*దేశవ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టు ల భర్తీకి కోర్సులు ఐబీపీఎస్ నోటిఫికేషన్ విడుదల చేసింది.
4500 లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్-I ఆఫీసర్, 1000 పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ ఖాళీలున్నాయి.*
*తెలంగాణాలో 470, ఏపీలో 420 పోస్టు లున్నాయి. ఈ నెల 21 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు.
ఆగస్టు మొదటి వారంలో ప్రిలిమ్స్ ఎగ్జామ్ ఉంటుంది.*
*ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్(ఐబీపీఎస్) దేశ వ్యాప్తంగా ఉన్న 45 ప్రాంతీయ గ్రామీణ బ్యాంకుల్లో 9638 పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఇందులో 4500లకు పైగా ఆఫీస్ అసిస్టెంట్, 3800 స్కేల్-I ఆఫీసర్, వెయ్యికి పైగా స్పెషలిస్ట్ ఆఫీసర్ పోస్టులున్నాయి.
ఈనెల 21 వరకు ఆన్‌లైన్ లో దరఖాస్తు చేసుకోవచ్చు. ఆగస్టు ఒకటి నుండి ప్రిలిమ్స్ నిర్వహిస్తారు.
లాక్‌డౌన్ కారణంగా దాదాపు నాలుగు నెలల తర్వాత నోటిఫికేషన్ వచ్చింది కాబట్టి పోటీ తీవ్రంగా ఉంటుంది. పక్కాగా ప్రిపేరయితే ఒక పోస్టు సొంతం చేసుకోవచ్చు.*
*ఐబీపీఎస్ ఈ నోటిఫికేషన్ ద్వారా మల్టి పర్పస్ ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్–I, ఆఫీసర్ స్కేల్–II (అగ్రిక ల్చర్ ఆఫీసర్, మార్కెటిం గ్ ఆఫీసర్, ట్రెజరీ మేనేజర్, లా ఆఫీసర్, చార్టడ్ అకౌంటెంట్, ఐటీ, జనరల్ బ్యాంకింగ్ ఆఫీసర్), ఆఫీసర్ స్కేల్–IIIపోస్టులను భర్తీ చేస్తుంది.
మన రాష్ర్టంలో 470, ఏపీలో 320 జాబ్లున్నాయి. మల్టి పర్పస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్-I కి ఎక్స్ పీరియన్స్ అవసరం లేదు.
కానీ మిగిలిన పోస్టులకు ఒకటి నుంచి 5 సంవత్సరాల ఎక్స్‌పీరియన్స్ ఉండాలి . ప్రాంతీయ భాషపై అవగాహనతో పాటు కంప్యూటర్ ప్రొఫీషియన్సీ తప్పనిసరి. సెలెక్షన్ ప్రాసెస్ ఆఫీస్ అసిస్టెంట్స్, ఆఫీసర్ స్కేల్–I పోస్టులకు ప్రిలిమినరీ, మెయిన్ ఎగ్జామ్, స్కేల్–II, III కి ఒకే దశలో నిర్వహించే ఆన్‌లైన్ టెస్టు ఉంటుంది. మల్టిపర్పస్ ఆఫీస్ అసిస్టంట్, ఆఫీసర్ స్కేల్–I పోస్టులకు ఇంటర్వ్యూలు ఉంటాయి. ప్రిలిమినరీ పరీక్ష 45 నిమిషాలకు, మెయిన్ ఎగ్జామ్ 2గంటలకు ఉంటుంది.
ప్రశ్నలు ఇంగ్ష్లిష్, హిందీలో ఇస్తారు. నెగెటివ్ మార్కింగ్ ఉంది. తప్పు సమాధానానికి ¼ మార్కు మైనస్ అవుతుంది.
సింగిల్ లెవెల్ ఎగ్జామ్ లో అభ్యర్థులు ఇంగ్లిష్ లేదా హిందీలో ఒక సబ్జెక్టు ఎంచుకోవచ్చు.*
*సెక్షనల్ కటాఫ్ ఉంది.*
*ప్రిలిమ్స్ లోని ప్రతి సెక్షన్ లో క్వాలిఫై కావాలి. ఆఫీస్ అసిస్టెంట్, స్కేల్–I ఆఫీసర్ పోస్టులకు ప్రశ్నాపత్రం తెలుగులో ఇస్తారు.
స్పెషల్ టాపిక్స్ బ్యాంకింగ్ అవేర్ నెస్ ఈ సెక్షన్లో ఫైనాన్సియల్ మార్కెట్స్, సర్ఫిటికెట్ ఆఫ్ డిపాజిట్స్, బ్యాంక్ ఇన్సూరెన్స్, లెటర్ ఆఫ్ క్రెడిట్, మనీ మార్కెట్స్, మనీ ఫంక్షన్స్ అండ్ టైప్స్, బ్యాంక్ లోన్స్ అండ్ డిపాజిట్స్, పథకాలు, టైప్స్ ఆఫ్ అకౌంట్స్, క్యాపిటల్ అండ్ మనీ మార్కెట్ ఇన్స్ర్టూమెంట్స్, పి నోట్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, స్ర్ట క్చర్ ఆఫ్ బ్యాంకింగ్, రీటెయిల్ బ్యాంకింగ్, బ్యాంక్ టెర్మ్స్, బ్యాంకింగ్ అండ్ నాన్ బ్యాంకింగ్ సంస్థలు, ఆర్బీఐ, నాబార్డ్, బ్యాంకింగ్ కమిటీలు, మ్యూచ్‌వల్ ఫండ్స్, ఈ పేమెంట్ సిస్టమ్స్ వంటి కొన్ని వందల టాపిక్ల నుంచి ప్రశ్నలిస్తారు.
ఇందుకు ఏదైనా స్టాండర్డ్ పుస్తకం ప్రిపేరవ్వాలి. కంప్యూటర్ నాలెడ్జ్, కంప్యూటర్ల పరిచయం, వాటి చరిత్ర, కంప్యూటర్ టెర్మినాలజీ, అబ్రివేషన్స్, వెబ్ టెక్నాలజీ, డేటాబేస్ మేనేజ్మెంట్ సిస్టమ్స్, బ్రౌజర్స్ అండ్ సెర్చ్ఇంజిన్స్, ఇంటర్‌నెట్, సాఫ్ట్‌వేర్స్ అండ్ అప్లి కేషన్స్, కంప్యూటర్ మెమొరీ, హార్డ్‌వేర్, సాఫ్ట్ వేర్, మొబైల్ అప్లి కేషన్స్, ఆపరేటింగ్ సిస్టమ్స్, కంప్యూ టర్ షార్ట్ కట్స్, ఎంఎస్ ఆఫీస్, వర్డ్, ఎక్సెల్ నుంచి క్వశ్చన్స్ అడిగే అవకాశం ఉంది.
అగ్రికల్చర్ బ్యాంకింగ్ ఇండస్ర్టీ తో ముడిపడి ఉన్న అగ్రికల్చర్ లోన్ సిస్టమ్స్, ఇన్సూరెన్స్ స్కీమ్స్, క్రాప్ సీజన్స్, అగ్రికల్చర్స్కీమ్స్ వంటి టాపిక్ల నుంచి ఎక్కువ ప్రశ్నలు వస్తాయి.
కాబట్టి ప్రీవియస్ పేపర్లలో వచ్చిన టాపిక్‌లలో లేటెస్ట్ అంశాలు అధ్యయనం చేయాలి. మార్కెటింగ్ బ్యాంకింగ్ ఇండస్ర్టీ లో వస్తున్న మార్పులు, లేటెస్ట్ డెవలప్మెంట్స్ గమనించాలి. బ్యాంక్ ప్రొడక్టులు, సర్వీస్‌లను వినియోగదారులకు చేరవేసే మార్కెటింగ్ విధానాలు, కస్టమర్లను ఆకట్టుకునే పథకాలు, బ్యాంక్ లో లభిస్తున్న సర్వీసులు–ఉపయోగాలు వంటి వాటిని క్షుణ్నంగా అధ్యయనం చేయాలి.ముఖ్యంగా రూరల్ ఏరియాల్లో వినియోగించాల్సిన మార్కెటింగ్ స్ర్టాటజీస్ మీద ప్రశ్నలు వచ్చే అవకాశం ఉంది.*
*బ్యాంకింగ్ లా*
*ఇందులో బ్యాంకింగ్ చట్టాలు, నెగోషియబుల్ ఇన్ స్ర్టుమెంట్ ట్యాక్స్ ట్, అగ్రికల్చర్ చట్టాల తోపాటు వినియోగదారుల చట్టాలు, ఫోరమ్స్ , కంపెనీ యాక్ట్, బ్యాంకింగ్ అంబుడ్స్ మన్, మనీ లాండరింగ్ యాక్ట్, ఐటీ చట్టం 2000, ఫారెన్ ఎక్స్ చేంజ్ యాక్ట్ కాంట్రాక్ట్ ఆఫ్ గ్యారంటీ, టైప్స్ ఆఫ్ కంపెనీస్, పార్టనర్షిప్ యాక్ట్స్ లాంటి రిలేటెడ్ అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. వీటితో పాటు ఐటీ, సీఏ వంటి స్పెషలైజేషన్లకు ఆయా సబ్జెక్టుల్లో బ్యాంక్రిలేటెడ్ ఇన్ఫర్మేషన్ ప్రిపేరయితే మంచి మార్కులు పొందవచ్చు.
ఇవి గుర్తుంచుకోండి ఏ బ్యాంక్పరీక్షలోనైనా దాదాపు ఒకే సబ్జెక్టులు ఒకే సిలబస్‌ను కలిగి ఉంటాయి. కాబట్టి ఓరియంటేషన్మార్చి సిద్ధమైతే దాదాపు అన్ని ఎగ్జామ్స్ రాయవచ్చు.
పరీక్షకు నెల రోజుల సమయం మాత్రమే ఉన్నందున సిలబస్‌ను పూర్తిగా అవగాహన చేసుకొని ప్రణాళికా ప్రకారం సిద్ధమవ్వాలి. ఏ సబ్జెక్టులో ఏ చాప్ట ర్స్ ఉన్నాయి? వాటిలో సబ్ టాపిక్స్ ఏంటి? అందులో ఉన్న స్పెషల్ మెథడ్స్ వంటి అంశాలను క్షుణ్నంగా అధ్యయనం చేయాలి. గంటలోపే 100 ప్రశ్నలకు సమాధానాలు రాయాల్సి ఉంటుంది. కాబట్టి మ్యాథ్స్, రీజనింగ్‌లో వేగంగా ఆన్సర్స్ రాయగలిగేలా ప్రాక్టీస్ చేయాలి. తద్వారా లాజికల్‍గా ఆలోచించడం, ఖచ్చితత్వంతో కూడిన వేగం సాధ్యమవుతుంది. సీనియర్లు, అధ్యాపకుల సలహాలు, ఇంటర్‌నెట్ రివ్యూలు వంటి అధ్యయనం తర్వాత పుస్తకాలు ఎంపిక చేసుకోవాలి. వీలైనన్ని ప్రీవియస్ పేపర్స్ ప్రాక్టీస్ చేయాలి. గ్రూప్‍లుగా చదవడం వల్ల ఎక్కువ విషయాలు గుర్తుంచుకోవచ్చు. ఒకేసారి ఎక్కువ పుస్తకాలు చదవడం కంటే ఒకే పుస్తకాన్ని ఎక్కువసార్లు చదవడం అనేది పరీక్షలో సక్సెస్‍కు మొదటిమెట్టు.*
IBPS RRB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన తేదీలు
ఆన్‌లైన్ దరఖాస్తు ప్రారంభం- 2020 జూలై 1 దరఖాస్తుకు చివరి తేదీ- 2020 జూలై 21 ఫీజు చెల్లించడానికి చివరి తేదీ- 2020 జూలై 21 అప్లికేషన్ సరిదిద్దుకోవడానికి చివరి తేదీ- 2020 జూలై 21 అప్లికేషన్ ప్రింట్ తీసుకోవడానికి చివరి తేదీ- 2020 ఆగస్ట్ 5 కాల్ లెటర్ డౌన్‌లోడ్- 2020 ఆగస్ట్ 12 ప్రీ-ఎగ్జామ్ ట్రైనింగ్- 2020 ఆగస్ట్ 24 నుంచి 29 ప్రిలిమినరీ పరీక్ష- 2020 సెప్టెంబర్ లేదా అక్టోబర్ ప్రిలిమినరీ పరీక్ష ఫలితాలు- 2020 అక్టోబర్ మెయిన్ / సింగిల్ ఎగ్జామ్- 2020 అక్టోబర్ లేదా నవంబర్ మెయిన్ / సింగిల్ ఫలితాల విడుదల- 2020 నవంబర్ ఇంటర్వ్యూ- 2020 నవంబర్
IBPS RRB Recruitment 2020 | బ్యాంకు ఉద్యోగం కోరుకునేవారికి శుభవార్త. ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS 9640 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది.
భారీగా ఉద్యోగాల భర్తీకి నోటిఫికేషన్ విడుదల చేసంది ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్ సెలక్షన్-IBPS.
రీజనల్ రూరల్ బ్యాంకుల్లో 9640 పోస్టుల్ని భర్తీ చేసేందుకు ఐబీపీఎస్ ఆర్ఆర్‌బీ 2020 నోటిఫికేషన్ విడుదల చేసింది.
ఈ నోటిఫికేషన్ ద్వారా ఆఫీసర్ స్కేల్ -I, II, III, ఆఫీస్ అసిస్టెంట్ (మల్టీ పర్పస్) పోస్టుల్ని భర్తీ చేయనుంది.
డిగ్రీ, లా, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు ఈ పోస్టులకు దరఖాస్తు చేయొచ్చు.
దరఖాస్తు ప్రక్రియ 2020 జూల్ 1న ప్రారంభమైంది. దరఖాస్తు చేయడానికి 2020 జూలై 21 చివరి తేదీ.
1) Andhra Pragathi Grameena Bank 2) Chaitanya Godavari Grameena Bank 3) Saptagiri Grameena Bank
4) Andhra Pradesh Grameena Vikas Bank 5) Telangana Grameena Bank
IBPS RRB Recruitment 2020: గుర్తుంచుకోవాల్సిన అంశాలు
విద్యార్హత- వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి.
డిగ్రీ, ఎంబీఏ లాంటి కోర్సులు చేసినవారు దరఖాస్తు చేయొచ్చు. వివరాలు నోటిఫికేషన్‌లో తెలుసుకోవచ్చు. వయస్సు- ఆఫీసర్ అసిస్టెంట్ పోస్టుకు 18 నుంచి 28 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ III పోస్టుకు 21 నుంచి 40 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ II పోస్టుకు 21 నుంచి 32 ఏళ్లు, ఆఫీసర్ స్కేల్ I పోస్టుకు 18 నుంచి 30 ఏళ్లు,. ఎంపిక విధానం- ఆఫీస్ అసిస్టెంట్, ఆఫీసర్ స్కేల్ I పోస్టులకు ప్రిలిమ్స్, మెయిన్స్, ఇంటర్వ్యూ. ఆఫీసర్ స్కేల్ II, III పోస్టులకు సింగిల్ ఎగ్జామ్, ఇంటర్వ్యూ. దరఖాస్తు ఫీజు- రూ.850. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులకు రూ.180.
IBPS RRB Recruitment 2020: దరఖాస్తు చేయండి ఇలా
దరఖాస్తుకు ముందు యాక్టీవ్‌లో ఉన్న ఇమెయిల్ ఐడీ, ఫోన్ నెంబర్, క్వాలిఫికేషన్ సర్టిఫికెట్లు, పాస్‌పోర్ట్ సైజ్ ఫోటో, బ్యాంకు వివరాలు సిద్ధంగా ఉండాలి. దరఖాస్తు సమయంలో పేరు, పుట్టిన తేదీ, కేటగిరీ, అడ్రస్, క్వాలిఫికేషన్ వివరాలన్నీ సరిగ్గా ఎంటర్ చేయాలి. ఆ తర్వాత వెబ్‌సైట్ ఓపెన్ చేయండి. హోమ్ పేజీలో Apply online for CRP RRBs IX లింక్ పైన క్లిక్ చేయాలి. కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
అందులో వేర్వేరు లింక్స్ ఉంటాయి.
మీరు అప్లై చేయాలనుకున్న పోస్టుకు సంబంధించిన లింక్ క్లిక్ చేయాలి. మళ్లీ కొత్త పేజీ ఓపెన్ అవుతుంది.
ముందే రిజిస్ట్రేషన్ చేసుకొని ఉంటే ఐడీ, పాస్‌వర్డ్‌తో లాగిన్ కావాలి.
లేకపోతే కొత్తగా రిజిస్ట్రేషన్ చేసుకోవాలి. మీ వివరాలు ఎంటర్ చేసి, డాక్యుమెంట్స్ అప్‌లోడ్ చేసి ‘Final Submit’ పైన క్లిక్ చేయాలి. చివరగా పేమెంట్ చేసి దరఖాస్తు సబ్మిట్ చేయాలి.