lic-housing-finance-limited-home-loan-2020-offers-announced

lic-housing-finance-limited-home-loan-2020-offers-announced

LIC Home Loan offer: హోమ్ లోన్ తీసుకునేవారికి ఎల్ఐసీ అద్భుతమైన ఆఫర్స్

ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఈఎంఐలు చెల్లించొచ్చు.

ఇదొక్కటే కాదు… 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్.

మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొనాలనుకుంటున్నారా? ప్లాట్, ఫ్లాట్ తీసుకునే ఆలోచనలో ఉన్నారా? 

ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్-LICHFL అద్భుతమైన ఆఫర్ ప్రకటించింది.

‘పే వెన్ యూ స్టే’ పేరుతో సరికొత్త ఆఫర్ తీసుకొచ్చింది.

అంటే మీరు హోమ్ లోన్ తీసుకొని ఇల్లు కొంటే బిల్డర్ ఆ ఇంటిని మీకు అప్పగించిన తర్వాత లేదా మీకు లోన్ ఇచ్చిన 48 నెలల తర్వాత అసలు కట్టాల్సి ఉంటుంది.

అంటే మీకు లోన్ మంజూరు కాగానే ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు.

రియల్ ఎస్టేట్ రంగంలో కస్టమర్లు ఎదుర్కొంటున్న సమస్యల్ని గుర్తించి ఈ స్కీమ్ ప్రకటించింది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్.

ఈ స్కీమ్ ద్వారా లోన్ తీసుకుంటే మీరు గృహప్రవేశం చేసిన తర్వాత ఈఎంఐలు చెల్లించొచ్చు.

అంతే తప్ప మీకు లోన్ మంజూరైన నాటి నుంచి ఈఎంఐలు చెల్లించాల్సిన అవసరం లేదు. అయితే అప్పటి వరకు వడ్డీ చెల్లించాల్సి ఉంటుంది.

ఇదొక్కటే కాదు… 6 ఈఎంఐలను మాఫీ చేస్తూ మరో ఆఫర్ ప్రకటించింది ఎల్ఐసీ హెచ్ఎఫ్ఎల్.

ఒక వేళ మీరు నిర్మించి సిద్ధంగా ఉన్న ఇంటిని లేదా ఫ్లాట్‌ను కొంటే ఈ స్కీమ్ వర్తిస్తుంది.

బిల్డర్ నుంచి మీరు ఆక్యుపెన్సీ సర్టిఫికెట్ తీసుకోవాలి.

అప్పుడే మీరు ఎంచుకున్న ఈఎంఐలల్లో 6 ఈఎంఐలను మాఫీ చేస్తుంది ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్.

ఈ రెండు ఆఫర్లు 2020 జనవరి 15 నుంచి 2020 ఫిబ్రవరి 29 వరకు దరఖాస్తు చేసుకున్నవారికే వర్తిస్తాయి.

మీకు మొదటి చెల్లింపు 2020 మార్చి 15న జరుగుతుంది.

ఇక ప్రాసెసింగ్ ఫీజు విషయానికి వస్తే రూ.1 కోటి లోపు రుణానికి 0.25% గరిష్టంగా రూ.10,000+జీఎస్టీ చెల్లించాలి.

రూ.1 కోటి నుంచి రూ.5 కోట్ల మధ్య రుణాలకు 0.25% గరిష్టంగా రూ.25,000+జీఎస్టీ చెల్లించాలి. లోన్ చెల్లించడానికి కాల వ్యవధి గరిష్టంగా 30 ఏళ్లు ఎంచుకోవచ్చు.

ప్రస్తుతం ఎల్ఐసీ హౌసింగ్ ఫైనాన్స్ లిమిటెడ్ గృహ రుణాలకు 8.10% వడ్డీ ప్రకటించింది.

LIC HFL HOUSING LOAN ONLINE APPLICATION

LIC HFL MAIN WEBSITE

error: Content is protected !!