ErrorException Message: syntax error, unexpected '' (T_ENCAPSED_AND_WHITESPACE), expecting '-' or identifier (T_STRING) or variable (T_VARIABLE) or number (T_NUM_STRING) https://amaravathiteacher.com/jobs/wp-content/plugins/dmca-badge/libraries/imperative/
కేంద్ర ప్రభుత్వంలోని వివిధ శాఖల్లో ఖాళీగా ఉన్న ఎల్డీసీ, జేఎస్ఏ, పీఏ వంటి పోస్టుల భర్తీకి కంబైండ్ హయ్యర్ సెకండరీ లెవల్ (సీహెచ్ఎస్సెల్) నోటిఫికేషన్‌ను స్టాఫ్ సెలక్షన్ కమిషన్ (ఎస్సెస్సీ) విడుదల చేసింది.
అర్హత, ఆసక్తి కలిగిన అభ్యర్థులు దరఖాస్తు చేసుకోవాలని సూచించింది.
వచ్చేనెల 15 వరకు దరఖాస్తులు ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉంటాయని తెలిపింది.
భర్తీ ప్రక్రియ మూడు దశల్లో ఉంటుందని వెల్లడించింది.
మొదటి దశలో (టైర్-1) ఆబ్జెక్టివ్ టైప్ ప్రశ్నలు, రెండో దశ (టైర్-2)లో పెన్‌పేపర్ (వ్యాసరూప ప్రశ్నలు) పరీక్ష, మూడోదశలో స్కిల్ టెస్ట్ ఉంటుంది.
అయితే మొత్తం పోస్టులను వెల్లడించలేదు.
కాగా, గతేడాది 4,893 పోస్టులతో నోటిఫికేషన్ విడుదల చేసింది. ప్రస్తుతం ఆ ప్రక్రియ కొనసాగుతున్నది. ఈ ఏడాది కూడా అంతే మొత్తంలో పోస్టులు ఉండే అవకాశం ఉన్నదని సమాచారం.