National-children-science-congress-ncsc-themes-sub-themes-details-2019

National-children-science-congress-ncsc-themes-sub-themes-details-2019

MAIN THEME

“Science, Technology & Innovation for a Clean, Green & Healthy Nation”.

SUB THEMES:-

  1. Ecosystem and Eco system Services.

  2. Health, Hygiene and Sanition.

  3. Waste to Wealth.

  4. Society, Culture and Lovely hoods.

  5. TraditionalKnowledge Systems

శ్రీయుత ప్రధానోపాధ్యాయులు, ఉపాధ్యాయిని ఉపాధ్యాయులకు (గైడ్ టీచర్స్)కు మనవి.

27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2019 జిల్లా స్థాయి ఎంపిక  జరగబోతుంది.

అంతలోపుననే క్రింద తెలిపిన ప్రధానాంశం,  ఉపఅంశములకు సంబందించి  పాఠశాల స్తాయిలో ప్రాజెక్టుల రూపకల్పన పూర్తి చేసుకోగలరు.

 ప్రధానాంశం: 

పరిశుభ్రమయిన, హరిత, ఆరోగ్యకర మైన దేశం కోసం విజ్ఞాన శాస్త్ర, సాంకేతిక పరిశోధనలు

ACTIVITY GUIDE BOOK 2019

NCSC APPLICATION FORM-A CLICK HERE FOR DOWNLOAD

ఉపఅంశాలు:

1.ఆవరణ వ్యవస్థ – అది అందించే సేవలు,

 2.ఆరోగ్యం, పరిశుభ్రత, పారిశుద్ద్యం

 3. చెత్త నుండి సంపద

4. సమాజం, సంస్క్రతి, జీవనోపాధులు

 5.సాంప్రదాయక విజ్ఞాన వ్యవస్థలు 

 వీటిల్లో ఒక ఉప అంశానికి సంబంధించినదై అది వారి పాఠశాల, పరిసరాలు, గ్రామానికి సంబంధించిన అంశంగా ఉండేలా ప్రాజెక్ట్‌ను రూపొందించాలి.

నియమాలు:*

1) పాఠశాల పరిధిలోని 10 నుండి 17 సంవత్సరాల వయస్సు గల పిల్లలు( బడిలో, బడి బయటి ) అందరు అర్హులే.

2) 10 నుండీ 14 సంవత్సరాల లోపు పిల్లలు జూనియర్లుగానూ, 14 నుండీ 17 సంవత్సరాల పిల్లలు సీనియర్లుగాను విభజించాలి.

3) ప్రతి గ్రూపు లో ఇద్దరు పిల్లలు వుండాలి. వారిలో ఒకరు లీడర్ గా వుండాలి.

4) జిల్లాస్థాయి, రాష్ట్రస్థాయి మరియు జాతీయస్థాయి ప్రదర్శనలో గ్రూపులీడర్ మాత్రమే పాల్గొనాలి.

5) ప్రాజెక్టు ప్రదర్శనకు “8” నిమిషాల సమయమే వుంటుంది.

6) ప్రాజెక్ట్ ప్రదర్శన సమయంలో 4 పోస్టర్లు లేదా స్లయిడ్ లు ఉపయోగించవచ్చు.

7) ప్రతి ప్రాజెక్టుకు సంబంధించిన రిజిస్ట్రేషన్ ఫామ్ ( ఫామ్ A), మూడు ఆబ్స్ ట్రాక్ట్ కాపీలు, మూడు ప్రాజెక్ట్ రిపోర్టులు, లాగ్ బుక్, పోస్టర్లు, టీమ్ లీడర్ యొక్క పాస్పోర్ట్ ఫోటోలు 5 తప్పనిసరిగా తెచ్చుకోవాలి.

కనుక మిత్రులారా పాఠశాలలో యెక్కువ గ్రూపులుచేసి విద్యార్థులలో విజ్ఞానశాస్త్రంపట్ల ఆసక్తి పెంపొందించగలరు. 

27వ జాతీయ బాలల సైన్స్ కాంగ్రెస్-2019 నందు ప్రాజెక్టులు ప్రదర్శించు వారు ముందుగా online Registration చేయించనవసరం లేదు.

రిజిస్టరేషన్ ఫామ్ ( ఫాం A) పూర్తిచేసుకొని తెస్తే సరిపోతుంది.

ప్రతి ప్రాజెక్ట్ కు ఒక ఫాం A తప్పనిసరి.

  జిల్లా స్థాయి బాలల సైన్స్ కాంగ్రెస్ గౌరవ జిల్లా విద్యాశాఖాధికారి గారి ఆధ్వర్యంలో నిర్వహించబడును.

కావున అన్నీ యాజమాన్యాల పాఠశాలల వారిని తప్పని సరిగా ఈ కార్యక్రమంలో పాల్గొనవలసినదిగా కోరటమైనది.

ప్రాజెక్టు రిపోర్టులో ఉంచవలసిన అంశాలు

ప్రాజెక్టు రిపోర్టు తయారీనందు క్రింది అంశాలను పరిగణనలో తిసుకోవాలి.

ముఖచిత్రం

ప్రాజెక్టు శీర్షిక

గ్రూపు లీడరు మరియు ఇతర సభ్యుల పేర్లు, చిరునామా.

గైడ్ టీచరు పేరు, చిరునామా

రిజిస్ట్రేషన్ ఫారం (ఫారం – ఎ)

సంక్షిప్త రిపోర్టు – 250 పదాలు (ఆంగ్లంలో)

పరిచయం – అధ్యయనం, శీర్షికలు, పట్టికలు మ్యాపులు మొదలైన వాటిని సూచిస్తూ పుట సంఖ్యలు

పరిచయం – అధ్యయనం యొక్క పూర్వ పరిస్థితులు

లక్ష్యాలు – స్పష్టీకరణలు

పరికల్పనలు

ప్రాజెక్టు ఆవశ్యకత

ప్రాజెక్టు ప్రణాళిక

అధ్యయన పద్ధతి

పరిశీలనలు

దత్తాంశ సేకరణ మరియు అన్వయం, విశ్లేషణ

ఫలితాలు

ముగింపు

సమస్య పరిష్కారం

భవిష్యత్ ప్రణాళిక

కృతజ్ఞతలు

పరిశీలనా గ్రంథాలు

ప్రాజెక్టు రిపోర్టు నందు జూనియర్ స్థాయికి 2500 పదాలు, సీనియర్ స్థాయికి 3500 పదాలు పరిమితిని పాటించాలి.

అదే విధంగా పరిమిత సంఖ్యలో పోటోగ్రాఫులు, పట్టికలు, గ్రాఫులు మరియు చిత్రాలను వాడాలి. ప్రాజెక్టు నిర్వహణలో జరిగిన కృషి, ఫలితాలను రిపోర్టులో పొందుపరచాలి.

NCSC ONLINE APPLICATION FORM

NCSC APPLICATION CLICK HERE

NCSC-2019 MAIN OFFICIAL WEBSITE CLICK HERE

error: Content is protected !!