# new-academic-calender-2020-21-from-July-27th-instructions

- Link: https://amaravathiteacher.com/new-academic-calender-2020-21-from-july-27th-instructions/
- Published: 2020-07-25T18:50:15+05:30
- Author: amaravathiteacher

## **new-academic-calender-2020-21-from-July-27th-instructions**

### **ప్రత్యామ్నాయ విద్యాకాలండరు**

### **27-7-20 నుండి 4-9-20వరకు పాఠశాలలో చేయవలసిన కార్యక్రమాలు**

### **ఆంధ్రప్రదేశ్ కమిషనర్ మరియు డైరెక్టర్ ఆఫ్ స్కూల్ ఎడ్యుకేషన్ వారు ఈరోజు పాఠశాల విద్య 2020 -21 విద్యాసంవత్సరం కరోనా వ్యాప్తికి దృష్ట్యా ప్రత్యామ్నాయ విద్య క్యాలెండరు అమలు గురించి ఆదేశాలు ఇవ్వడమైనది.**

### **\*ముఖ్యంగా పాఠశాల తిరిగి పునఃప్రారంభం సెప్టెంబర్ 5వ తేదీ\***

### ** \*ఉపాధ్యాయులు ప్రాథమిక ప్రాథమికోన్నత ఉన్నత పాఠశాలలు వారానికి ఒకసారి హాజరు కావాలి. అయితే అందరూ ఒకే రోజు కాకుండా పని విభజన చేసుకుని ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి ప్రధానోపాధ్యాయులు తో కలిసి నిర్ణయించుకోవాలి\***

### **\*హాజరైనప్పుడు ఉపాధ్యాయులు బయోమెట్రిక్ హాజరు నమోదు చేయనవసరం లేదు\***

### **\*ఇంకా గతంలో మాదిరిగానే దీర్ఘ వ్యాధులతో సతమత ఉన్నవారు, కంటోన్మెంట్లో నివసించే వారు, శారీరక వైకల్యం కలిగిన వారు హాజరు కానవసరం లేదు .**

### **ఇంటి వద్ద నుండి ప్రణాళికలు రూపొందించుకొని పని చేయాలి\***

### **ఉపాధ్యాయులు హాజరు\* ::**

### **విద్యార్థివారీ ప్రణాళిక రూపొందించుకుని అమలు చేయడం మొదలుపెట్టాక, ఉపాధ్యాయులు ప్రాథమిక ****పాఠశాలల్లోను, ఉన్నత పాఠశాలల్లోనూ కూడా వారానికి ఒకసారి హాజరు కావలసి ఉంటుంది\*. **

### **కాని అందరూ విధిగా ****ఒక్కరోజే హాజరు కావలసిన అవసరం లేదు. **

### **వారు వారు ఏ రోజు పాఠశాలకు హాజరు కావాలి, ఎన్ని సార్లు హాజరు ****కావాలన్న విషయమై పాఠశాల ప్రధానోపాధ్యాయుడు తగు ఉత్తర్వులు ఇవ్వవలసి ఉంటుంది\*. **

### **ఈ ఆదేశాలు నాడు నేడు ****పాఠశాలలకు కూడా వర్తిస్తాయి.**

### **ఆ విధంగా హాజరు అయినప్పుడు ఉపాధ్యాయులు \*బయో మెట్రిక్ హాజరు నమోదు చెయ్యనవసరం లేదు.**

### **దీర్ఘకాలిక వ్యాధులతో సతమతమవుతున్నవారు, కంటెయిన్ మెంటు జోన్లలో నివసిస్తున్నవారు, శారీరిక ****వైకల్యం కలిగినవారు, కంటెయిన్ మెంటు జోన్లలో పాఠశాలలు ఉన్నవారు భౌతికంగా పాఠశాలలకు హాజరు ****కానవసరం లేదు. **

### ** కాని వారు కూడా తమ తరగతి వారీగా , విద్యార్థివారీగా ప్రణాళికలు తప్పని సరిగా ****రూపొందించుకోవాలి, విద్యార్థుల తల్లిదండ్రులతో ఫోన్ ద్వారా ఉత్తరప్రత్యుత్తరాలు జరుపుతూ తప్పనిసరిగా ప్రణాళిక ****అమలు పర్చాలి.**

### **󠀁[1st CLASS TO 10TH CLASS ALTERNATIVE ACADEMIC CALENDER PROJECTS & ACTIVITIES SUBJECT WISE DOWNLOAD BOOKLET CLICK HERE](https://amaravathiteacher.com/alternative-academic-calender-primary-up-high-schools-in-telugu/)󠁿**

### **󠀁[దీర్ఘ వ్యాధులతో సతమత ఉన్నవారు, కంటోన్మెంట్లో నివసించే వారు, శారీరక వైకల్యం కలిగిన వారు హాజరు మినహాయింపు కోరుతూ వ్రాసే లెటర్స్ ](https://amaravathiteacher.com/ap-teachers-not-attend-to-duty-quarantine-containment-red-zones/)󠁿**

### **󠀁[1 TO 5 PRIMARY CLASSES ALTERNATE ACADEMIC CALENDER PDF(ENGLISH)](https://drive.google.com/file/d/1sNM0ON_rohaPB-rsY4k5HuVMOFrw48KL/view?usp=sharing)󠁿**

### **󠀁[PRIMARY CLASSES TELUGU ALTERNATIVE ACADEMIC CALENDER PAER-1 DOWNLOAD PDF(తెలుగు)](https://drive.google.com/file/d/1ftwqPjWUVXk84Ovwdxb3cGVh5UFM4iaC/view?usp=sharing)󠁿**

### **󠀁[PRIMARY CLASSES ALTERNATE ACADEMIC CALENDER PART-2 DOWNLOAD PDF(తెలుగు)](https://drive.google.com/file/d/1xq6mFHhUr1gLjTa547xaCLQLtOGlFhaT/view?usp=sharing)󠁿**

### **󠀁[6TH AND 7TH CLASSES UPPER PRIMARY CLASSES ALTERNATE ACADEMIC CALENDER PDF ](https://drive.google.com/file/d/1sKqaWZAid5Re_RWWnsv0yqG1_w2lW_Da/view?usp=sharing)󠁿**

### **󠀁[9TH & 10TH CLASSES ALTERNATE ACADEMIC CALENDER PDF DOWNLOAD](https://drive.google.com/file/d/1sIp42CFlYfOrv0Lzb2Nl2HMpdVrSChmm/view?usp=sharing)󠁿**

### **󠀁[SCHOOL ADMISSION APPLICATION FORM PDF DOWNLOAD(English)](https://drive.google.com/file/d/14zyWSaeELToyVBVzIHsQVmGWfUyf6IRn/view)󠁿**

### **󠀁[SCHOOL ADMISSION FORM IN TELUGU](https://drive.google.com/file/d/1z-oJr6kd880PxieOY92w7f9c0gtT4fQw/view?usp=sharing)󠁿**

### **ఉపాధ్యాయుల పని సమీక్ష**

### **ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరులో సూచించిన విధంగా \*ప్రతి ఉపాధ్యాయుడు ప్రతి\* \*రోజు తల్లిదండ్రులకు\* ****\*ఫోన్ చెయ్యవలసి\* \*ఉంటుంది\*. **

### **ఇందుకు గాను ఆయన రోజుకి కనీసం 15 మంది తల్లిదండ్రులకు ఫోన్ చేసి వారి పిల్లలు ****చేపట్టవలసిన విద్యాకార్యక్రమాల గురించి వివరించవలసి ఉంటుంది. **

### **మరుసటి రోజు నుండి రోజుకు అయిదుగురు ****చొప్పున తల్లిదండ్రులకు మరలా ఫోన్ చేసి వారి పిల్లల పురోగతి ఏ విధంగా ఉన్నదో తెలుసుకోవాలి. **

### **ఆ విధంగా ****వారానికి కనీసం 40 మంది విద్యార్థుల పురోగతి కనుక్కోవాలి.**

### **ఆ విధంగా ఉపాధ్యాయుడు తాను చేసిన రోజువారీ పనిని ఒక డైరీలో నమోదు చేసుకుని ఆ పేజీలను \*ప్రతి శనివారం ఫొటో లేదా డాక్యుమెంట్\* \*ఫార్మేట్లో గూగుల్ ఫారంలో అప్ లోడ్ చేయాలి.\***

### **󠀁[13 DISTRICTS GOOGLE FORM LINKS CLICK HERE](https://amaravathiteacher.com/13-districts-google-forms-links-for-all-teachers-submit-their-report/)󠁿**

### **ఆ విధంగా నమోదు చేసిన వివరాలను సంబంధిత మండల విద్యాశాఖాధికారులు, ఉప విద్యాశాఖాధికారులు ****ఎప్పటికప్పుడు సమీక్షించుకోవాలి.**

### **\*విద్యార్థి వారీ ప్రణాళిక\***

### **మొదటగా ప్రతి ఉపాధ్యాయుడూ తన తరగతిలోని విద్యార్థులకు \*విద్యార్థివారీ ప్రణాళికను\* ****రూపొందించుకోవాలి\*. ****విద్యార్థులను\* \*మూడు విధాలుగా\* \*విభజించుకోవాలి\*.**

### **అ) ఆన్ లైన్ సౌకర్యాలు అందుబాటులో ఉన్న విద్యార్థులు \*(హై టెక్)\*,**

### **ఆ) రేడియో లేదా దూరదర్శన్ అందుబాటులో ఉన్న విద్యార్థులు \*(లో టెక్)\*,**

### **ఇ) కంప్యూటర్ గాని మొబైల్ గాని రేడియో గాని దూరదర్శన్ గాని అందుబాటులో లేని విద్యార్థులు \*(నో టెక్)\*.**

### **గ్రామస్థాయిలోనూ, పట్టణాల్లో వెనకబడ్డ ప్రాంతాల్లో నివసిస్తున్న విద్యార్థులు ఎక్కువమందికి ఎటువంటి ****సమాచార, ప్రసార, కంప్యూటర్ సాధనాలు అందుబాటులో లేనందువల్ల ముఖ్యంగా వారి పైన దృష్టి పెట్టే విధంగా ****ఉపాధ్యాయుడు తన ప్రణాళిక తయారు చేసుకోవాలి.**

### **ఆ ప్రణాళికలో ఆయా తరగతుల వారికి, మానవ వనరుల అభివృద్ధి మంత్రిత్వ శాఖ, భారత ప్రభుత్వం వారు ****సూచించిన విధంగా ఈ దిగువ పాఠ్యప్రణాళిక రూపొందించుకోవాలి.**

### **అ) 1 నుండి 5 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా \*12 (నాలుగు వారాలు మొదటి భాగం, 8 వారాలు రెండో భాగం) వారాల ప్రత్యామ్నాయ కాలెండరులో\*  చూపిన కృత్యాలు ****చేయించడం. ఇందుకు గాను, ఏ ఉపాధ్యాయుడికి ఆ ఉపాధ్యాయుడు కృత్యపత్రాలు తయారు చేసుకోవాలి. ****వాటిని స్థానికంగా ముద్రించుకోవడం గాని లేదా ఫొటో కాపీ తీయించుకోవడం గాని లేదా కంప్యూటరు**

### **ద్వారా ప్రింటు తీసుకోవడం గాని చేయాలి. ఆ కృత్యపత్రాలు విద్యార్థుల తల్లిదండ్రులకు అందచేసి వారి ద్వారా ****విద్యార్థులు ఆ కృత్యాలు చేసే విధంగా పర్యవేక్షించాలి. **

### **దూరదర్శన్ లో వచ్చే కార్యక్రమాలు పర్యవేక్షణ,**

### **ప్రత్యామ్నాయ కాలెండర్ పర్యవేక్షించాలి.**

### **ఆ) 6 నుండి 8 వ తరగతి వరకు కనీస అభ్యసన సామర్థ్యాలు సాధించే విధంగా 4 వారాల ప్రత్యామ్నాయ ****కాలెండరులో చూపిన ప్రాజెక్టు పనులు పిల్లలద్వారా చేయించాలి. పిల్లలు అటువంటి కృత్యాలు ఏ విధంగా ****చేపట్టాలో వారి తల్లిదండ్రులకు వివరించాలి. దూర దర్శన్ ద్వారా ప్రతి వారం ఒక పాఠం ద్వారా వివరించాలి.**

### **దూరదర్శన్ సౌకర్యం ఉన్న విద్యార్థులను లేని విద్యార్థులతో ఇద్దరిద్దరు చొప్పున జతపరిచి సౌకర్యాలు ఉన్న ****విద్యార్థుల ద్వారా సౌకర్యాలు లేని విద్యార్థులకు సమాచారాన్ని చేరవేసే విధంగా ఏర్పాటు చేసుకోవాలి. వారు ****ఆ విధంగా ప్రాజెక్టు పనులు చేస్తున్నారో లేదో తల్లిదండ్రుల ద్వారా పర్యవేక్షించుకోవాలి.**

### **ఇ) 9, 10 తరగతులకు: వీరికి విషయాల వారీగా బోధన చేపట్టవచ్చు. ఇందుకుగాను, \*నాలుగు వారాల\* ****ప్రత్యామ్నాయ కాలెండరును\* ఉపయోగించుకోవాలి. **

### **వారికి ఆన్ లైన్, రేడియోల ద్వారా శిక్షణ చేపట్టవచ్చు.**

### ** అంతేకాక స్థానికంగా అందుబాటులో ఉన్న విద్యావంతులైన యువతీ యువకులు స్వచ్ఛందంగా ముందుకు ****వచ్చినట్లయితే వారి సేవలు కూడా వినియోగించుకోవచ్చు.**

### **\*పాఠశాల ప్రణాళిక\***

### **ప్రతి ఉపాధ్యాయుడు విద్యార్థి వారీగా తన ప్రణాళిక రూపొందించుకున్న తరువాత ప్రధానోపాధ్యాయుడు ****వాటిని పరిశీలించి \*పాఠశాల ప్రణాళిక రూపొందించుకోవాలి\*.**

### ** \*జూలై 27 నుంచి సెప్టెంబరు 4 వరకు 40 రోజుల వ్యవధి\* ****ఉన్నందున, నలభై రోజుల ప్రణాళిక ద్వారా తాము ఎటువంటి అభ్యసన ఫలితాలు సాధించబోతున్నదీ నిరంతరం ****పర్యవేక్షిస్తూ స్పష్టంగా భౌతిక లక్ష్యాలు నిర్దేశించుకోవాలి.**

### **\*తల్లిదండ్రుల కమిటీ సమావేశం\***

### **పాఠశాలవారీ ప్రణాళిక రూపొందించుకున్నాక, తల్లిదండ్రుల కమిటీ సమావేశం ఏర్పాటు చేసుకోవాలి. వారి ****ద్వారా తక్కిన తల్లిదండ్రులకి సమాచారం అందించాలి.**

### ** ఆ సమావేశంలో తమ ప్రణాళికను వివరించాలి. అలాగే స్థానికంగా ఉన్న విద్యావంతులైన యువతీ ****యువకులు స్వచ్ఛంద సేవలు వినియోగించుకునేలా తల్లిదండ్రుల కమిటీకి సూచించాలి. **

### **అటువంటి స్వచ్ఛంద ****కార్యకర్తలకు ఎటువంటి పారితోషికం ఇవ్వబడదు. ఎటువంటి ఉత్తర్వులు కూడా ఇవ్వబడవు. **

### **వారు తమ సేవలను ****పూర్తి ఐచ్ఛికంగా, స్వచ్ఛందంగా అందచేయవలసి ఉంటుంది. స్వచ్ఛంద సేవకులు కూడా కోవిడ్ పరీక్షలు ****చేయించుకుని ఉండాలి.**

### **\*పరీక్షలు\***

### **1 నుండి 8 వ తరగతి వరకు ఎటువంటి పరీక్షలు నిర్వహించరాదు. కాని మూల్యాంకనం (అసెస్మెంట్) చేపట్ట ****వలసి ఉంటుంది. **

### **విద్యార్థి అభ్యసన సామర్థ్యాలు సాధించారా లేదా అన్నది మాత్రం పరిశీలించవలసి ఉంటుంది.**

### **\*తొమ్మిది, పది తరగతుల విద్యార్థులకు ఇంటర్నల్ అసెస్మెంట్లు నిర్వహించుకోవచ్చు\* గాని, అవి కేవలం ****ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలండరుకు సంబంధించినవే అయి ఉండాలి. విద్యాసంవత్సరం ఇంకా మొదలుకాలేదు ****కాబట్టి, \*సిలబస్ ప్రకారం పరీక్షలు నిర్వహించరాదు\*. **

### **విద్యార్థులు, వారికి రూపొందించిన వారాంతపు కృత్యాల ద్వారా ****పొందవలసిన ‘లెర్నింగ్ అవుట్ కమ్స్’ను సాధించారా లేదా అనే విషయంలో స్పష్టత ఉండాలి.**

### **\*ఫ్రీ ప్రైమరీ\***

### **రాష్ట్రంలో కొన్ని పాఠశాలలు ఆన్ లైన్ ద్వారా ప్రీ ప్రైమరీ తరగతులు నిర్వహిస్తున్నట్టు, విద్యార్థులు యూనిఫాం ****ధరించి ఆన్ లైన్ తరగతులకు హాజరు కావలసిందిగా తల్లిదండ్రుల మీద ఒత్తిడి చేస్తున్నట్టు పాఠశాల విద్యాశాఖ దృష్టికి ****వచ్చింది. **

### **అటువంటి ప్రయత్నాలు చట్టపరంగానే కాక నైతికంగా కూడా చెల్లనేరవు. అటువంటి ప్రయత్నాల్ని సామాజిక ****దురాచారాలుగా తల్లిదండ్రులు గుర్తించవలసి ఉంటుంది. అటువంటి ఆదేశాలు ఇచ్చే విద్యాసంస్థల్ని అలాంటి ****ప్రయత్నాలు చేయకూడదని ఇందువెంట ఆదేశించనైనది.**

### **\*ఆన్ లైన్ తరగతులు\***

### **ఆన్ లైన్ తరగతుల విషయమై కూడా కొంత స్పష్టత నివ్వవలసిందిగా విద్యార్థి సంఘాలు పాఠశాల ****విద్యాశాఖను కోరుతున్నారు. అందువల్ల ఈ కింది ఆదేశాలను గమనించనైనది.**

### **అ) \*పాఠ్యబోధనకు ఆన్ లైన్ బోధన చేపట్టవచ్చు\*. కానీ ఆ బోధన ప్రత్యామ్నాయ అకడెమిక్ కాలందరులో ****సూచించిన పాఠ్య ప్రణాళికకు మాత్రమే పరిమితమై ఉండాలి.**

### **ఆ) ఆన్ లైన్ అంటే కంప్యూటర్ ద్వారా గాని దూరదర్శన్ ద్వారా గాని చేపట్టే బోధన విషయంలో ఒక రోజుకి ****ఎంత సమయం కేటాయించాలి అన్నదాని మీద భారత ప్రభుత్వం ఈ విధంగా స్పష్టం చేసింది.**

### **అందులో \*పేర్కొన్న సమయానికి మించి ఏ పాఠశాల, ఏ యాజమాన్యంగాని ఆన్లైన్ బోధన చేపట్టరాదు\*.**

### ** \* \*పాఠశాలల్లో ప్రవేశాలు**

### **\*అన్ని పాఠశాలల్లోనూ 2020-21 విద్యా సంవత్సరానికి గాను ప్రవేశాలు చేపట్టవచ్చును\*.**

### **ఆ విధంగా ప్రవేశాలు చేపట్టడానికి ఈ దిగువ చూపిన విధంగా ఏర్పాట్లు చేసుకోవలసి ఉంటుంది.**

### **అ) కోవిడ్ – 19 నివారణకి చేపట్టిన సూచనలను ఉల్లంఘించకుండా ప్రవేశాలు చేపట్టాలి.**

### **ఆ) \*ప్రవేశాల నిమిత్తం ఏ ఒక్క విద్యార్థిని పాఠశాలకు రప్పించరాదు.\***

### **ఇ) 2019-20లో ప్రాథమిక పాఠశాలల్లో 1 నుండి 5 వ తరగతి వరకు, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 1నుండి 7 వరకు, ఉన్నత పాఠశాలల్లో 6 నుండి 9 వ తరగతి వరకు చదివి, ఉత్తీర్ణులైనట్లుగా ప్రకటించబడ్డ ****విద్యార్థులందరిని తదుపరి తరగతిలోకి ప్రమోట్ చేసి వారి పేర్లు\* \*పాఠశాల అడ్మిషను రిజిష్టరులో పై తరగతిలో ****నమోదు చేయాలి.\***

### **ఈ) ప్రాథమిక పాఠశాలల్లో 5 వ తరగతి, ప్రాథమికోన్నత పాఠశాలల్లో 7 వ తరగతి చదివి ఉత్తీర్ణులైన ****విద్యార్థులు తదనంతరం ఏ పాఠశాలల్లో చేరాలనుకుంటున్నారో వారి తల్లిదండ్రుల్ని అడిగి తెలుసుకుని ఆ ****ప్రకారం ప్రవేశాలు చేపట్టాలి. **

### **6వ తరగతిలో ప్రవేశాలు సంబంధిత మండల విద్యాశాఖాధికారి, 8 వ ****తరగతిలో ప్రవేశాలు సంబంధిత ఉప విద్యాశాఖాధికారి పర్యవేక్షించాలి.**

### **ఉ) తల్లిదండ్రులు తమ పిల్లలను వేరే పాఠశాలలో చేర్చు నిమిత్తం వారి \*రికార్డు షీటు / ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు\* ****అడిగినట్లయితే ప్రధానోపాధ్యాయుడు ఆయా సర్టిఫికేట్లను తల్లిదండ్రులకు విధిగా అందించాలి.**

### **అదే విధంగా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకునేందుకు \*ప్రధానోపాధ్యాయుడు విద్యార్థుల రికార్డు షీటు / ట్రాన్స్ఫర్\* ****సర్టిఫికెట్ల విషయంలో\* \*నిర్బంధించకుండా విద్యార్థులను పాఠశాలలో చేర్చుకోవాలి.\*  **

### **ఒకవేళ విద్యార్థి రికార్డు ****షీటు/ ట్రాన్స్ఫర్ సర్టిఫికెటు ఇవ్వలేకపోతే కాలక్రమంలో వాటిని పొందుపరచమనాలి.**

### **ఊ) ఆన్ లైన్ ద్వారా ప్రవేశాలు పొందే మోడల్ పాఠశాలలు, గురుకుల పాఠశాలలు, కస్తూర్బా గాంధి బాలికా ****విద్యాలయాలు మొదలైన పాఠశాలల విషయంలో కూడా ఈ సూత్రాన్నే అనుసరించాలి.**

### **ఎ) బడి బయట ఉన్న పిల్లల్ని గుర్తించి వారి వయసుకు తగ్గ తరగతిలో చేర్పించాలి. **

### **వలస పోయిన ****కుటుంబాలకు చెందిన పిల్లలను కూడా పాఠశాలలో చేర్చుకునే బాధ్యత ఉపాధ్యాయులదే.**

### **ఏ) వలస పోయిన కుటుంబాల పిల్లలు, \*వలసలనుండి తిరిగి వచ్చిన కుటుంబాల పిల్లల విషయంలో ఐడెంటిటీ\* ****నిరూపణ తప్ప మరే విధమైన ధ్రువపత్రాలూ అవసరం లేదు.\***

### **ఒ) ప్రత్యేక అవసరాల గలపిల్లలను కూడా పాఠశాలలో చేర్పించుకోవాలి. వారికి తగిన విధంగా కృత్యాలను ****మార్పులు చేసి కనీస అభ్యసన స్థాయిలు పొందే విధంగా చేయాలి.**

### **ఓ) \*ప్రవేశాలు పూర్తి కాగానే ఎప్పటికప్పుడు చైల్డ్ ఇన్ఫో లో నమోదు చేస్తుండాలి.\***

### **󠀁[దీర్ఘ వ్యాధులతో సతమత ఉన్నవారు, కంటోన్మెంట్లో నివసించే వారు, శారీరక వైకల్యం కలిగిన వారు హాజరు మినహాయింపు కోరుతూ వ్రాసే లెటర్స్](https://amaravathiteacher.com/ap-teachers-not-attend-to-duty-quarantine-containment-red-zones/)󠁿**

### **󠀁[1st CLASS TO 10TH CLASS ALTERNATIVE ACADEMIC CALENDER PROJECTS & ACTIVITIES SUBJECT WISE DOWNLOAD CLICK HERE](https://amaravathiteacher.com/alternative-academic-calender-primary-up-high-schools-in-telugu/)󠁿**

### **󠀁[FOR MORE DETAILS RC.NO.150 DOWNLOAD CLICK HERE](https://drive.google.com/file/d/14rrnx8IhjAw57GezV1q3d99YbzEJr-LT/view?usp=sharing)󠁿**

### **󠀁[SCHOOL ADMISSION APPLICATION FORM PDF DOWNLOAD](https://drive.google.com/file/d/14zyWSaeELToyVBVzIHsQVmGWfUyf6IRn/view)󠁿**

### 󠀁[AP TEACHERS LATEST NEWS](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)󠁿

 *  [ NEW SA1 Science Question Papers 2026 ](https://amaravathiteacher.com/sa1-science-question-papers-2026/)
 *  [ SA1 EVS Key Papers 2026 PDF Download – 3rd to 5th Class ](https://amaravathiteacher.com/sa1-evs-key-papers-2026/)
 *  [ SA1 Maths Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-maths-key-papers-2026/)
 *  [ APPSC Group 2 Notification 2026 – 720 Vacancies, Post-wise Qualifications, Age, Fee, Dates & Syllabus Apply Online ](https://amaravathiteacher.com/appsc-group-2-notification-2026-720-vacancies-apply-online/)
 *  [ SA1 Hindi Key Papers 2026 PDF Download – 6th to 10th Class ](https://amaravathiteacher.com/sa1-hindi-key-papers-2026/)
 *  [ SA1 English Key Papers 2026 PDF Download – 1st to 5th Class ](https://amaravathiteacher.com/sa1-english-key-papers-2026/)
 *  [ SA1 Key Paper 2026 ](https://amaravathiteacher.com/sa1-key-paper-2026/)
 *  [ AP CPS to OPS Conversion 2026 – GO 158 Guidelines, NIDHI Application & Annexures ](https://amaravathiteacher.com/ap-cps-to-ops-conversion-2026-go-158-guidelines-nidhi-application-annexures/)
 *  [ SA1 Telugu Key Papers 2026 PDF Download – 1st to 10th Class ](https://amaravathiteacher.com/sa1-telugu-key-papers-2026/)
 *  [ AP SA1 2026 Class 10 School Level Observers Duties – DSE Proceedings 08-11-2026 ](https://amaravathiteacher.com/ap-sa1-2026-class-10-school-level-observers-duties-dse-orders/)

[View More ](https://amaravathiteacher.com/category/ap-teachers-latest-news/)

### 󠀁[TEACHERS SOFTWARES](https://amaravathiteacher.com/category/teachers-softwares/)󠁿

 *  [ SMC Elections 2026 Notification Voters List Download ](https://amaravathiteacher.com/smc-elections-2026-notification-voters-list-download/)
 *  [ Income Tax Online Calculator FY 2026-27 ](https://amaravathiteacher.com/income-tax-online-calculator-fy-2026-27/)
 *  [ Student id Card Download ](https://amaravathiteacher.com/student-id-card-download/)
 *  [ AP DA Arrears Calculator 2026 ](https://amaravathiteacher.com/ap-da-arrears-calculator-2026/)
 *  [ AP New DA Salary Calculator ](https://amaravathiteacher.com/ap-new-da-salary-calculator/)
 *  [ AP EHS Hospitals List ](https://amaravathiteacher.com/ap-ehs-hospitals-list/)
 *  [ AP Teachers ID Card Download ](https://amaravathiteacher.com/ap-teachers-id-card-download/)
 *  [ Pdf Compressor Online ](https://amaravathiteacher.com/pdf-compressor-online/)
 *  [ Online image compressor ](https://amaravathiteacher.com/online-image-compressor/)
 *  [ AP Medical Reimbursement Proposal Software ](https://amaravathiteacher.com/ap-medical-reimbursement-proposal-software/)

[View More ](https://amaravathiteacher.com/category/teachers-softwares/)
