TCS-recruitment-2020-for-freshers-40,000-jobs-how-to-get-job-in-tcs

TCS-recruitment-2020-for-freshers-40,000-jobs-how-to-get-job-in-tcs

Tata Consultancy Services (TCS)

40 వేల ఉద్యోగాల భర్తీకి కసరత్తు.. వీటిని మీ సొంతం చేసుకోవాలంటే.. అర్హత, ఎంపిక ప్రక్రియ, ఇంటర్వ్యూ విధానాలను తెలుసుకోండి..!

ఐటీ దిగ్గజం టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్‌ (టీసీఎస్‌) కరోనా కష్టకాలంలో ఫ్రెషర్లకు కొలువుల భరోసా ఇస్తోంది.

ఈ ఏడాది ఏకంగా 40 వేల కొత్త ఉద్యోగావకాశాలు కల్పించనున్నట్లు ప్రకటించింది.

జాబ్‌ మార్కెట్ ఆశాజనకంగా లేని పరిస్థితుల్లో ఈ ప్రకటన నిరుద్యోగ యువతలో ఆశలు రేకెత్తుతున్నాయి..

ఈ నేపథ్యంలో ఉద్యోగార్థులు టీసీఎస్‌లో ఉద్యోగం సంపాదించాలంటే ఏయే అర్హతలుండాలి..

ఎంపిక ప్రక్రియ ఏవిధంగా ఉంటుంది.. ఎలా ప్రిపేర్‌ కావాలి అనే అంశాలను పరిశీలిద్దాం..

భారత ఐటీ రంగంలో టీసీఎస్‌ ముందు వరుసలో నిలుస్తోంది.

సమాచార, సాంకేతిక సేవల కన్సల్టింగ్‌ సంస్థ అయిన టీసీఎస్‌కు 46 దేశాల్లోని 149 ప్రాంతాల్లో క్యాంపస్‌లున్నాయి.

1968లో ఈ సంస్థను ప్రారంభించారు. ఈ సంస్థలో కొలువు సాధిస్తే.. జాబ్‌ సెక్యూరిటీతో పాటు చక్కటి పనివాతావరణం, కెరీర్‌ గ్రోత్‌ అవకాశాలు ఉంటాయి.

అందుకే యువత ఎక్కువగా టీఎసీఎస్‌ వైపు ఆకర్షితులవుతుంటారు.

ఎలాగైనా టీసీఎస్‌లో ఉద్యోగం సాధించాలనే పట్టుదలతో ప్రయత్నిస్తుంటారు.

విద్యార్హతలు:

  • పదోతరగతి నుంచి అన్ని పరీక్షల్లో మొదటి ప్రయత్నంలోనే ఉత్తీర్ణులై ఉండాలి. ఆయా పరీక్షల్లో కనీసం 60 శాతం మార్కులతో ఉత్తీర్ణత తప్పనిసరి.

  • దరఖాస్తు సమయానికి తుది విద్యార్హతకు సంబంధించి ఒక బ్యాక్‌లాగ్‌ను మాత్రమే అనుమతిస్తారు. ఎంపిక సమయానికి బ్యాగ్‌లాగ్‌ను పూర్తి చేసుండాలి.

  • ఆయా కోర్సులను రెగ్యులర్‌ విధానంలో చదువుతుండాలి. ఎడ్యుకేషన్‌కు సంబంధించి రెండేళ్లకు మించి గ్యాప్‌ ఉండకూడదు. గ్యాప్‌కు సంబంధించి సహేతుక కారణాలు ఉండాలి.

  • కనీస వయసు 18 సంవత్సరాలు ఉండాలి.

  • బీఈ/బీటెక్, ఎంఈ/ఎంటెక్‌ అన్ని స్ట్రీములు విద్యార్థులకు టీసీఎస్‌ అవకాశాలు కల్పిస్తోంది. ఆఫ్‌ క్యాంపస్‌ కొలువులకు సంబంధించి ఎంసీఏ, ఎంఎస్సీ విద్యార్థులు సైతం పోటీ పడవచ్చు

TCS OFFICIAL WEBSITE

ఎంపిక ప్రక్రియ:
టీసీఎస్‌ ఎంపిక ప్రక్రియ రెండు విధాలుగా ఉంటుంది. 1. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్ 2. ఆఫ్‌ క్యాంపస్‌ డ్రైవ్స్. ఈ రెండు మార్గాల‌ ద్వారా అభ్యర్థులను ఎంపిక చేస్తుంది. ఈ రెండు పద్ధతులకు సంబంధించి ఎంపిక ప్రక్రియ, సిలబస్‌ పరంగా పెద్దగా తేడాలుండవు. క్యాంపస్‌ ప్లేస్‌మెంట్స్‌ విధానంలో పోటీ తక్కువగా ఉంటుంది.

ఆఫ్‌ క్యాంపస్‌ మార్గంలో పోటీ ఎక్కువగా ఉంటుంది. కరోనా కారణంగా ఈ ఏడాది క్యాంపస్‌ డ్రైవ్స్‌కు అవకాశం తక్కువ. ఆఫ్‌ క్యాంపస్‌ అవకాశాల కోసం అభ్యర్థులు టీసీఎస్‌ అధికారిక వెబ్‌సైట్‌లో నమోదు చేసుకోవాల్సి ఉంటుంది. టీసీఎస్‌ ఎంపిక ప్రక్రియలో ఆన్‌లైన్‌ టెస్టుతోపాటు ఇంటర్వూ ఉంటుంది. ఆన్‌లైన్‌ టెస్టులో ఇంగ్లిష్, క్వాంటిటేటివ్‌ అప్టిట్యూడ్, ప్రోగ్రామింగ్‌ లాజిక్, కోడింగ్‌ తదితర అంశాలు ఉంటాయి.

ఇంగ్లిష్‌:
ఈ విభాగంలో బేసిక్‌ గ్రామర్‌ అంశాలపై ప్రశ్నలు అడుగుతారు. మొత్తం 15 ప్రశ్నల్లో 10 ఎంసీక్యూలు, 5 ఫిల్‌ అప్‌ ది బాక్సెస్‌ ప్రశ్నలు ఉంటాయి. ఈ విభాగంలో నెగిటివ్‌ మార్కింగ్ ‌(0.33 మార్కులు) ఉంటుంది. టెన్సెస్, ఆర్టికల్స్, సెంటెన్స్‌ కరెక్షన్, పారా జంబుల్స్, నౌన్స్, మోడల్స్, స్పెల్లింగ్స్, సినానిమ్స్, ఆంటోనిమ్స్, సబ్జెక్టు–వర్బ్‌ అగ్రిమెంట్, క్లోజ్‌ టెస్టులను ప్రాక్టీస్‌ చేయాలి. 10–12 ప్రశ్నలకు తగ్గకుండా సమాధానాలు ఇవ్వగలగాలి. పరీక్ష సమయం 10 నిమిషాలు ఉంటుంది.

క్వాంటిటేటివ్‌ ఆప్టిట్యూడ్‌:
ఈ విభాగంలో మొత్తం 15 ప్రశ్నల్లో 10 ఎంసీక్యూలు, 5 ఫిల్‌ అప్‌ ది బాక్సెస్‌ ప్రశ్నలు ఉంటాయి. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. 12–14 ప్రశ్నలు గుర్తించేలా సన్నద్ధమవడం తప్పనిసరి. అరేంజ్‌మెంట్స్‌ అండ్‌ సిరీస్, పీ అండ సీ, నంబర్‌ సిస్టమ్, ఎల్‌సీఎఫ్, హెచ్‌సీఎఫ్, పర్సంటేజెస్, రేషియోలు, ప్రపోర్షన్‌ అండ్‌ యావరేజెస్, రీజనింగ్, వర్క్‌ అండ్‌ టైమ్, జామెట్రి, డివిజబులిటీ, ప్రాఫిట్‌ అండ్‌ లాస్, ఏజెస్, సిరీస్‌ అండ్‌ ప్రోగ్రెషన్స్, ఈక్వేషన్స్‌ తదితర టాపిక్స్‌ను ప్రిపరేరవ్వాలి. ఈ విభాగానికి పరీక్ష సమయం 30 నిమిషాలు కేటాయిస్తారు.

కోడింగ్‌:
ఈ విభాగంలో 7 ఎంసీక్యూలు, 3 ఫిల్‌ అప్‌ ది బాక్సెస్‌‌ ప్రశ్నలు అడుగుతారు. నెగిటివ్‌ మార్కింగ్‌ ఉంటుంది. ఇందులో ప్రధానంగా సీ ఇన్‌పుట్‌ అండ్‌ ఔట్‌పుట్‌ థియరీపై ప్రశ్నలు అడుగుతారు. అలాగే డేటా స్ట్రక్చర్‌ టాపిక్స్‌పై ప్రశ్నలు వస్తాయి. పరీక్ష సమయం 30 నిమిషాలు ఇస్తారు.

ప్రోగ్రామింగ్‌ లాజిక్‌:
ఈ విభాగంలో సీ, సీ++, జావా, పైథాన్, పెర్ల్‌ లాంగ్వేజ్‌ల నుంచి ప్రశ్నలుంటాయి. పది ప్రశ్నలు అడుగుతారు. పరీక్ష సమయం 20 నిమిషాలు ఉంటుంది. ఈ రౌండ్‌ తర్వాత ఇంటర్వ్యూ ఉంటుంది.

ఇంటర్వూ విధానం:‌
ఇంటర్వూ విభాగంలో టెక్నికల్, మేనేజీరియల్, హెచ్‌ఆర్‌ రౌండ్లు ఉంటాయి. రాతపరీక్షలో ఎంపికైన వారిని ఇంటర్వ్యూ రౌండ్‌కు ఆహ్వానిస్తారు.

టెక్నికల్‌ రౌండ్‌
స్పెషలైజేషన్‌కు సంబంధించి రెండు డొమైన్లు లేదా టెక్నాలజీలను ఎంచుకొని వాటిలో జరిగిన అభివృద్ధి, ఇతర అప్‌డేట్‌లను తెలుసుకోవాలి.
ప్రాథమిక ప్రోగ్రామింగ్‌ అంశాలపై పట్టు సాధించాలి. C లాంగ్వేజ్‌పై పరిజ్ఞానం అదనపు బలంగా ఉంటుంది.
ప్రాజెక్టు వర్కులపై వివరణాత్మక ప్రశ్నలు అడుగుతారు. సాంకేతిక కార్యకలాపాలపై ప్రశ్నలు అడిగే అవకాశం ఉంటుంది.

మేనేజీరియల్‌ రౌండ్‌
ఈ విభాగంలో ప్రధానంగా.. ఒత్తిడిలో అభ్యర్థి ఏ రీతిలో స్పందిస్తున్నాడనే విషయాన్ని అంచనా వేస్తారు. దానికోసం ఇంటర్వ్యూ చేసే ప్యానెల్‌ అభ్యర్థులను ఉద్దేశపూర్వకంగా గందరగోళ పరిచే, సంశయానికి గురిచేసే ప్రయత్నాలు చేస్తారు. అలాగే భావోద్వేగాలను పరీక్షించేలా ప్రశ్నలు అడుగుతారు. కఠిన పరిస్థితుల్లో అభ్యర్థి వ్యవహరించే తీరును పరీక్షిస్తారు. కాబట్టి అభ్యర్థులు జాగ్రత్తగా సమాధానం చెప్పాల్సి ఉంటుంది.

హెచ్‌ఆర్‌ రౌండ్‌

  • ఈ రౌండ్‌లో సంస్థ నిబంధనలు, షరతుల గురించి పేర్కొనడంతోపాటు వాటికి అభ్యర్థి ప్రవర్తన, ఆలోచన విధానం సరితూగుతుందా లేదా అని అంచనా వేస్తారు.

  • ఈ కంపెనీలోనే ఎందుకు చేరాలనుకుంటున్నారనే ప్రశ్నతోపాటు ఇతర అభ్యర్థుల కంటే మీరేవిధంగా బెటర్‌ అనుకుంటున్నారనే తరహాలో ప్రశ్నలు అడుగుతారు.

  • పరిచయం, చేసిన కోర్సులు, ఆత్మవిశ్వాసం, వ్యక్తిత్వం, బలాలు, బలహీనతలు, సాఫ్ట్‌స్కిల్స్‌పై ప్రశ్నలు ఎదురవుతాయి. ఈ విభాగాలన్నీ పూర్తయిన తర్వాత ఆఫర్‌ లెటర్‌ చేతికొస్తుంది.

TCS OFFICIAL WEBSITE CAREER