Reliance-Jio-Jobs-Assistant-Technicians-300-jobs-Hyderabad-Job-mela

Reliance-Jio-Jobs-Assistant-Technicians-300-jobs-Hyderabad-Job-mela

రిలయన్స్ జియోలో జాబ్స్.. సోమవారం జాబ్ మేళా.. ఫుల్ డిటెయిల్స్

రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఐ.టి.ఐ తో పాటు అప్రెంటీస్ చేసిన పురుష అభ్యర్ధులు హాజరుకావొచ్చు.

భారత ప్రభుత్వం ఆధ్వర్యంలోని జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ, రిలయన్స్ జియో ఇన్ఫోకాం ఆధ్వర్యంలో 300 అసిస్టెంట్ టెక్నీషియన్  ఖాళీల భర్తీకి సోమవారం జాబ్ మేళా నిర్వహిస్తున్నారు.

రిలయన్స్ జియో ఇన్ఫోకాం లో జియో గిగా ఫైబర్ ఇన్‌స్టాలేషన్ , సర్వీసెస్ లో అసిస్టెంట్ టెక్నీషియన్స్ గా పనిచేయడానికి ఐ.టి.ఐ పూర్తి చేసిన అభ్యర్ధులు హైదరాబాద్‌లోని రామాంతపూర్ లో గల  జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ఆధ్వర్యంలో సోమవారం జరిగే జాబ్ మేళాకు హాజరు కావచ్చని ఆయన తెలిపారు.

భారత ప్రభుత్వం నైపుణ్య అభివృద్ధి మంత్రిత్వ శాఖకు చెందిన జాతీయ నైపుణ్య శిక్షణా సంస్థ ప్రాంగణంలో జరిగే ఈ జాబ్ మేళాలో రిలయన్స్ జియో ఇన్ఫోకాం లిమిటెడ్ సంస్థలో పని చేయడానికి ఐ.టి.ఐ తో పాటు అప్రెంటీస్ చేసిన పురుష అభ్యర్ధులు మాత్రమే ఈ జాబ్ మేళాకు హాజరుకావాలి.

రిలయన్స్ జియో ఇన్ఫోకామ్ లిమిటెడ్ లో 300 అసిస్టెంట్ టెక్నీషియన్ పోస్టులు ఉన్నాయని, ఐ.టి.ఐ లో ఎలక్ట్రీషియన్, వైర్ మెన్, ఎలక్ట్రానికి మెకానిక్, ఇన్ స్ట్రుమెంట్స్ మెకానిక్, కంప్యూటర్ సాప్ట్ వేర్ లో కోర్స్ పూర్తి చేసిన వారు లేదా ఈ ట్రేడ్స్ లో సి.ఐ.టి.ఎస్ చేసిన వారు నేరుగా ఈ జాబ్ మేళా కు హాజరుకావచ్చు. 

స్కిల్ ఇండియా లో  భాగంగా డైరక్టరేట్ ఆఫ్ ట్రైనింగ్ విభాగం పలు నైపుణ్య అభివృద్ది కార్యక్రమాలు నిర్వహిస్తుంది. పలు రంగాలకు సంబంధించి ఆయా కంపెనీలకు అవసరమైన అభ్యర్ధులకు సరైన శిక్షణ ఇచ్చి నైపుణ్యాల మెరుగుకు పలు చర్యలు తీసుకుంటుంది.