SSC CGL Exam: కేంద్ర ప్రభుత్వ ఉద్యోగానికి డిగ్రీ చాలు… నోటిఫికేషన్ వివరాలివే
కేంద్ర ప్రభుత్వంలోని మంత్రిత్వ శాఖలు, విభాగాల్లో ఉద్యోగాల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC తరచూ నోటిఫికేషన్లు జారీ చేస్తూ ఉంటుంది.
ఇప్పుడు డిగ్రీ అర్హతతో కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 నోటిఫికేషన్ విడుదలైంది.
పూర్తి వివరాలు తెలుసుకోండి.
కేంద్ర ప్రభుత్వ ఉద్యోగాల కోసం ఎదురుచూస్తున్న నిరుద్యోగులకు మరో శుభవార్త.
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2019 నోటిఫికేషన్‌ను విడుదల చేసింది స్టాఫ్ సెలక్షన్ కమిషన్-SSC
కేంద్రంలోని వివిధ మంత్రిత్వ శాఖలు, విభాగాలు, సంస్థల్లో ఖాళీల భర్తీకి స్టాఫ్ సెలక్షన్ కమిషన్ ఈ నోటిఫికేషన్ జారీ చేసింది.
అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, సబ్ ఇన్స్పెక్టర్, జూనియర్ అకౌంటెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ లాంటి గ్రూప్ బీ, గ్రూప్ సీ పోస్టుల్ని భర్తీ చేయనుంది
వేర్వేరు పోస్టులకు వేర్వేరు విద్యార్హతలున్నాయి. చాలావరకు పోస్టులకు బ్యాచిలర్స్ డిగ్రీ అర్హత.
డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.
ఆసక్తిగల అభ్యర్థులు స్టాఫ్ సెలక్షన్ కమిషన్ అధికారిక వెబ్సైట్ ఓపెన్ చేసి పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ 2020 మార్చి 3 నుంచి మార్చి 11 వరకు జరగనుంది.
దరఖాస్తు ప్రక్రియ 2019 అక్టోబర్ 22న మొదలైంది.
దరఖాస్తుకు నవంబర్ 25 చివరి తేదీ
అప్లికేషన్ రిసిప్ట్ తీసుకోవడానికి చివరి తేదీ 2019 నవంబర్ 25 సాయంత్రం 5 గంటలు.
ఆన్లైన్ ఫీజ్ చెల్లించడానికి చివరి తేదీ 2019 నవంబర్ 27 సాయంత్రం 5 గంటలు
విద్యార్హతల వివరాలు చూస్తే అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్ / అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్ పోస్టులకు సంబంధిత అంశంలో బ్యాచిలర్స్ డిగ్రీ. జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్ పోస్టుకు 12వ తరగతిలో మ్యాథ్స్‌లో 60% మార్కులతో పాస్ కావాలి. లేదా స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి.
స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2 పోస్టుకు స్టాటిస్టిక్స్‌లో బ్యాచిలర్స్ డిగ్రీ ఉండాలి
ఇక మిగతా అన్ని పోస్టులకు డిగ్రీ ఉంటే చాలు. డిగ్రీ చివరి సంవత్సరం చదువుతున్న విద్యార్థులు కూడా దరఖాస్తు చేయొచ్చు.
2020 జనవరి 1 నాటికి డిగ్రీ పూర్తి చేయడం తప్పనిసరి. దరఖాస్తు ఫీజు రూ.100
కంబైన్డ్ గ్రాడ్యుయేట్ లెవెల్-CGL ఎగ్జామినేషన్ ద్వారా అసిస్టెంట్ ఆడిట్ ఆఫీసర్, అసిస్టెంట్ అకౌంట్స్ ఆఫీసర్, అసిస్టెంట్ సెక్షన్ ఆఫీసర్, అసిస్టెంట్, ఇన్స్పెక్టర్ ఆఫ్ ట్యాక్స్, ఇన్స్పెక్టర్, అసిస్టెంట్ ఎన్ఫోర్స్మెంట్ ఆఫీసర్, సబ్ ఇన్స్పెక్టర్, డివిజనల్ అకౌంటెంట్, జూనియర్ స్టాటిస్టికల్ ఆఫీసర్, స్టాటిస్టికల్ ఇన్వెస్టిగేటర్ గ్రేడ్ 2, ఆడిటర్, అకౌంటెంట్, జూనియర్ అకౌంటెంట్, సీనియర్ సెక్రెటేరియట్ అసిస్టెంట్, ట్యాక్స్ అసిస్టెంట్, అప్పర్ డివిజన్ క్లర్క్ పోస్టుల్ని భర్తీ చేయనుంది స్టాఫ్ సెలక్షన్ కమిషన్
ఎంపిక ఎలా? 4 అంచెలుగా అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. మొదటి రెండు ఆన్లైన్ విధానంలో పరీక్ష నిర్వహిస్తారు.
గతంలో నిర్వహిస్తుండే మౌఖిక పరీక్షను తొలగించి, ఆ స్థానంలో చివరి రెండు అంచెలను ప్రవేశపెట్టారు.
ప్రతి పరీక్షలో కనీస అర్హత మార్కులు పొందినవారిని మాత్రమే తర్వాత జరగబోయే పరీక్షకు అర్హులుగా ప్రకటిస్తారు.
ఆన్లైన్ రాతపరీక్షలో రుణాత్మక మార్కులు (1/4వ వంతు) ఉన్నాయి.
టైర్-1 పరీక్ష:దీనిలో 100 ప్రశ్నలను 60 నిమిషాలలో పూర్తి చేయాలి.
నాలుగు విభాగాలుగా విభజించి ప్రతి విభాగం నుంచి 25 ప్రశ్నలు ఇస్తారు.
ప్రతి ప్రశ్నకూ 2 మార్కులు..
టైర్-2 పరీక్ష: దీనిలో కనీస అర్హత మార్కులు పొందిన అభ్యర్థులందరూ వారు దరఖాస్తు చేసిన పోస్టులకు అతీతంగా పేపర్-1, పేపర్-2 పరీక్షలు రాయాలి. * పేపర్-1లో మేథమేటిక్స్, అరిథ్‌మెటిక్ అంశాల నుంచి 100 ప్రశ్నలు వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షను 2 గంటల సమయంలో పూర్తిచేయాలి. * పేపర్-2లో ఇంగ్లిష్ లాంగ్వేజి ప్రశ్నలు 200 వస్తాయి. 200 మార్కులకు జరిగే ఈ పరీక్షకు కూడా 2 గంటల సమయం.