Home Loan: హోమ్ లోన్ తీసుకోవాలనుకుంటున్నారా? వడ్డీ రేట్లు ఇవే
️SBI Home Loan Customers కు విజ్ఞప్తి :*
1.10.2019 కు ముందు home loan తీసుకున్న వారు ప్రస్తుత RBI Repo Rate ఆధారిత interest rate కు మారటానికి అవకాశం కల్పించారు.
మీ హోం లోన్ బ్రాంచిని సంప్రదించి ఫార్మేట్-1 ఫాం ను పూర్తి చేసి వన్ టైం అమౌంట్ ₹5900 చెల్లించిన ప్రస్తుత వడ్డీరేటుకు మారును.
మీరు ఏ తేదీన పైన పేర్కొన్న ఫాం పూర్తి చేసి బ్రాంచి లో ఇస్తే ఆ తేదీ నుండి మాత్రమే క్రొత్త వడ్డీరేటు లోకి హోం లోన్ మారుతుంది.
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా తన వినియోగదారులకు బంపర్ ఆఫర్ తో ముందుకు వచ్చింది.
లోన్లకు సంబంధించిన ఎంసిఎల్ఆర్ (MCLR-Marginal Cost of Funds based Lending Rate) ఆధారిత రుణ రేటుకు సంబంధించి బ్యాంక్ ఒక ప్రధాన నిర్ణయం తీసుకుంది.
ఏడాది పాటు వేచి ఉండకుండా వడ్డీ తగ్గింపు ప్రయోజనాలను వినియోగదారులకు అందించాలని బ్యాంక్ తన ట్వీట్‌లో పేర్కొంది. SBI MCLR రీసెట్ ఫ్రీక్వెన్సీని 1 సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించింది.
దీంతో ఇకపై తగ్గుతున్న వడ్డీ రేట్లను సద్వినియోగం చేసుకోవడానికి రుణదాతలు ఒక సంవత్సరం పాటు వేచి ఉండాల్సిన అవసరం లేదు. ప్రస్తుతం, SBI ఒక సంవత్సరం ఎంసిఎల్ఆర్ 7 శాతం, ఆరు నెలల ఎంసిఎల్ఆర్ 6.95 శాతంగా నిర్ణయించారు.
SBI రీసెట్ ఫ్రీక్వెన్సీని ఒక సంవత్సరం నుండి ఆరు నెలలకు తగ్గించడంతో రుణాలు తీసుకున్న వినియోగదారులకు ఊరట కలిగించే అంశం.
రీసెట్ ఫ్రీక్వెన్సీ ఒక సంవత్సరం ఉన్నప్పుడు మునుపటి కంటే వేగంగా MCLR తగ్గింపు యొక్క ప్రయోజనాలను పొందటానికి ఇది రుణగ్రహీతలకు సహాయపడుతుంది.
బ్యాంక్ తన అధికారిక ట్విట్టర్ హ్యాండిల్ ద్వారా ఈ సమాచారాన్ని పేర్కొంది.
సాధారణంగా, బ్యాంకులు MCLR అనుసంధాన రుణాలను ఒక సంవత్సరం రీసెట్ ఫ్రీక్వెన్సీతో అందిస్తాయి.
గతంలో కస్టమర్లు బ్యాంకు యొక్క ఎంసిఎల్‌ఆర్‌లో కోత ద్వారా EMIలో వడ్డీ రేట్లు తగ్గింపు యొక్క ప్రయోజనాన్ని పొందడానికి ఎక్కువ సమయం తీసుకునేవారు.
Home Loan Interest Rates 2020 | హోమ్ లోన్‌కు అప్లై చేసే ముందు వడ్డీ రేట్లు తెలుసుకోవడం మంచిది.
వివిధ బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్సింగ్ సంస్థలు అందిస్తున్న అతి తక్కువ వడ్డీ రేట్లు తెలుసుకోండి.
సొంత ఇల్లు మీ కలా? అపార్ట్‌మెంట్‌లో ఫ్లాట్ తీసుకోవాలనుకుంటున్నారా? సొంత ఇంటిని నిర్మించాలనుకుంటున్నారా? హోమ్ లోన్ వడ్డీ రేట్లు బాగా తగ్గాయి.
రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా-SBI వడ్డీ రేట్లను బాగా తగ్గిస్తుండటంతో హోమ్ లోన్ ఇంట్రెస్ట్ రేట్స్ కూడా పడిపోయాయి.
ఒకప్పుడు 9 శాతంగా ఉన్న హోమ్ లోన్ వడ్డీ రేట్లు ఇప్పుడు 7 శాతం కన్నా తక్కువే ఉన్నాయి. ప్రస్తుతం తక్కువ వడ్డీకే హోమ్ లోన్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఏవో, లేటెస్ట్ వడ్డీ రేట్లు ఎలా ఉన్నాయో తెలుసుకోండి.
Home Loan Interest Rates: హోమ్ లోన్ తాజా వడ్డీ రేట్లు
బ్యాంక్ ఆఫ్ బరోడా- 6.85%
స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా- 6.95%
హెచ్‌డీఎఫ్‌సీ బ్యాంకు- 6.95%
సిటీ బ్యాంకు- 7.50%
ఎల్ఐసీ హౌజింగ్ ఫైనాన్స్- 7.50%
యాక్సిస్ బ్యాంకు- 7.70%
డీబీఎస్ బ్యాంక్- 7.70%
ఐసీఐసీఐ బ్యాంకు- 8.10%
పీఎన్‌బీ హౌజింగ్ ఫైనాన్స్- 8.60%
ఇండియా బుల్స్ హౌజింగ్ ఫైనాన్స్- 9.25%
ప్రస్తుతం తక్కువ వడ్డీ రేట్లకే హోమ్ లోన్స్ ఇస్తున్న బ్యాంకులు, హౌజింగ్ ఫైనాన్స్ సంస్థలు ఇవి.
ప్రాసెసింగ్ ఫీజు కూడా వేర్వేరుగా ఉంటుంది.
ఆయా బ్యాంకుల వెబ్‌సైట్లలో పూర్తి వివరాలు తెలుసుకోవచ్చు.