lockdown-free-online-courses-during-work-from-home

lockdown-free-online-courses-during-work-from-home

చదువుకోవాలన్న కోరిక ఉంటే కరోనా వైరస్‌ దాన్ని ఆపలేదని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) పేర్కొంది.

విద్యార్జన కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వైబ్‌సెట్ల వివరాలను కళాశాలల, విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో ఉంచాలని కోరింది.

ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యూజీసీ కార్యదర్శి ఆచార్య రజ్‌నీశ్‌ జైన్‌ లేఖ రాశారు.

‘‘మనందరం కలిసి కోవిడ్‌-19పై యుద్ధం చేస్తున్నాం.

ఇళ్లు, వసతిగృహాల్లోనే ఉంటూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేస్తున్నాం.

ఆన్‌లైన్‌ అభ్యసనం ద్వారా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి.

కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ వాటి ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్స్‌ (ఐయూసీలు)లు..  ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్క్‌వర్క్, కన్సార్టియం ఫర్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌(సీఈసీ) వంటి ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ)ని అభివృద్ధి చేశాయి.

డిజిటల్‌ వేదికగా వీటితో సులభంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు’’.

స్వయం ఆన్‌లైన్‌:

https://swayam.gov.in లో జనవరిలో నమోదు చేసుకున్నవారు సెమిస్టర్‌ను కొనసాగించొచ్చు.

యూజీ, పీజీ మూక్స్‌:

సాంకేతికేతర అంశాలకు సంబంధించి http://ugcmoocs.inflibnet.ac.in ద్వారా తెలుసుకోవచ్చు

ఈ-పీజీ పాఠశాల:

https://epgp.inflibnet.ac.in ద్వారా సోషల్‌ సైన్స్, ఆర్ట్స్, ఫైన్‌ ఆర్ట్స్, హ్యుమానిటీస్, నాచురల్, మేథమెటికల్‌ సైన్సెస్‌ తెలుసుకోవచ్చు

ఈ-కంటెంట్‌ కోర్స్‌వేర్‌ ఇన్‌ యూజీ సబ్జెక్ట్స్‌:

87 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు సంబంధించి 24,110 మాడ్యూల్స్‌ http://cec.nic.in ద్వారా తెలుసుకోవచ్చు.

స్వయంప్రభ:

విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు ఇతరులు కూడా ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్‌ తదితర 32 డీటీహెచ్‌ ఛానల్స్‌ https://swayamprabha.gov.in ద్వారా తెలుసుకోవచ్చు.

సీఈసీ-యూజీసీ యూట్యూబ్‌ ఛానల్‌:

విద్యా సంబంధిత లెక్చర్లను ఉచితంగా https://www.youtube.com/user/cecedusat ద్వారా తిలకించవచ్చు.

Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ… ఖాళీ సమయంలో పూర్తి చేయండి

కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు.

ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా?

అయితే కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చు.

ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు అందించే సంస్థలు చాలా ఉన్నాయి.

మరి మీరేం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.

1. Artificial Intelligence: స్మార్ట్‌ఫోన్ల నుంచి అత్యాధునిక వైద్య పరికరాల వరకు అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా.

ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అందిస్తోంది. వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి.

ONLINE COURSE WEBSITE 

2. Coding and IT Essentials: భారతీయ స్టార్టప్ Guvi ఐఐటీ మద్రాస్ సహకారంతో ఏర్పాటైంది. ఐటీ రంగంలో ఉపాధి కల్పించే అనేక ఆన్‌లైన్ కోడింగ్ కోర్సుల్ని అందిస్తోంది.

మీరు ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్నా, ఐటీ రంగంపై ఆసక్తి ఉన్నా ఈ కోర్సులు చేయొచ్చు.

పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇలా చాలా కోర్సులున్నాయి.

సాధారణంగా ఈ కోర్సులకు డబ్బులు చెల్లించాలి.

కానీ మార్చి 31 వరకు ఈ కోర్సులు ఉచితం. వెబ్‌సైట్ చూడండి.

ONLINE WEBSITE FOR IT STUDENTS

3. Writing: మీరు రైటర్ కావాలనుకుంటున్నారా? అందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా?

మీరే స్వయంగా ఓ నవల రాద్దామనుకుంటున్నారా? 

అయితే రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి.

ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇది సాధ్యం. వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి

https://www.open.edu/

4. Photography: ఫోటోగ్రఫీ మీకు ఇష్టమా? అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ కోర్సుల్ని అందిస్తున్నారు. 1,100 పైగా కోర్సులున్నాయి.

ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసి నేర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ చూడండి

https://www.ppa.com/

5. Smart Cities: స్మార్ట్ సిటీలు, వాటితో ఉండే లాభాల గురించి ఓపెన్ యూనివర్సిటీలో రెండు వారాల కోర్స్ ఉంది.

స్మార్ట్ సిటీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందేందుకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి

https://www.open.edu/

6. Block Chain and Cryptocurrencies: బ్లాక్ చెయిన్ రెవల్యూషన్ స్పెషలైజేషన్ కోర్స్‌ని ఆఫర్ చేస్తోంది బ్లాక్ చెయిన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం ఈ కోర్స్ ఉచితం.

బ్లాక్ చెయిన్‌కు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ పొందొచ్చు. ఇందుకోసం మీరు వారానికి 12 గంటలు కేటాయిస్తే చాలు. వెబ్‌సైట్‌లో జాయిన్ కావొచ్చు

https://www.coursera.org/

7. Mandarin Chinese: కొత్తగా ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకుంటున్నారా?

ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం ఎక్కువగా ఉంది.

అందుకే మాండరిన్ చైనీస్ భాషకు డిమాండ్ ఎక్కువగా ఉంది.

ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈ భాష నేర్చుకునేందుకు వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి

https://www.open.edu/

ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా

SWAYAM e-learning platform

error: Content is protected !!