TENTATIVE TIMELINE: 1 Notification inviting applications 20-04-2020 2 Receipt of application 20-04-2020 to 24-04-2020 3 Scrutiny of applications By 25-04-2020 4 Interviews by selection committees 27.04.2020 to 29.04.2020 5 Intimation letters to selected volunteers 27.04.2020 to 29.04.2020 6 Positioning of volunteers 01-05-2020
ఉద్యోగం పేరు : గ్రామ, వార్డు వాలంటీర్లు.
విద్యార్హత:
వార్డు వాలంటీర్లు కు అయితే డిగ్రీ ,గ్రామ వాలంటీర్లు కు ఆయితే ఇంటర్, గిరిజన ప్రాంత వాలంటీర్లకు అయితే పదోవ తరగతి .
వేతనం : Rs.5000+ ప్రయాణపు ఖర్చులు .
వయసు: 18-35Y
రిజర్వేషన్ :
ST,SC,BC,minority లకు 50% రిజర్వేషన్ .
( ప్రతి కేటగిరీ లో 50% మహిళలకే ప్రాధాన్యత .)
వలంటీర్ల విధులు
– తనకు కేటాయించిన 50 కుటుంబాల పరిధిలో కులం, మతం, రాజకీయంతో సంబంధం లేకుండా అర్హులందరికీ ప్రభుత్వ పథకాల ద్వారా లబ్ధి చేకూర్చేలా పని చేయాలి.
– వలంటీరుగా నియమితులయ్యే వారు తమకు కేటాయించిన ప్రతి 50 ఇళ్ల వద్దకు తరుచూ వెళ్లి ఎప్పటికప్పుడు మారుతున్న అవసరాలకు అనుగుణంగా వారి స్థితిగతులపై సమాచారం సేకరించాలి.
సేకరించిన సమాచారాన్ని గ్రామ- వార్డు సచివాలయం లేదా సంబంధిత అధికారికి అందజేయాలి.
– తమ పరిధిలో ఉండే కుటుంబాల నుంచి అందే వినతులు, వారి సమస్యలపై ఎప్పటికప్పుడు గ్రామ-వార్డు సచివాలయంతో పాటు వివిధ శాఖల అధికారులతో సమన్వయం చేసుకుంటూ సమస్యల పరిష్కారానికి పని చేయాలి.
అర్హులను లబ్ధిదారులుగా ఎంపిక చేయడంలో, సంబంధిత సమస్య పరిష్కారంలో సంధానకర్తగా వ్యవహరించాలి.
వివిధ శాఖలకు అందే వినతుల పరిష్కారంలో ఆయా శాఖలకు సహాయకారిగా పనిచేయాలి.
- తమ పరిధిలోని లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయాన్ని వారి ఇంటి వద్దకే వెళ్లి అందజేయాలి
– 50 కుటుంబాల పరిధిలో సంక్షేమ పథకాలు పొందేందుకు అర్హత ఉండి, వారికి ఆ పథకం అందనప్పుడు దానిపై వారికి అవగాహన కలిగించి, లబ్ధిదారునిగా ఎంపికకు సహాయకారిగా ఉండాలి.
- గ్రామ- వార్డు సచివాలయం ఆధ్వర్యంలో జరిగే సమావేశాలకు హాజరవుతూ..
తనకు కేటాయించిన 50 ఇళ్ల వారి సమస్యలపై ఎప్పటికప్పుడు నోట్‌ను తయారు చేసి అధికారులకు అందజేయాలి.
– ప్రభుత్వ సంక్షేమ పథకాల ద్వారా లబ్ధి పొందుతున్న వారి వివరాలు, ఇతరత్రా సహాయం పొందిన కుటుంబాల జాబితాను తన వద్ద రికార్డు రూపంలో ఉంచుకోవాలి.
- తన పరిధిలోని 50 కుటుంబాల భద్రతపై తగిన జాగ్రత్తలు తీసుకోవడంలో భాగంగా.. విద్య, ఆరోగ్య పరంగా ఎప్పటికప్పుడు వారికి చైతన్యం కలిగించాలి. వృత్తి నైపుణ్యాల గురించి తెలియజేస్తుండాలి.
- తన పరిధిలోని ఇళ్లకు సంబంధించి రోడ్లు, వీధి దీపాలు, మురుగునీటి కాల్వల పరిశుభ్రత, మంచినీటి అవసరాల పరిష్కారం కోసం పనిచేయాలి.
SELECTION CRITERIA: The interview board will select the most eligible applicants based on the following four (04) parameters: 1. Should have knowledge on various Government Schemes, Programs, welfare activities – 25 Marks 2. Previous work experience on various Government Welfare Departments and programs/ NGOs/Federations/Social activities – 25 Marks 3. Leadership qualities, good communication skills and general awareness– 25 Marks 4. Soft Skills – 25 Marks Each of the four parameters will carry 25 marks each totaling to 100 marks. POSITIONING: Positioning and Commencement of work by newly placed Village/Ward Volunteers in the villages shall start from 1st May, 2020 onwards.