# medical-invalidation-teachers-employees-process-ap

- Link: https://amaravathiteacher.com/medical-invalidation-teachers-employees-process-ap/
- Published: 2018-09-02T14:42:45+05:30
- Author: amaravathiteacher

## **_medical-invalidation-teachers-employees-process-ap_**

## **_MEDICAL INVALIDATION PROCESS_**

## **_మెడికల్ ఇన్వాలిడేషన్_**

### **అనారోగ్య కారణంగా పదవీ విరమణ పొందు ప్రభుత్వ ఉద్యోగి పదవీ విరమణకు కనీసం 5 సంవత్సరాల సర్వీసు కలిగియుండి, ఉద్యోగి కుటుంబానికి ఎటువంటి జీవనాధారము లేని తీవ్ర,దుర్భర ప్రత్యేక పరిస్థితులు ఏర్పడినచో నియామకాధికారి సంతృప్తి చెందిన మీదట కొన్ని షరతులకు లోబడి ఉద్యోగి కుటుంబ ఆధారితులకు కారుణ్య నియామకము చేస్తారు.**⏎ **(G.O.Ms.NO.504,GAD తేది:30-4-1980)****(G.O.Ms.NO.309,GAD తేది:04-07-1985)****(A.P Pension code volume-I,Article-441)**

### **తదుపరి ఒక కేసులో రాష్ట్ర ఉన్నత స్థాయి న్యాయస్థానం అట్టి కారుణ్య నియమకాలు రాజ్యంగ విరుద్దమని తీర్పు వెలువరించిన దరిమిలా రాష్ట్ర ప్రభుత్వం మెడికల్ ఇన్వాలిడేషన్ పై కారుణ్య నియామకాల పద్దతిని రద్దుపరచింది.**

### **భారతదేశ అత్యున్నత న్యాయస్థానం తీర్పు మేరకు ప్రభుత్వం మరలా మెడికల్ఇన్వాలిడేషన్ పై  ఉద్యోగుల కుటుంబ సభ్యులకు కారుణ్య నియామకాల పద్దతిని మరలా పునరుద్దరించింది.**

### **Public Services – Subordinate Services – Revival of the scheme of compassionate appointments to ****the dependents of Government employees who retire on medical invalidation, as per the judgment ****of Supreme Court of India in Civil Appeal No.4210/2003 dated 12.08.2008 filed by V.Sivamurthy ****and others – Orders – Issued. **

### 󠀁[**(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)**](https://drive.google.com/file/d/1UNViWUBw6COzEL7tgg_MN-sGDcQS-JdW/view?usp=sharing)󠁿

### **☘ఎవరు అర్హులు:☘**

### **కుటుంబ సభ్యులు అనగా AP Revised Pension Rules 1980 లోని రూలు 50(12B)లో నిర్దేశించిన వారై ఉండాలి.**⏎ **భార్య/భర్త, కుమారులు, కూతుళ్ళు , చట్టరిత్యా దత్తత తీసుకున్న కుమారుడు/కూతురు, అట్టి దత్తత రిటైర్మెంటుకు ముందుగా తీసుకునియుండాలి.****అవివాహిత కూతురు, విధవరాలైన కూతురు, విడాకులు పొందిన కూతురు.**

### **మెడికల్ ఇన్వాలిడేషన్ నిబంధనలు, **

### **󠀁[GOVERNMENT TEACHERS, HEAD MASTERS & PETs JOB CHART PDF FILE](https://amaravathiteacher.com/ap-teachers-headmasters-physical-education-teachers-job-chart-2020/)󠁿**

### **మెడికల్ ఇన్వాలిడేషన్  కోరు ఉద్యోగి నియామకాధికారికి దరఖాస్తు చేసుకోవాలి.**

### **సదరు దరఖాస్తు మెడికల్ బోర్డు సిఫార్సుల నిమిత్తం పంపబడుతుంది.**⏎ **జూనియర్ అసిస్టెంట్, తత్సమానమైన పోస్టు అంతకంటే తక్కువైన పోస్టులో నియామకం చేయవచ్చు.****(G.O.Ms.No.35 తేది:10-04-2000)**

### **మెడికల్ ఇన్వాలిడేషన్ పై ఉద్యోగి రిటైరైన తేది నుంచి ఒక సంవత్సరం లోపల ఉద్యోగం కోసం దరఖాస్తు చేసుకోవాలి.**⏎ **నియామక ఉత్తర్వులు జారీచేసిన తర్వాత, అభ్యర్ధికి సంబంధించిన అన్ని వివరములు ఎంప్లాయిమెంట్ కార్యాలయానికి తెలియజేయాలి.**

### **మెడికల్ బోర్డు నివేదిక  అందిన తర్వాత ఉద్యోగిని  నియామక అధికారి జిల్లాస్థాయి కమిటీ వారి పరిశీలనార్ధం పంపాలి.**

### **జిలాస్థాయి కమిటీ:**

### **1.జిల్లా కలెక్టర్-అధ్యక్షుడు (CHAIRMAN)**⏎ **2.జిల్లా వైద్య మరియు ఆరోగ్య అధికారి-సభ్యుడు****3.సంబంధిత జిల్లా శాఖ అధికారి-సభ్యుడు/కన్వీనర్**

### **శాఖాధిపతి (Head of the Department) కార్యాలయాలలో పనిచేయు ఉద్యోగులు/సెక్రటేరియేట్ శాఖాలలో పనిచేయు ఉద్యోగుల విషయంలో రాష్ట్రస్థాయి కమిటీ పరిశీలిస్తుంది**

### **మెడికల్ ఇన్వాలిడేషన్ పథకం క్రింద, కారుణ్యనియామకాలు, యూనిట్ నియామకాల డైరెక్ట్ రిక్రూట్మెంట్ ఖాళీలలో 5 % మించకూడదు**

### **భార్య,భర్తలిరువురు ఉద్యోగులైన సందర్భములో కారుణ్య నియామకానికి అవకాశము లేదు.**

### **మెడికల్ ఇన్వాలిడేషన్ స్కీము జిల్లాపరిషత్, మున్సిపల్,ఎయిడెడ్ టీచర్లకు వర్తింపచేసారు. **

### **మెడికల్ ఇన్వాలిడేషన్ (అనారోగ్య కారణాలపై) వైద్య ధ్రువపత్రము ద్వారా రిటైర్ అయిన వారికి పెన్షన్,కమ్యూటేషన్ అవకాశములేదు.**

### **మెడికల్ ఇన్వాలిడేషన్ ఉద్యోగికి ఇన్వాలిడు పింఛను ఇస్తారు**

### **ఏ జబ్బుల వల్లమెడికల్ ఇన్వాలిడేషన్ పై  రిటైరు కావచ్చ**⏎ **క్రింద తెలిపిన ఏదేని జబ్బులు రోగ పీడితులుగా ఉన్న ఉద్యోగి మెడికల్ఇన్వాలిడేషన్ పై మెడికల్ బోర్డు నిర్థారణ సర్టిఫికేట్ ఆధారంగా,మెడికల్ ఇన్వాలిడేషన్ పై రిటైరు కావచ్చును.**

### **󠀁[AP EMPLOYEES SALARY AND SERVICE CERTIFICATE](https://amaravathiteacher.com/salary-certificate-pay-slip-for-ap-employees/)󠁿**

### 󠀁[**COMPASSIONATE APPOINTMENT FOR GOVERNMENT EMPLOYEES PROCEESURE GO COPIES DOWNLOAD**](https://amaravathiteacher.com/compassionate-appointment-ap-teachers-employees/)󠁿

### **1.పక్షవాతము (PARALYSIS):          **⏎ **A)నాలుగు అవయవములు-కాళ్ళు,చేతులు****B)ఒకవైపు పై భాగము లేదా,క్రింది భాగము****C)క్రింది భాగము రెండు అవయవములు లేదా/అంగములు**

### **అంతిమదశలో ఉన్న మూత్రపిండముల రోగము(END STAGE RENAL DISEASE)**

### **అంతిమదశలో ఉన్న కాలేయ రోగము(END STAGE LEVER DISEASE)**

### **క్యాన్సరు(CANCER WITH METASTASIS STAGE OR SECONDARIES)**

### **మానసిక సంబంధితము(DEMENTIA-MENTAL DISORDER)**

### **తీవ్రమైన పార్కిన్సన్ జబ్బు(SEVERE PARKINSON DISEASE)**

### **మెడికల్ ఇన్వాలిడేషన్  విషయంలో కమిటీకి పంపవలసిన వివరములు**

### **GOVT MEMO.NO.10054/K2/2009 తేది:05-09-2009 ప్రకారం**

### **1.మెడికల్ ఇన్వాలిడేషన్ కోరు ఉద్యోగి పేరు:**⏎ **2.ఉద్యోగి పనిచేస్తున్న శాఖ-హోదా-జీతపు స్కేలు:****3.ఏదైనా క్రమశిక్షణా చర్యలు అపరిష్క్రుతంగాఉన్నాయా:****4.ఉద్యోగి సర్వీసు క్రమబద్దీకరించబడిందా:****5.సర్వీసు రిజిస్టరు మేరకు పుట్టిన తేది:****6.వాస్తవంగా కాలపరిమితిమేరకు పదవీవిరమణ  చేయు తేది:****7.రోగ వివరములు:****8.అట్టి రోగము ప్రభుత్వ ఉత్త్ర్వులు G.O.Ms.No.661, తేది:23-10-2008 లో తెలిపిన మేరకు కలిగియున్నదా:****9.ఉద్యోగి రోగ చికిత్స నిమిత్తం అతను/ఆమె మెడికల్ సెలవుపై ఉన్నారా,అయితే ఏ తేదినుంచి  అట్టి సెలవుపై అట్టి రోగ చికిత్స నిమిత్తం ఉన్నారు:****10.మెడికల్ బోర్డు వారి సిఫార్సులు(ORIGINAL) సిఫార్సు జతపరిచారా:****11.శాఖాపర విశ్లేషణ-సిఫార్సు**

### **󠀁[AP LEAVE RULES FUNDAMENTAL RULES F.R PDF ](https://amaravathiteacher.com/andhra-pradesh-leave-rules-all-type-of-leaves-g-os/)󠁿**

### 󠀁[**(G.O.Ms.No.661 GAD తేది:23-10-2008)**](https://drive.google.com/file/d/1UNViWUBw6COzEL7tgg_MN-sGDcQS-JdW/view?usp=sharing)󠁿

### 󠀁[**_FOR ALL GOVERNMENT ORDERS CLICK HERE_**](http://goir.ap.gov.in/)󠁿

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ NEW SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
