# LIC-Golden-Jubilee-Scholarship-Scheme-2020-21

- Link: https://amaravathiteacher.com/lic-golden-jubilee-scholarship-scheme-2020-21/
- Published: 2020-12-07T18:45:12+05:30
- Author: amaravathiteacher

## **LIC-Golden-Jubilee-Scholarship-Scheme-2020-21**

[[

### **స్కాలర్‌షిప్ ద్వారా ఉన్నత విద్య అభ్యసించాలనుకునే విద్యార్థులకు శుభవార్త. ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ అందిస్తోంది. ఎలా పొందాలో తెలుసుకోండి.**

### **ద‌ర‌ఖాస్తుకు చివ‌రి తేది: ‌31.12.2020.**

### **ప్రతిభ ఉన్న పేద విద్యార్థులకు శుభవార్త. భారతదేశంలో అతిపెద్ద బీమా కంపెనీ అయిన లైఫ్ ఇన్స్యూరెన్స్ కార్పొరేషన్ ఆఫ్ ఇండియా-LIC గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 స్కీమ్ ప్రకటించింది. **

### **ఆర్థికంగా వెనుకబడ్డ కుటుంబాలకు చెందిన విద్యార్థులు ఎవరైనా ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 కి దరఖాస్తు చేయొచ్చు. **

### **ప్రతిభ ఉన్న పేద విద్యార్థులు ఉన్నత చదువులు చదివేందుకు ఆర్థికంగా అండగా నిలవడమే ఎల్ఐసీ స్కాలర్‌షిప్ లక్ష్యం. **

### **భారతదేశంలోని యూనివర్సిటీలు, ప్రభుత్వ, ప్రైవేట్ కళాశాలల్లో చదువుతున్నవారు ఎవరైనా ఈ స్కాలర్‌షిప్ పొందేందుకు అర్హులు.**

### ** ఐటీఐలో టెక్నికల్, వొకేషనల్ కోర్సులు చదివేవారు కూడా ఈ స్కాలర్‌షిప్‌కు దరఖాస్తు చేయొచ్చు. **

### **ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ స్కీమ్‌కు దరఖాస్తు చేయడానికి 2020 డిసెంబర్ 31 చివరి తేదీ. మరి ఎల్ఐసీ జూబ్లీ స్కాలర్‌షిప్ 2020 వివరాలు పూర్తిగా తెలుసుకోండి.**

### **󠀁[ONLINE APPLICATION FOR LIC SCHOLARSHIPS](https://customer.onlinelic.in/LICEPS/portlets/visitor/GJF/GJFController.jpf)󠁿**

### **󠀁[LIC SCHOLARSHIPS GUIDELINES PDF CLICK HERE](https://licindia.in/getattachment/Bottom-Links/Golden-Jubilee-Foundation/Website-GJSS-2020-Scheme.pdf.aspx)󠁿**

### **ఎల్ఐసీ గోల్డెన్ జూబ్లీ స్కాలర్‌షిప్ పొందేందుకు విద్యార్హతల వివరాలు చూస్తే 2019-20 విద్యాసంవత్సరంలో 12వ తరగతి లేదా ఇంటర్, 10వతరగతి పాసైనవారు దరఖాస్తు చేయొచ్చు. కనీసం 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షిక ఆదాయం రూ.2,00,000 దాటకూడదు. **

### **మెడిసిన్, ఇంజనీరింగ్, గ్రాడ్యుయేషన్, డిప్లొమా లాంటి ఉన్నత చదువులు చదవాలనుకునేవారు ఎల్ఐసీ స్కాలర్‌షిప్‌కు అప్లై చేయొచ్చు. **

### **ఎల్ఐసీ ఇచ్చే స్కాలర్‌షిప్స్ అండర్ గ్రాడ్యుయేషన్ కోసం మాత్రమే. పోస్ట్ గ్రాడ్యుయేషన్‌కు ఈ స్కాలర్‌షిప్ వర్తించదు. కోర్సు పూర్తి చేసే వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. అండర్ గ్రాడ్యుయేషన్‌ పూర్తి చేసేందుకు ప్రతీ ఏడాది రూ.20,000 వరకు స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఇక అమ్మాయిల కోసం ప్రత్యేకంగా స్కాలర్‌షిప్ అందిస్తోంది ఎల్ఐసీ. **

### **10వ తరగతి పాసైన అమ్మాయిలు 10+2 చదివేందుకు ఈ స్కాలర్‌షిప్ పొందొచ్చు. **

### **10వ తరగతిలో 60 శాతం మార్కులతో పాస్ కావాలి. కుటుంబ వార్షికాదాయం రూ.2,00,000 కన్నా ఎక్కువ ఉండకూడదు. 10+2 చదివేందుకు ప్రతీ ఏటా రూ.10,000 స్కాలర్‌షిప్ లభిస్తుంది.**

### **ఒక కుటుంబంలో ఒకరికి మాత్రమే ఈ స్కాలర్‌షిప్ లభిస్తుంది. ఈ స్కాలర్‌షిప్స్‌కి ఎంపికైన విద్యార్థులు కనీసం 55 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాల్సి ఉంటుంది. ఆర్ట్స్, సైన్స్, కామర్స్ విద్యార్థులు 50 శాతం మార్కులతో కోర్సు పూర్తి చేయాలి. **

### **కోర్సులో ఫెయిల్ అయితే స్కాలర్‌షిప్ నిలిపివేస్తారు. **

### **󠀁[LIC SCHOLARSHIPS OFFICIAL WEBSITE](https://www.licindia.in/)󠁿**

### **విద్యార్థులకు స్కాలర్‌షిప్ నేరుగా బ్యాంక్ అకౌంట్‌లోకి ట్రాన్స్‌ఫర్ అవుతుంది. విద్యార్థులు స్కాలర్‌షిప్‌కు ఎంపికైతే వారి బ్యాంక్ అకౌంట్, ఐఎఫ్ఎస్‌సీ కోడ్ లాంటి వివరాలను తీసుకుంటుంది ఎల్ఐసీ. **

### **సదరు విద్యార్థి పేరు మీద ఉన్న క్యాన్సిల్డ్ చెక్ తప్పనిసరి.**

### **ఎల్ఐసీ-గోల్డెన్ జూబ్లీ స్కాల‌ర్‌షిప్ స్కీం 2020**⏎ **మొత్తం స్కాల‌ర్‌షిప్‌ల సంఖ్య‌: ****1) దేశ‌వ్యాప్తంగా ఎల్ఐసీ డివిజ‌న‌ల్ సెంట‌ర్ ఒక్కోదానికి 20 చొప్పున‌ రెగ్యుల‌ర్ స్కాల‌ర్‌షిప్‌లు(బాలురు-10, బాలిక‌లు-10).****2) ప్ర‌తి ఎల్ఐసీ డివిజ‌న్ ప‌రిధిలో కేవ‌లం బాలిక‌లకు 10 ప్ర‌త్యేక స్కాల‌ర్‌షిప్స్ (ప‌దోత‌ర‌గ‌తి పూర్తి చేసిన వారికి).****అర్హ‌త‌:****\* 2019-20 విద్యాసంవ‌త్స‌రంలో క‌నీసం 60% మార్కుల‌తో ప‌దోత‌ర‌గ‌తి, ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణ‌త‌. ****\* ప‌దోత‌ర‌గ‌తి ఉత్తీర్ణులైన విద్యార్థులు ప్ర‌భుత్వ గుర్తింపు పొందిన కళాశాల‌లు/ స‌ంస్థ‌ల్లో ఒకేష‌న‌ల్‌/ ఐటీఐ సంబంధిత కోర్సులు చ‌దువుతూ ఉండాలి.****\* ఇంట‌ర్మీడియ‌ట్ ఉత్తీర్ణులైన విద్యార్థులు మెడిసిన్‌, ఇంజినీరింగ్‌, గ్రాడ్యుయేష‌న్‌, ఇంటిగ్రేటెడ్ కోర్సులు, డిప్లొమా/ త‌త్స‌మాన ఉన్న‌త విద్య‌ చ‌దువుతూ ఉండాలి.**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
