MPTC ZPTC ELECTIONS VOTES COUNTING USER MANUAL DOWNLOAD

MPTC ZPTC ELECTIONS VOTES COUNTING USER MANUAL DOWNLOAD

  1. పోస్టల్ బ్యాలెట్స్ మొదటగా లెక్క పెట్టాలి.
  2. Form-XVII Declaration Part-“A” కవరులో  ఉంటేనే Part-“B” కవరు విప్పవలెను 
  3. పోస్టల్ బ్యాలెట్స్ కౌంటింగ్ ను Form-26 నందు MPTC వారిగా నమోదు చేయ్యాలి
  4. పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్ పూర్తయిన పిదప MPTC/ZPTC వారీగా ఒక కవరు నందు పెట్టి సీల్ వెయ్యవలెను Valid Postal Ballot Papers MPTC/ZPTC వారీగా మరియు  Rejected Postal Ballot Papers | MPTC/ZPTC వారిగా (అభ్యర్థి వారిగా సీల్ వెయ్యవలెను)
  5. ఒక MPTC సంబంధించిన పోలింగ్ స్టేషన్స్ అన్నియు ఒకే టేబుల్ నందు మొదటి దశ కౌంటింగ్ నందు పూర్తిచెయ్యాలి. 
  6. MPTC/ZPTC ఓట్లు 25 చొప్పున బండిల్ కట్టవలెను, బ్యాలెట్ బాక్సు నందు కనుగొనబడిన బ్యాలెట్ పత్రముల వివరములు బ్యాలెట్ పేపరు అకౌంట్ తో సరిచూసుకొని బ్యాలెట్ పేపరు ఆకౌంటు నందు నమోదు పరచవలెను 
  7.  MPTC/ZPTC వారిగా ఒకే డబ్బా నందు 25 చొప్పున కట్టిన బండిల్స్ వెయ్యవలెను, Form-26 నందు పోలింగ్ స్టేషన్ వారిగా బ్యాలెట్ బాక్సు నందు కనుగొనబడిన ఓట్లను నమోదు చెయ్యవలెను
  8. బ్యాలెట్ బాక్స్ సీల్ మరియు పేపర్ సీల్స్ ఏజెంట్లకు చూపించవలెను 
  9.  కౌంటింగ్ హాలు నందు ఏర్పాటు చేయబడిన టేబుల్స్ 50% MPTC & 50% ZPTC టేబుల్స్ కేటాయించి కౌంటింగ్ పక్రియ కొనసాగించవలెను
  10. ఒక టేబుల్ నకు ఒక రౌండ్ కు 25 ఓట్ల బండిల్స్ – 40 అనగా 1000 ఓట్ల లెక్కించవలెను
  11. అభ్యర్థి వారిగా పడిన ఓట్లను 50 చొప్పున బండిల్స్ కట్టవలెను, 50 చొప్పున కట్టబడిన బండిల్స్ అభ్యర్థి వారిగా రౌండ్ పూర్తి అయిన పిదప పిజిన్ హోల్ నందు భద్రపరచవలెను, తరువాత అదే టేబులు 1000 ఓట్లు పంపవలెను. ఇలా MPTC పూర్తి అయ్యెంత వరకు కొనసాగాలి.
  12. నిరాకరించిన ఓట్లు అన్నియు రిటర్నింగు అధికారి గారు తనిఖీ చెయ్యవలెను
  13. నిరాకరించిన బ్యాలెట్ పత్రములపై “REJECTED” చేయడం జరిగినదని వ్రాసి రిటర్నింగు అధికారి గారు సంతకం చెయ్యవలెను
  14. అభ్యర్థి వారిగా పోలైన ఓట్లు మరియు నిరాకరించిన ఓట్లు, పోస్టల్ బ్యాలెట్స్ ఓట్లు వివరములు FORM NO.26 నందు నమోదు చెయ్యవలెను
  15. FORM NO.26 నందు అభ్యర్థి వారిగా పోలైన ఓట్లను రిటర్నింగు అధికారి గారు ప్రకటించాలి, ప్రకటించిన తరువాత ఎటువంటి ఫిర్యాదులు లేకపోతే FROM NO.26 నందు రిటర్నింగు అధికారి గారు సంతకం చేయ్యాలి
  16.  రిటర్నింగ్ అధికారి గారు ప్రకటించిన ఫలితాల తరువాత ఒకటి లేదా రెండు నిముషముల లోపల ఏవరైన అభ్యర్థి రికౌంటింగ్ అవసరమని చెప్పి నిర్దిష్టమైన ఫిర్యాదుతో వ్రాతపూర్వకంగా 15 నిమిషాల లోపల రిటర్నింగు అధికారి గారికి తెలియజేయాలి
  17. MPTC/ZPTC వారిగా అభ్యర్థి వారిగా పోలైన ఓట్లును కవరు నందు పెట్టి సీల్ వెయ్యవలెను. అలాగే Rejected and Invalid Ballot Papers కూడా MPTC/ZPTC వారిగా సపరేటుగా సీల్ వెయ్యవలెను 
  18. ఒక MPTC/ZPTC నందు పోటీ చేసిన అభ్యర్థులకు సమానంగా ఓట్ల వచ్చినప్పుడు వారి పేర్లను మాత్రమే లాటరి వేసి విజేతగా నిర్ణయించవలెను.
  19. Form No.27 నందు ఎన్నిక అయిన అభ్యర్థి వివరములను రిటర్నింగ్ అధికారి గారు ప్రకటించవలెను 
  20. Form No.28 నందు ఎన్నిక రిటరును నమోదు చేయ్యవలెను 
  21. Form No.29 నందు అభ్యర్థి ఎన్నికైనట్లు ఎన్నిక ధృవపత్రం జారీ చేయవలెను, ఎన్నిక ధృవపత్రం ముట్టినట్లు రశీదు తీసుకొనవలెను
  22. మండలముంలో గల అన్ని MPTC సభ్యులు ఎన్నికైనట్లు మండల ప్రజా పరిషత్ కార్యాలయము నందు పబ్లికేషన్ చెయ్యవలెను

MPTC ZPTC సాధారణ ఎన్నికలు 2020-ఓట్ల లెక్కింపు ప్రక్రియ పై సూచనలు

  1.  ఎన్నికల ప్రక్రియలో ఎన్నికలు నిర్వహించడం ఎంత ముఖ్యమో ఓట్లు లెక్కింపు ప్రక్రియ నిర్వహించడం కూడా అంతే ముఖ్యం.
  2.  Annexure-36 లో సూచించిన ఫారం ప్రకారము వ్రాత పూర్వకముగా పోటీలో ఉన్న అభ్యర్థులకుగాని లేదా అతని ఎన్నికల ఏజెంట్ నకుగాని కౌంటింగ్ ప్రక్రియ ఎక్కడ చేపట్టేది స్థలము, తేదీ, సమయము ముందుగా తెలియజేయాలి.
  3.  అనివార్యకారణముల వలన ఏదైనా పోలింగ్ కేంద్రములో ఎన్నిక వాయిదా పడినట్లైతే ఆ పోలింగ్ కేంద్రములో ఎన్నిక పూర్తయిన తరువాతనే మొత్తం లెక్కింపు ప్రారంభించాలి.
  4.  ఓట్ల లెక్కింపు ప్రక్రియ చేపట్టే స్థలం విశాలంగా ఉండాలి. లెక్కింపు సిబ్బంది అలాగే పోటీలో ఉన్న అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లుకు సరిపడా చోటు ఉండేలా చూసుకోవాలి. దీనికొరకు లెక్కింపు కొరకు ఎన్ని టేబుల్స్ వినియోగిస్తామో ముందే నిర్ణయించుకోవాలి.
  5. లెక్కింపు ప్రక్రియ సవ్యంగా నిరాటంకంగా సాగేలా లైటింగ్ మరియు అంతరాయం కలిగితే జనరేటర్ వినియోగించుకొనేలా ముందస్తుగానే ఏర్పాటు చేసుకొని అందుబాటులో ఉంచుకోవాలి.
  6. ఒక మండలంలో ఆ మండలంలోని MPTC సభ్యుల సంఖ్యకు సమానంగా లెక్కింపు టేబుల్స్ ఏర్పాటు చేసుకొనవచ్చును ఆదనంగా రిటర్నింగ్ అధికారి వారి టేబుల్ ను ఏర్పాటు చేసుకొనవలెను.
  7.  ప్రతీ అభ్యర్థికి అతని ఓట్ల లెక్కింపు కొరకు ఎన్ని టేబుల్స్ వినియోగిస్తారో అంతమంది ఏజెంట్లను, రిటర్నింగ్ అధికారి టేబుల్ వద్ద గమనించుకోవడానికి ఒక ఒక ఏజెంట్ ను నియమించుకొనవచ్చును.
  8. అభ్యర్థుల తరుపున లెక్కింపును పరిశీలించుకోవడానికి వచ్చే ఏజెంట్లనదరికీ వారి ఫోటో గుర్తింపుతో కూడిన, అలాగే వారు ఏ పార్టీ అభ్యర్థికి ప్రాతినిధ్యం వహిస్తున్నారో తెలిపే విధంగా బ్యాడ్జీలు సంతకం చేసి సరఫరా చేయాలి.
  9. పోలింగ్ కౌంటింగ్ హాల్ లోకి నిధితముగా పోలీస్ వారు పరీక్ష జరిపిన తరువాతనే హాల్ కి అనుమతించాలి. వాటర్ బాటిల్స్, Blades లేక ఇతర హానికరమైన వస్తువులను లోనకు అనుమతించకూడదు. COVID-19 పరీక్ష జరిపి జ్వరం లేదు అని నిర్ధారించిన తరువాత మాత్రమే లోనకి అనుమతించవలెను.

లెక్కింపు ప్రక్రియ జరిగే కేంద్రములోనికి క్రింది వారికి మాత్రమే ప్రవేశం కలదు:

  •  కౌంటింగ్ కొరకు నియమించిన సూపర్వైజర్లు మరియు కౌంటింగ్ అసిస్టెంట్లు.
  • ఎన్నికల కమిషన్ చే నిర్ధారించబడిన అధికారులు.
  •  ఎన్నికల విధులు నిర్వహించే ప్రభుత్వ అధికారులు మరియు సిబ్బంది.
  •  పోటీ లో ఉన్న అభ్యర్థులు వారికి చెందిన ఎలెక్షన్ ఏజెంట్స్ మరియు లెక్కింపు ఏజెంట్లకు మాత్రమే ప్రవేశము కలదు.
  • కౌంటింగ్ కేంద్రములోని ఎవరి వద్ద సెల్ ఫోన్ అనుమతించరాదు, కేంద్రపు గుమ్మం వద్ద పోలీస్ సిబ్బందిని నియమించి కౌంటింగ్ హాలు లోనికి ప్రవేశమునకు అనుమతిలేని వారిని అనుమతించకూడదు. కేంద్రము నందు క్రమశిక్షణా పూరితమైన వాతావరణం నెలకొనేలా చర్యలు తీసుకోవలయయును.
  •  కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించేముందు RO-Hand Book Page No: 225 నందు కల పంచాయతీరాజ్ చట్టపు సెక్షన్ 217 ను చదివి వినిపించాలి.

పోస్టల్ బాలెట్ లెక్కింపు ప్రక్రియ :

  1. ఓట్ల లెక్కింపు ప్రక్రియలో మొదటగా పోస్టల్ బ్యాలెట్ పత్రములు లెక్కింపు ప్రారంభించాలి. అలాగే లెక్కింపును నిర్దేశించిన ఖచ్చితముగా ప్రారంభించాలి.
  2.  Form XIX (Cover – B) – ఒకటి తరువాత ఒకటి తెరవాలి.
  3. Cover-B తెరిచిన తరువాత అందులో Cover-A మరియు Form XVII నందు Declaration form ఉండును.
  4. ఈ క్రింది తెలిపిన పరిస్థితి ఉన్నచో Cover -A తెరవకూడదు.

  1. i. ప్రతీ కవరు తెరిచిన తరువాత ఫారం XVII డిక్లరేషన్ పరిశీలించాలి.

    ii. డిక్లరేషన్ పరశీలనలో డిక్లరేషన్ నిర్దేశించిన కవరు లో లేకపోయినా, డిక్లరేషన్ లో అధీకృత అధికారి సంతకం లేకపోయిన, ఓటరుకు పంపిన బ్యాలెట్ పేపర్ సీరియల్ నెంబరు, బ్యాలెట్ పేపర్ మీద ఉన్న సీరియల్ నెంబరు సరిపోలేకపోయిన అటువంటి బ్యాలెట్ను తిరస్కరించవలెను.

    iii. ఫారం XIX (Annexure 39) కల్గిన పోస్టల్ బ్యాలెట్ పత్రములు కల్గిన కవర్లు నిర్ధేశించిన సమయానికి అందని కవర్లు తెరువవలసిన అవసరం లేదు, వాటి మీద ‘Rejected’ (తిరస్కరించబడినది) అనే రిమార్కు వ్రాసి ప్రత్యేకమైన కవర్లలో భద్రపరుచుకోవాలి.

    iv. ఫారం XIX సకాలంలో వచ్చినవి ఒకదాని తరువత ఒకటి తెరవాలి.

    V. ఈ విధముగా తిరస్కరించబడినవి ఒక బండిల్ గా ప్యాకింగ్ చేయవలెను.

  2.  పైన సూచించిన నియమాలన్ని సరిపోయిన పక్షంలో ఒకదాని తరువాత ఒకటి తెరిచి బ్యాలెట్ పేపరును పరిశీలించాలి ఆ పరిశీలనలో

    1. ఎటువంటి గుర్తుతో ఓటు నమోదు చేయకపోయిన.
    2.  ఓటు ఒకరికంటే ఎక్కువమంది అభ్యర్థులకు వేసిన.
    3. అలాగే బ్యాలెట్ పత్రం పాడైపోయిన.
    4. అలాగే పోస్టల్ బ్యాలెట్ కొరకు నిర్దేశించిన కవరులో లేకపోయిన బోగస్ లేక అధికారికంగా జారీ చేసిన బ్యాలెట్ పేపర్ కానప్పుడు.
    5. మార్క్ కాకుండా ఓటరు తెలిసేలా ఏదేని వివరాలు తెలిపినచో వాటిని తిరస్కరించవలెను.
      •  పోస్టల్ బ్యాలెట్ పై మార్క్ ఏ విధముగా ఉండాలని ఎటువంటి నిబంధనలు లేవు ఓటర్ సూచించిన మార్క్ ప్రకారం ఓటర్ అభిప్రాయం
      • చెల్లుబాటైన ఓట్ల వివరాలు అభ్యర్థి వారిగా, పదవి వారిగా బండిల్ గా సీల్ చేసి లోపల ఉన్న వస్తువుల వివరాలు నమోదు చేయాలి. 18) అటువంటి లెక్కింపులో నమోదైన ఓట్లను రిజల్ట్ షీటులో ఫారం XXVI- Annexure. 40 ప్రతీ అభ్యర్థికి ఎదురుగా నమోదుచేయవలెను.
      • తదుపరి అన్నీ సక్రమంగా ఉన్న బ్యాలెట్ పత్రములు, తిరస్కరించిన బ్యాలెట్ పత్రములు వేరువేరుగా ప్యాకెట్లుగా చేసి వాటిని ఒకే ప్యాకెట్ చేసి సీలు వేసి (అధికారిక) సీలుతో బాటు అభ్యర్థులు లేదా వారి ఏజెంట్ల సీలు కూడా సంక్షిప్తంగా వ్రాసుకొని భద్రపరచవలెను.
      •  నిర్దేశిత సమయానికన్నా ఆలస్యంగా వచ్చిన చో పోస్టల్ బ్యాలెట్ పత్రములు (కవర్ ఫారం XIX) ప్రత్యేకంగా సీలు చేసి భద్రపరచవలెను.

      బ్యాలెట్ పత్రముల లెక్కింపు (ప్రాథమిక లెక్కింపు

      1.  బ్యాలెట్ పెట్టెలలోని ఓట్లు లెక్కించు క్రమంలో పోలింగ్ స్టేషన్ క్రమ సంఖ్యననుసరించి లెక్కింపు ప్రారంభించవలెను. ఈ సమయంలో ఆ యా పోలింగ్ స్టేషన్ లకు సంబంధించిన బ్యాలెట్ పేపరు అకౌంట్ మరియు పేపరు సీల్ అకౌంటు సిద్ధముగా ఉంచుకొనవలెను.
      2.  స్ట్రాంగ్ రూమ్ నుండి సీల్డ్ బ్యాలెట్ బాక్స్ లు కౌంటింగ్ టేబుల్ కు అందజేయలి ఒకొక్క టేబుల్ కు ఒక పోలింగ్ కేంద్రమునకు చెందిన బ్యాలెట్  బాక్స్ జారీ చేయాలి.
      3. ఇది పోలింగ్ స్టేషన్ క్రమ సంఖ్య ప్రకారం జారీ చేయాలి.
      4. ప్రతీ సీల్డ్ బ్యాలెట్ బాక్స్ తో బ్యాలెట్ పేపర్ అకౌంటు పేపర్ సీల్ అకౌంట్ కు సంబందించిన సీల్డ్ కవర్లు కౌంటింగ్ సూపర్వైజర్ కు

       ప్రాథమిక లెక్కింపు నందు కౌంటింగ్ సిబ్బంది నిర్వహించు విధులు

      1.  సీల్డ్ బ్యాలెట్ బాక్స్ కు సీళ్లు తెరవకముందు ఏజెంట్లకు సీళ్లు సక్రమంగా ఉన్నవని చూపిన తరువాత మాత్రమే సీళ్లు తొలగించాలి.
      2. బ్యాలెట్ బాక్స్ తెరిచే ముందు పేపర్ సీలు క్రమ సంఖ్యను ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన పేపర్ సీలు ఎకౌంట్ తో సరిపోల్చుకొనవలెను. సరిపోలినట్లైతో కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభించవచ్చును. కొన్ని సందర్భాలలో పేపర్ సీల్ నెంబరు సరిపోనట్లైతే, ప్రిసైడింగ్ అధికారి ఇచ్చిన PO డైరీలో ఉపయోగించని పేపర్ సీల్ క్రమ సంఖ్యతో పోల్చుకొనిచూసుకోవలెను.
      3. ఈ సందర్భములో రిటర్నింగ్ అధికారి (P.O వారు నమోదు తప్పు చేసినట్లు గమనించినట్లైయిన) దాని అభ్యంతరంగా పరిగణలోనికి తీసుకోవలసిన అవసరం లేదు.
      4.  సంబంధిత అభ్యర్థులు లేదా వారి ఏజెంట్లకు బ్యాలెట్ పెట్టెకు పెట్టిన పేపర్ సీలు సీరియల్ నెంబరు కూడా ఋజువు చూసుకొనే అవకాశం కల్పించాలి…
      5.  ఒకవేళ పేపర్ సీల్ టేంపర్ జరిగినట్లు గమనించినట్లయిన జిల్లా అధికారుల దృష్టిలో ఉంచి తదుపరి చర్యలు గైకొనవలెను.
      6. అన్ని సక్రమముగా ఉన్నవని ఏజెంట్లకు తెలిపిన తరువాత బ్యాలెట్ బాక్స్ తెరవాలి.
      7. బ్యాలెట్ బాక్స్ లోని బ్యాలెట్ పత్రములన్నీ లెక్కింపు కొరకు బయటకుతీసినట్లు, బ్యాలెట్ పెట్టె పూర్తిగా ఖాళీ చేసినట్లు లెక్కింపు టేబుల్ మీద నుంచి బ్యాలెట్ పెట్టెను తొలగించే సమయంలో ఏజెంట్లకు చూపించవలెను.
      8.  ఈ క్రమంలో MPTC, ZPTC అభ్యర్థులకు పోలైన బ్యాలెట్ పత్రాలు నిలువు మడత విప్పకుండా ఓట్లను వేరుచేయవలెను ఈ క్రమంలో ప్రతీ బండిల్ లోను 25 పేపర్లు ఉండేలా కట్టలుగా కట్టవలెను. ఈ కట్టలు కట్టే సమయంలో బ్యాలెట్ పేప తో సరిపోల్చిచూసుకొనవలెను. వాటికి సంబంధించి వివరములు నమోదు చేసుకొనవలెను (8 A).
      9.  ప్రతీ MPTC పదవికి చిన్న డ్రమ్ము ఏర్పాటు చేయాలి అందు ఆ పరిధిలోని అన్ని పోలింగ్ కేంద్రముల నుండి సేకరిం పత్రాల కట్టలు ఉంచాలి, అన్ని కట్టలు కలిపి ఆ MPTC పరిధిలోని అన్ని ఓట్ల కట్టాలను మిశ్రమంగా చేయాలి.
      10. ఈ విధముగా సీల్డ్ బ్యాలెట్ బాక్స్ లు అన్ని తెరచి బ్యాలెట్ పత్రాలు పదవి వారీగా విడివిడి డ్రమ్ములలో సేకరణతో ప్రాధమిక లెక్కింపు పూర్తగును.
      11. ఈ ప్రక్రియలో ప్రతీ టేబుల్ వద్ద కౌంటింగ్ సిబ్బంది కౌంటింగ్ ఏజెంట్ల నుండి సీళ్లు సక్రమంగా ఉన్నవని బ్యాలెట్ పేపర్ అకౌంట్ సరిపోయిందని పోలింగ్ కేంద్రం వారిగా ధ్రువపత్రములు సేకరించాలి.
      12. ఈ లెక్కింపు తర్వాత వివరణాత్మక లెక్కింపు ప్రారంభించాలి.

      బ్యాలెట్ పాత్రముల లెక్కింపు వివరణాత్మక లెక్కింపు) :

      1.  ఈ లెక్కింపు నందు అభ్యర్థి వారిగా పోలైన ఓట్లు చెల్లుబాటు కానీ ఓట్లను ప్రతీ బ్యాలెట్ పత్రముల యొక్క నిలువు మడత తెరిచి ఏజెంట్ల సమక్షంలో టేబుల్ పై ఏర్పాటు చేసిన గుర్తు వారి ట్రే ల యందు ఏ గుర్తుకు ఓటు పడిందో చూపి ఆ ట్రే నందు వేయాలి.
      2. సందేహాత్మక ఓటుగా నిర్ధారించినవి డౌట్ ఫుల్ ట్రే లో వేయాలి వీటికి అవసరమైన ట్రే లు ముందుగా సిద్ధం చేసుకోవాలి.
      3.  ప్రాధమిక లెక్కింపు సమయములో బ్యాలెట్ పేపర్ విలువు మడతలో ఉండగానే 25 బ్యాలెట్ పత్రములు ఒక కట్ట చొప్పున రెండు వైపులా రబ్బర్ బ్యాండ్ తో కట్టవలెను. చివరగా మిగిలిన బ్యాలెట్ పత్రములు 25 కంటే తక్కువ ఉన్నపటికీ ఒక కట్టకట్టవలెను. ఇలా కట్టిన కట్టలన్నీఒక డ్రమ్ములో వేసి కలిపిన తరువాత 25 x 40 (కట్టలు) చొప్పున ఒక టేబుల్ పై ట్రేలలో వేసి నిశిత లెక్కింపునకు ఉపక్రమించవలేను. (1 రౌండ్ = 1000 25×40)
      4.  ZPTC బ్యాలెట్ పేపర్ల లెక్కింపుకు నిర్ధారించిన టెబుల్స్ కు ప్రతీ రౌండ్ ప్రతీ టేబుల్ కు వెయ్యి చొప్పున బ్యాలెట్ పత్రాలు డ్రమ్ము ఇంచార్జ్ వద్దకు పంపాలి.
      5. అలాగే ఓటు వేసిన గుర్తు, ఓటు వేయడానికి ఇచ్చింది కాకుండా వేరేగా ఉన్న; లేదా బ్యాలెట్ పత్రం మీద వేరే ఏమైనా రాతలు రాసిన అటువంటి పోస్టల్ బ్యాలెట్లను లెక్కింపునకు పరిగణన లోనికి తీసుకొనకూడదు.
      6. ఏ అభ్యర్థికి ఓటు వేసాడో నిర్ణయం తీసుకొనేలా ఓటు మార్క్ చేయబడి ఉండి అటువంటి ఓటును లెక్కించవచ్చును.
      7. ఈ బండెల్స్ ను విడదీసి అభ్యర్థుల వారీగా లెక్కించుచూ మొత్తం బండిల్స్ పూర్తి అగువరకు లెక్కింపు చేయవలెను.
      8.  ప్రతీ రౌండ్ కౌంటింగ్ ముగిసిన తరువాత ఆ టేబుల్ కు కేటాయించిన 1000 ఓట్లలో ఏ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పొలైయ్యాయో లెక్కించి ఏజెంట్లకు తెలియజేసి వారి సంతకము తీసుకొనవలెను.

        బ్యాలెట్ పేపరు తిరస్కరించడానికి కారణాలు:

        1. . బ్యాలెట్ పేపరుపై ఓటు గుర్తు కాకుండా వేరే ఏదైనా రాతలు లేదా గుర్తులు ఉంటే. ఏ మార్కు లేని పక్షంలో: లేదా అతను వేయదలచిన గుర్తు దగ్గర గాని, పేపరు దగ్గరలో గాని లేని పక్షంలో లేదా ఓటు చేయడానికి ఇచ్చిన Arrow cross మార్క్ తో కాకుండా వేరేదానితో ఓటు చేసిన పక్షంలో, ఒకరికన్న ఎక్కువ అభ్యర్థులకు ఓటు మార్కు చేసిన సందర్భంలో
        2.  అలాగే ఓటు మార్క్ వేసినప్పటికీ అది సహేతుకంగా ఏ అభ్యర్థికి చెందినదో గుర్తించలేని పక్షంలో.
        3.  బ్యాలెట్ పేపర్, చిరిగిపోయినా లేదా అవాస్తవికమైన పక్షంలో
        4. సీరియల్ సంఖ్య లేదా బ్యాలెట్ పత్ర డిజైన్ పోలింగ్ కేంద్రానికి కేటాయించిన వాటికి భిన్నంగా ఉన్న పక్షంలో
        5. అలాగే బ్యాలెట్ పత్రం వెనుకవైపు డిస్ట్రింగ్విషింగ్ మార్క్ లేదా ప్రిసైడింగ్ అధికారి వారి సంతకం లేని పక్షంలో – Rule 45 ప్రకారం.

        ఈ పై కారణాలపై రిటర్నింగ్ అధికారి సంతృప్తి చెందిన పక్షంలో అటువంటి ఓట్లను తిరస్కరించవచ్చును. అటువంటి బ్యాలెట్ పత్రములపై ‘REJECTED’ అని వ్రాసి సంక్షిప్తంగా తగు కారణం కూడా నమోదు చేయవలెను. చివరగా బ్యాలెట్ ను లెక్కింపులోనికి తీసుకోని పక్షంలో అభ్యర్థి లేదా ఏజెంటుకు పరిశీలన నిమిత్తము చూపవలెను. కాని వారు బ్యాలెట్ పత్రమును చేతితో పట్టుకొని చూచుటకు అనుమతించరాదు. ఈ విషయంలో అంతిమ నిర్ణయాధికారం రిటర్నింగ్ అధికారివారికి మాత్రమే కలదు.

        టెండర్ బ్యాలెట్ పత్రములు కల కవరును ఎట్టి పరిస్థితులలోను తెరువరాదు. ఈ విధముగా పదవి వారిగా పోలైన ఓట్లను పరిశీలించి ఆ అభ్యర్థికి ఎన్ని ఓట్లు పడినవో NOTA + తిరస్కరించబడినవి ఎన్నో నిర్ధారించి వివరములు తుది ఫలిత ప్రకటన షీటు Form-26 నందు రౌండ్ వారీ అభ్యర్థి వారి వివరములు నమోదు చేసుకొని తుది ఫలితాలు నిర్ణయించాలి. ఫలితాల వివరాలు రిటర్నింగ్ అధికారి ప్రకటించాలి.

        తిరిగిలెక్కింపు (Recount):

        లెక్కింపు ప్రక్రియ మొత్తం పూర్తయిన తరువాత రిసల్ట్ షీటు (ఫారం XXVI) నందు ప్రతీ అభ్యర్థికి వచ్చిన ఓట్ల వివరములు న వివరములు ప్రకటించుచు ఆ ప్రకటన చేసిన పిదప 1 లేదా 2 నిమిషముల సమయము అభ్యర్థుల లేదా వారి ఏజెంట్ల స్పందన కొరకు నిర్వీ సమయములో ఏదైనా అభ్యర్థి లేదా అతని తరపు ఏజెంట్ వ్రాత పూర్వక అభ్యర్ధనలో తిరిగి లెక్కించమని కోరిన పక్షంలో దానికి రిటర్నింగ్  అధికారి వారిదే.

        తుది రిజల్ట్ షీటు:

        1. తుది రిజల్ట్ ఫారం XXVI లో చూపిన విధంగా ఫారంలో నమోదు చేయవలెను.
        2. కౌంటింగ్ ప్రక్రియ పూర్తయిన పిదప బ్యాలెట్ పేపర్లు మరియు ఎన్నికల సంబంధించిన పత్రములకు సీళ్లు వేసి భద్రపరచుట.
        3.  లెక్కింపు పూర్తయిన తరువాత అభ్యర్థి వారీగా వచ్చిన చెల్లుబాటు అయిన ఓట్లు; తిరస్కరించబడిన మరియు చెల్లుబాటు కాని ఓట్లను విడివడిగా కట్టలుగా కట్టాలి. తరువాత అటువంటి అభ్యర్థులనదరికీ వచ్చిన ఓట్ల కట్టలను ఒక పెద్ద కట్టగా కట్టాలి. దానిమీద సీల్ వేయాలి లోపల ఏమేమి ఉన్నాయో బండిల్ స్లీప్ మీద వివరములు నమోదు చేయాలి.

        4) ఈ పత్రములను ఎటువంటి పరిస్థితులలోను విప్పడం గాని వాటి వివరములు ఎవరి ముందు ప్రదర్శించడం కానీ చేయకూడదు. కేవలం ఎన్నికల వివాదములకు సంబంధించిన కోర్టు ఆదేశములతో మాత్రమే తెరువవలెను. వీటిని ప్రత్యేక కస్టడీలో ఉంచి భద్రపరచవలెను. ఇవి ఏమనగా:

        • ఎన్నికలలో ఉపయోగించని బ్యాలెట్ పత్రములు వాటి కౌంటర్ ఫాయిల్స్ తో సహా
        • ఉపవయోగించిన బ్యాలెట్ పత్రములు (సవ్యముగానున్నవి, టెండర్, తిరస్కరించబడినవి. పోస్టల్ బ్యాలెట్ పత్రములు, నిర్ణీత సమయం దాటిన తరువాత వచ్చిన పోస్టల్ బ్యాలెట్ పత్రములతో సహా)
        • ఉపయోగించిన బ్యాలెట్ పత్రములకు సంబంధించిన కౌంటర్ ఫాయిల్స్
        • మార్క్స్ కాపీ ఆఫ్ ఎలక్టోరల్ రోలుకు చెందిన ప్యాకెట్లు,
        • డిక్లరేషన్ ఆఫ్ ఎలక్టర్స్ మరియు వారి సంతకమల ధృవీకరణ పత్రమలకు చెందిన ప్యాకెట్లు.
        •  రీకౌంటింగ్ జరపమని ఎవరైనా కోరితే 15 నిమిషాలు సమయం కేటాయించి లిఖితపూర్వకంగా తీసుకోవాలి ఆ సమయంలో వారు స్పందించనిచో RO వారు నిర్ణయం ప్రకటించవచ్చును.

        ఈ పై ప్యాకెట్లన్నీ రిటర్నింగ్ అధికారి వారి సీల్ వేసి భద్రపరచవలెను.

        ఫలిత ప్రకటన ఎన్నికల రిటర్నింగ్ జారీ

        1. కొన్ని సందర్భములలో పోటీలో ఉన్న అభ్యర్థులలో ఎక్కువ ఓట్లు ఇద్దరికి సమానంగా పోలైనచో ఫలితాల ప్రజ విధానంలో రిటర్నింగ్ అధికారి నిర్ణయించవలెను.
        2. లాటరీ విధానం:- లాటరీ తీయుట కొరకు 10 సమానసైజులో ఉన్న ఒకే రకమైన పేపర్ స్లిప్ లమ తయారు పేపర్లలో 5 స్లిప్ లపై ఒక అభ్యర్థిపేరు మరో 5 స్లిప్ లపై వేరొక అభ్యర్థి పేరు వ్రాయాలి (పేపర్ వెనుక భాగంలో మరకగాని వ్రాసిన impression వెనుకపడకుండా జాగ్రత్త వహించాలి).
        3. 3. ప్రతీ స్లిప్ ను బిగతుగా రెండు మడతలు వేసి 10 స్లిప్ లను ఒక డబ్బాయందు వేసి మిక్స్ చేసి పిదప రిటర్నింగ్ అధికారి ఆ డబ్బా మండి ఒక స్లిప్ తీసి తెరచి ఆ స్లిప్ పై ఎవరి పేరు ఉన్నదో చదివి వినిపించి వారిని విజేతగా ప్రకటించాలి.
        4.  Form-27 నందు తుది ఫలిత ప్రకటన RO జారీ చేయాలి.
        5.  Form-28 నందు ఎన్నికల రిటర్న్ ధృవీకరించాలి.
        6. Form-29 నందు ఎన్నికల ధ్రువపత్రము జారీ చేసి గెలుపొందిన అభ్యర్థికి అందజేయవలెను.
        7. లెక్కించిన బ్యాలెట్ పత్రములు 50 పత్రములు ఒక కట్ట చొప్పునకట్టవలెను. అభ్యర్థివారీగా కట్టి ఆ కట్టలన్నిటినీ కలిపి ఒక పెద్ద ఆ కట్టగా కట్టి దానికి wrapper చుట్టిదానిపై ballot paper account వ్రాసి. Pigeonhole ఇంచార్జ్ కి అప్పగించవలెను.
        8. ధృవీకరించిన ప్రతులన్నీ రిటర్నింగ్ అధికారి జిల్లా ప్రజా పరిషత్ కు అందజేయలి.

MPTC ZPTC ELECTIONS VOTES COUNTING USER MANUAL DOWNLOAD

https://drive.google.com/file/d/1VmNrZG-aFCZJnrnUju7wWuecx_XraB9U/view?usp=sharing

MPTC ZPTC ELECTIONS VOTES COUNTING USER MANUAL2 DOWNLOAD

https://drive.google.com/file/d/1W7OGiNk-I8hJdJCPpscx9BlJNpZ3SXgb/view?usp=sharing

MPTC ZPTC ELECTIONS VOTES COUNTING USER MANUAL3 DOWNLOAD

https://drive.google.com/file/d/1b6MRu4z7vH_-0In4NwWzIJLay2XUACFG/view?usp=sharing

MPTC ZPTC ELECTIONS VALID / INVALID VOTES DOWNLOAD

https://drive.google.com/file/d/1QLLX-gAxK-0g40z-bVXcZ7T-5_DFSubn/view?usp=sharing

DOWNLOAD TELUGU INSTRUCTIONS ON COUNTING VOTES

error: Content is protected !!