Skip to content
invites-applications-for-MBA-hiring-drive-TCS-MBA-Off-Campus-Drive-2019
TCS’లో ఉద్యోగాలు.. MBA స్పెషల్ రిక్రూట్‌మెంట్ ‘డ్రైవ్’
TCS MBA Off-Campus Drive 2019 కోసం దరఖాస్తు చేసుకునే అభ్యర్థులు ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతూ ఉండాలి.
ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
సెప్టెంబరు 30 దరఖాస్తుకు చివరితేదీ
అక్టోబరు 10న రాతపరీక్ష, 17న ఇంటర్వ్యూ
టెక్నాలజీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (TCS) ఫ్రెషర్స్ నుంచి ఉద్యోగాల భర్తీకి దరఖాస్తులు కోరుతోంది.
ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులకు కూడా స్పెషల్ డ్రైవ్ నిర్వహిస్తోంది.
విద్యార్థులు ఆన్‌లైన్ ద్వారా మొదట రిజిస్ట్రేషన్ చేసుకోవాలి.
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా అభ్యర్థులను ఎంపికచేస్తారు.
MBA రిక్రూట్‌మెంట్ డ్రైవ్
అర్హత..
➦ ఎంబీఏ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.
ఐదేళ్ల ఇంటిగ్రేటెడ్ ఎంబీఏ చదువుతున్నవారు కూడా దరఖాస్తు చేసుకోవచ్చు.
➦ పదోతరగతి నుంచి డిగ్రీ దాకా 60 శాతం మార్కులతో ఉత్తీర్ణులై ఉండాలి.
➦ రెగ్యులర్ విధానంలో ఫుల్ టైం కోర్సులు చదివినవారు మాత్రమే దరఖాస్తుకు అర్హులు.
➦ అకడమిక్ కోర్సుల మధ్య మొత్తంగా 30 నెలల కంటే ఎక్కువ అంతరం ఉండకూడదు.
ఎంబీఏ స్పెషలైజేషన్లు:
మార్కెటింగ్/ ఫైనాన్స్/ సిస్టమ్స్/ ఆపరేషన్స్/ ఐటీ/ సప్లయ్ చెయిన్/ బిజినెస్ ఎకనామిక్స్/ ప్రొడక్టివిటీ అండ్ క్వాలిటీ మేనేజ్‌మెంట్/ ఈ-కామర్స్/ లాజిస్టిక్స్/ రిటైల్/ ఎనలిటిక్స్/ ఆర్టిఫిషియల్ ఇంటలిజెన్స్.
ఎంపిక విధానం:
రాతపరీక్ష, ఇంటర్వ్యూ ద్వారా.
పరీక్ష విధానం:
రాతపరీక్షలో వెర్బల్ ఎబిలిటీ, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్ నుంచి ప్రశ్నలు అడుగుతారు.
90 నిమిషాల్లో పరీక్ష పూర్తిచేయాల్సి ఉంటుంది. ఇందులో 80 నిమిషాలు క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్, 10 నిమిషాలు వెర్బల్ ఎబిలిటీకి కేటాయించారు.
ముఖ్యమైన తేదీలు..
➦ ఆన్‌లైన్ రిజిస్ట్రేషన్‌కు చివరితేదీ: 30.09.2019
➦ ఆన్‌లైన్ పరీక్ష తేదీ: 10.10.2019
➦ ఇంటర్వ్యూ తేదీ: 17.10.2019 నుంచి.
error: Content is protected !!