బ్యాచిలర్ డిగ్రీలో సాధించిన మార్కులు, ఆప్టిట్యూడ్ పరీక్షలో చూపిన ప్రతిభతో అభ్యర్థులను ఎంపిక చేస్తారు.
ఆప్టిట్యూడ్ పరీక్షకు 80 శాతం, అకడమిక్ పెర్ఫార్మెన్స్‌కు 20 శాతం వెయిటేజీ ఉంటుంది.
ఆప్టిట్యూడ్ పరీక్ష ఎలా? పరీక్షను ఆన్‌లైన్‌లో ఆబ్జెక్టివ్ తరహాలో జరుపుతారు. ప్రశ్నపత్రం ఇంటర్మీడియట్ (10+2) స్థాయిలో ఉంటుంది.
పరీక్ష వ్యవధి 1.30 గంటలు. ప్రతి ప్రశ్నకు ఒక మార్కు చొప్పున 80 మార్కులకు పరీక్ష నిర్వహిస్తారు.
ఇందులో క్వాంటిటేటివ్ ఎబిలిటీ నుంచి 16,
వెర్బల్ ఎబిలిటీలో 16,
లాజికల్ అండ్ న్యూమరికల్ రీజనింగ్ విభాగంలో 22,
జనరల్ అవేర్‌నెస్ 16,
కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానానికి సంబంధించి 10 ప్రశ్నలు వస్తాయి.
ఆయా విభాగాలవారీ సిలబస్ (ప్రశ్నలడిగే అంశాల) వివరాలను ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులు వాటిపై దృష్టి సారిస్తే సరిపోతుంది. ఇప్పటికే బ్యాంకు, రైల్వే పోటీ పరీక్షలకు సన్నద్దమవుతున్నవారు ఈ పరీక్షను సులువుగానే ఎదుర్కోవచ్చు.
ఖాళీల వివరాలు:
మొత్తం 85 పోస్టుల్లో విభాగాలవారీ అన్ రిజర్వ్‌డ్ 37, ఓబీసీ 22, ఎస్సీ 13, ఎస్టీ 5, ఈడబ్ల్యుఎస్ 8 ఖాళీలు ఉన్నాయి.
దివ్యాంగులకు 4 పోస్టులు.
అర్హత:
50 శాతం మార్కులతో బ్యాచిలర్ డిగ్రీ ఉత్తీర్ణత. కంప్యూటర్ అప్లికేషన్ పరిజ్ఞానం.
వయసు: నవంబరు 7, 2020 నాటికి 26 ఏళ్లలోపు ఉండాలి. ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు: దివ్యాంగులకు పదేళ్లు, ఓబీసీలకు మూడేళ్ల సడలింపు