M-Adhaar-app-offers-35-releted-services-including-address-updates

M-Adhaar-app-offers-35-releted-services-including-address-updates

Aadhaar Services: ఈ ఒక్క యాప్ ఉంటే… 35 ఆధార్ సేవలు పొందొచ్చు

మీ దగ్గర ఆధార్ కార్డు ఉందా? ఆధార్ కార్డుకు సంబంధించిన సేవల కోసం పదేపదే ఆధార్ కేంద్రానికి వెళ్లాల్సి వస్తుందా? మీలాంటివారికోసమే mAadhaar యాప్‌ రూపొందించింది యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI.

మరి ఈ యాప్‌తో ఎలాంటి సేవలు పొందొచ్చో తెలుసుకోండి.

ఆధార్ కార్డు సేవల కోసం యూనిక్ ఐడెంటిఫికేషన్ అథారిటీ ఆఫ్ ఇండియా-UIDAI రూపొందించిన మొబైల్ అప్లికేషన్ mAadhaar. ఇటీవల ఈ యాప్‌ను అప్‌డేట్ కూడా చేశారు. ఐఓఎస్, ఆండ్రాయిడ్ ప్లాట్‌ఫామ్స్‌లో కొత్త వర్షన్ రిలీజైంది

గతంలో మీరు mAadhaar యాప్ ఉపయోగిస్తున్నట్టైతే గూగుల్ ప్లేస్టోర్ లేదా యాప్ స్టోర్‌లో కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

ఆండ్రాయిడ్ 5.0, ఐఓఎస్ 10.0 కన్నా ఎక్కువ ఆపరేటింగ్ సిస్టమ్ ఉన్నవారికి కొత్త ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది.

యూజర్లు పాత యాప్ డిలిట్ చేసి కొత్త యాప్ డౌన్‌లోడ్ చేసుకోవాలి

ఎంఆధార్ యాప్‌ను 13 భాషల్లో ఉపయోగించొచ్చు.

అందులో 12 భారతీయ భాషలు కాగా, మరో భాష ఇంగ్లీష్. తెలుగు, హిందీ, ఉర్దూ, తమిళ్, మళయాళం, కన్నడ, గుజరాతీ, పంజాబీ, మరాఠీ, ఒడియా, అస్సామీ, బెంగాలీ భాషల్లో ఎంఆధార్ యాప్ పనిచేస్తుంది.

ఇంగ్లీష్‌లో టైప్ చేస్తేనే ఇతర భాషల్లో కనిపిస్తుంది

 పర్సనలైజ్డ్ ఆధార్ సర్వీసెస్ పొందేందుకు ఆధార్ ప్రొఫైల్‌లో రిజిస్టర్ చేయాల్సి ఉంటుంది.

ఆధార్ ఉన్నవారు మాత్రమే కాదు… లేనివాళ్లు కూడా తమ స్మార్ట్‌ఫోన్లల్లో ఈ యాప్ ఇన్‌స్టాల్ చేయొచ్చు.

ఆధార్ యాప్ ఓపెన్ చేయగానే ‘Main Service Dashboard’, ‘Request Status Services’, ‘My Aadhaar’ లాంటి సేవలుంటాయి

ఎంఆధార్ యాప్‌లో ఆధార్ కార్డ్ డౌన్‌లోడ్ చేసుకోవచ్చు.

రీప్రింట్, అడ్రస్ అప్‌డేట్, ఇకేవైసీ డౌన్‌లోడ్, స్కాన్ క్యూఆర్ కోడ్, వెరిఫై ఆధార్, వెరిఫై ఇమెయిల్, రిట్రీవ్ యూఐడీ / ఈఐడీ, అడ్రస్ వ్యాలిడేషన్ లెటర్ లాంటి సేవలుంటాయి. మొత్తం 35 రకాల సేవలు ఒకే యాప్‌లో పొందొచ్చు

ఇమెయిల్ ఐడీ, మొబైల్ నెంబర్ వెరిఫై చేయొచ్చు.

మీరు మర్చిపోయిన ఆధార్ నెంబర్, ఎన్‌రోల్‌మెంట్ ఐడీని తిరిగి పొందొచ్చు.

ఆధార్ సేవా కేంద్రంలో అపాయింట్‌మెంట్ తీసుకోవాలంటే ఎంఆధార్ యాప్‌లోనే బుక్ చేసుకోవచ్చు

ఎంఆధార్ యాప్ ద్వారా మీ ఆధార్ లేదా బయోమెట్రిక్ ఆథెంటికేషన్‌ను లాక్ లేదా అన్‌లాక్ చేయొచ్చు. ‘My Aadhaar’ సెక్షన్‌లో పర్సనలైజ్డ్ సెక్షన్ ఉంటుంది.

The key features in mAadhaar:
Multilingual : In order to ensure the Aadhaar Services are accessible to linguistically diverse residents of India, the menu, button labels and form fields are provided in English as well as in 12 Indian languages (Hindi, Assamese, Bengali, Gujarati, Kannad, Malayalam, Marathi, Odia, Punjabi, Tamil, Telugu and Urdu). After installation, the user will be prompted to select any of the preferred languages. However, the input fields in the forms will accept data entered in the English language only. This is done to help the user avoid facing the challenges of typing in regional languages (due to limitations in the mobile keyboards).
Universality: Resident with or without Aadhaar can install this App in their smart phones. However to avail personalized Aadhaar services the resident will have to register their Aadhaar Profile in the App.
Aadhaar Online Services on Mobile: The mAadhaar user can avail the featured services for themselves as well as for any other resident seeking Aadhaar or related help. The functionalities are broadly grouped as :
o Main Service Dashboard: Direct access to download Aadhaar, Order a Reprint, Address Update, Download offline eKYC, Show or Scan QR Code, Verify Aadhaar, Verify mail/email, retrieve UID/EID, Request for Address Validation Letter
o Request Status Services: To help resident check status of various online requests
o My Aadhaar: This is a personalized section for Aadhaar holder where the resident will not have to enter their Aadhaar number to avail Aadhaar services. In addition, this section also provides facility for the resident to lock/unlock their Aadhaar or Biometric Authentication.
Aadhaar Locking – Aadhaar holder can lock their UID/Aadhaar number anytime they wish. 
Biometric locking/unlocking secures biometric authentication by locking biometrics data. Once resident enables Biometric Locking system their biometric remains locked till the Aadhaar Holder chose to either unlock it (which is temporary) or Disable the Locking system.
TOTP generation – Time-based One-Time Password is an automatically generated temporary password that can be used instead of SMS based OTP.
Update of profile – To updated view of Aadhaar profile data after successful completion of update request.
 Sharing of QR code and eKYC data by Aadhaar Number holder helps Aadhaar users share their password-protected eKYC or QR code for safe and paperless verification.
Multi-profile: Aadhaar holder can include multiple (up to 3) profiles (with the same registered mobile number) in their profile section.
Aadhaar Services on SMS ensures Aadhaar holder avail Aadhaar services even when there is no network.
Locate Enrolment Center helps the user find the nearest Enrolment Center.

HOW TO DOWNLOAD M-AADHAR MOBILE APP

AADHAR CARD MAIN WEBSITE

ఒక ఆధార్ యాప్‌లో ఒకరి వివరాలు మాత్రమే కాదు… మూడు ప్రొఫైల్స్ యాడ్ చేయొచ్చు

ఎంఆధార్ యాప్‌లో లొకేట్ ఎన్‌రోల్‌మెంట్ సెంటర్ చేయొచ్చు.

ఎస్ఎంఎస్ ద్వారా ఆధార్ సేవలు కూడా పొందొచ్చు.

ఎంఆధార్ యాప్ ఆఫ్‌లైన్‌లో పనిచేయదు. ఇంటర్నెట్ ద్వారానే పనిచేస్తుంది.

ఆధార్ కార్డ్ హోల్డర్లు ఎంఆధార్ యాప్ ద్వారా క్యూఆర్ కోడ్, ఇకేవైసీ షేర్ చేయొచ్చు

ఇక ఇందులో మరో కీలకమైన ఫీచర్ ఏంటంటే… రైల్వే ప్రయాణికులు రైళ్లల్లో ప్రయాణించేప్పుడు ఐడీ ప్రూఫ్‌ను ఎంఆధార్ యాప్ ద్వారా చూపించొచ్చు.

ఎయిర్‌పోర్టులో కూడా ఎంఆధార్ యాప్‌ను ఐడెంటిటీ ప్రూఫ్‌గా చూపించొచ్చు.

యాప్ ఉంటే సాఫ్ట్ కాపీని మీ ఫోన్‌లోనే క్యారీ చేయొచ్చు

M-AADHAR CARD MOBILE APP IN GOOGLE PLAY STORE

HOW TO DOWNLOAD AADHAR CARD EASY METHOD IN YOUR MOBILE

error: Content is protected !!