# lockdown-free-online-courses-during-work-from-home

- Link: https://amaravathiteacher.com/lockdown-free-online-courses-during-work-from-home/
- Published: 2020-03-26T11:22:51+05:30
- Author: amaravathiteacher

## **lockdown-free-online-courses-during-work-from-home**

### **చదువుకోవాలన్న కోరిక ఉంటే కరోనా వైరస్‌ దాన్ని ఆపలేదని విశ్వవిద్యాలయాల నిధుల సంఘం (యూజీసీ) పేర్కొంది. **

### **విద్యార్జన కోసం ఆన్‌లైన్‌లో అందుబాటులో ఉన్న వైబ్‌సెట్ల వివరాలను కళాశాలల, విశ్వవిద్యాలయాల వెబ్‌సైట్లలో ఉంచాలని కోరింది. **

### **ఈ మేరకు విశ్వవిద్యాలయాల ఉప కులపతులు, కళాశాలల ప్రధానోపాధ్యాయులకు యూజీసీ కార్యదర్శి ఆచార్య రజ్‌నీశ్‌ జైన్‌ లేఖ రాశారు. **

### **‘‘మనందరం కలిసి కోవిడ్‌-19పై యుద్ధం చేస్తున్నాం. **

### **ఇళ్లు, వసతిగృహాల్లోనే ఉంటూ వైరస్‌ వ్యాప్తి చెందకుండా చేస్తున్నాం. **

### **ఆన్‌లైన్‌ అభ్యసనం ద్వారా ఈ విలువైన సమయాన్ని సద్వినియోగం చేసుకోండి. **

### **కేంద్ర మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, యూజీసీ వాటి ఇంటర్‌ యూనివర్సిటీ సెంటర్స్‌ (ఐయూసీలు)లు..  ఇన్ఫర్మేషన్, లైబ్రరీ నెట్క్‌వర్క్, కన్సార్టియం ఫర్‌ ఎడ్యుకేషనల్‌ కమ్యూనికేషన్‌(సీఈసీ) వంటి ఇన్ఫర్మేషన్, కమ్యునికేషన్‌ టెక్నాలజీ(ఐసీటీ)ని అభివృద్ధి చేశాయి. **

### **డిజిటల్‌ వేదికగా వీటితో సులభంగా విద్యార్థులు, ఉపాధ్యాయులు, పరిశోధకులు తమ నైపుణ్యాన్ని పెంచుకోవచ్చు’’.**

### **స్వయం ఆన్‌లైన్‌:**

### **󠀁[https://swayam.gov.in](https://swayam.gov.in/)󠁿 లో జనవరిలో నమోదు చేసుకున్నవారు సెమిస్టర్‌ను కొనసాగించొచ్చు.**

### **యూజీ, పీజీ మూక్స్‌:**

### **సాంకేతికేతర అంశాలకు సంబంధించి 󠀁[http://ugcmoocs.inflibnet.ac.in](http://ugcmoocs.inflibnet.ac.in/)󠁿 ద్వారా తెలుసుకోవచ్చు**

### **ఈ-పీజీ పాఠశాల:**

### **󠀁[https://epgp.inflibnet.ac.in](https://epgp.inflibnet.ac.in/)󠁿 ద్వారా సోషల్‌ సైన్స్, ఆర్ట్స్, ఫైన్‌ ఆర్ట్స్, హ్యుమానిటీస్, నాచురల్, మేథమెటికల్‌ సైన్సెస్‌ తెలుసుకోవచ్చు**

### **ఈ-కంటెంట్‌ కోర్స్‌వేర్‌ ఇన్‌ యూజీ సబ్జెక్ట్స్‌:**

### **87 అండర్‌ గ్రాడ్యుయేట్‌ కోర్సులకు సంబంధించి 24,110 మాడ్యూల్స్‌ 󠀁[http://cec.nic.in](http://cec.nic.in/)󠁿 ద్వారా తెలుసుకోవచ్చు.**

### **స్వయంప్రభ:**

### **విద్యార్థులు, ఉపాధ్యాయులతోపాటు ఇతరులు కూడా ఆర్ట్స్, సైన్స్, కామర్స్, సోషల్‌ సైన్సెస్, హ్యుమానిటీస్‌ సబ్జెక్ట్స్, ఇంజినీరింగ్, టెక్నాలజీ, లా, మెడిసిన్, అగ్రికల్చర్‌ తదితర 32 డీటీహెచ్‌ ఛానల్స్‌ 󠀁[https://swayamprabha.gov.in](https://swayamprabha.gov.in/)󠁿 ద్వారా తెలుసుకోవచ్చు.**

### **సీఈసీ-యూజీసీ యూట్యూబ్‌ ఛానల్‌:**

### **విద్యా సంబంధిత లెక్చర్లను ఉచితంగా 󠀁[https://www.youtube.com/user/cecedusat](https://www.youtube.com/user/cecedusat)󠁿 ద్వారా తిలకించవచ్చు.**

### **Free Courses: ఆన్‌లైన్‌లో ఈ 7 కోర్సులు ఫ్రీ… ఖాళీ సమయంలో పూర్తి చేయండి**

### **కరోనా వైరస్ ప్రభావం కారణంగా దేశవ్యాప్తంగా లాక్‌డౌన్ విధించడంతో అందరూ ఇళ్లకే పరిమితం అయ్యారు. **

### **ఇంట్లో ఖాళీగా ఉంటే బోర్ కొడుతుందా? ఏం చేయాలో అర్థం కావట్లేదా? **

### **అయితే కొత్తగా ఏదైనా నేర్చుకోవచ్చు. **

### **ఆన్‌లైన్‌లో ఉచితంగా కోర్సులు అందించే సంస్థలు చాలా ఉన్నాయి. **

### **మరి మీరేం నేర్చుకోవచ్చో తెలుసుకోండి.**

### **1. Artificial Intelligence: స్మార్ట్‌ఫోన్ల నుంచి అత్యాధునిక వైద్య పరికరాల వరకు అంతటా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్‌దే హవా. **

### **ఫిన్‌లాండ్‌లోని యూనివర్సిటీ ఆఫ్ హెల్సింకీ ఉచితంగా ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్ కోర్స్ అందిస్తోంది. వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి.**

### 󠀁[**ONLINE COURSE WEBSITE **](https://course.elementsofai.com/)󠁿

### **2. Coding and IT Essentials: భారతీయ స్టార్టప్ Guvi ఐఐటీ మద్రాస్ సహకారంతో ఏర్పాటైంది. ఐటీ రంగంలో ఉపాధి కల్పించే అనేక ఆన్‌లైన్ కోడింగ్ కోర్సుల్ని అందిస్తోంది. **

### **మీరు ఐటీ సెక్టార్‌లో పనిచేస్తున్నా, ఐటీ రంగంపై ఆసక్తి ఉన్నా ఈ కోర్సులు చేయొచ్చు. **

### **పైథాన్, జావా, హెచ్‌టీఎంఎల్, సీఎస్ఎస్ ఇలా చాలా కోర్సులున్నాయి. **

### **సాధారణంగా ఈ కోర్సులకు డబ్బులు చెల్లించాలి.**

### ** కానీ మార్చి 31 వరకు ఈ కోర్సులు ఉచితం. వెబ్‌సైట్ చూడండి.**

### 󠀁[**ONLINE WEBSITE FOR IT STUDENTS**](https://www.guvi.io/courses)󠁿

### **3. Writing: మీరు రైటర్ కావాలనుకుంటున్నారా? అందుకు కావాల్సిన స్కిల్స్ పెంచుకోవాలనుకుంటున్నారా? **

### **మీరే స్వయంగా ఓ నవల రాద్దామనుకుంటున్నారా?  **

### **అయితే రైటింగ్ స్కిల్స్ పెంచుకోవాలి. **

### **ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఇది సాధ్యం. వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి**

### **https://www.open.edu/**

### **4. Photography: ఫోటోగ్రఫీ మీకు ఇష్టమా? అమెరికాకు చెందిన ప్రొఫెషనల్ ఫోటోగ్రాఫర్స్ ఆన్‌లైన్ ఫోటోగ్రఫీ కోర్సుల్ని అందిస్తున్నారు. 1,100 పైగా కోర్సులున్నాయి. **

### **ఫ్రీగా అకౌంట్ క్రియేట్ చేసి నేర్చుకోవచ్చు. మరిన్ని వివరాల కోసం వెబ్‌సైట్ చూడండి**

### **https://www.ppa.com/**

### **5. Smart Cities: స్మార్ట్ సిటీలు, వాటితో ఉండే లాభాల గురించి ఓపెన్ యూనివర్సిటీలో రెండు వారాల కోర్స్ ఉంది. **

### **స్మార్ట్ సిటీకి సంబంధించిన పరిజ్ఞానాన్ని పొందేందుకు ఈ కోర్స్ ఉపయోగపడుతుంది. వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి**

### 󠀁[**https://www.open.edu/**](https://www.open.edu/)󠁿

### **6. Block Chain and Cryptocurrencies: బ్లాక్ చెయిన్ రెవల్యూషన్ స్పెషలైజేషన్ కోర్స్‌ని ఆఫర్ చేస్తోంది బ్లాక్ చెయిన్ రీసెర్చ్ ఇన్‌స్టిట్యూట్. ప్రస్తుతం ఈ కోర్స్ ఉచితం. **

### **బ్లాక్ చెయిన్‌కు సంబంధించిన పూర్తి నాలెడ్జ్ పొందొచ్చు. ఇందుకోసం మీరు వారానికి 12 గంటలు కేటాయిస్తే చాలు. వెబ్‌సైట్‌లో జాయిన్ కావొచ్చు**

### 󠀁[**https://www.coursera.org/**](https://www.coursera.org/)󠁿

### **7. Mandarin Chinese: కొత్తగా ఏదైనా విదేశీ భాష నేర్చుకోవాలనుకుంటున్నారా? **

### **ప్రస్తుతం ప్రపంచ ఆర్థిక వ్యవస్థపై చైనా ప్రభావం ఎక్కువగా ఉంది. **

### **అందుకే మాండరిన్ చైనీస్ భాషకు డిమాండ్ ఎక్కువగా ఉంది.**

### ** ఓపెన్ యూనివర్సిటీ ద్వారా ఈ భాష నేర్చుకునేందుకు వెబ్‌సైట్‌లో మరిన్ని వివరాలు తెలుసుకోండి**

### **https://www.open.edu/**

### 󠀁[**ఇంట్లో బోర్ కొడుతుందా? ఆన్‌లైన్‌లో ఫ్రీగా కోర్సులు చేయండి ఇలా**](https://amaravathiteacher.com/gvt-of-india-e-learning-platform-swayam-offers-online-courses/)󠁿

### **SWAYAM e-learning platform **

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
