Social-Security-Assistant-Recruitment-2189-jobs-EPFO

Social-Security-Assistant-Recruitment-2189-jobs-EPFO

2189 సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్ల పోస్టులకు ప్రకటన

ఉద్యోగ భవిష్యనిధి సంస్థ (ఈపీఎఫ్‌వో) 2189 సోషల్‌ సెక్యూరిటీ అసిస్టెంట్ల భర్తీకి ప్రకటన విడుదలచేసింది. డిగ్రీ కోర్సులు పూర్తిచేసుకున్నవారు వీటికి పోటీ పడవచ్చు.

మూడు దశల్లో పరీక్షలు నిర్వహించి వాటిలో చూపిన ప్రతిభ ఆధారంగా నియామకాలు చేస్తారు.

ఎంపికైనవారిని లెవెల్‌-3 వేతనాలతో ఉద్యోగంలోకి తీసుకుంటారు.

ప్రకటించిన పోస్టుల్లో ఆంధ్రప్రదేశ్‌ రీజియన్‌లో 60, తెలంగాణ పరిధిలో 151 కేటాయించారు.

అయితే అభ్యర్థులు దేశవ్యాప్తంగా తమకు నచ్చిన ప్రాంతంలోని పోస్టులకు పోటీ పడవచ్చు.

ఇందుకోసం ఆ రీజియన్‌ పరిధిలోని కేంద్రాల్లో ఏదో ఒక చోట పరీక్ష రాయాల్సి ఉంటుంది.

మూడు దశల్లో నిర్వహించే ఫేజ్‌-1, 2, 3 పరీక్షల ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తారు.

Important Dates

Online Registration of Application 27th June, 2019 (17:00 hrs) to 21st July, 2019 (17:00 hrs)

Downloading of Call Letters 21st August, 2019 to 1st September, 2019

Preliminary Examination (Phase-I) 31st August and 1st September, 2019.

SCALE OF PAY Level- 4 of Pay Matrix (Civilian employees) (Gr. ’C’) with Entry Pay Rs 25,500/- under 7th Pay Commission).
In addition to Pay they will also be eligible allowances as per rules in force from time to time.

ప్రిలిమినరీ
ఇది అర్హత పరీక్ష మాత్రమే.

ఇందులో సాధించిన మార్కులను తుది ఎంపికలో పరిగణనలోకి తీసుకోరు.

ఈ పరీక్షను వంద మార్కులకు నిర్వహిస్తారు.

ప్రతి ప్రశ్నకూ ఒక మార్కు చొప్పున వంద ప్రశ్నలుంటాయి.

ఇంగ్లిష్‌లో 30, రీజనింగ్‌ ఎబిలిటీ 35, న్యూమరికల్‌ ఆప్టిట్యూడ్‌లో 35 ప్రశ్నలు ఉంటాయి.

ఒక్కో విభాగాన్నీ 20 నిమిషాల వ్యవధిలో పూర్తిచేయాలి. ప్రశ్నలన్నీ ఆబ్జెక్టివ్‌ తరహాలో ఉంటాయి.

ఇంగ్లిష్‌ విభాగం తప్ప మిగిలిన ప్రశ్నపత్రం ఆంగ్ల/ హిందీ మాధ్యమాల్లో ఉంటుంది.

ప్రతి తప్పు సమాధానానికీ పావు మార్కు చొప్పున తగ్గిస్తారు. ఫేజ్‌-1 ప్రిలిమినరీలో చూపిన ప్రతిభతో ఆయా కేటగిరీ / విభాగాల వారీ ఖాళీలకు పదిరెట్ల సంఖ్యలో అభ్యర్థులను ఫేజ్‌-2 మెయిన్స్‌కు ఎంపిక చేస్తారు. 

డేటా ఎంట్రీ
ఇది కంప్యూటర్‌ స్కిల్‌ (డేటా ఎంట్రీ) పరీక్ష.

ఇందులో గంట వ్యవధిలో అయిదు వేల కీ డిప్రెషన్స్‌ నమోదు చేయగలగాలి.

ఇది అర్హత పరీక్ష మాత్రమే. తుది ఎంపికలో ఈ మార్కులను లెక్కించరు.

ఫేజ్‌-3లో అర్హులైన అభ్యర్థులు ఫేజ్‌-2లో సాధించిన మార్కుల మెరిట్‌ ఆధారంగా తుది నియామకాలు చేపడతారు.

ఎంపికైనవారికి రూ.25, 500 మూలవేతనం అందుతుంది. దీనికి డీఏ, హెచ్‌ఆర్‌ఏ అదనం.
ముఖ్యమైన అంశాలు


అర్హత: 

ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణత వయసు:

జులై 21, 2019 నాటికి 18 నుంచి 27 ఏళ్లలోపు ఉండాలి. 
ఓబీసీలకు మూడేళ్లు; ఎస్సీ, ఎస్టీలకు అయిదేళ్లు గరిష్ఠ వయసులో సడలింపులు వర్తిస్తాయి.


ఆన్‌లైన్‌ దరఖాస్తులకు గడువు:

 జులై 21 సాయంత్రం 5 వరకు
దరఖాస్తు ఫీజు: ఎస్సీ, ఎస్టీ, మహిళలు, దివ్యాంగులకు రూ.250.
మిగిలిన అన్ని వర్గాలకూ రూ.500


ప్రవేశ పత్రాలు: 

ఆగస్టు 21 నుంచి డౌన్‌లోడ్‌ చేసుకోవచ్చు.
ప్రిలిమినరీ ఫేజ్‌-1 పరీక్ష: 

ఆగస్టు 31, సెప్టెంబరు 1న వివిధ సమయాల్లో నిర్వహిస్తారు. 

ఏపీలో ఫేజ్‌-1 పరీక్ష కేంద్రాలు: 

చీరాల, గుంటూరు, కాకినాడ, కర్నూలు, నెల్లూరు, రాజమండ్రి, తిరుపతి, విజయవాడ, విశాఖపట్నం, విజయనగరం. ఫేజ్‌-2 పరీక్షను విజయవాడ, విశాఖపట్నంలో నిర్వహిస్తారు.


తెలంగాణలో ఫేజ్‌-1: హైదరాబాద్‌, కరీంనగర్‌, వరంగల్‌లో, ఫేజ్‌-2 హైదరాబాద్‌లో ఉంటాయి.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

ONLINE APPLICATION CLICK HERE

NOTIFICATION FOR EPFO JOBS