HDFC Bank Recruitment 2020: హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకులో ఉద్యోగాలు.. ప్రారంభ వేతనం రూ. 58 వేలు
నిరుద్యోగులకు హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పారేషన్ లిమిటెడ్(HDFC) బ్యాంక్ శుభవార్త చెప్పింది.
నిరుద్యోగులకు హౌసింగ్ డెవలప్‌మెంట్ కార్పారేషన్ లిమిటెడ్(HDFC) బ్యాంక్ శుభవార్త చెప్పింది. సంస్థలో ఖాళీగా ఉన్న పలు ఉద్యోగాలను భర్తీ చేసేందుకు రెడీ అయింది. హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ పీవో, హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంక్ క్లర్క్, అస్టిస్టెంట్ మేనేజర్, ఎగ్జిక్యూటివ్ పోస్టుల కోసం దరఖాస్తులను ఆహ్వానించింది.
మొత్తం 1367 పోస్టులు ఖాళీగా ఉన్నట్టు పేర్కొంది. ఆసక్తి గల అభ్యర్థులు డిసెంబర్ 31 లోగా దరఖాస్తు చేసుకోవచ్చని తెలిపింది.
విద్యార్హత- పోస్టును బట్టి బ్యాచిలర్ డిగ్రీ మరియు మాస్టర్ డిగ్రీ
పోస్టుల వివరాలు– మొత్తం 1367 పోస్టులు. అందులో ప్రొబేషనరీ ఆఫీసర్, అసిస్టెంట్ మేనేజర్ , ఎగ్జిక్యూటివ్‌తో పాటు ఇతర పోస్టులు ఉన్నాయి.
వయోపరిమితి– ఈ పోస్టులకు దరఖాస్తు చేసుకునేవారి కనీస వయసు 21 సంవత్సరాలుగా, గరిష్టంగా 26 ఏళ్లుగా నిర్ణయించారు.
జీతం- వివిధ పోస్టులకు ఎంపికైనా అభ్యర్థులకు ప్రారంభ వేతనం నెలకు రూ. 58,200గా ఉంటుంది.
ఎంపిక ప్రక్రియ- దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులను ప్రత్యక్ష ఇంటర్వ్యూ ద్వారా ఎంపిక చేయనున్నారు.
దరఖాస్తు ఎక్కడ చేయాలంటే.. దరఖాస్తు చేయడం కోసం హెచ్‌డీఎఫ్‌సీ అధికారిక వెబ్‌సైట్ ను సందర్శించండి.