Language-Festival-Primary-Upper-Primary-August-26th-to-31st
ఆంధ్ర ప్రదేశ్ లో భాషోత్సవాల నిర్వహణకు సూచనలు:
క్ర. సం. |
దినము |
భాష |
1 |
26 ఆగస్టు 2019 |
ఆంగ్ల భాష |
2 |
27 ఆగస్టు 2019 |
సంస్కృతము, హిందీ మరియు ఉర్దు భాష |
3 |
28 ఆగస్టు 2019 |
గిరిజన భాష, కన్నడ, తమిళం మరియు ఒరియా |
4 |
29 ఆగస్టు 2019 |
తెలుగు భాష |
భాషోత్సవ లక్ష్యాలు
-
విద్యార్ధులు మధ్య సహృద్భావ భావన కల్పించుట.
-
అవ్యవస్థీకృత సమస్యలను సాధించుటకు, సమాచార నైపుణ్యాలు అభివృద్ధికి, ద్వితీయ భాషను సమర్ధవంతంగా ఉపయోగించుట, విద్యార్ధులను ప్రోత్సహించుట.
-
స్వతంత్రంగా నేర్చుకొనుట యందు మరియు కలసి పనిచేయుట యందు విద్యార్ధులను ప్రోత్సహించుటకొరకు.
-
సృజనాత్మకతను విస్తరింపచేసి సమాచారాన్ని వివిధ భాషలలొ అందించగలిగే నైపుణ్యాన్ని వృద్ధిపరుచుట.
-
మన సంస్కృతిని ఆచరించుచూ విజయాలు సాధించులాగున విద్యార్ధులను ప్రభావితం చేయుటకొరకు.
-
భాషోత్సవ ప్రాంగణానికి విద్యార్ధులు, యువత, స్త్రీలు, సమాజంలోని ఇతర సభ్యులు అధిక సంఖ్యలో హాజరగునట్లు ప్రోత్సహించుట కొరకు.
అమలు చేయు విధానము:-
దిగువ పేర్కొనబడిన పట్టిక ప్రకారం ఆంధ్రప్రదేశ్ లోని అన్నీ జిల్లాల సర్వ శిక్ష అభియాన్ ప్రాజెక్ట్ అధికారులు, జిల్లా అకడమిక్ మరియు అసిస్టెంట్ అకడమిక్ మానిటరింగ్ అధికారులు భాషోత్సవ సందర్భంగా క్రింద తెలిపిన షెడ్యూల్ ప్రకారము ప్రాధమిక, ప్రాధమికోన్నత పాఠశాలలో నిర్వహించబోవు కార్యక్రమాలపై విస్తృతమైన అవగాహన కల్పించాలి.
భాషోత్సవములో విద్యార్ధులకై నిర్వహించు కృత్యములు:
ఆంగ్ల భాష:
-
నేటి ప్రపంచములో ఆంగ్ల భాష అంతర్జాతీయ భాషగా ప్రాముఖ్యత గాంచింది. దిగువ పేర్కొనబడిన కృత్యాలను 26 ఆగస్టు 2019 న విద్యార్ధులకు నిర్వహించాలి.
-
ప్రాధమిక పాఠశాల విద్యార్ధులకు వివిధ రకాల ప్రదర్శనలు, ఆటలు నిర్వహించాలి. వారిలో ఇంద్రియ జ్ణానాన్ని పెంపొందించుటకు తోలు బొమ్మలాట కధలు, పాటలు మరియు క్విజ్ లు మొదలైన పోటీలు నిర్వహించాలి.
-
పఠన పోటీలు ( 5 లేక 7 ని.లలో చదవదగిన విధంగా ఉండే చిన్న కధలు)
-
చిన్న కధలు రాయడం.
-
ఆంగ్ల భాష ప్రాముఖ్యతపై చర్చ
-
నాటకీకరణంగా కధ చెప్పుట (ఆంగ్లము)
-
విద్యార్ధులు వివిధ పాత్రలు పోషించే విధంగా రోల్ ప్లే ను నిర్వహించటం.
-
పద్యాలు మరియు ఉక్తలేఖనం.
-
బోధన అభ్యసన సామాగ్రి తయారీలో స్థానిక వనరుల వినియోగం.
హింది భాష:
హింది భాషాభివృద్దికై క్రింది పేర్కొనబడిన కృత్యాలను 6 నుండి 8 వ తరగతి విధ్యార్ధులలో 27 ఆగష్టు 2019 న నిర్వహించవలెను.
-
పద్యాలు మరియు ఉక్తలేఖనం
-
పఠన పోటీలు ( 5 ని. లలో)
-
చిన్న కధలు రాయడం.
-
జాతీయ భాష హిందీ పై చర్చ
-
నాటకీకరణంగా కధ చెప్పుట (హిందీ)
-
విద్యార్ధులకు వివిధ రకాల ప్రదర్శనలు మరియు ఆటలు నిర్వహించుట.
-
విద్యార్ధులు వివిధ పాత్రలు పోషించే విధంగా రోల్ ప్లే ను నిర్వహించటం.
తెలుగు భాష:
సుగంధ భరితమైన మరియు మాధుర్యం కలిగిన భాష తెలుగు భాష, తెలుగు భాషోత్సవమును నిర్వహించుట మనకు ఎంతో గర్వకారణము.
కీ.శే. శ్రీ గిడుగు వెంకట రామ్మూర్తి గారి జయంతిని పురస్కరించుకొని 29 ఆగష్టు 2019 న దిగువ పేర్కొనబడిన కృత్యాలను తెలుగు భాషాభివృద్దికై నిర్వహించవలెను.
-
తెలుగు భాషకు గౌరవం ఆపాదించులాగున వక్తృత్వ మరియు నాటకములను నిర్వహించవలెను.
-
తెలుగు భాషాభివృద్దిలో చిన్న చిన్న కధల రచనా ప్రాబల్యము.
-
తెలుగు భాషలో పాటలు, చర్చాకార్యక్రమములు.
భోధన, అభ్యసన కార్యక్రమము తయారీలో స్థానిక వనరుల వినియోగం
లాజిస్టిక్ ఏర్పాట్లు:
-
ప్రతీ మండలములోని భాషోత్సవ నిర్వహణకు ప్రాంగణ ఎంపిక, సమావేశ భవనం, నోటీసు బోర్డ్, ప్రజావేదిక మొదలైన ఏర్పాట్లు DPO చూసుకొనవలెను.
-
భాషోత్సవ కార్యక్రమము నందు రాష్ట్ర పరిశీలకుల వారికి బస, రవాణా సౌకర్యము మరియు విద్యార్ధులకు అల్పాహారము జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయము సమకూర్చవలెను.
-
రాష్ట్ర స్థాయి పర్యవేక్షకులము TA & DA లు జిల్లా ప్రాజెక్ట్ కార్యాలయము మేనేజ్ మెంట్ నిధుల నుండి SSA నిబంధనల ప్రకారం ఇవ్వవలెను.
భాషోత్సవాల ప్రయోజనం:
-
అభ్యసన ప్రక్రియ కొనసాగడానికి భాషోత్సవాలు విధ్యార్ధులకు దోహద పడతాయి
-
వినడం- మాట్లాడటం, చదవడం మరియు వ్రాయడం వంటి నైపుణ్యాలు విద్యార్ధులు సాధించుటకు భాషోత్సవము ఉపకరిస్తుంది.
-
విధ్యార్ధులలో పరస్పర సమాచార నైపుణ్యాల అభివృద్ధికి భాషోత్సవం ప్రోత్సాహకారిణి.
-
భాష ప్రయోగానికి భాషోత్సవం సరియైన అవకాశం కల్పిస్తోంది.
AP TEACHERS LATEST UPDATES PRC – DA – FORMATIVE ASSESSMENT EXAM,, SUMMETIVE ASSESMENT EXAMS MODEL PAPERS, PROJECTS, PREVIOUS PAPERS, TEACHERS PAY BILL SOFTWARE, MEDICAL REIMBURSEMENT, ZPPF SLIPS, ZPPF SOFTWARE, APGLI ANNUAL SLIPS,
