# Mana-Badi-Naadu-Nedu-nine-9-components-improving Infrastructure-schools

- Link: https://amaravathiteacher.com/mana-badi-naadu-nedu-nine-9-components-improving-infrastructure-schools/
- Published: 2019-12-24T21:20:10+05:30
- Author: amaravathiteacher

## **Mana-Badi-Naadu-Nedu-nine-9-components-improving Infrastructure-schools**󠀁[](https://amaravathiteacher.com/mana-badi-naadu-nedu-nine-9-components-improving-infrastructure-schools/)󠁿

###  

### **మన బడి నాడు నేడు CRP, HM ల  పాత్ర, వారికి ఆదేశాలు\***

### **\*మన బడి నాడు నేడు లో రాయాల్సిన రెజిస్టర్స్…తీర్మానాలు⤵\***

### **\*➡Rc.19, Dt.2/1/2020\***

### **\*➡File No.ESE02/563/2019-CIVIL SEC-SSA\***

### **\*➡ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వము పాఠశాల విద్యాశాఖ\***

### **\*➡సర్క్యూలర్.నెం. ఎంబిఎస్ఎన్/19-20/2, తేది: 2-1-2020\***

### **          పైన పేర్కొనబడిన ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారము ‘మనబడి: నాడు – నేడు’ అనే ప్రభుత్వ ప్రాధాన్యత గల కార్యక్రమం మన రాష్ట్రంలో అమలు జరుగుచున్నది. దీనికి సంబంధించి ఒక వినూత్న పద్ధతిలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ద్వారా పనులు చేపట్టడం జరిగింది. **

### **ఈ కార్యక్రమం విజయవంతం కావాలంటే పాఠశాల తల్లిదండ్రుల కమిటీ ప్రధాన పాత్ర వహించాల్సి ఉంటుంది. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ చురుగ్గా పాల్గొనాలంటే వారిని ప్రేరేపించడం (Motivation) మరియు వారిని సౌలభ్యం (Facilitate) చేయడం అనేవి విద్యాశాఖ నుండి మనం చేపట్టాల్సి ఉంటుంది. ఈ రెండు అంశాలు నిర్వహించుటలో పాఠశాల ప్రధానోపాధ్యాయులు మరియు క్లస్టర్ రిసోర్సు పర్సన్లు ముఖ్య బాధ్యత వహించాల్సి ఉంటుంది. వీరిద్దరూ ఈ క్రింది విధులు నిర్వహించాల్సి ఉంటుంది..**

### **➡1. ప్రతి పాఠశాలలోని తల్లిదండ్రుల కమిటి వారానికి ఒకరోజు (అనుకున్న రోజు, అనుకున్న సమయానికి) తప్పకుండా సమావేశం నిర్వహించుకోవాలి. దీనికి సంబంధిత పాఠశాల ప్రధానోపాధ్యాయలు మరియు సీఆర్పీలు తప్పకుండా హాజరు కావాలి.**

### **➡2. ప్రధానోపాధ్యాయులు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుందరికీ ఫోన్లు చేసి, వారు ప్రతి వారం తప్పకుండా సమావేశం జరిగేలా బాధ్యత వహించవలెను.**

### **➡3. ఆ సమావేశంలో తగు విషయాలను అంశాలను చర్చించి ప్రజాస్వామ్యయుతంగా అందరు కమిటీ సభ్యులు కలిసి నిర్ణయాలు తీసుకునేటట్లు సీఆర్పీ సులభతరం (Facilitation) చేయాలి.**

### **➡4. ఆ సమావేశానికి గ్రామ/వార్డు సచివాలయం నుండి ఇంజినీర్ సహాయకుడు, సంక్షేమ విద్యా సహాయకులు తప్పకుండా హాజరు అయ్యేటట్లు చూసుకోవాలి..**

### **➡5. మండల స్థాయిలో మండల విద్యాశాఖాధికారి గారు, పట్టణ ప్రాంతాలలో సంబంధిత డిప్యూటీ ఇన్స్పెక్టర్ /మండల విద్యాశాఖాధికారి/ సీఆర్పీలు హాజరు అయ్యే టట్లు పర్యవేక్షించాలి.**

### **➡6. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు ఎలాంటి కాంట్రాక్టరుకు పనులను కట్టపెట్టకుండా ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు చూసుకోవాలి. బినామీ కాంట్రాక్టర్ ద్వారా పనులు జరగకుండా చూడాల్సిన బాధ్యత పూర్తిగా ప్రధానోపాధ్యాయులదే.**

### **➡7. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సమావేశంలో తీసుకున్న నిర్ణయాలు, ఖర్చు పెట్టిన వివరాలు అన్ని కూడా ‘మనబడి: నాడు-నేడు’ లెక్కల పుస్తకాలలో వ్రాయాలి. ఈ లెక్కల పుస్తకాలు గ్రామ/వార్డు సచివాలయ సంక్షేమ విద్యా సహాయకులతో వ్రాయించాలి. **

### **ఒక వేళ ఆ పోస్టులో ఎవరు లేకపోతే సీఆర్పీలు ఆ లెక్కలు వ్రాయాల్సి ఉంటుంది.**

### **󠀁[నాడు నేడు ఒప్పంద అంగీకార పత్రము MOU CERTIFICATE](https://drive.google.com/file/d/1H7qF1H6Fvuadeb4w_5R4TpvZLs8uHrg5/view?usp=sharing)󠁿**

### **󠀁[Requisition Letter to Open Nadu Nedu BANK Account](https://drive.google.com/file/d/1Lp97boHbHc44sTgX15GveMwTL1eHdZM8/view?usp=sharing)󠁿**

### **󠀁[తల్లి దండ్రుల తీర్మాన కమిటి సర్టిఫికేట్ ](https://drive.google.com/file/d/17YwXqNvF64nfSzLTI6ytf-fBlHvd5nSp/view?usp=sharing)󠁿**

### **➡8. మన బడి: నాడు-నేడు’ కార్యక్రమానికి సంబంధించి ఈ క్రింది పుస్తకాలు వ్రాయాలి.**

### **(i) మీటింగ్ మినిట్స్**

### **(ii) నగదు పుస్తకం**

### **(iii) సాధారణ లెడ్జర్**

### **(iv) చెల్లింపు వోచర్**

### **(V) రశీదు పుస్తకము**

### **(vi) స్టాక్ నమోదు- పంపిణీ రిజిస్టర్**

### **➡9. సీఆర్పీ మరియు ప్రధానోపాధ్యాయులు క్షేత్రస్థాయి ఇంజినీరు సహాయంతో తాపీ మేస్త్రీ , రంగులు వేసే మేస్త్రీ , కరెంట్ మేన్, ఫ్లోరింగ్ మేస్త్రీ , శానిటరీ మేస్త్రీ , ప్లంబింగ్ మేస్త్రీ  మొదలగు వారితో గంపగుత్త రేటు మాట్లాడటంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీకి సహాయపడాలి. మేస్త్రీ లతో రేటు మాట్లాడినప్పుడు ఒక పేజీ ఒప్పంద పత్రము తయారు చేసుకోవడానికి పాఠశఆల తల్లిదండ్రుల కమిటీకి సహాయం చేయాలి.**

### **➡10. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కేంద్రీయ సరఫరా(central procurement) పద్ధతిలో ఫర్నీచర్, ఫ్యాన్లు, కమొడ్లు, ఆకుపచ్చ బోర్డులు వంటివి ఇండెంట్ తయారు చేయడానికి, దానిని కంప్యూటర్ ద్వారా పంపించడానికి ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.**

### **➡11. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ వారు కొన్న వస్తువులు లేక కేంద్రీయ సరఫరా (central procurement) ద్వారా వచ్చిన సామగ్రి/ వస్తువులు చాల జాగ్రత్తగా పాఠశాల ఆవరణలో భద్రపరచడంలో ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి. సామగ్రి భద్రపరచడంలో క్షేత్ర స్థాయి ఇంజినీర్ బాధ్యత ఉండదు.**

### **➡12. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ నిర్మాణ వస్తువులు/సామగ్రి కొనడానికి మార్కెట్ కు వెళ్ళేటప్పుడు తప్పనిసరిగా సీఆర్పీ గాని ప్రధానోపాధ్యాయుడు కాని ఎవరో ఒకరు తప్పకుండా వెళ్లవలెను.**

### **➡13. మనబడి’ అనే భావజాలంను, ‘మన బడి ఒక పవిత్ర స్థలం’ అనే భావజాలాన్ని పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, ఇంజినీరుకు, తల్లిదండ్రులకు, టీచర్లకు, ప్రధానోపాధ్యాయులకు, సీఆర్పీలకు, గ్రామ/వార్డు సచివాలయం సిబ్బందికీ ఇలా ప్రతి ఒక్కరిలో ఆ భావన కలిగేటట్లుగా చేయడంలో ప్రధానోపాధ్యాయులు మరియు సీఆర్పీలు ముఖ్య పాత్ర పోషించవలెను.**

### **➡14. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యుల మధ్య సఖ్యత ఉండేట్లు, వారిలో ఏమైనా బేధాభిప్రాయాలు వచ్చినట్లయితే వాటిని పరిష్కరించే బాధ్యత సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు తీసుకోవాలి.**

### **➡15. ఇంజినీర్ పాఠశాలకు వచ్చినపుడు పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సమావేశపరిచి, పాఠశాలలో అందరు తిరిగి ఏమేమి కావాలో గుర్తించి ఇంజనీర్ అంచనాను తయారు చేసేట్లు ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీలు బాధ్యత తీసుకోవాలి.**

### **➡16. పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులు , క్షేత్రీయ ఇంజనీర్, గ్రామ/వార్డు సచివాలయ ఇంజనీర్, సంక్షేమ విద్యా సహాయకులు, ప్రధానోపాధ్యాయులు, సీఆర్పీ అందరూ ఒక బృందంలా తయారు కావాలి.**

### **➡17.  పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులకు, తల్లిదండ్రులకూ ఖర్చు పెట్టిన ప్రతి పైసా కూడా లెక్క తెలిసేటట్లుగా సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు బాధ్యత తీసుకోవాలి.**

### **➡18. చివరగా పాఠశాల పనులను త్వరితగతిన చేయడంలో పాఠశాల తల్లిదండ్రుల కమిటీ సభ్యులను సంస్థాగతంగా నడిపించి వారితో పాఠశాల పనులను పూర్తి చేయడంలో సీఆర్పీలు, ప్రధానోపాధ్యాయులు ప్రధాన పాత్ర వహించాలి.**

### **󠀁[Requisition Letter to Open Nadu Nedu Account](https://drive.google.com/file/d/1Lp97boHbHc44sTgX15GveMwTL1eHdZM8/view?usp=sharing)󠁿**

### **󠀁[CSE – APSS – ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List](https://schooledu.ap.gov.in/DSENEW/manaBadiNaaduNedu.jsp)󠁿**

### **Mana Badi – Nadu Nedu Programme Mana Badi – Naafu Nedu Component Wise Ceilings**

### **▪ \*నాడు నేడు కార్యక్రమం పాఠశాలను కేటగిరీ వారీగా విభజించారు\***

### **▪ \*పాఠశాలలో ఉన్న రోల్ ఆధారంగా ఒక్కో కాంపోనెంట్ కి ఎంత మొత్తం మంజూరు చేస్తారు తెలియజేసే పట్టిక\***

### **ఏ పాఠశాలలైతే నాడు-నేడు పథకం కు ఎంపికైనాయో ఆ పాఠశాలల HMs అందరు తమ పాఠశాల PMC  సభ్యులు 5 గురు + HM+AE =7గురు సభ్యులతో  ఏదైన జాతీయ బ్యాంకు లో అకౌంటు ఓపెన్ చేయవలెను. తదుపరి ఆ అకౌంట్లలో 15% అమౌంటు జమచేయబడును. **

### **ఒకవేళ అకౌంటు ఓపెన్ చేయలేకపోతే మీ అకౌంట్లలో డబ్బులు పడవు.**

### **మీ పాఠశాల  మంచి అవకాశంకోల్పోయే  ప్రమాదం ఉంది.కనుక జాగ్రత్త వహించగలరు.**

### **School Education Department – Mana Badi; Naadu-Nedu – Administrative approval ****accorded to take up the basic infrastructure works with nine (9) components for ****improving Infrastructure facilities in all the schools under Mana Badi; Naadu-Nedu ****Program – Implementation of the program through parent’s committees by way of ****community contracting and guidelines for implementation of the program – Orders – ****Issued. **

### **Government after careful examination of the matter, hereby accord ****administrative approval to the Commissioner of School Education to take up the basic ****infrastructure works with nine (9) components i.e **

### **i. Toilets with running water, **

### **ii. ****Electrification with fans and tube lights, **

### **iii. Drinking water supply, **

### **iv. Furniture for**⏎ **students and staff, **

### **v. Painting to school, **

### **vi. Major and minor repairs, **

### **vii. Green chalk**⏎ **boards, **

### **viii. English labs, **

### **󠀁[CSE – APSS – ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List](https://schooledu.ap.gov.in/DSENEW/manaBadiNaaduNedu.jsp)󠁿**

### **󠀁[పాఠశాలలో ఉన్న రోల్ ఆధారంగా ఒక్కో కాంపోనెంట్ కి ఎంత మొత్తం మంజూరు చేస్తారు తెలియజేసే పట్టిక](https://drive.google.com/file/d/1nU4g9gD3XEcetUhMAY9OSSlFbwaXAVD8/view?usp=sharing)󠁿**

### **󠀁[MANA BADI NADU NEDU DATA INPUT SHEET DOWNLOAD PDF](https://drive.google.com/file/d/11qQxzkul9CODocdjdmWXrOKOHv1RESqT/view?usp=sharing)󠁿**

### **ix. Compound walls in all Government Schools under Mana ****Badi: Nadu-Nedu programme for transformation of Government schools in the State in ****a period of three years from the current financial year 2019-20.**

### **The project shall cover all the (44,512) schools run by all managements.**

### **మనబడి : నాడు – నేడు****\*చేయవలసిన పనులు**

### **1. \*Engineering Assistant\* :**

### **వీరు పాఠశాలను సందర్శించి అవసరమైన సాంకేతిక వివరాలను**

### **\*Input Data Sheet\* లో నింపి సంతకం చేయాలి. **

### **\*పాఠశాలలో జరిగే కమిటీ సమావేశాలకు తప్పక హాజరు కావాలి.\***

### **\*పనులు జరిగే సమయంలో పర్యవేక్షిస్తూ సూచనలివ్వాలి.\***

### **\*పనులలో నాణ్యత ఉండేలా చూసుకోవాలి.\***

### **\*ఈ కార్యక్రమంలో ప్రథమ బాధ్యత వహించాల్సివుంది.\***

### **2. \*Assistant Engineer (AE):\***

### **\*వీరు మండలంలోని ప్రతి పాఠశాలలో Engineering Assistant లు నింపిన వివరాలు పరిశీలించి, పాఠశాలను సందర్శించి input data sheet లోని వివరాలను సరిచూసుకొని సంతకం చేయాలి.\***

### **\*పనులు జరిగే సమయంలో నాణ్యతకు అవసరమైన సూచనలు ఇస్తూ ఉండాలి.\***

### **\*పనులలో నాణ్యత కు పూర్తి బాధ్యత వహించాల్సివుంది.\***

### **3. \*ప్రధానోపాధ్యాయులు/ప్రిన్సిపాల్\*: **

### **\*ఇంజినీరింగ్ వారు పూర్తిచేసిన వివరాలు సరిపోల్చుకొని input data sheet లో సంతకం చేయాలి.\***

### **\*పూర్తిచేసిన ప్రతి సమాచారంను ఒక కాపీని Xerox ను పాఠశాలలో భద్రపరచాలి.\***

### **\*మరొక ప్రతిని ఇంజినీరింగ్ వారికి ఇవ్వాలి.\***

### **\*మరొక ప్రతిని మండల విద్యాశాఖాధికారిగారికి ఇవ్వాలి.\***

### **\*కమిటీ సమావేశం జరిగే సమయంలో ఛైర్మన్, వైస్ ఛైర్మన్, సభ్యులు, ఇంజినీరింగ్ వారు EA, AEలు పాల్గొనేలా కోఆర్డినెట్ చేసుకోవాలి.\***

### **\*పనులు జరిగే సమయంలో  పనులలో నాణ్యత ఉండేలా 7గురు కమిటీ సభ్యులతో చర్చిస్తూ ఉండాలి.\***

### **యాక్షన్‌ ప్లాన్‌\***

### **\*ఈ నెల 31న మాస్టర్‌ ట్రైనీలతో మండల స్థాయిలో సీఆర్‌పీ, వార్డు,గ్రామ సచివాలయాల్లో కొత్తగా చేరిన వెల్ఫేర్‌ అండ్‌ ఎడ్యుకేషన్‌ అసిస్టెంట్‌, ఇంజనీరింగ్‌ అసిస్టెంట్‌లకు శిక్షణ ఇస్తారు. అదే రోజున పేరెంట్‌ కమిటీలకు అవగాహన కల్పిస్తారు.\***

### **\*జనవరి 5లోగా అంచనాలు సిద్ధమవ్వాలి. వాటి సాంకేతిక అనుమతి కోసం రిపోర్టు డీఈవోకు పంపాలి. వాటిని పరిశీలించాక పరిపాలనా ఆమోదం కోసం ఫైల్‌ కలెక్టర్‌కు వెళ్తుంది. అదే రోజున కలెక్టర్‌ వాటికి అనుమతి ఇస్తారు.\***

### ** \*జనవరి 5 నాడు పథకానికి సంబంధించి బ్యాంకు ఖాతాలు తెరవాలి. పాఠశాల హెచ్‌ఎం, పేరెంట్‌ కమిటీ చైర్మన్‌, మరికొందరి సభ్ల్యులతో ఖాతాలు ప్రారంభించాలి. వాటిని ఎస్‌టీఎంఎస్‌ యాప్‌లో అప్‌లోడ్‌ చేయాలి.\***

### **\*జనవరి 8న పనుల ప్రారంభానికి అవసరమైన అంచనా విలువలో 15 శాతం నిధులు తీసుకోడానికి పేరెంట్‌ కమిటీ తీర్మానం చేయాలి.\***

### **10న సంబంధిత ఇంజనీరింగ్‌ శాఖల ఈఈలతో పేరెంట్‌ కమిటీలు ఒప్పందం చేసుకోవాలి. అదే రోజున పనులు ప్రారంభించాలి.**

### **󠀁[CSE – APSS – ManaBadi Naadu-Nedu First Phase Provisionally Approved Schools List](https://schooledu.ap.gov.in/DSENEW/manaBadiNaaduNedu.jsp)󠁿**

### **󠀁[MANA BADI NAADU NEDU BOOK KEPING PDF FILE](https://drive.google.com/file/d/1Hvhtpu-cwV5I1TV1TIG61s5Rhswm77ex/view?usp=sharing)󠁿**

### **󠀁[MANA BADI NEDU NADU FOR MUNICIPAL SCHOOLS ](https://drive.google.com/file/d/12yOKWen4HzmLna-zh-CO5psaX6JgLC9Q/view?usp=sharing)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
