification

Coal India Jobs: కోల్ ఇండియా లిమిటెడ్‌లో 1326 ఉద్యోగాలు… మొదలైన దరఖాస్తు ప్రక్రియ

దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు.

కోల్ ఇండియా లిమిటెడ్-CIL భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది.

మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని ప్రకటించింది. మొత్తం 1326 ఖాళీలున్నాయి.

ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్ విభాగాల్లో మేనేజ్‌మెంట్ ట్రైనీ పోస్టుల్ని భర్తీ చేయనుంది.

కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్, పర్సనల్ ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేయనున్నారు.

ఇంజనీరింగ్‌లో సంబంధిత విభాగంలో 60 శాతం మార్కులతో పాసైనవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకోవచ్చు.

దరఖాస్తు ప్రక్రియ 2019 డిసెంబర్ 21న ప్రారంభమైంది.

దరఖాస్తుకు 2020 జనవరి 19 చివరి తేదీ.

ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను  వెబ్‌సైట్‌లో కెరీర్స్ సెక్షన్‌లో చూడొచ్చు.

Coal India Recruitment 2019: ఖాళీల వివరాలివే…

మొత్తం ఖాళీలు- 1326

మైనింగ్- 288
ఎలక్ట్రికల్- 218
మెకానికల్- 258

సివిల్- 68కోల్ ప్రిపరేషన్- 28
సిస్టమ్స్- 46
మెటీరియల్స్ మేనేజ్‌మెంట్- 28
ఫైనాన్స్ అండ్ అకౌంట్స్- 254
పర్సనల్ అండ్ హెచ్ఆర్- 89
మార్కెటింగ్ అండ్ సేల్స్- 23
కమ్యూనిటీ డెవలప్‌మెంట్- 26

Coal India Recruitment 2019:

గుర్తుంచుకోవాల్సిన అంశాలు


ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం-

2019 డిసెంబర్ 21 ఉదయం 10 గంటలు


దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జనవరి 19 రాత్రి 11 గంటలు


కంప్యూటర్ బేస్డ్ ఆన్‌లైన్ టెస్ట్- 2020 ఫిబ్రవరి 27, 28

విద్యార్హత-

మైనింగ్, ఎలక్ట్రికల్, మెకానికల్, సివిల్, కోల్ ప్రిపరేషన్, సిస్టమ్స్, మెటీరియల్ మేనేజ్‌మెంట్ పోస్టులకు సంబంధిత విభాగంలో బీటెక్ లేదా బీఈ లేదా బీఎస్సీ పాస్ కావాలి.

ఫైనాన్స్ అండ్ అకౌంట్స్, పర్సనల్ అండ్ హెచ్ఆర్, మార్కెటింగ్ అండ్ సేల్స్, కమ్యూనిటీ డెవలప్‌మెంట్ విభాగాలకు గ్రాడ్యుయేషన్, పీజీ డిప్లొమా ఉండాలి.


దరఖాస్తు ఫీజు-

జనరల్, ఓబీసీ, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు రూ.1,000. ఎస్సీ, ఎస్టీ, వికలాంగులు, కోల్ ఇండియా లిమిటెడ్ ఉద్యోగులు, అనుబంధ సంస్థ ఉద్యోగులకు ఫీజు లేదు.


వయస్సు-

2020 ఏప్రిల్ 1 నాటికి జనరల్, ఈడబ్ల్యూఎస్ అభ్యర్థులకు 30 ఏళ్లు. ఓబీసీలకు 3 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 5 ఏళ్లు, వికలాంగులకు 10 ఏళ్లు, ఎస్సీ, ఎస్టీలకు 15 ఏళ్లు వయస్సులో సడలింపు.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

COAL INDIA OFFICIAL WEBSITE