state-bank-of-India-RECRUITMENT OF JUNIOR ASSOCIATES-8904-jobs

state-bank-of-India-RECRUITMENT OF JUNIOR ASSOCIATES-8904-jobs

 

స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (ఎస్‌బీఐ) దాదాపు ప‌దివేల క్ల‌రిక‌ల్ పోస్టుల‌తో ప్ర‌క‌ట‌న విడుదల చేసింది.

జూనియ‌ర్ అసోసియేట్ (క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌)గా పిలిచే ఈ పోస్టుల ఎంపిక ఆన్‌లైన్‌ ప్రిలిమినరీ, మెయిన్స్‌ , ప్రాంతీయ భాషా ప‌రీక్ష‌ల‌ ద్వారా జరుగుతుంది. అభ్య‌ర్థులు ఆస‌క్తి ఉన్న ఏదైనా ఒక రాష్ట్రానికి మాత్ర‌మే ద‌ర‌ఖాస్తు చేసుకోవ‌డానికి వీల‌వుతుంది.

అయితే వీరికి సంబంధిత ప్రాంతీయ భాషలో చ‌ద‌వ‌డం, రాయ‌డం, మాట్లాడ‌టం వ‌చ్చి ఉండాలి.

ఆన్‌లైన్ మెయిన్ ప‌రీక్ష అయిన త‌ర్వాత బ్యాంకులో చేరేముందు ఈ ప‌రిజ్ఞానాన్ని ప‌రీక్షిస్తారు.

ఇందులో ఫెయిలైన‌వారిని నియామ‌కాల కోసం పరిగ‌ణించ‌రు.

ప్రాంతీయ భాష చ‌దివిన‌ట్లు ప‌దోత‌ర‌గ‌తి లేదా ఇంట‌ర్ స‌ర్టిఫికెట్ స‌మ‌ర్పించిన‌వారికి లాంగ్వేజ్ టెస్టును మినహాయిస్తారు. 

ప‌రీక్షా స్వ‌రూపం
ప్రిలిమిన‌రీ ప‌రీక్ష (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టైప్‌): 

మొత్తం 100 ప్ర‌శ్న‌ల‌కు గంట‌లో స‌మాధానాలు గుర్తించాలి.

ప్ర‌తి ప్ర‌శ్న‌కు ఒక మార్కు.

ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 వంతున కోత విధిస్తారు. ప్ర‌తి విభాగానికి ప్ర‌త్యేక స‌మ‌యం ఉంది.

ప్ర‌తి విభాగంలో క‌నీస మార్కులు రావాల‌నే నిబంధ‌నేమీ లేదు. 

 1. English Language 30 Qns 30Marks 20 Minutes

2. Numerical Ability 35Qns 35Marks 20 Minutes

3. Reasoning Ability 35Qns 35Marks 20 Minutes

Total 100Qns 100Marks 1 Hour
మెయిన్ ప‌రీక్ష (ఆన్‌లైన్ ఆబ్జెక్టివ్ టైప్‌): 

మెయిన్ ప‌రీక్ష‌కు మొత్తం 2 గంట‌ల 40 నిమిషాలు కేటాయించారు.

190 ప్ర‌శ్న‌ల‌కు 200 మార్కులు.

ప్ర‌తి విభాగానికి ప్ర‌త్యేక స‌మ‌యం ఉంది. స‌బ్జెక్టుల‌వారీ క‌నీసార్హ‌త మార్కులు లేవు. ప్ర‌తి త‌ప్పు స‌మాధానానికి 1/4 వంతు మార్కులు త‌గ్గిస్తారు.

మెయిన్‌ మార్కులే కొల‌మానం…
ఇంగ్లిష్ త‌ప్ప మిగిలిన ప్ర‌శ్న‌ల‌ను ఇంగ్లిష్‌, హిందీ భాష‌ల్లో ఇస్తారు.

ప్రిలిమినరీ పరీక్షలో ప్రతిభ చూపిన అభ్యర్థుల్లో ప్ర‌తి కేట‌గిరీ నుంచి ఖాళీల సంఖ్యకు 10 రెట్ల అభ్యర్థుల‌ను మెయిన్‌ పరీక్షకు ఎంపిక చేస్తారు.

ప్ర‌ధాన ప‌రీక్ష‌లో ప్ర‌తిభ చూపిన అభ్య‌ర్థుల‌కు లాంగ్వేజ్ టెస్ట్ చేసి నియామ‌కాలు చేప‌డ‌తారు.

ప్రిలిమినరీ పరీక్ష కేవలం అర్హత పరీక్ష మాత్రమే. ప్ర‌ధాన ప‌రీక్ష మార్కుల‌ను మాత్ర‌మే పరిగణనలోకి తీసుకుంటారు. మెయిన్ ప‌రీక్షలో రావాల్సిన క‌నీస‌ యాగ్రిగేట్ (ఓవ‌రాల్‌) మార్కుల‌ను బ్యాంకు నిర్ణ‌యిస్తుంది. వీటిలో ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్‌కు 5శాతం మిన‌హాయింపు ఉంది. ప్రధాన ప‌రీక్ష మార్కుల ఆధారంగా కేట‌గిరీవారీ, రాష్ట్రాల‌వారీ మెరిట్ లిస్టును బ్యాంకు ప్ర‌క‌టిస్తుంది. 
నోటిఫికేషన్‌ వివరాలు
పోస్టు: జూనియ‌ర్ అసోసియేట్ (క‌స్ట‌మ‌ర్ స‌పోర్ట్ అండ్ సేల్స్‌) ఇన్ క్ల‌రిక‌ల్ కేడ‌ర్‌
మొత్తం ఖాళీలు: 8904 (రెగ్యుల‌ర్, బ్యాక్‌లాగ్‌, స్పెష‌ల్ రిక్రూట్‌మెంట్ డ్రైవ్‌తో క‌లిపి)
తెలుగు రాష్ట్రాల్లో ఖాళీలు: తెలంగాణ – 425, ఆంధ్ర‌ప్ర‌దేశ్ – 253.
విద్యార్హతలు:

 ఏదైనా డిగ్రీ ఉత్తీర్ణ‌త‌ (చివరి సంవత్సరం/ సెమిస్టర్‌ అభ్యర్థులు కూడా అర్హులే)
వ‌య‌సు: 

01.04.2019 నాటికి 20-28 సంవ‌త్స‌రాల మ‌ధ్య ఉండాలి. 02.04.1991 నుంచి 01.04.1999 మ‌ధ్య జ‌న్మించిన‌వారు అర్హులు. ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, దివ్యాంగుల‌కు వ‌యఃప‌రిమితిలో స‌డ‌లింపు ఉంది.
ఆన్‌లైన్ రిజిస్ట్రేష‌న్‌, ఫీజు చెల్లింపున‌కు

చివ‌రి తేది: 03.05.2019 
ఫీజు: 

ద‌ర‌ఖాస్తు పీజు, ఇంటిమేష‌న్ చార్జీల కింద జ‌న‌ర‌ల్/ ఓబీసీ/ ఈడ‌బ్ల్యూఎస్ అభ్య‌ర్థుల‌కు రూ.750. ఎస్సీ, ఎస్టీ, దివ్యాంగులు, ఎక్స్‌స‌ర్వీస్‌మెన్ వారు ఇంటిమేష‌న్ చార్జీల కింద రూ.125 చెల్లిస్తే స‌రిపోతుంది

పరీక్ష తేదీలు
ప్రిలిమ్స్‌: జూన్ 2019 (జూన్ మొద‌టివారంలో హాల్‌టికెట్ల‌ను డౌన్‌లోడ్ చేసుకోవ‌చ్చు) 
మెయిన్‌: 10.08.2019 (జులై నాలుగో వారంలో హాల్‌టికెట్ల డౌన్‌లోడ్‌)
తెలుగు రాష్ట్రాల్లో ప‌రీక్షా కేంద్రాలు: 

తెలంగాణ – హైద‌రాబాద్‌, క‌రీంన‌గ‌ర్‌, ఖ‌మ్మం, వ‌రంగ‌ల్‌.
ఆంధ్ర‌ప్ర‌దేశ్ – చీరాల‌, చిత్తూరు, ఏలూరు, గుంటూరు, క‌డ‌ప‌, కాకినాడ‌, క‌ర్నూలు, నెల్లూరు, ఒంగోలు, రాజ‌మండ్రి, శ్రీకాకుళం, తిరుప‌తి, విజ‌య‌వాడ‌, విశాఖ‌ప‌ట్నం, విజ‌య‌న‌గ‌రం.

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE FOR DOWNLOAD

ONLINE APPLICATION FOR SBI CLERKS CLICK HERE

OFFICIAL WEBSITE CLICK HERE