# many-passenger-trains-be-converted-express-Trains-ap

- Link: https://amaravathiteacher.com/many-passenger-trains-be-converted-express-trains-ap/
- Published: 2020-10-22T15:05:44+05:30
- Author: amaravathiteacher

## **many-passenger-trains-be-converted-express-Trains-ap**󠀁[](https://amaravathiteacher.com/many-passenger-trains-be-converted-express-trains-ap/)󠁿

### **ఇన్నాళ్లూ పాసింజర్లుగా నడుస్తున్న పలు రైళ్లు ఎక్స్‌ప్రెస్‌లుగా మారబోతున్నాయి. **

### **దక్షిణ మధ్య రైల్వే పరిధిలోని విజయవాడ, గుంటూరు డివిజన్లలో దాదాపు 20 వరకు పాసింజర్లు ఇలా ఎక్స్‌ప్రెస్‌ రైళ్లుగా  అప్‌గ్రేడ్‌ కానున్నాయి.  **

 * 
   ### **దేశంలోని వివిధ జోన్ల పరిధిలో నడుస్తున్న పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌/మెయిల్‌లుగా మార్పు చేస్తూ తాజాగా రైల్వే బోర్డు నిర్ణయం తీసుకుంది. రైల్వే బోర్డు వాటి      వివరాలను వెల్లడించింది.  **
   
 * 
   ### **పాసింజర్‌ రైళ్లు గమ్యాన్ని చేరడంలో ఆలస్యమవుతున్నాయి. దీనిని దృష్టిలో ఉంచుకుని ఎక్స్‌ప్రెస్‌లుగా అప్‌గ్రేడ్‌ చేయాల్సిన పాసింజర్‌ రైళ్ల వివరాలను ఆయా రైల్వే జోనల్‌ కార్యాలయాల నుంచి రైల్వే బోర్డుకు ప్రతిపాదనలు/సిఫార్సులు వెళ్లాయి.  **
   
 * 
   ### **వాటిని అనుసరించి పలు పాసింజర్‌ రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మార్పు చేసింది.  **
   

### **అమలు ఎప్పటినుంచంటే.. **⏎ **అయితే ఈ రైళ్లు ఎప్పట్నుంచి ఎక్స్‌ప్రెస్‌లుగా రూపాంతరం చెందుతాయన్నది రైల్వే బోర్డు ఇంకా స్పష్టం చేయలేదు. **

### **ప్రస్తుతం కోవిడ్‌ నేపథ్యంలో కొన్ని స్పెషల్‌ రైళ్లను మాత్రమే నడుపుతున్నారు. **

### **తిరిగి పూర్తి స్థాయిలో రెగ్యులర్‌ రైళ్లను నడపడం ప్రారంభించాక అప్‌గ్రేడ్‌ చేసిన రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా నడపుతారని తెలుస్తోంది.  **

### **వేగంగా గమ్యానికి.. **⏎ **ఇవి ఎక్స్‌ప్రెస్‌లుగా మారితే ప్రయాణ వేగం మరింతగా పెరగనుంది. **

### **దీంతో గమ్యానికి చేరుకునే సమయం బాగా తగ్గుతుంది. ప్రయాణం కలిసొస్తుంది. **

### **కాగా ప్రస్తుతం ఆగుతున్న పాసింజర్‌ హాల్టుల్లో ఇకపై ఈ ఎక్స్‌ప్రెస్‌లు ఆగవన్నమాట! అయితే కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారిన రైళ్లకు పాసింజర్‌ హాల్టులున్న కొన్ని ముఖ్య స్టేషన్లలో హాల్ట్‌ ఇచ్చే అవకాశం ఉంది. **

### **ఎక్స్‌ప్రెస్‌లుగా మారగా మిగిలిన పాసింజర్‌ రైళ్లు మాత్రం నిర్ణీత స్టేషన్లలో యథావిధిగా ఆగుతాయి. కొత్తగా ఎక్స్‌ప్రెస్‌లుగా మారాక ఈ రైళ్లలో స్లీపర్‌ క్లాస్‌ బోగీలు, మరికొన్ని రైళ్లలో థర్డ్‌ ఏసీ కోచ్‌లను కూడా ఏర్పాటుతో పాటు రిజర్వేషన్‌ సదుపాయం కూడా ఉండే వీలుంది. **

### **ఎక్స్‌ప్రెస్‌లుగా మారనున్న పాసింజర్‌ రైళ్లు ఇవే.. **

### **󠀁[AP INTER 1ST YEAR ONLINE ADMISSIONS & APPLICATION DETAILS](https://amaravathiteacher.com/ap-inter-online-registration-process-2020-21-academic-year/)󠁿**

### **󠀁[AP EAMCET CUT OF RANKS & WEB COUNCILLING SCHEDULE DETAILS](https://amaravathiteacher.com/ap-eamcet-2020-admissions-councilling-notification-colleges-cut-off-ranks/)󠁿**

### **రైలు ప్రయాణం.. ప్రయాణికులకు భారం\* **

### ** \*ఎక్స్‌ప్రెస్‌లుగా పలు ప్యాసింజర్‌ రైళ్లు\*….. **

### ** సామాన్య ప్రయాణికులకు రైలు ప్రయాణం భారంగా మారనుంది. **

### **దేశవ్యాప్తంగా 362 ప్యాసింజర్‌, డెము, మెము రైళ్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారుస్తూ రైల్వేబోర్డు మంగళవారం పచ్చజెండా ఊపింది. కరోనా కష్టకాలంలో రైల్వేశాఖ గప్‌చుప్‌గా ఈ నిర్ణయం తీసుకుంది.  **

### **దేశవ్యాప్తంగా 17 జోన్ల పరిధిలో 362 ప్యాసింజర్లను ఎక్స్‌ప్రెస్‌లుగా మారిస్తే.. అత్యధికంగా 47 రైళ్లు దక్షిణ మధ్య రైల్వే నుంచే ఉన్నాయి. **

### **వీటిలో ప్రాచూర్యం పొందిన కాకతీయ ఫాస్ట్‌ ప్యాసింజర్‌, సికింద్రాబాద్‌ రేపల్లె రైళ్లు కూడా ఉన్నాయి.**

### **ద.మ.రైల్వేలో ఎక్స్‌ప్రెస్‌లుగా మార్చిన ప్యాసింజర్‌, డెము, మెమురైళ్లు వివరాలు\* **

### **◆ కాజీపేట-బళ్లార్ష, **

### **◆ భద్రాచలం రోడ్‌్-సిర్పూర్‌టౌన్‌,**

### **◆ బళ్లార్ష-భద్రాచలం రోడ్‌,**

### **◆ విజయపుర-బొల్లారం,**

### **◆ హైదరాబాద్‌-విజయపుర,**

### **◆ అజ్ని-కాజీపేట, **

### **◆కాజీపేట-అజ్ని,**

### **◆ మచిలీపట్నం-విశాఖపట్నం,**

### **■ విశాఖపట్నం-మచిలీపట్నం,**

### **◆ నర్సాపూర్‌-విశాఖపట్నం,**

### **◆ విశాఖపట్నం-నర్సాపూర్‌,**

### **◆ డోన్‌-గుంటూరు, **

### **◆గుంటూరు-డోన్‌,**

### **◆ గుంటూరు-నర్సాపూర్‌,**

### **◆ నర్సాపూర్‌-గుంటూరు,**

### **◆ కాచిగూడ-కర్నూలుసిటీ,**

### **◆ కర్నూలుసిటీ-కాచిగూడ**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
