ErrorException Message: syntax error, unexpected '' (T_ENCAPSED_AND_WHITESPACE), expecting '-' or identifier (T_STRING) or variable (T_VARIABLE) or number (T_NUM_STRING) https://amaravathiteacher.com/jobs/wp-content/plugins/dmca-badge/libraries/imperative/
గ్రామ సచివాలయంలో జాబ్ రాలేదా? ఈ 30,000 ఉద్యోగాలకు ట్రై చేయండి
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి.
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో అర్హత సాధించనివారంతా వారివారి అర్హతలకు తగ్గ ఉద్యోగాలకు దరఖాస్తు చేసుకోవచ్చు.
మరి ఆయా నోటిఫికేషన్ల వివరాలు
ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షా ఫలితాలు విడుదలయ్యాయి.
19.50 లక్షల మంది పరీక్ష రాస్తే 1,98,164 మంది మాత్రమే క్వాలిఫై అయ్యారు. అంటే సుమారు 2 లక్షలు మాత్రమే. అంటే 17.50 లక్షల మంది అభ్యర్థులు ఆంధ్రప్రదేశ్ గ్రామ, వార్డు సచివాలయ పరీక్షల్లో క్వాలిఫై కాలేదు.
గ్రామ, వార్డు సచివాలయాల్లో ఉద్యోగాలు దొరక్కపోయినా… మరో 30,000 పైగా జాబ్స్ రెడీగా ఉన్నాయి.
ఇటీవల 12,074 క్లర్క్ పోస్టుల భర్తీకి ఇన్స్టిట్యూట్ ఆఫ్ బ్యాంకింగ్ పర్సనల్-IBPS నోటిఫికేషన్ జారీ చేసింది. తెలుగు రాష్ట్రాల్లో మొత్తం 1389 (తెలంగాణ-612, ఆంధ్రప్రదేశ్- 777) పోస్టులున్నాయి.
దేశంలోని ప్రభుత్వ రంగ బ్యాంకుల్లో ఈ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఐబీపీఎస్.
ఈ పోస్టులకు కూడా డిగ్రీ అర్హత. కంప్యూటర్ లేదా ఇన్ఫర్మేషన్ టెక్నాలజీలో సర్టిఫికెట్ / డిప్లొమా / డిగ్రీ ఉండాలి. దరఖాస్తు ప్రక్రియ ప్రారంభమైంది. దరఖాస్తుకు 2019 అక్టోబర్ 9 చివరి తేదీ. ఐబీపీఎస్ నోటిఫికేషన్‌కు సంబంధించిన పూర్తి వివరాల కోసం ఇక్కడ క్లిక్ చేయండి.