IBPS Clerk 2020: డిగ్రీ పాసైనవారికి ప్రభుత్వ బ్యాంకుల్లో 1557 క్లర్క్ పోస్టులు.. ఏపీలో ఖాళీలు
బ్యాంకు ఉద్యోగం మీ కలా? విద్యార్హతలు తక్కువగా ఉన్నా మంచి ఉద్యోగం కోరుకుంటున్నారా?
ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో క్లర్క్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది. దేశంలోని వేర్వేరు రాష్ట్రాల్లో మొత్తం 1557 పోస్టుల్ని ప్రకటించింది.
బ్యాంక్ ఆఫ్ బరోడా, కెనెరా బ్యాంక్, బ్యాంక్ ఆఫ్ ఇండియా, సిండికేట్ బ్యాంక్, సెంట్రల్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, పంజాబ్ నేషనల్ బ్యాంక్, యూనియన్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లాంటి బ్యాంకుల్లో ఈ పోస్టులున్నాయి.
కామన్ రిక్రూట్‌మెంట్ ప్రాసెస్ ద్వారా ఈ పోస్టుల్ని భర్తీ చేయనుంది ఐబీపీఎస్.
ఈ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది.
అప్లై చేయడానికి 2020 సెప్టెంబర్ 23 చివరి తేదీ. ప్రిలిమ్స్ డిసెంబర్‌లో మెయిన్స్ వచ్చే ఏడాది జనవరిలో ఉంటాయి.
ఈ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాలను https://www.ibps.in/ వెబ్‌సైట్‌లో తెలుసుకోవచ్చు.
IBPS Clerk Recruitment 2020: ఖాళీల వివరాలు ఇవే…
మొత్తం పోస్టులు- 1557 ఆంధ్రప్రదేశ్- 10 తెలంగాణ- 20
దరఖాస్తు ప్రారంభం- 2020 సెప్టెంబర్ 2
దరఖాస్తుకు చివరి తేదీ- 2020 సెప్టెంబర్ 23
ఐబీపీఎస్ క్లర్క్ ప్రిలిమినరీ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2020 డిసెంబర్ 5, 12, 13 ప్రిలిమ్స్ ఫలితాల విడుదల- 2020 డిసెంబర్ 31 మెయిన్స్ కాల్ లెటర్స్- 2021 జనవరి 12 మెయిన్స్ ఆన్‌లైన్ ఎగ్జామ్- 2021 జనవరి 24 ప్రొవిజనల్ అలాట్‌మెంట్- 2021 ఏప్రిల్ 1
IBPS Clerk Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
ఎంపిక విధానం- కంప్యూటర్ బేస్డ్ ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ విద్యార్హతలు- గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుంచి ఏదైనా డిగ్రీ కంప్యూటర్ లిటరసీ- కంప్యూటర్ సిస్టమ్స్ ఆపరేట్ చేయడం తప్పనిసరి.
కంప్యూటర్ ఆపరేషన్స్‌లో సర్టిఫికెట్, డిప్లొమా, డిగ్రీ ఉండాలి.
హైస్కూల్ లేదా కాలేజీలో కంప్యూటర్, ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ సబ్జెక్ట్స్ చదివి ఉండాలి. వయస్సు- 20 నుంచి 28 ఏళ్లు. దరఖాస్తు ఫీజు- రూ.600.