డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌లో ఉద్యోగాలు… వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు.
Dr Reddy’s Laboratories Walk in Interview | డిగ్రీ పాసైనవారికి శుభవార్త.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్ ఉద్యోగాల భర్తీకి వాక్ ఇన్ ఇంటర్వ్యూ నిర్వహిస్తోంది.
ఆంధ్రప్రదేశ్‌లోని నిరుద్యోగులకు శుభవార్త. తెలుగు రాష్ట్రాల్లోని రెడ్డీస్ ల్యాబరేటరీస్‌లో ఉద్యోగాల భర్తీ జరుగుతోంది.
ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC ఈ విషయాన్ని ట్విట్టర్‌లో వెల్లడించింది.
అందులోని వివరాల ప్రకారం ప్రొడక్షన్ కెమిస్ట్రీ పోస్టుల్ని భర్తీ చేస్తోంది రెడ్డీస్ ల్యాబరేటరీస్. బీఎస్సీ కెమిస్ట్రీ పాసైనవారు ఈ పోస్టులకు అప్లై చేయొచ్చు.
వేతనాల వివరాలను వెల్లడించలేదు. 2020 లో డిగ్రీ పాసైనవారు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి. తెలుగు, ఇంగ్లీష్ భాషల్లో నైపుణ్యం ఉండాలి.
కేవలం యువకులు మాత్రమే ఈ పోస్టులకు అప్లై చేయాలి.
అభ్యర్థులకు వేర్వేరు ప్రాంతాల్లో వాక్ ఇన్ ఇంటర్వ్యూలు నిర్వహిస్తోంది రెడ్డీస్ ల్యాబరేటరీస్.
నవంబర్ 3, 5, 6 తేదీల్లో విజయనగరం, శ్రీకాకుళం, విశాఖపట్నంలో ఇంటర్వ్యూలు ఉంటాయి.
ఇంటర్వ్యూలకు సంబంధించిన పూర్తి వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC అధికారిక వెబ్‌సైట్ https://www.apssdc.in/ ఓపెన్ చేసి తెలుసుకోవచ్చు.
Dr. Reddy’s Laboratories Ltd. Hiring Now Job Role: Production Chemistry Qualification:
http://B.Sc & http://M.Sc (Chemistry) Job Location: AP & Telangana Gender:Male Candidates Only Toll Free: 1800 4252 422 Log on to: http://apssdc.in
Dr Reddy’s Laboratories Walk in Interview: వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలు ఇవే…
2020 నవంబర్ 3న శ్రీకాకుళం జిల్లా ఎచ్చెర్లలోని టీటీడీసీలో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
2020 నవంబర్ 5న విజయనగరంలోని గర్బం మోడల్ స్కూల్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది. 2020 నవంబర్ 6న విశాఖపట్నంలోని ఎంవీపీ కాలనీలో ఉన్న గాయత్రి విద్యా పరిషత్‌లో వాక్ ఇన్ ఇంటర్వ్యూ ఉంటుంది.
ఈ వాక్ ఇన్ ఇంటర్వ్యూకు సంబంధించిన మరిన్ని వివరాలు తెలుసుకోవడానికి 1800 4252 422 టోల్ ఫ్రీ నెంబర్‌కు కాల్ చేసి తెలుసుకోవచ్చు.
డాక్టర్ రెడ్డీస్ ల్యాబరేటరీస్‌లోనే కాదు ఇతర ప్రైవేట్ సంస్థల్లో కూడా ఖాళీలు, వాక్ ఇన్ ఇంటర్వ్యూ వివరాలను ఆంధ్రప్రదేశ్ స్టేట్ స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్-APSSDC తమ వెబ్‌సైట్, ట్విట్టర్ అకౌంట్, ఇతర సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్స్‌లో అప్‌డేట్ చేస్తూ ఉంటుంది.