life-insurance-corporation-of-india-assistants-jobs-8500-Syllabus

life-insurance-corporation-of-india-assistants-jobs-8500-Syllabus

LIC Jobs: డిగ్రీ పాసైనవారికి 8500 పైగా అసిస్టెంట్ జాబ్స్.

వెబ్‌సైట్‌లో ‘LIC’ అసిస్టెంట్ పరీక్ష హాల్‌టికెట్లు

మొదట ప్రకటించిన షెడ్యూలు ప్రకారం అక్టోబరు 21, 22 తేదీల్లో ప్రిలిమినరీ పరీక్ష నిర్వహించాల్సి ఉంది. అయితే అనివార్య కారణాల వల్ల అక్టోబరు 30, 31 తేదీల్లో పరీక్ష నిర్వహించనున్నారు.

అన్ని డివిజన్లలో ఆయా తేదీల్లో జరిగే పరీక్షకు ఈ కొత్త షెడ్యూలు వర్తించనుంది.

దేశవ్యాప్తంగా 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల భర్తీకి ఎల్ఐసీ నోటిఫికేషన్ జారీ చేసింది

తెలుగు రాష్ట్రాలు ఉన్న జోన్‌ పరిధిలో 630కి పైగా ఖాళీలు ఉన్నాయి

ఎల్ఐసీలో అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు డిగ్రీ పాసైతే చాలు

ప్రిలిమ్స్, మెయిన్స్ ఎగ్జామ్ ద్వారా అసిస్టెంట్ పోస్టులకు అభ్యర్థుల్ని ఎంపిక చేయనుంది ఎల్ఐసీ.

మీరు ఇటీవల లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC జారీ చేసిన అసిస్టెంట్ నోటిఫికేషన్‌కు దరఖాస్తు చేసుకున్నారా?

ఈ నోటిఫికేషన్‌లో 8500 పైగా అసిస్టెంట్ పోస్టుల్ని భర్తీ చేస్తోంది ఎల్ఐసీ.

మరి ఈ ఎగ్జామ్స్‌కు సిలబస్ ఏంటో, ఏం చదవాలో తెలుసుకోండి.

ఏపీ, తెలంగాణల్లోని ఎల్‌ఐసీ ఆఫీసులు సౌత్‌ సెంట్రల్‌ జోన్‌ పరిధిలోకి వస్తాయి.

జోన్‌ పరిధిలో డివిజన్లు, డివిజన్ల కింద బ్రాంచీలు ఉంటాయి.

డివిజన్లవారీ నియామకాలు చేపడతారు.

అభ్యర్థి నచ్చిన డివిజన్‌ను ఎంచుకోవాలి.

పరీక్ష అక్కడే రాయాల్సి ఉంటుంది.

ఎంపికైనవారు మొదటి మూడేళ్లు ఆ డివిజన్‌ పరిధిలోని బ్రాంచిలో చేరి, 6 నెలలు ప్రొబేషన్‌లో ఉంటారు. అనంతరం శాశ్వత ఉద్యోగిగా తీసుకుంటారు.

విధుల్లో చేరినవారికి రూ.14,435 మూలవేతనం లభిస్తుంది.

హైదరాబాద్‌ లాంటిచోట అలవెన్సులన్నీ కలిపి రూ.30,000 వేతనం పొందవచ్ఛు ఎంపికైనవారు బ్రాంచీ అవసరాలకు అనుగుణంగా అసిస్టెంట్‌, క్యాషియర్‌, సింగిల్‌ విండో ఆపరేటర్‌, కస్టమర్‌ సర్వీస్‌ ఎగ్జిక్యూటివ్‌లలో ఏదో ఒక బాధ్యతను నిర్వహించాల్సి ఉంటుంది.

అక్టోబర్ 21, 22 తేదీల్లో ప్రిలిమ్స్ నిర్వహించే అవకాశముంది.

అయితే ఈ ఉద్యోగాలకు సిలబస్ ఏంటీ? ఏం చదవాలి?

ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది? అన్న అనుమానాలు అభ్యర్థుల్లో ఉన్నాయి

ఎల్ఐసీ అసిస్టెంట్ పోస్టులకు దరఖాస్తు చేసే అభ్యర్థులు సిలబస్‌పై అవగాహన పెంచుకుంటే పరీక్షల్లో బాగా రాణించగలరు.

ఎల్ఐసీ అసిస్టెంట్ ఎగ్జామ్ ప్రిలిమినరీ, మెయిన్స్ పరీక్షల సిలబస్ ఈ విధంగా ఉంటుంది

ఎల్ఐసీ అసిస్టెంట్ ప్రిలిమ్స్ ఎగ్జామ్ 100 మార్కులకు ఉంటుంది.

పరీక్ష వ్యవధి 60 నిమిషాలు.

ఇంగ్లీష్ లేదా హిందీ భాషలో 30 ప్రశ్నలు,

న్యూమరికల్ ఎబిలిటీలో 35 ప్రశ్నలు,

రీజనింగ్ ఎబిలిటీ 35 ప్రశ్నలుంటాయి.

ఇంగ్లీష్‌లో క్లోజ్ టెస్ట్, ఎర్రర్ కరెక్షన్, ఎర్రర్ డిటెక్షన్, పిల్ ఇన్ ది బ్లాంక్స్, ప్యారా జంబుల్స్, రీడింగ్ కాంప్రహెన్షన్ కవర్ అవుతాయి. న్యూమరికల్ ఎబిలిటీలో అప్రాక్సిమేషన్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫీషియెన్సీ, నంబర్ సిరీస్, క్వాడ్రాటిక్ ఈక్వేషన్స్, క్వాంటిటీ బేస్డ్ ప్రశ్నలు, సింప్లిఫికేషన్ ఉంటాయి.

ఇక రీజనింగ్ ఎబిలిటీలో ఆల్ఫాన్యూమరిక్, కోడింగ్, డేటా సఫీషియెన్సీ, డీకోడింగ్, ఇనీక్వాలిటీ, నెంబర్ సిరీస్, పజిల్స్, సిట్టింగ్ అరేంజ్‌మెంట్, సిల్లాగిజమ్ ఉంటాయి

LIC ASSISTANTS JOBS HALLTICKETS DOWNLOAD HERE

ఇక ఎల్ఐసీ అసిస్టెంట్ మెయిన్స్ ఎగ్జామ్‌ 200 మార్కులకు ఉంటుంది.

పరీక్ష వ్యవధి 120 నిమిషాలు. జనరల్ / ఫైనాన్షియల్ అవేర్‌నెస్‌లో 40 ప్రశ్నలు, జనరల్ ఇంగ్లీష్‌లో 40 ప్రశ్నలు, క్వాంటిటీవ్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు, రీజనింగ్ ఎబిలిటీ & కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో 40 ప్రశ్నలు, హిందీ భాషలో 40 ప్రశ్నలు ఉంటాయి

జనరల్ ఫైనాన్స్ అవేర్‌నెస్‌లో బేసిక్ కంప్యూటర్, జీకే, బాటనీ, కెమిస్ట్రీ, కరెంట్ అఫైర్స్ (గత ఆరు నెలల జాతీయ, అంతర్జాతీయ అంశాలు), ఎన్విరాన్‌మెంట్, ఫేమస్ బుక్స్& ఆథర్స్, ఫేమస్ డేస్& డేట్స్, జాగ్రఫీ, ఇండియన్ బ్యాంకింగ్ సిస్టమ్ చరిత్ర, ఇండియన్ కల్చర్, ఇండియన్ ఎకానమీ, ఇండియన్ హిస్టరీ, ఇండియన్ పార్లమెంట్, ఇండియన్ పాలిటిక్స్, ఇన్వెన్షన్స్, ఇండియన్ ఫైనాన్షియల్ సిస్టమ్, ఫిజిక్స్, ఇటీవలి క్రెడిట్ అండ్ మానెటరీ పాలసీలు, స్పోర్ట్స్ జువాలజీ ఉంటాయి

జనరల్ ఇంగ్లీష్‌లో యాక్టీవ్ అండ్ పాసీవ్ వాయిస్, యాంటోనిమ్స్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డైరెక్ట్ అండ్ ఇండైరెక్ట్ స్పీచ్, ఎర్రర్ కరెక్షన్, ఫిల్ ఇన్ ది బ్లాంక్స్, హోమోనిమ్స్, ఇండియమ్స్ అండ్ ఫ్రేజెస్, జాయినింగ్ సెంటెన్సెస్, ప్యారా కంప్లీషన్, ప్యాసేజ్ కంప్లీషన్, ప్రిపొజిషన్స్, సెంటెన్స్ అరేంజ్‌మెంట్, సెంటెన్స్ కంప్లీషన్, సెంటెన్స్ ఇంప్రూవ్‌మెంట్, స్పెల్లింగ్ టెస్ట్, స్పాటింగ్ ఎర్రర్స్, సబ్‌స్టిట్యూషన్, సినానిమ్స్, థీమ్ డిటెక్షన్, ట్రాన్స్‌ఫార్మేషన్, వర్డ్ ఫార్మేషన్ ఉంటాయి

క్వాంటిటేటీవ్ యాప్టిట్యూడ్‌లో ఏరియాస్, యావరేజెస్, బార్స్ అండ్ గ్రాఫ్స్, బోట్స్ అండ్ స్ట్రీమ్స్, కాంపౌండ్ ఇంట్రెస్ట్, డెసిమల్స్ ఆండ్ ఫ్రాక్షన్స్, డిస్కౌంట్, ఇంట్రెస్ట్, లైన్ చార్ట్స్, టేబుల్స్, మెన్స్యూరేషన్, మిక్స్చర్ అండ్ అలీగేషన్, నంబర్ అండ్ ఏజెస్, ఆడ్ మ్యాన్ ఔట్, పార్ట్‌నర్ షిప్ బిసినెస్, పర్సంటేజ్, పర్మ్యుటేషన్స్ అండ్ కాంబినేషన్స్, ప్రాబబిలిటీ, ప్రాఫిట్ అండ్ లాస్, రేసెస్ అండ్ గేమ్స్, సింపుల్ ఈక్వేషన్స్, సింపుల్ ఇంట్రెస్ట్, స్వేర్ రూట్స్, టైమ్ అండ్ డిస్టెన్స్, వాల్యూమ్స్ ఉంటాయి

రీజనింగ్ ఎబిలిటీలో అనాలజీస్, అనలిటికల్ రీజనింగ్, ఆర్టిఫిషియల్ లాంగ్వేజ్, డేటా ఇంటర్‌ప్రిటేషన్, డేటా సఫీషియెన్సీ, లెటర్ అండ్ సింబల్ సిరీస్, లాజికల్ డిడక్షన్, లాజికల్ ప్రాబ్లమ్స్, లాజికల్ రీజనింగ్, మ్యాచింగ్ డెఫినిషన్స్, నాన్ వెర్బల్ రీజనింగ్, నంబర్ సిరీస్, పజిల్స్ ఉంటాయి.

కంప్యూటర్ యాప్టిట్యూడ్‌లో కంప్యూటర్స్ ఇంట్రడక్షన్, నెంబర్ సిస్టమ్ అండ్ సింప్లిఫికేషన్, లాజిక్ గేట్స్ అండ్ బూలియన్ ఆల్జీబ్రా, ప్రింటర్స్, వర్డ్ ప్రాసెసింగ్, స్ప్రెడ్‌షీట్, పవర్ పాయింట్, కంప్యూటర్ నెట్‌వర్క్, TCP/IP& X protocols, ఎన్‌క్రిప్షన్, డీక్రిప్షన్ ఆల్గరిథమ్స్ ఉంటాయి

LIC 8500 JOBS NOTIFICATION