LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్… నోటిఫికేషన్ వివరాలు తెలుసుకోండి
LIC Assistant Notification 2019,
లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC సంస్థలో ఉద్యోగాల జాతర మొదలైంది.
దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్ఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది. వివరాలు తెలుసుకోండి.
నిరుద్యోగులకు శుభవార్త. భారీగా ఉద్యోగాల భర్తీ చేపట్టింది ఎల్ఐసీ. దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి నోటిఫికేషన్ జారీ చేసింది
తెలుగు రాష్ట్రాల్లో 276 పోస్టులున్నాయి
ఈస్ట్ సెంట్రల్ జోన్ తప్ప మిగతా అన్ని జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు విడుదల చేసింది. సెంట్రల్, ఈస్టర్న్, ఈస్ట్ సెంట్రల్, నార్తర్న్, నార్తర్న్ సెంట్రల్, సదరన్, సౌత్ సెంట్రల్, వెస్టర్న్ జోన్లకు వేర్వేరుగా నోటిఫికేషన్లు ఉన్నాయి
ఎల్ఐసీలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు ప్రక్రియ కూడా ప్రారంభమైంది.