national-children-science-congress-2020-21-guidelines-model-projects

national-children-science-congress-2020-21-guidelines-model-projects

28 వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ – 2020

విద్యార్థులలో సృజనాత్మకతను ప్రోత్సహిస్తూ , స్థానిక సమస్యలకు పరిష్కారం కనుగొనే దిశగా పిల్లలను ప్రేరేపించే లక్ష్యంతో ప్రతి సంవత్సరం జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ను భారత ప్రభుత్వ శాస్త్ర, సాంకేతిక శాఖ, న్యూ ఢిల్లీ మరియు ఆంధ్ర ప్రదేశ్ రాష్ట్ర శాస్త్ర సాంకేతిక మండలి, విజయవాడ (అప్కాస్ట్) , విద్యాశాఖ నిర్వహిస్తోంది .

ప్రస్తుతం అమలులో వున్న COVID-19 నిబంధనల కారణంగా , పిల్లల భద్రత దృష్ట్యా  ఈ సంవత్సరం ONLINE / Offline విధానంలో జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్ ను నిర్వహించాలని తగు చర్యలు చేపట్టింది .

కింద కనబరచిన అంశాలలో విద్యార్థులు సైన్స్ ప్రాజెక్టులు చేపట్టవచ్చు .

ప్రధాన అంశం :

సుస్థిరమైన జీవనం కోసం విజ్ఞాన శాస్త్రం(Science for Sustainable Living)

ఉప అంశాలు :

1.సుస్థిరమైన జీవనం కోసం పర్యావరణ వ్యవస్థ

  (Eco System for Sustainable Living)

2.సుస్థిరమైన జీవనం కోసం తగిన సాంకేతికత

 (Appropriate Technology for Sustainable Living)

3.సుస్థిరమైన జీవనం కోసం తగిన సామాజిక ఆవిష్కరణ

 (Social Innovation for Sustainable Living)

4.సుస్థిరమైన జీవనం కోసం తగిన రూపకల్పనలు ,నమూనాలను అభివృద్ధి పరచడం

 (Design, Development and Modelling for Sustainable Living)

5. సుస్థిరమైన జీవనం కోసం సాంప్రదాయ జ్ఞాన వ్యవస్థ

(Traditional Knowledge System (TKS) for Sustainable Living)

ఒకరు లేదా ఇద్దరు విద్యార్థులు గైడ్ టీచర్ సహాయంతో ఎంచుకున్న ఉప అంశానికి అనుగుణంగా సర్వే, పరిశీలనలు, ప్రశ్నావళి మరియు కేస్ స్టడీస్ ఆధారంగా ప్రాజెక్టులు చేపట్టి , రిపోర్టు తయారుచెయ్యాలి.

ఈ సంవత్సరం కరోనా విపత్కర పరిస్థితులలో ప్రాజెక్టులు ఫీల్డ్ ఓరియెంటెడ్ గా కాకుండా రిసెర్చ్ ఓరియెంటెడ్ గా ఉండాలని APCOST  మెంబర్ సెక్రెటరి డాక్టర్  Y.అపర్ణ గారు సూచించారు.

 ఒక పాఠశాల నుండి ఎన్ని ప్రాజెక్టులైనా సమర్పించవచ్చు.

 పాఠశాలలో 6 నుండి 10వ తరగతి విద్యార్థులెవరైనా పాల్గొనవచ్చు.

అత్యుత్తమమైన 10 ప్రాజెక్టులు మాత్రమే *రాష్ట్ర స్థాయికి* ఎంపిక చేయబడతాయి.

 కోవిడ్ నిబంధనలు పాటిస్తు (ప్రభుత్వ నిబంధనలు) *online* పద్దతి ద్వారా *డిసెంబర్ 20* వ తేదీ లోపు జిల్లా స్థాయి పోటీలు నిర్వహించడం జరుగుతుంది.

 ఏవిధంగా నిర్వహించడం, ఏలా నమోదు చేసుకొవడం అనేది మీకు త్వరలో తేలియజేయడం జరుగుతుంది.

 కోవిడ్ నిబంధనలు పాటిస్తు, మీ అవకాశాన్ని బట్టి  ప్రాజెక్ట్ చేయవలసినది గా కోరుచున్నము.

 *విద్యార్థులలో*

*శాస్త్రీయ దృక్పధం పెంపొందించుట,*

*ప్రకృతిని నిశితంగా పరిశీలించుట,*

*పరిశోధించుట,*

*పర్యావరణాన్ని పరిరక్షించుట*

NCSC PROJCT MODEL-1

NCSC PROJCT MODEL-2 T.M

NATIONAL CHILDREN SCIENCE CONGRESS PROJECTS MODEL-3

NCSC PROJCTS MODEL-4 PDF

*బాల శాస్త్రవేత్తలను భావి శాస్త్రవేత్తలుగా తీర్చిదిద్దే ఉన్నత లక్ష్యాలు*

కలిగిన ఈ కార్యక్రమాన్ని సైన్స్, గణిత శాస్త్ర మరియు సోషల్ స్టడీస్ ఉపాధ్యాయులు అందరూ విజయవంతం చేయవలసినదిగా కోరుచున్నాము.

8TH, 9TH & 10TH CLASS DELETED LESSONS & STUDY MATERIAL LATEST PDF

error: Content is protected !!