national-talent-search-examinations-NTSE-2019-20-notification

national-talent-search-examinations-NTSE-2019-20-notification

ఎన్‌టీఎస్‌ఈ*NTSE.

▪ ప్రేరణ కలిగించడానికి, ఆర్థికంగా ఆదుకోవడం కోసం ఏటా పదోతరగతి చదువుతున్న విద్యార్థులకు నిర్వహించే నేషనల్‌ టాలెంట్‌ సెర్చ్‌ స్కీం (ఎన్‌టీఎస్‌ఈ) పరీక్ష ప్రకటన విడుదల.

°▪ కేవలం పదోతరగతి చదువుతున్న విద్యార్థులు మాత్రమే ఈ పరీక్ష రాయడానికి అర్హులు. 

▪ ఈ పరీక్ష రెండు దశల్లో జరుగుతుంది.

▪ మొదటి దశ రాష్ట్రస్థాయిలో నిర్వహిస్తారు.

▪ మొదటి దశలో అర్హత సాధించిన విద్యార్థులను రెండోదశకు ఎంపిక చేస్తారు.

▪ ప్రతి రాష్ట్రం/కేంద్ర పాలిత ప్రాంతాల్లో ఉన్న ఎస్‌సీఈఆర్‌టీఈలు ఈ పరీక్షను నిర్వహిస్తాయి.

▪ మొదటి దశలో అర్హత సాధించిన వారికి రెండోదశ పరీక్షను ఎన్‌సీఈఆర్‌టీఈ దేశవ్యాప్తంగా నిర్వహిస్తుంది.

మొదటి దశ (రాష్ట్రస్థాయి)

▪ దీనిలో రెండు పేపర్లు ఉంటాయి.

పేపర్‌-1 మెంటల్‌ ఎబిలిటీ టెస్ట్‌- మ్యాట్‌(ఎంఏటీ),

పార్ట్‌-2 స్కోలాస్టిక్‌ ఆప్టిట్యూడ్‌ టెస్ట్‌ (ఎస్‌ఏటీ).

▪ మ్యాట్‌ 100 మార్కులకు నిర్వహిస్తారు.

120 నిమిషాల కాలవ్యవధి.

ఈ పరీక్షను నవంబర్‌ మొదటి ఆదివారం ఉదయం 9.30 నుంచి 11.30 వరకు నిర్వహిస్తారు.

▪ పేపర్‌-2 (శాట్‌)ను మధ్యాహ్నం 1.30 నుంచి 3.30 వరకు నిర్వహిస్తారు.

100 ప్రశ్నలు, 120 నిమిషాల కాలవ్యవధి.

▪ సైన్స్‌-40,

మ్యాథ్స్‌-20,

సోషల్‌సైన్సెస్‌-40 ప్రశ్నలు ఇస్తారు.

నోట్‌ :

రాష్ట్రస్థాయి పరీక్షలో జనరల్‌, ఓబీసీలకు 40 శాతం మార్కులు, ఎస్సీ, ఎస్టీ, పీహెచ్‌సీలకు 40 శాతం మార్కులు అర్హతగా నిర్ణయించారు.

▪ నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.

మ్యాట్‌, శాట్‌లో వచ్చిన మార్కుల ప్రాతిపదికన రెండోదశ ఎంపిక జరుగుతుంది.

▪ మొదటి దశ పరీక్ష ఫలితాలను జనవరి/ఫిబ్రవరిలో ప్రకటిస్తారు.

రెండోదశ పరీక్ష తేదీలను ఎన్‌సీఈఆర్‌టీఈ తర్వాత ప్రకటిస్తుంది.

రెండోదశ పరీక్ష

▪ దీనికి ఎటువంటి ఫీజు లేదు.

ఈ పరీక్షను మే రెండో ఆదివారం నిర్వహిస్తారు.

పరీక్షలో 9, 10 తరగతి సిలబస్‌ నుంచి ప్రశ్నలను ఇస్తారు.

▪ రెండోదశ పరీక్షలో మ్యాట్‌, శాట్‌ ఉంటాయి.

మ్యాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు. 120 నిమిషాల కాలవ్యవధి.

▪ శాట్‌లో 100 ప్రశ్నలు, 100 మార్కులు, 120 నిమిషాల కాలవ్యవధి.

ఈ పరీక్షలో కూడా నెగెటివ్‌ మార్కింగ్‌ విధానం లేదు.

మ్యాట్‌, శాట్‌లలో అర్హత సాధించిన వారిని మెరిట్‌ ఆధారంగా ఎన్‌టీఎస్‌ఈ స్కాలర్‌షిప్‌లకు ఎంపిక చేస్తారు.

COMPLETE INFORMATION ABOUT NTSE IN TELUGU CLICK HERE

పరీక్ష రాయడానికి ఎవరు అర్హులు?

▪ కేవీ, నవోదయ, ప్రభుత్వ, ప్రభుత్వ గుర్తింపు పొందిన ప్రైవేటు పాఠశాలల్లో పదోతరగతి చదువుతున్నవారు అర్హులు. ఓపెన్‌, డిస్టెన్స్‌ లెర్నింగ్‌ విధానంలో విద్యను అభ్యసిస్తున్నవారు కూడా అర్హులే. 

▪ 2019, జూలై 1 నాటికి అభ్యర్థుల వయస్సు 18 ఏండ్లు మించరాదు. మొదటిసారి పదోతరగతి పరీక్షకు హాజరుకానున్నవారు మాత్రమే దరఖాస్తు చేసుకోవడానికి అర్హులు.

 దరఖాస్తు విధానం

▪ ఆయా రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాలలోని లైజన్‌ ఆఫీసర్లు ప్రత్యేక ప్రకటన విడుదల చేస్తారు. 

▪ ఆ ప్రకటనలో తెలిపిన విధంగా దరఖాస్తును పూర్తి చేసి పాఠశాల ప్రధానోపాధ్యాయుడి సంతకంతో సంబంధిత అధికారికి పంపాలి. 

NTSE PREVIOUS PAPERS CLICK HERE

HOW TO APPLY NTSE SCHOLARSHIPS CLICK HERE

FOR MORE DETAILS NOTIFICATION CLICK HERE

APPLY ONLINE CLICK HERE

error: Content is protected !!