sbi-apprentice-recruitment-jobs-8500-details

sbi-apprentice-recruitment-jobs-8500-details

SBI: ఎస్‌బీఐలో 8500 అప్రెంటిస్ జాబ్స్‌.. తెలుగు రాష్ట్రాల్లో 1100 ఖాళీలు..!

SBI Recruitment 2020: ఎస్‌బీఐ మూడేళ్ల కాల‌ప‌రిమితికి అప్రెంటిస్ పోస్టుల‌ను నియ‌మిస్తుంది.

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ).. అప్రెంటిస్ పోస్టుల భ‌ర్తీకి నోటిఫికేష‌న్ విడుద‌ల చేసింది.

ఈ నోటిఫికేష‌న్ ద్వారా మొత్తం 8500 పోస్టుల‌ను భ‌ర్తీ చేయ‌నుంది.

ఎస్‌బీఐ మూడేళ్ల కాల‌ప‌రిమితికి అప్రెంటిస్ పోస్టుల‌ను నియ‌మిస్తుంది. అర్హ‌త‌, అనుభ‌వం ఉన్న అభ్య‌ర్థులు ఆన్‌లైన్‌లో ద‌ర‌ఖాస్తు చేసుకోవచ్చు.

డిసెంబర్‌ 10 దరఖాస్తుకు చివరితేది. పూర్తి వివరాలకు వెబ్‌సైట్‌ చూడొచ్చు.

ఎంపిక విధానం:

ఈ పోస్టులకు సంబంధించి ఎంపిక ప్ర‌క్రియ రెండు విధాలుగా ఉంటుంది. మొద‌ట రాత‌ప‌రీక్ష నిర్వ‌హిస్తారు.

అందులో అర్హ‌త సాధించిన‌వారికి లాంగ్వేజ్ టెస్ట్ ఉంటుంది. అంటే అభ్య‌ర్థుల‌కు స్థానిక భాష‌ల‌పై ప‌ట్టు ఉండాలి. ఇక రాత‌ప‌రీక్ష‌లో మొత్తం 100 బ‌హుళైచ్ఛిక‌ ప్రశ్న‌లు ఉంటాయి.

ఇందులో జ‌న‌ర‌ల్ అవేర్‌నెస్‌, జ‌న‌ర‌ల్ ఇంగ్లిష్‌, క్వాంటిటేటివ్ ఆప్టిట్యూడ్‌, రీజ‌నింగ్ ఎబిలిటీ అండ్ కంప్యూట‌ర్ ఆప్టిట్యూడ్ నుంచి 25 చొప్పున ప్ర‌శ్న‌లు అడుగుతారు. ప్ర‌తి ప్ర‌శ్న‌కు 1 మార్కు కేటాయించారు.

ప్ర‌తి స‌బ్జెక్టును 15 నిమిషాల్లో పూర్తిచేయాల్సి ఉంటుంది. స‌మాధానాలు త‌ప్పుగా రాస్తే 1/‌4 వంతు మార్కులు కోత‌విధిస్తారు.

ఇందులో అర్హ‌త సాధించిన‌వారికి లాంగ్వేజ్ టెస్ట్ నిర్వ‌హిస్తారు.

అయితే ప‌దో త‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ వ‌ర‌కు స్థానిక లేదా మాతృ భాషలో చ‌దివిన‌ట్లు మార్కు‌ల మెమో లేదా ధ్రువీక‌ర‌ణ ప‌త్రం స‌మ‌ర్పించిన‌వారికి ప‌రీక్ష నుంచి మిన‌హాయింపు ఉంటుంది.

అంటే రాత‌ప‌రీక్ష‌తోనే నేరుగా ఎంపిక‌వుతారు. ‌

మొత్తం పోస్టులు: 8500

ఇందులో జ‌న‌ర‌ల్ 3595, ఓబీసీ 1948, ఈడ‌బ్ల్యూఎస్ 844, ఎస్సీ 1388, ఎస్టీ 725 చొప్పున ఖాళీలు ఉన్నాయి.

తెలుగు రాష్ట్రాల్లో 1100 ఖాళీలు:
దేశ‌వ్యాప్తంగా 8500 పోస్టులు ఉన్నాయి. అందులో తెలంగాణ‌లో 460, ఆంధ్ర‌ప్ర‌దేశ్‌లో 620 ఖాళీల చొప్పున‌ ఉన్నాయి.

రెండు రాష్ట్రాల్లో ద‌ర‌ఖాస్తు చేసుకునే అభ్య‌ర్థుల‌కు స్థానిక అధికారిక‌ భాష‌లైన తెలుగు లేదా ఉర్దూపై ప‌ట్టు ఉండాలి. ‌

అయితే ఏదైనా ఒక రాష్ట్రంలో మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవాల్సి ఉంటుంది.

అర్హ‌త‌: డిగ్రీ ఉత్తీర్ణులై ఉండాలి.

వయసు: అభ్య‌ర్థులు 20 నుంచి 28 ఏళ్ల లోపువారై ఉండాలి.

జీతం: అప్రెంటిస్ కాలంలో మొద‌టి ఏడాది రూ.15 వేలు,

రెండో ఏడాది రూ.16500,

మూడో ఏడాది రూ.19 వేలు స్ట‌యిఫండ్‌గా చెల్లిస్తారు.

శిక్ష‌ణ అనంత‌రం వారికి స‌ర్టిఫికెట్ అందిస్తుంది. దీనిని ఎస్‌బీఐతోపాటు ఇత‌ర ప్రైవేట్ బ్యాంకులు నియామ‌కాల సంద‌ర్భంగా ప‌రిగ‌ణ‌న‌లోకి తీసుకుంటాయి.

ద‌ర‌ఖాస్తు విధానం: ఆన్‌లైన్‌లో దరఖాస్తు చేసుకోవాలి.

దరఖాస్తు ఫీజు: రూ.300, ఎస్సీ, ఎస్టీ, పీడ‌బ్ల్యూడీ అభ్య‌ర్థుల‌కు ఎలాంటి ఫీజు లేదు.

ద‌ర‌ఖాస్తులు ప్రారంభం: న‌వంబ‌ర్ 20

ద‌ర‌ఖాస్తుల‌కు చివ‌రి తేదీ: డిసెంబ‌ర్ 10

ప‌రీక్ష: 2021, జ‌న‌వ‌రిలో

STATE BANK OF INDIA OFFICIAL WEBSITE